12.31.2009

31/12/2009

ప్రతి సంవత్సరం చాలా సందడిగా కొత్త సంవత్సర సంబరాలు చేసుకునేవాళ్ళము. కాని ఈసారి గ్రహణం , ప్రాంతీయ గొడవలు రాష్ట్రాలకోసం గొడవలతో ఎప్పటినుండో గ్రహణం పట్టినట్లుంది..నాకయితే , ఎందుకో మూడ్ రావడం లేదు. "వెళ్తున్నాను" అని చెప్పి నెమ్మదిగా కదిలే 2009 కి వీడ్కోలు చెప్పాలి కాబట్టి వచ్చె 2010 ని "రావద్దు" అని చేయి పెట్టి ఆపలేము కాబట్టి సాదరంగా ఆహ్వానిస్తూ.. . ఇప్పుడు జరిగే ప్రాంతీయ గొడవలు.. ఈ 2009 లాంటి సంవత్సరం వద్దు బాబోయ్.. అని వేడుకుంటూ 2010 కోసం ఎదురుతెన్నులు చూస్తూ... ఈరోజు గడపాలని ఆలోచిస్తూ.... అంతర్జాలంలో విహరిస్తుంటే ఈ వ్యాసం దొరికింది బాగుంది మీరు చదవండి.

How do you end your year? Without much thought and barely a glance back? Or, do you bend down and kiss the ground you walk on because you made it through another year – just barely!

There's personal strength, refreshed energy and renewed focus to be gained from mindfully acknowledging and completing the year that has past. Mindfully completing your year is sort of like cleaning out a closet; you feel better AND make room for fresh new stuff that fits better! And hopefully in the year ahead you'll make everything you add to your life not only fit better, but feel better too.

To help you say GOODBYE 2009 so you can say HELLO 2010 - REGRET FREE, this 5-step process will help. The time you take acknowledging and letting go of the year that has past will set the stage for making 2007 your best year yet!

Step 1: Schedule it. I know you're busy, but taking a few hours to do this exercise will be time well spent. Put it on your to-do list just like any other commitment. By doing so, you're committing to not only living your life, but you'll also be working on your life.

Step 2: Set the stage. Pick a location you love. This could be a favorite room in your house, your favorite coffee house, or some other location that allows you to relax and hear your own thoughts.

Step 3: Get to the heart of it. Center yourself, breathe deeply and begin asking yourself the following question. As you reflect on each question write down your answers.

Don't judge yourself and be totally honest. (If it helps, at the top of your paper write, "no one will ever have to read this") Remember, you're doing this so you can say GOODBYE, once and for all, to the year that has past.

Ask and answer these questions to get to the HEART of your year.

What are my blessings? This is a great question to start with because it opens your heart for things to come.

What were my tangible accomplishments? What did you accomplish that you could measure in some way? (i.e. increase your salary by 10%, lose 15 pounds, clear the clutter in your life)

What were my intangible accomplishments? This question has to do more with personal accomplishments others may not be able to see, but you can. (i.e. started each day with an intention, smiled more, let go of past hurts and old wounds)

What did I learn about myself? Your answers to this question may give you clues to your passions and talents OR reveal how you STOP yourself from living the life you really want. (i.e. I discovered I love interviewing people, so I'll definitely want to do more of that in 2007!)

Overall, how do I feel about the year that has past? Your answer to this one question gives you insight to how you feel about your life overall. (use a simple 1- 10 scale; 1=things aren't so great, or 10=my life is fabulous!)

What didn't I do that I really wish I had? Your answer to this question will give you the choice of letting it go, or making a plan to do it next year. (i.e. I didn't travel as much as I wanted to, etc.)

What did I do that I have to do again? Your answer to this question will give you insights into what will make next year great. (i.e. I learned more about a topic I love, I hosted my first dinner party, etc.)

Step 4: Say goodbye and thank you. Remind yourself the year is OVER. It has ended. Whether it was a great year or a bomb, the past is the past. It does not define your future - unless you let it.

Step 5: Don't look back! Now it's time to LET GO. Be proud of yourself for taking the time to do this exercise (you're part of an elite group). Forgive yourself and forgive others. Imagine any regrets you have turning to dust and being gently swept away, out of your body and your mind – never to return.

You stand a better chance of having a great year next year by starting the New Year with no unfinished business, no guilt – no regrets.

Let go and say thank you to 2006 for all that it gave you – good and bad. There's no time like the PRESENT to live the life you really want. By Cari Vollmer

Copyright (c) 2007 Cari Vollmer

"ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు నీతో ఉన్నవాడే అసలైన స్నేహితుడు " కదా..

******



12.30.2009

30/12/2009

హ.... బంద్ అసలెందుకో ఈ బంద్.. గ్రేటర్ ఆంధ్రలో చదివిన ఈ వాక్యాలు ఆలోచింపజేస్తున్నాయి.. నిజమైన తెలుగువాడు దేహం ముక్కలైనా భరిస్తాడు కాని, రాష్ట్రం ముక్కలయితే భరించలేడుట. మనుషులు మతాలను సృష్టిస్తే, మతాలు దైవాలను సృష్టిస్తే, మనుషులు, మతాలు, దైవాలు ఈ భూమిని చీల్చాయట. జేసుదాస్ గారు ఒక పాత పాటలో అంటున్నారు. ఈ గొడవలు ఎప్పటికి సమసిపోతాయో..

ఇంట్లో పేపర్స్ చదువుకుంటూ ఏవో పరీక్షకి పేపర్స్ రాసుకుంటూ, ఒకసారి అమ్మని కలిసి,అలా అలా గడిపేసాను. పెద్దగా స్పెషల్ ఏమి లేదు ఈరోజు. ఎంటో రోజు గడవాలి కాబట్టి అన్నట్లుగా.. అలా..
****

12.29.2009

29/12/2009 contd...

ఆఫీసులో ఎవరిదో పుట్టినరోజు.. బాగా జరిగింది, భోజనాల ఖర్చులు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాయి.... ఇంతలో ఇంటినుండి ఫోన్, ఈరోజు వంటలు ఎక్స్‌టాడరీగా ( టైపాటు కాదు ఇది మన కొరియోగ్రాఫర్ల భాష) ఉన్నాయి అని.. :-) "దేనికన్నా దంతసిరి ఉండాలే" అంటుంది అమ్మ.. అంటే ఇదేనేమో..

ఈరోజు ఆఫీసులో నైపుణ్యతకి సంబంధించి పరీక్షలు...(Performance test ) , కార్పోరేట్ కల్చర్ :-) ... అడిగే ప్రశ్నలకి సమాధానాలు రావు కాని పక్కవాడంటే ఎంత మంటో చెప్పడం.. నాకెందుకు చెప్తారో అనిపించింది. మనలో మన మాట ఇది నాకు పరీక్ష ఏమో ..ఈ పరీక్షలో నేను నెగ్గితే ప్రమోషన్ ఉంటుందేమో.. బాస్ ఏమంటారో.. బాస్ అంటే గుర్తొచ్చింది మా బాస్ గురించి రాయాలి రాయాలి అనుకుంటాను చూడాలి ఒక సుధీర్ఘ పోస్ట్ రాయాలి ఎప్పుడో..


మళ్ళీ రేపు బందుట ..బందులకి అలవాటుపడాల్సి వస్తోంది. ఉద్యోగాలకి అలవాటుపడిన తరువాత ఇంట్లో కూర్చోవాలంటే కొంచం బోరే. ఎప్పుడో ఒక రోజంటే పర్వాలేదు కాని మరీ ఇలా రోజు విడిచి రోజు బందులంటే సామాన్యుడి జీవితం ఎలాగో..

*****

చెప్పదల్చుకుంటే పెన్నుని,వినదల్చుకుంటే పుస్తకాన్ని ఆశ్రయించాలిట..... బాగుంది కదా .. :-)


12.28.2009

29/12/2009

పొద్దున్నే ఎందుకో కోపం వచ్చింది, ఎంత లేపినా నిద్ర లేవరు.. సెలవలొస్తే అదేపనిగా లేపాలి పిల్లలిని అని, పాప లేవగానే టి వి పెట్టింది. 10 వ తరగతి , నాకేమో భయం ఎక్కడ పర్సెంటేజ్ తగ్గుతుందో.... పిల్ల అసలు చదవడంలేదు అని ... అందుకే అన్నాను "చదువుకోమ్మా! పరీక్షలు దగ్గిర పడ్తున్నాయి" కొంచం గట్టిగానే అన్నాను. "నీకు నా మీద అంత అపనమ్మకమేమిటమ్మా నేను పాస్ అవనని " అని అడిగింది :-) . ఏమి చెప్పను పిల్లలికి... అపనమ్మకం కాదు, పాపమీద నమ్మకమే నాకు, కాని మీడియా ప్రభావం పిల్లలమీద పడకూడదు అన్న ఆలోచన, దారి తప్పుతారేమో చదువులు మానేసి అని... ఇదంతా పక్కన పెడితే, అర్థ సంవత్సర పరీక్షలప్పుడు బాబుని ఎదో పరీక్షకి తెల్లవారుఝామున నిద్ర లేపలేదని "రాత్రి అన్ని చదువుకోలేదు ... ఇప్పుడు గంటలో నేనేమి చదువుతాను " అని ఏడ్చేసాడు, "పోనిలే నాన్నా మార్క్స్ తగ్గితే నేనేమి అనను... సరేనా నీకు వచ్చిందే రాయి ఏడవకు" అని సముదాయిస్తే , వాడు ఒక్కసారిగా "నేను పరీక్ష రాసేది నీకోసం కాదమ్మా నాకు నాలెడ్జ్ రావాలని కదా" అని అన్నాడు.. పాపేమో , నీకు నమ్మకం లేదా.... బాబేమో నీకోసం కాదమ్మా పిల్లల ఆలోచనలని ఏవిధంగా అర్థం చేసుకోవాలో కదా..

ఆ మధ్య ఓ వెబ్ పత్రికకి ఒక కథ పంపాను నిన్నే తిరిగి వచ్చేసింది కథ కథలా కనిపించడంలేదు అందులోని పాత్ర వేదన కనిపిస్తోంది అని ఒక స్నేహితురాలి కామెంట్.. కథ కథలా ఉండాల ? వేదన ఉంది కాబట్టే అది కథ అయ్యింది కదా ఏమో! బాధ పడ్డానా? నిజానికి కొంచం బాధ కలిగిన మాట వాస్తవమే.. కాని అన్వర్ గారి బ్లాగులో చూసిన పచ్చనాకు సాక్షిగా.. శ్రీ ఆర్ ఎం ఉమామహేశ్వరరావు గారు రాసిన తిమురుబట్టిన నామిని కత చదివి బాధనుండి ఉపశమనం కలిగింది. అన్నిటికన్నా బాధ.. పంపే ముందూ "బాగుంది వెబ్ పత్రిక కన్నా పర్లేదు .. ప్రింట్ పత్రిక కన్నా పర్లేదు.... పంపమని " చెప్పిన స్నేహితురాలు తిరిగొచ్చినతరువాత "నాకూ నచ్చలేదు" అనడం ఎక్కడో తగిలినట్లుగా అనిపించింది. వస్త్రధారణ విషయంలో ఇంట్లో వాళ్ళు బాగుందో బాలేదొ చెప్తే బయట ఎవరో అనామకుల చేత బాలేదు అనిపించుకొనే అవకాశం ఉండదు కదా .. అలాగే స్నేహితులు మన ప్రవర్తనో, కథలో, రచనలో ముందే చెప్పెస్తే ఇంకొకరికి అవకాశం ఇవ్వము కదా... ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఈ స్నేహితులు... నా మనసులో మటుకు కథ ఇప్పటికి బాగుందన్న భావన ఉంది. అందులో యధార్థం ఉంది.. నిజం నిష్టూరం అంటారుగా అందుకే ప్రచురణకి నోచుకోలేదేమో .. :-)

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేనవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని..
*****

28/12/2009 contd....

ఈరోజు ఆఫీసులో పని చేసుకుంటూ.. ఆమధ్య ఎప్పుడో "సఖీ" షూటింగ్‌లో పరిచయమైన బ్లాగరితో చాటింగ్ చేసాను. చాలా విలువైన సమాచార విజ్ఞానం కలిగిన చాటింగ్ అని చెప్పొచ్చు. ప్రేమ, ఆకర్షణ, పెళ్ళి , బంధం వెరసి జీవితం గురించి కాసేపు చర్చించుకున్నాము. బాగుంది, కొన్ని పదాలు నచ్చాయి. ఎవరితోను "తీవ్రమైన స్నేహాన్ని " ఆశించవద్దు అన్న సలహా నచ్చింది. "నేను నా ప్రాజెక్ట్ పనిలోనో లేకపోతే ఇంకేదన్నా దీక్షగా పనిచేసుకుంటేనో ఎంతటి విలువైన విషయమైనా... అప్పుడు లీనమై చేసే ఆ పని ముందు దిగదుడుపే. పనిని అంతగా ఇష్టపడతాను.. " అన్న మాటలు మంచి ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు.

రాత్రి "ఆట" (టి వి డాన్స్ ప్రోగ్రాం) చూస్తూ భోజనాలు చేస్తుంటే ఆ చిన్ని చిన్ని పిల్లలు ఐటం సాంగ్స్ చెస్తున్నారు. అది చూసి బాబు అన్నాడు.. "అమ్మా ఇలా చేస్తారు, రెపొద్దున్న వీళ్ళకి సినిమా చాన్స్ లు వస్తే ఇంక వీళ్ళు ఆడుకోగలరా? మాలా ఫ్రీ గా ఉండగలరా?" ... ఊ .. ఇదేదో ఆలోచించతగ్గ విషయమే కదా... కాని నేనేమి చెప్తాను మా బాబు కొచ్చిన ఆలోచన వాళ్ళ సంబంధీకులకి రాకుండా ఉండదని ఎందుకనుకుంటాము... డబ్బే లోకమనుకుంటే మనం చేయగలిగేది ఏమి లేదు కదా..
********

28/12/2009


ఈరోజు ముక్కోటెకాదశి.. దీనినే వైంకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశులు ద్వాదశులు అంటే గుర్తొచ్చేది నాకు నా చిన్నతనమే. చిన్నపిల్లలు అలా ఉపవాసాలు ఉండలేరు అంటూ అమ్మ మధ్యాహ్నం 3 గంటలకి పళ్ళతో పాటు కాస్త పలహారం కూడా చేసేసి కటికోపవాసం లంకణంతో సమానమంటూ పెట్టేది , సరదాగా జాగారణలు. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ ఆపకుండా చదివే సహస్రనామాలు , అష్టొత్తర శతనామవళులు, భలె అనిపించేది నేను ప్రయత్నించేదానిని కాని అసలు నోరు తిరిగేది కాదు నాకు.

" రాత్రి 12 గంటలదాక అన్నా మెలుకువగా ఉండాలే " అని అమ్మ చెప్పినందుకని, వైకుంఠ పాళి ఆడుకునేవాళ్ళము. నిచ్చెనలు ఎక్కెస్తే ఆనందం, పాములు మింగేస్తే బాధ పరపద సోపానానికి చేరుకొనేసరికి తెల్లవారుఝాము 4 అయ్యేది. శివరాత్రిలాగా జాగారం చేసేవాళ్ళము.

ఇప్పుడు పెళ్ళయిన తరువాత ఈ జాగారణలు లేవు, ఉపవాసాలు లేవు. ఒక్క శివరాత్రి ఉపవసాలు , కార్తిక సోమవార ఉపవాసాలు తప్ప.. పొద్దున్నే గుడికి వెళ్ళి ఒకసారి దైవ దర్శనం చేసుకొని ఆఫీసు దారి పట్టాను.

హైదరాబాదు మూడు దర్నాలు , ఆరు బందులతో అలరారుతోంది, కాబట్టి ప్రస్తుతం తాజా సమాచారమంటూ ఏమీ లేదు. ఆఫీసులో అంతా రోటీన్ పనే.

ఎందుకో అనిపిస్తుంది మన మనసుకి మాత్రం మనం ఒంటరి వాళ్ళమే అని ...

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది అన్న పాట గుర్తొస్తోంది.... :)
*****

12.26.2009

పెద్ద కళ్ళాడు......

ఇదిగో ఇదే అన్నారం మావయ్య గది. ఈ గదిలోనే అమ్మకి తమ్ముడు పుట్టాడు.. ఆ కిటికీలోంచి తొంగి చూసాను. వసారా ... నల్లటి గచ్చు, అలాగే ఉంది, అస్టా చెమ్మా చెక్కించారు తీరికవేళల్లో ఆడుకుంటారని .. అలాగే ఉంది. ఏమి మార్చలేదు. ఇది అమ్మగది, ఆ పక్కన సబిత టీచర్ అద్దెకి ఉండేవారు, ఎలా ఉండేది ఆవిడ తెల్లగా , సన్నగా తీగలా. టీచర్ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించేంతగా.. అదేంటి ఆవిడ ఉండే ఈ గదిలో వీళ్ళు సామాన్లు వేసేసారలా... ప్చ్ ఇది సామాన్ల గదేమో, ఈ చెరువులొనే అన్నయ్యలందరూ ఈతలు కొడుతూ అమ్మమ్మని పిలిచేవారు, ఏమి మారలేదు ఇల్లసలు మార్చలేదు, అవే గదులు, అవే గొడలు, వసరా ఒక్కటే గచ్చు. మిగతా అంతా రోజు పిన్ని శుబ్బరంగా పేడనీళ్ళతో అలికి ముగ్గులేసేది. అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా మునుల గదుల్లా ముగ్గులతో కళ కళ లాడుతూ. ఒకటి , రెండు , మూడు, నాలుగు.... మొత్తం 14 గదులు, అప్పుడు కూడా ఇన్ని గదులున్నాయా ఎమో! ఎవరికి తెలుసు? లెక్కపెట్టాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది కనక, వచ్చినప్పుడలా ఈతకాయలు, చెరువుగట్టు, "రాజుల్ని పిలమ్మా కాస్తా" ... అంటే రివ్వున అటు పరిగెత్తడం, ఒక గదిలోని ఇంకో గదిలోకి పరిగెత్తుతూ "కుండ పలిగి(గిలి)ందోచ్" అనే ఆటలు.. ఎన్ని గదిలో లెక్కపెట్టేంత టైం ఎక్కడుందసలు..

అన్ని జ్ఞాపకాలను అలా మనసు నాతో మాట్లాడుతూ నెమరేస్తూ ఉంటే, వీధి గదిలోకి వస్తుంటే "గుర్తుపట్టారా పాపగోరు.. నేను వెంకాయమ్మని, మీ అమ్మమ్మగోరికి పాలు పోసేదాన్ని , పాలు పెరుగు అన్ని నేనే ఇచ్చేదాన్ని గుర్తుపట్టావామ్మా? " ఎమో గుర్తు పట్టిందా తను? తెలీదు ఎదో సెలవులకి రావడమే ఇక్కడికి అక్కకయితే బాగా తెలుసు, "పెద పాపగోరు గుర్తు పడతారు " అంది ఆమే వెంటనే నా ఆలోచనలు పసిగట్టెసినట్లుగా. అక్క నవ్వింది నా వైపు చూసి.. అలా ఒక్కొక్కళ్ళు "మమ్మల్ని గుర్తుపట్టారమ్మా" అంటే "మమ్మల్ని గుర్తు పట్టారా" అని అప్యాయంగా అడగడం, ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, వీరి వీరి గుమ్మడిపండు అంటూ ఆడుకున్న ఆటలు అన్ని గుర్తొస్తుంటే ఆప్యాయంగా వాళ్ళిచ్చిన ఆతిధ్యం స్వీకరించి అమలాపురం బయల్దేరాము.

అటూ ఇటూ కొబ్బరిచెట్లు మధ్యలో తార్ రోడ్ పై కారు అలా పరిగెడెతూ ఉంటే.... నా ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఎంత బాగుంది ఈ ఊరు, "అదిగో అటు చూడు ఆ వచ్చేదే గోడితిప్ప, ఇక్కడే నా మాట వినడం లేదని నిన్ను తోసాను" అంది అక్క అవును ..... ఎంత తీయటి జ్ఞాపకం. అక్క ఇక్కడే ఉండేది. ఇద్దరం గోడితిప్పలో సంతకి వెళ్దామని బయల్దేరేవాళ్ళము. అన్ని చూపించేది అక్క, "అదిగో!! అదేనే మా స్కూల్" , అంటు మొదలుకుని, గోడితిప్ప, అల్లవరం, అక్కడి కొబ్బరిచెట్లమధ్య ఒండ్రుమట్టితో బొమ్మలు చెయడం, లక్క పిడతలు, తాటాకు వాచీలు, అన్ని అరుగుమీద చేర్చి ఎంతసేపు ఆడేవాళ్ళమో. "భోజనాలకి రండఱ్ఱా!!!!" అంటే కాని ఆటలకి విరామం ఇచ్చేవాళ్ళము కాదు.

"ఆ వెంకాయమ్మా నేనేనమ్మా పాలు పెరుగు అని అంది కాని ... అసలు ఏమి ఇచ్చేది కాదే, ఒకసారి మావయ్య హైదరాబాదునుండి వచ్చినప్పుడు అమ్మ వెళ్ళి వెంకాయమ్మ దగ్గిర పాలు తీసుకురా అంటే, వెళ్ళి అడిగానే, ఎంత బతిమాలాననుకున్నావు, ఒక చుక్క ఇవ్వలేదు , అమ్మమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని "అంత దూరం నుండి వచ్చిన కొడుకుకి కనీసం కాఫీ ఇవ్వలేకపోతున్నానే " అని... "పర్లేదమ్మా డికాషన్ ఇచ్చేయి తాగుతాను అన్నారు మావయ్య.." అక్క మాటలకి నేను మళ్ళీ ప్రస్థుతానికి వచ్చాను. "అమ్మమ్మకి అనారోగ్యంగా రక్తం కక్కుకునే సరికి, భయం వేసి అలా చూస్తుంటే...., పిన్ని " వెళ్ళి స్కూల్ దగ్గిర ఆచారిగారిని తీసురమ్మంటే... ఏడుస్తూ వెళ్ళాను. అర్ధరాత్రి 12 గంటలకి, ఈ టైంలోనా.. ససేమిరా అన్నడు ఆ ఆచారిగారు... అలా రక్తం కక్కుకుని చనిపోయింది అమ్మమ్మ.... నాన్నగారు పోవడం పెద్ద దెబ్బ, అలా బెంగెట్టుకునే పోయిందే..." అక్క కళ్ళనీళ్ళతో దారి పొడుగునా ఒక్కొక్కటి చెప్తుంటే మనసు బాధతో మూలిగింది.

*******

అమ్మమ్మ ... "అది బంగారమయితే నువ్వు వెండివే , ఇద్దరూ రెండు కళ్ళు" , అంటూ అమ్మతో "దీన్ని కూడా ఇక్కడ వదిలేయవే అక్కకి తోడుగా చదువుకుంటుందిలే" అంటూ వెళ్ళినప్పుడల్లా వళ్ళో కూర్చోపెట్టుకుని "ఉండిపోవే" అన్నప్పుడల్లా ఎంత సంబరపడిపోయేదానినో, "ఉంటానమ్మమ్మా" అంటూ "నా బంగారు తల్లి " అంటూ ఎన్ని కథలు చెప్పేది. మానిబోగి ఇప్పటికి గుర్తుంది.. రామాయణం... అవి.. అలా పట్టి మంచం మీద పడుకు చుట్టూతా పిల్లలందరిని కూర్చోబెట్టుకుని రాత్రి కథలు చెప్తూ..... అన్నం తినిపిస్తూ .... ఎవరన్నా తిననని మారాం చేస్తుంటే "అదిగో ఆ కిటికీలొంచి పెద్ద కళ్ళాడు వస్తాడు, అన్నం తినకపోతే మిమ్మల్ని అమాంతం తీసుకుపోతాడు" అంటూ చిమ్మ చీకటిలో పాములా పాకి ఉన్న సన్నజాజి తీగని ఆనుకుని ఉన్న కిటికీని చూపించేది. అమ్మో ! ఎంత భయంవేసేదో నాకు పొద్దున్నే పాలు పట్టుకొచ్చే మనిషికి గుడ్లన్ని పైకి వచ్చేఅసి పెద్ద పెద్ద కళ్ళతో "అమ్మగోరు పాలండి" అని అరుస్తుంటే .... అక్కడే అరుగుపై ఆడుకునే మేము బెదిరిపోయి.....అతనివైపు చూసేవాళ్ళం కూడా కాదు ..అమ్మమ్మ అనేది "పిల్లలు దడుసుకుంటాఱ్ఱా అరవకు" అంటూ పాలు పోయించుకునేది అరుగుమీద తళ తళా మెరిసిపోతున్న ఇత్తడి గిన్ని పెట్టి(ఇప్పుడు కనిపిస్తాయా ఇంత మందం ఇత్తడి గిన్నేలు పట్టుకోడానికే బరువుగా ఉండేవి). వాణ్ణే అమ్మమ్మ "పెద్దకళ్ళాడు, బూచాడు" అని "మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు" అంటూ భయపెట్టి అన్నం తినిపించేది. నాకు మటుకు వినగానే భయం రాత్రి నిద్రపట్టేది కాదు నాకు, కిటికీలోంచి ఆ పెద్ద కళ్ళాడు నా వైపే చూస్తున్నట్లు నన్నే తీసుకెళ్ళడానికి వస్తున్నట్లు అనిపించేది. "మర్నాడు లేచి అమ్మా మనం వెళ్ళిపోదాము, నాకిక్కడ భయంగా ఉంది " అని ఏడ్చేసేదానిని. "అదేంటే , నిన్నే కదా అమ్మమ్మ ఇది కూడా ఉంటుంది అంటే ఉంటానన్నావు ..." అని వెక్కిరించేది అమ్మ. "పెద్ద కళ్ళాడు... " అని నసిగేదానిని. అవును అతను ఇప్పుడెక్కడున్నాడో?" అని మాతోపాటు తోటంతా చూపించడానికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో కాళ్ళకి చెప్పులేకుండా వచ్చినావిడని అడిగాను ఒకప్పుడు మాది(మావయ్యది) అయిన ఆ తోట వాళ్ళు కొనుక్కున్నారు. ఆ బేషజాలేమి లేకుండా ఎంత ఆప్యాయంగా పలకరించిదో ఆవిడ. అందుకే అడిగాను పేరు తెలీక "పెద్ద కళ్ళాడు" అని... అమే నవ్వేసి "సూరిడమ్మా.. అతని పేరు ... మా ఆయనే, పోయి చాలా కాలం అయ్యింది .. అమ్మమ్మగారొక్కరే పెద్దకళ్ళాడు అనేవోరు" అని చెప్పింది. మనిషి రూపు మదిలో లేదు కాని ఆ కళ్ళు ఇప్పటికి గుర్తున్నాయి నాకు.

******

అల్లవరం దాటి అమలాపురం వైపు దారితీస్తోంది కారు.. "ఇక్కడే చిన్నన్నయ్య స్థలం కొన్నాడట.. మనం కూడా మన ఊరిలో అంతొ ఇంతో స్థలం కొనాలే, అన్ని బాధ్యతలు తీరాక ఇక్కడికొచ్చి ఉండొచ్చు.. కొందామా ఇద్దరం కలిసి....." అక్క అడుగుతోంది... కొంటామా? ఏమో.. :)
******

పోయిన సంవత్సరం పిల్లలికి వేసవి సెలవులకి, చిన్నపిన్ని , బాబయ్యల షష్ఠిపూర్తికని తాళ్ళరేవు వెళ్తూ పిన్నుల పిల్లలందరం కలిసి మా ఊరయిన గోడిలంక కి వెళ్ళొచ్చాము. ఆ జ్ఞాపకాల వెల్లువ ఈ పోస్ట్. ఈ పోస్ట్ రాస్తుంటే కూడా కళ్ళు ఆనందంతో తడిసాయి..... మంచి జ్ఞాపకాలు. ....

********

గోడిలంక

వికీపీడియా సౌజన్యంతో

గోడిలంక, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామము.

అల్లవరం · బెండమూరులంక · బోడసకుర్రు · దేవగుప్తం · గోడి · గోడిలంక · గూడాల · కొమరగిరిపట్నం · మొగలమూరు · రెల్లుగడ్డ · సామంతకుర్రు · తాడికోన · తూరుపులంక · యెంట్రుకోన · కోడూరుపాడు · గోడితిప్ప · పల్లిపాలెం · గుండిపూడి · దేవగుప్తం రావులపాలెం · తుమ్మలపల్లె · ఓడలరేవు ·


మన ఊరి అందాలు




ఈ పైన సిత్రాలు విశ్వామిత్ర-మరో ప్రపంచం బ్లాగులోనివనియునూ.. ఆ బ్లాగు అధిపతి శ్రీ పప్పు శ్రీనివాస్ రావు గారు అనియునూ.. వారి అనుమతి ఎంతమాత్రం తీసుకొనకుండా ఇక్కడ నా బ్లాగులో నా బ్లాగు సందర్శకులకనుకూలంగా "కోనసీమ అందాలు" చూపించే ప్రయత్నం చేసి ఉన్నా
నియునూ... ఇంచుమించు మా ఊరుకూడా ఇలాగే ఉన్నందువల్ల ఈ పని చేయవలసి వచ్చినదనియునూ సవినయముగా మనవి చేసుకుంటున్నాను. పప్పు గారికి క్షమాపణలతో..








12.10.2009

మనోభావాలకనుగుణంగా...

" అమ్మా ! ఎలా అన్నా ఆ కాయిన్ వేసేయ్యాలి నువ్వు. పర్లేదు నెమ్మదిగా ఆడు ...సూటిగా ఉందమ్మా స్లోగా కొట్టు" బాబు హడావిడి చేసెస్తున్నాడు.

నేను చాలా దీక్షగా ఆడాలనే పంతంగా కాయిన్ పట్టుకొని కూర్చున్నా..బాబు ప్రోత్సాహం సాక్షిగా .. కిందటేడు అమలాపురం అన్నయ్యవాళ్ళింటికి వెళ్ళినప్పుడు భోజనాలు ఆలస్యమవుతాయంటే క్యారంబోర్డ్ ఆడుతున్నప్పుడు జరుగుతున్న హంగామా అది. నేను మా బాబు ఒక జట్టు, అన్నయ్య కొడుకులిద్దరు ఒక జట్టుగా ఆడుతున్నాము.

బాబెంత ప్రొత్సహించినా అనుకున్నట్లుగా కాయిన్ పడలేదు సరికదా "అమ్మా
నువ్వు ఎప్పుడు ఇంతే " అని చిన్నబుచ్చుకున్నాడు .

మళ్ళీ రెండో సారి... అలాగే జరిగింది. రెండో సారి జరిగినప్పుడు మటుకు అన్నయ్య కొడుకు "అత్తా మేమే విన్" అని అననే అనేసాడు. మనసులోంచి అభిమానమో మరి ఉడుకుమొత్తనమో తెలీదు కాని ఒక్కసారిగా తన్నుకొచ్చేసింది. "చట్! నాకాకలి వేస్తొంది నేనాడను " అంటూ మొత్తం బోర్డ్ మీద కాయిన్స్ అన్నీ చెల్లాచెదురు చెసేసాను.

ఇంట్లో ఆడే చిన్న చిన్న ఆటలకే అవతలి వాళ్ళు ఏదో అంటున్నారని, లేకపోతే సరిగ్గా ఆడట్లేదని, మనల్ని మోసం చేసేస్తున్నారనో, లేకపొతే ఆత్మన్యునతా భావం ఆవరించో ఎదో మొత్తానికి పూర్తిగా ఆడలేము. అవతలివాళ్ళకి దొరకకూడదు అనే పంతం. నాకు తెలిసి ఈ భావన అందరిలో ఉంటుంది. కొంతమంది గుంభనంగా ఉంటారు , కొంతమంది కంటనీరు ద్వారా బయటపడ్తారు, ఇహ నాలాంటి వాళ్ళు అలా ఆట మొత్తాన్ని చెడగొడ్తారు. దానికి కారణం ఏదన్నా కావచ్చు చిన్నపిల్లలతో ఓడిపోవడం ఇష్టం లేకపోవచ్చు, గిల్టీ కావచ్చు, పొగరు, ఉడుకుమోత్తనం, అసహయత, అభిమానం మొ! ఏ పేరు పెట్టుకున్నా అక్కడినుండి తప్పుకోడం ముఖ్యం.
******

"మనోభావాలకనుగుణంగా.." అంటే ఎంటో కాని ఈ మధ్య ఈ తెలంగాణ, సమైక్యాంధ్ర, గ్రేటర్ రాయలసీమ అంటూ మీడియావాళ్ళు మాటి మాటికి ప్రజల మనోభావాలకనుగుణంగా అంటూ ఊదరకొట్టేస్తున్నారు. అదే మీడియా... మరి అవే మనోభావాలతో ఆటాడుకొని, పాల్గొంటున్న వారి మనోభావాలని దెబ్బతీస్తూ..చూస్తున్న వాళ్ళని వెఱ్ఱి జనాలని చేసి వ్యాపారాన్ని చేసుకొంటున్నారు. దీనికి ఉదహరణే నిన్న జరిగిన ఒక ప్రముఖ ఛానెల్ లో జరిగిన కార్యక్రమం(రియాల్టీ??). "

సమైక్యాంధ్ర, తెలంగాణా, రాయలసీమ, కళింగ రాష్ట్రం ఇలా ఛానల్స్ అన్నీ పోటిగా మనకి తాజా వార్తలందించడంలో నేను ముందంటే, నేను ముందు అని హడావిడి పడ్తుంటే.. ఏది చూడాలో తెలియక ఛానెల్ మార్చే ప్రక్రియలో కంటపడిందో రియాల్టీ అనుకుంటున్న ఒక కార్యక్రమం. కాసేపు ఈ రాష్ట్రాల గొడవలకతీతంగా చూడచ్చు కదా అని అదే ఉంచి చూస్తూ ఉన్నా. యాంకర్ కొత్తేమి కాదు అందరూ దేవుడు, జీవితాలు నిలబెట్టాడు అంటు పొగుడుతున్న వ్యక్తే. పేరెందుకులెండి అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. :) సరే విషయానికి వద్దాము. పోటి కొరియోగ్రాఫర్ల మధ్య.. ఇంతకుముందు
వీళ్ళందరి కుప్పిగంతులు చూసి చూసి విసుగొచ్చి చూడడం మానేసాము. వీళ్ళే మళ్ళీ ఇంకో ఛానెల్ ని ఆక్రమించారు.

వీళ్ళకి నిజంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదో మరి మనకోసం పధకంగా స్క్రిప్ట్ రాసుకుంటారో కాని, "నువ్వు నా కాలి గోటికి సరిపోవు", లేదా "నీకు నాతో పోటినా .. " ఇంకోచం ముందుకెళ్ళి సినిమా సంభాషణలకు మేమేమి తీసిపోము అన్నట్లుగా బయటకి చెప్పలేని రీతిలో ధూషించుకోడం.. అసలు డాన్స్ కన్నా ఈ గోల ఎక్కువగా ఉంటుంది. సరేలే ! డాన్స్‌లో నన్నా అమీ తుమీ తేల్చేస్తారు అనుకొనే లోపులో ... ఓ ఇద్దరిని డేంజర్ జోన్ అంటూ పంపి.. ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటూ సాగతీస్తారు. ఆ ఇద్దరి మధ్య కళ్ళు మూసుకుని ఒక డాన్స్, హావాభావాలు , పరికరాలు అంటూ పోటి పెడ్తారు.

అంతా అయి అందరి అభిప్రాయాలు తీసుకుని... కంటెస్టెంట్స్ వాళ్ళు వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి ఏడుస్తుంటారా లేదా అని చూపించడానికో వాణిజ్య ప్రకటన, కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒక ప్రకటన, యాంకర్ నవ్వూతూంటే ఒకటి ఇలా మాట్లాడే/పోట్లాడే పద పదానికి చేస్తున్న చేయబోయే చర్యలకి మధ్య ఒక ప్రకటన వెరసి ఒక గంటన్నర మనల్ని ఏవిధంగా వేపుకు తినాలో ఆ విధంగా తినేసిన తరువాత ఎవరు ఎలిమినేట్ అయ్యారో .... మన కంటినీటి తుడుపుకోసం అన్నట్లుగా చెప్పి... మళ్ళీ ఒక వంద వాణిజ్య ప్రకటనల తరువాతా.. యాంకర్ ఒక వెఱ్ఱి నవ్వుతో..
"ఓకే కంటెస్టెంట్స్, జడ్జెస్& వ్యూయర్స్ .. చూసారుగా ఈరోజు ఎపిసోడ్, ఇప్పటిదాకా జరిగిన ఈ సంగ్రామం, ఈ ఎలిమేనెషన్ ఎపిసోడ్లో అసలు ఎలిమినేషన్ అనేదే లేదు... అసలు ఎలిమినేట్ చేస్తే వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూద్దామని ఇంతవరకు ఇలా చేసాము" అంటూ చావు కబురు చల్లగా చెప్తారు.

ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ దెబ్బ తింటున్నాయి? ఎవరి మనోభావాలకనుగుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు? షూటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, పాట
కి ... పాటకి మధ్య జరిగే ఏర్పాట్లవల్ల మధ్యలో కనీసం ఒక గంట time ఉంటుంది. ఆ time లో అందరు కలిసి మాట్లాడుకుంటూ, తరువాత ఏవిధంగా మార్క్స్ వెయ్యాలి అని చర్చించుకుంటూ, ఎవరిని పంపించాలో కూడా ముందుగానే నిర్ణయించుకుంటూ కార్యక్రమ షూటింగ్ తీసే వీళ్ళు అటు ఆ స్టేజ్ మీదున్న వారిని కాదు.. ఇక్కడ ఆసక్తిగా చూస్తున్నవాళ్ళని ఫూల్స్ ని చేశారనిపిస్తుంది. ఎలిమినేషన్ లేదు అంటూ ఒక ఎపిసోడ్ నిర్వహించి, మళ్ళీ దానికి వాణిజ్య ప్రకటనలు, పాల్గొన్నవారి ఏడుపులు ... యాంకర్ చిద్విలాసంగా నవ్వడం... చూస్తున్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అసలే రాష్ట్రం ముక్కలయిపోతోంది , రోజు రోజుకి మూడు ధర్నాలు , ఆరు బంద్‌లతో చికాకు చికాకుగా, "శాలరీలు వస్తలేదు సెల్ బిల్లు కడ్తలేదు" అన్న చందాన భాగ్యనగర సగటుజీవి సెలవుల గోలలో ఉంటే, రియాల్టి పేరుతో అసహజంగా కుప్పిగెంతులు వేస్తూ .. మరింత చికాకుకి గురిచేస్తున్నాయి ఈ కార్యక్రమాలు. ఎప్పుడు విముక్తో వీటన్నిటినుండి.... చూస్తున్నారు కాబట్టి , తీస్తున్నారు అంటే, ఇంట్లో ఎప్పుడో వ్యాపకానికి T V చూసే మాలాంటివాళ్ళు ఇలా మౌనం వహించి బ్లాగుల్లో మా బాధని వెళ్ళగక్కుకోవల్సిందే. ఏమంటారు????... :)
********