3.15.2010

విరోధి నుంది వికృతిలోకి...మహిళలూ జరభద్రం

సాంకేతిక నిపుణుల సలహాలు, WPC లో వారి సహకారంతో ... నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు కూడా..

"మాకు తెలిసిందే కొత్తగా మీరు చెప్పేదేముంది" అని తెలిసినవాళ్ళు వాళ్ళ సమయం వృధా చేసుకుని చదివినందుకు ధన్యవాదాలు తెలియనివాళ్ళు.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకి వచ్చే ప్రమాదాలని అధిగమించవచ్చు అని చిన్ని ప్రయత్నం.

మన జీమైల్ అకౌంట్ కి ఏమన్నా అజ్ఞాతల ఉత్తరాలు, బెదిరింపులు లాంటివి వస్తే, వారి ఐ . పి అడ్రస్ ని కనుక్కొకనుక్కోవచ్చట ఇలా.

మన జి-మెయిల్ అకౌంట్ మనము కాక ఇంకెవరన్నా ఒపెన్ చేస్తున్నారా.. అన్న విషయం తెలియాలంటే ఇదిగో కింద ఈ చిత్రం చూడండి, మన inbox కింద ఈ విధంగా ఉంటుంది అందులో మూడో లైన్‌లో లాస్ట్ అకౌంట్ activity ... అంటూ మనము ఇంతకుముందు ఎప్పుడు లాగిన్ అయ్యాము, ఆ ఐ.పి అడ్రస్ ఇస్తుంది. మరి మనము ఆ టైంలోనే లాగిన్ అయ్యామా అదే ఐ పి అడ్రస్ అవునా .. కాదా అని చూసుకుంటే సరి. డిటైల్స్ చూస్తే , ముందు రెండురోజుల చరిత్ర అంతా మనముందే. అది కనక మన ఐ.పి అడ్రస్ తో సరి కాకపోతే మన జి- మేయిల్ ఎవరో ఒపేన్ చేస్తున్నారని అర్థం. సో, మహిళలూ మరి కొంచం జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ జోనే కదా.

విరోధినుండి వికృతిలోకి అడుగుపెడ్తూ.. మనందరికీ జయం కలగాలని ఆశిస్తూ.... బ్లాగర్లందరికి వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



శత్రువు అంటే కేవలం మనిషే కాదు.సమస్య చిరాకు,ఇబ్బంది,అసంతృప్తి,ఇవన్నీ కూడా మన శత్రువులే. వీటితో పోరాటమే యుద్ధం. మన శత్రువు ఎపుడూ మరణించడు. శత్రువు మీద నిరంతర విజయం సాధించడమే మన సంతృప్తి. సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంటుంది.సమస్య లేకపోతే ఆనందమే లేదు. కాబట్టి తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు.. ఇలా షడ్రుచుల సమ్మేళనం మన ఆనందమయ జీవితం కావాలని ఆశిస్తూ ఇప్పటికిక సెలవు
******

3.12.2010

జయహో సుమమాల...

జీ టి.వి లోనో, మా టి వి లోనో అనుకుంట ఎదో రియాల్టీ షో వస్తుంది..చివర్లో ఎవరు ఎలిమినేట్ అవాలి అనేది పేరు రాయమంటారు. ఎవరిపేరయితే అవతలి వ్యక్తి రాసారో ఆ పేరు గలవాళ్ళు "ఏంటి నాతో కాంపిటేషనా? ఓడిపోతానని భయమా " అని అంటూ అవతలి వారిని ఉడికిస్తారు..

అదిగో అలాగే జరుగుతోంది ఇక్కడ, ఎప్పుడో అలేఖ్య పత్రికలో అనుకుంట "టాప్ 10 లో మీరున్నారు" అన్న సమాచారం వచ్చినప్పుడు... "నాకు ఓటెయండి" అన్నప్పుడు మనకి పోటి ఏమో ఈ బ్లాగు అని, అప్పుడు రావాల్సిన బెదిరింపు లేఖలు, ఒక పక్క 17 ఏళ్ళ పసిపిల్లను పోగుట్టుకొని డిప్రెషన్లో ఉండి బాధగా ఒక కన్న తల్లి ని ఓదారుస్తున్నప్పుడు, నా సొంత ప్రాజెక్ట్ పనిలో తలమునకలుగా ఉండి ఇప్పుడు ఈ బ్లాగు అవసరమా కొన్నాళ్ళు పక్కన పెడదాము అని అనుకున్నప్పుడు ఇలా రావడం హాస్యాస్పదమే. బ్లాగు మూసేయండి అంటూ .... నేను పని వత్తిడి వల్ల క్లోజ్ చేసేసిన తరువాత వచ్చింది అంటే ఆ రాసినవాళ్ళు ఎంత అమాయకులో, నా బ్లాగు ఎంత బాగా ఫాలో అవుతున్నారో తెలుస్తోంది.

ఇకపోతే నా ఉద్యోగం... నా జీవితం ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నేను ఉద్యోగం చేస్తున్నానా? చేయట్లేదా, లేక చేయబోతున్నానా అన్నది నాకు మాత్రమే పరిమితమన విషయం. నేను ఉద్యోగం చేయడం వల్లో చేయకపోవడవల్లొ బ్లాగర్లకి ఉపయోగమేమి లేదు కదా. నాకు తెలిసి నేను బ్లాగర్లెవరికి చెప్పి ఉద్యోగంలో చేరలేదు.. నా ఉద్యోగం విషయంలో రెండో వ్యక్తి ప్రమేయం , నా సంసారం విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని నేను అంగీకరించలేను.

నేను రాసే ఈ సుమమాల మటుకు పబ్లిక్ కాబట్టి దీని గురించి మీరు బాలేదనో బాగుందనో పరమ చెత్తగా ఉందనో సలహాలో బెదిరింపులో ఇవ్వచ్చు. వేరే వేరే బ్లాగర్ల పేరు చెప్పి అనవసర రాద్దాంతం చేసేవాళ్ళని ఆ దేవుడే రక్షించాలి.

చివారఖరికి నే చెప్పొచ్చేదమంటే.. బ్లాగు క్లోజ్ చేసిన తరువాత "ఛట్ బ్లాగు మూసేయండి లేకపోతే మీ సంసారంలో చిచ్చు పెడ్తా" అంటూ వచ్చిన బెదిరింపు లేఖ చూసి నవ్వాపుకోలేకపోయాను. నా బ్లాగు నా ఇష్టం, ఎందుకు క్లోజ్ చేస్తున్నాను, ఎందుకు విరామం ఇస్తున్నాను, ఎందుకు మళ్ళి పోస్ట్లు రాస్తున్నాను అనేది అనుమతి తీసుకుని రాయాలా అన్న ఆలోచనలతో..... సుమమాలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమమాలా.! . నాకసలు రాయడం కుదరకపోయినా... నిన్ను కూడా వార్తల్లోకి తెచ్చేస్తున్నరొహో అనుకుని కించిత్ సంబరపడిపోతూ... ఇలాంటి బెదిరింపు లేఖలకి ఒకటే నా సమాధానం..

ఈ నా నాలుగు రోజుల జీవితం నా సొంతం , దీనిలోకి ముష్కర్లకి తావు లేదు. ఎవరెవరో బ్లాగర్ల పేర్లు చెప్పి నన్ను భయపెడదామనుకోడం మీ భ్రమ. ఏది జరిగినా మన మంచికే... అన్న నిజాన్ని నా దృష్టిలోకి తెచ్చారు.. చెప్పనుగా మొదటగా 17 ఏళ్ళ పసి తల్లి పోగొట్టుకున్న తల్లిని ఓదారుస్తున్నాము .... మొత్తం మా కుటుంబ సభ్యులమందరం అదే డిప్రెషన్లో ఉన్నామని, "నేనే తప్పు చేయలేదు కనీసం అలా ఉన్న పిల్లనన్నా ఆ దేవుడు బతికించి ఉంటే జీవితాంతం సేవ చేసుకునేదానిని అని " ఆ కన్న తల్లి హృదయం ఆక్రోశించినప్పుడు, "అలా ఎందుకనుకోవాలండి, ఏమి జరిగినా మన మంచికే .. ప్రతి పనికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి, ఇలా జీవితాంతం తల్లి తండ్రులు అయినా ఎలా కష్టపడ్తారు అని ఆలోచించి ఆ భగవంతుడు తీసుకుని వెళ్ళాడేమో అని మా అక్క ఓదార్చింది. .. నిజమే కదా.. ఏమి జరిగినా మన మంచికే, నాకో లేఖ రావడం ... కఛ్చితంగా నా ఆలోచనలని చెప్పగలిగే అవకాశం ఇచ్చింది... మళ్ళీ మీ ముందుకు వచ్చేలా చేసింది.
******

కొసమెరుపు: సమయానికి తగు మాటలు అన్నట్లు ఈరోజు ఒక ఛానెల్ లో మహిళలు ఇంటర్‌నెట్ ప్రమాదాలు ఏమి చేయాలి అన్న ప్రోగ్రాం చూడడం. కింద స్క్రోల్ లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కాంటాక్ట్ నంబర్ సేవ్ చేసుకుందామనుకునేలోపు స్ఫురణకి వచ్చిన మరో విషయం, 17 ఏళ్ళ పసిదాన్ని పోగొట్టుకున్న తండ్రి వెరసి మా అన్నగారు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లోనే సర్కిల్ ఇన్‌స్పెక్టరని. గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరుక్కొడమెందుకు అని ... గొడ్డలిదాక తీసుకొస్తే తప్పదు అన్నగారి అండదండలు.. చెల్లెలు కష్టపడ్తోంది అంటే ఏ అన్న ఊరుకుంటారు చెప్పండి.. :-)
*****

ఒక శత్రువుని గెలవాలంటే అతన్ని గురించి మర్చిపోడమే అన్ని విధాలా ఉత్తమమయిన మార్గంట. ఇంతవరకూ నేను అజాత శతృవుని అనుకున్నాను కాని, కాదు నీకు కూడా అజ్ఞాత శతృవులున్నారని చెప్తోంది నా బ్లాగు సుమమాల. అజ్ఞాతులని కూడా మర్చిపోదామనే అనుకుంటున్నా.... ఎందుకంటే నాకు ఈ బ్లాగు వ్యాపకమే కాని , జీవితం కాదు. "మీ బ్లాగువల్ల నా బ్లాగు బ్లాగుల్లో నిలబడలేకపోతోంది (అంత సీన్ లేదనుకోండి ఈ బ్లాగు ఎప్పుడో జన్మానికో శివరాత్రిలా రాస్తాను) తీసేయండి " అంటే ఇట్టే క్లోజ్ చేసేస్తాను. ఇదేమంత బ్రహ్మ విద్యా? దానికంత చీప్ ట్రిక్స్ ఎందుకో..:-)

******