5.29.2010

సెల్లులో మన పేర్లు....

సో.. నేను రాసిన ముందు పోస్ట్ వల్ల చాలా మందికి చాలా కోపం వచ్చేసినట్లుంది. సరే.. అభిప్రాయాలనేవి అందరికి ఒకటే అవవు.. అలా అని చాలా పెద్ద తప్పిదం చేశేసానా ... నా అభిప్రాయం తప్పా అని ఆలోచించి.. ఆలోచించి... ఇది తెగేది కాదని అనిపించి ఇహ ఆలోచించడం మానేసాను. నా అభిప్రాయాల వల్ల ఇబ్బంది పడినవారికి సారీ. నచ్చిన వారికి ధన్యవాదాలు. :-)
******


అప్పుడెప్పుడెప్పుడో... ఒకసారి మా ఆఫీసులో మేనేజర్ గారు ఏదో పనికోసమని .. నా సెల్ కి ఫోన్ చేసారట. నా సెల్ కవరేజ్ ఎరియాలో లేనని మొరాయించేసిందిట. పక్కన కొలీగ్ కి ఫోన్ చేసి , నాకివ్వమని చెప్పారు. సాధారణంగా మానేజర్ చేసేది లాండ్ లైన్ కే. కాని మా అసిస్టెంట్ మానేజర్ చలవ వల్ల, అది గంట నుండి ఎంగేజ్ రూపేణా బిజీగా ఉంది.

సరే ఆయనేదో అవతలి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎదో ఇంకో ఫోన్ వస్తున్నట్లుగా సౌండ్ వచ్చేసరికి , ఒకసారి సెల్ వైపు చూసా.. పేరు చూసి ఒక్క క్షణం తడబడ్డాను... ఇదేమి పేరు అని.. ఇలా కూడా ఉంటాయా ? అని... అంటే నేను సెల్ ఫోన్ వాడకం కొత్త అన్నమాట అప్పటికి. కాకపోతే కొంచం నయం.. మనమే ..... నంబర్ , ఆ నంబర్ ఎవరిదో వారి పేర్లు సేవ్ చేసుకోవాలని మాత్రమే తెలుసు. అది కూడా తెలియకముందయితే అంటే సెల్ కొన్న కొత్తలో అప్పటికి ఎవరో ఎల్.ఐ .సి ఏజెంట్ ఫోన్ చేసినప్పుడు, పేరుతో సహా సెల్ ఎంత బాగా గుర్తించేసింది, సెల్ ఎంత గొప్పదో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. (మా తమ్ముడు అన్ని సేవ్ చేసి ఇచ్చాడని తెలియక) ..

అలా కాకుండా ఇలా కొత్తగా పేర్లు.. ఎవరిదో తెలుసుకోవాలన్న కుతుహలం బయల్దెరెంది.. మానేజర్ ఫోన్ అయిపోగానే కొలీగ్ దగ్గరకి వెళ్ళి "ఫోన్ వచ్చిందండి మీకు పేరు కొత్తగా... చాలా వింత గా ఉంది ఎవరండి " అని అడిగాను. నవ్వుతూ తను చెప్పిన సమాధానం "మా ఆవిడండి".. ముద్దుగా అలా.. యు ఎస్ లో ఉంటుంది " అని చెప్పారు...... నిజంగానే సరదాగా అనిపించి, బాగుంది అని కొలీగ్ ఫోన్ బుక్ లో మిగతావారి పేర్లు ఎముంటాయా అన్న కుతూహలం కలిగింది... "నిరభ్యంతరంగా చూసుకొండి" అని నా చేతికి ఇచ్చారు.... నాచ్యురల్‌గా ... అమ్మా, అక్కా, ఆఫీస్, ఇలా స్టార్ట్ అయిన లిస్ట్.. రాక్షసి(వాళ్ళ ఆవిడట :-) ) , చిన్న రాక్షసి (మరదలు) , మై స్వీట్ హోం.... ఇలా వరసగా చదువుతుంటే నా పేరు నా పేరేవిధంగా ఉంటుంది చెప్మా..... అని ఆలోచన వచ్చి.... నా సెల్ నుండి రింగ్ ఇచ్చి పేరు చూస్తే "పొడుగు మేడం - కర్పోరేట్ కాలింగ్" అని వచ్చింది. నవ్వు వచ్చింది నాకు .. "అదేంటి పేరే పెట్టొచ్చుగా ఇలా పొడుగు .. పొట్టి ఎందుకు " అని అడిగితే..... "ఇంకో బ్రాంచ్ లో ఇంకో రమణి ఉన్నారుగా " ఎందుకు.. అని ఇలా జవాబు కొలీగ్ దగ్గరనుండి..
*****

ఇదిగో ఇతని సెల్ లో అలా పేర్లు చూసిన నాలో కుతూహలం.. నా ఫోన్ నంబర్ మా వాళ్ళ సెల్లో ఏ పేరుతో సేవ్ చేసి ఉంటారా?... చాలా రోజులకి మళ్ళీ మా అక్క దగ్గిర సెల్ లో చూసాను ఇలాంటి స్వీట్ పేర్లు ... ప్రేమగా పాప నంబర్ని మై అయిస్ 1 , బాబు నంబర్ని మై అయిస్ 2, అమ్మ నంబర్ని .. మై బర్త్ అని సేవ్ చేసుకోడం.. బాగుందనిపించింది.

అలా నా పేరు మరుగున పడి, నేను.... మై యంగర్ సిస్టర్, చిన్నక్క, సి. వదిన, పిన్ని, మాం .. మణి. ... ఇలా ఇలా మావాళ్ళ సెల్ లో నా నంబర్ ఇన్ని పేర్లతో దోబూచులాడుతోందన్నమాట. . మరి మీకెప్పుడయినా ఇలాంటి అనుభూతి, మన పేరు సెల్ లో ఏవిధంగా సేవ్ చేశారో అన్న కుతుహలం??? అయితే ఇకనేమి పంచేసుకుందాం రండి సరదా సరదాగా...
*****

5.25.2010

స్వర్ణ మల్లిక గారు.. నా జవాబు.

మీ ఆవేశ పూరిత వ్యాఖ్య:

మీకు హక్కు లేదు అని ఎవరు అన్నారు? ఆచారం అయినా అలవాటు అయినా నచ్చని మరుక్షణం మానేసే / మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ మీరు ఒకే వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఎందుకు దాడి చేస్తున్నారు? ఆ వర్గంలో మీరు చెప్పిన లాంటి ఆడవారు ఈ రోజున వందలో ఒక్కరు కూడా ఉండరు. అలాగే ఆ పిల్లవాడి లాంటి వారు కూడా. ఆ స్త్రీ తన పిల్లలని అతిగా కట్టడి చేసింది. వారు తప్పించుకుని ప్రేమ వివాహాల పేరుతొ బయట పడ్డారు. ఆ విషయం మీకు చాలా సంతోషం కలిగించినట్టుంది. ఒక వ్యక్తీ తన కొడుకుని మాంసాహారం తినద్దని మందలించాడు. ఆ కొడుకు రేప్పొద్దున చాటు మాటుగా తింటూ ఇంట్లో మాత్రం బుద్ధిగా ఉంటాడు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకి వెళ్లి తనకు ఇష్టమైనట్టు స్వేచ్చగా ఉంటాడు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా వారికి నచ్చనప్పుడు/భరించలేనప్పుడు చక్కగా మారిపోతారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. ఇంతవరకు బాగుంది. ఇకపోతే మీరు చెప్పిన ఆకాశవాణి రకం ఆడవారు అన్ని వర్గాల్లోను ఉన్నారు. ఈ లక్షణాన్ని ఒకరికే పరిమితం చేయకండి. పదోతరగతి చదివి ఇంటి పని చేసుకుంటూ ఉండే సగటు ఇల్లాలి నుంచి, పెద్ద పెద్ద కార్పోరేట్ ఆఫీసుల్లో పని చేసే చదువుకున్న ఆడవారి దాకా చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది. ఎవరు దీనికి మినహాయింపు కాదు. మీకు ఎదురయిన అతి తక్కువ అనుభవాలతో పూర్తిగా ఒక వర్గం వారిని అవహేళన చేయకండి. మీకు ఎదురయిన లాంటి వారు మొత్తం వర్గంలో ఎంత శాతం ఉండచ్చని మీ అభిప్రాయం. మీకు నచ్చని అలవాట్లు మీరు నిరభ్యంతరంగా మార్చుకోండి ఎవరు కాదన్నారు. మీ ఇంటి మీదకి గొడవకి కాని వచ్చారా ఆ ఫలానా వర్గం వారు. ఇకపోతే నీతులు చెప్పడం..... నీతి అంటేనే ఇంకొరికి చెప్పేదే కానీ పాటించేది కాదు అని ఈ రోజుల్లో నిర్వచనం. ప్రతి వాడు చేసేదే అది. దీన్ని కూడా మీరు ఒకే వర్గానికి ఆపాదిస్తున్నారు. అలాంటి వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తీ మీకు నీతులు చెప్పేవరకు ఎందుకు వస్తాడు. దారిన పోతుంటే ఆపి చెప్పడుగా మా వంశం మా తాతలు తండ్రులు అని. చెప్పినా ఎవరు విలువ ఇస్తారు, అనేదేదో మొహం మీద అనేస్తారు. ముందు నీ సంగతి చూసుకో నాకు నీతులు చెప్పడం ఎందుకు అని. అంతేగానీ ఇలా ఇంటికొచ్చి మొత్తం ఆ వర్గం వారు అందరూ అంతే అని తేల్చేయడం తప్పు. మీకు ఎదురయిన చెడుని అక్కడే ఖండించండి. దాన్ని మొత్తం ఒక వర్గానికి ఆపాదించకండి. మరి నాకు తెలిసిన చాలా మంది అదే వర్గం వారు వారి క్రమశిక్షణ వలన చదువుల్లోనూ, వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోనూ ఇంకా చాలా రంగాల్లో రాణించారు. దీనికి ఏమంటారు... మీరు దురాచారాలు... తొక్కా తోలు ... అని తీసిపారేసేవి వారికి నియమాలు. వాటిని చిత్తశుద్దితో పాటించడం వలన వారికి మేలే జరుగుతుంది కానీ కీడు కాదు. ఎవరో ఒకరో ఇద్దరో చేసే చెడు పనుల వలన ఇలా వర్గం మొత్తాన్నీ చిన్న చూపు చూడకండి.

*******
నా చిరునవ్వు జవాబు:

మీకు హక్కు లేదు అని ఎవరు అన్నారు? ఆచారం అయినా అలవాటు అయినా నచ్చని మరుక్షణం మానేసే / మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది: ఉంది కాని ఆచరణలో లేదు. ఒకరిద్దరు ఆచరిస్తే చులకన మాటలు, (ఉదా: సినిమాల్లో ప్రత్యేకంగా ఉదహరిస్తూ అపహాస్యం చేస్తూ) కాదంటారా? .

కానీ మీరు ఒకే వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఎందుకు దాడి చేస్తున్నారు? : దాడా నేనా భలేవారే మీరు ఆవేశంలో అంటున్నారేమో .... అపహాస్యం కావద్దు అని నా అభిప్రాయం చెప్పాను.

ఆ వర్గంలో మీరు చెప్పిన లాంటి ఆడవారు ఈ రోజున వందలో ఒక్కరు కూడా ఉండరు.: :-) మీ చిన్ని ప్రపంచంలో అనుకుంట మాదగ్గిర అగ్రహారాలు , అతిధుల ఇళ్ళల్లో రోజుకి 10 మందిని ఇలా చూస్తాము.

అలాగే ఆ పిల్లవాడి లాంటి వారు కూడా. ఆ స్త్రీ తన పిల్లలని అతిగా కట్టడి చేసింది. వారు తప్పించుకుని ప్రేమ వివాహాల పేరుతొ బయట పడ్డారు. ఆ విషయం మీకు చాలా సంతోషం కలిగించినట్టుంది: నా అభిప్రాయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనిపిస్తోంది.. అలా కట్టడి చేయకండి, పరువు నిలబెట్టండి అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఒక వ్యక్తీ తన కొడుకుని మాంసాహారం తినద్దని మందలించాడు. ఆ కొడుకు రేప్పొద్దున చాటు మాటుగా తింటూ ఇంట్లో మాత్రం బుద్ధిగా ఉంటాడు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకి వెళ్లి తనకు ఇష్టమైనట్టు స్వేచ్చగా ఉంటాడు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా వారికి నచ్చనప్పుడు/భరించలేనప్పుడు చక్కగా మారిపోతారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. ఇంతవరకు బాగుంది: కదా.. ఈరోజు "నాన్నా నేను ఫలనా పని చెద్దామనుకుంటున్నాను" అని అడిగినప్పుడు తండ్రిగా అది మంచో చెడో చెప్పే భాద్యత ఆ తండ్రికి ఉండాలి కాని మందలించడం , హెచ్చరించడం వల్ల పిల్లలు అలా మీరు చెప్పినట్లుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి, మన చేయి దాటిపోయే అవకాశం పిల్లలికి ఇవ్వద్దని కదా నేను చెప్పేది. మొక్కయి వంగనిది మానై వంగదు కదా..

ఇకపోతే మీరు చెప్పిన ఆకాశవాణి రకం ఆడవారు అన్ని వర్గాల్లోను ఉన్నారు: ఇప్పుడే పైన అన్నట్లున్నారు వందల్లో ఒకరని... మళ్ళి అన్ని వర్గాలు... హహహ..

ఈ లక్షణాన్ని ఒకరికే పరిమితం చేయకండి: లేదే... నా ఎదురుగుండా అప్పట్లో కనపడ్డారు కాబట్టి చెప్పాను.

పదోతరగతి చదివి ఇంటి పని చేసుకుంటూ ఉండే సగటు ఇల్లాలి నుంచి, పెద్ద పెద్ద కార్పోరేట్ ఆఫీసుల్లో పని చేసే చదువుకున్న ఆడవారి దాకా చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది: ఊ yes I agree with you . ఇక్కడ ఆవిడని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే సహ ఈడు పిల్లలతో తన పిల్లలిని ఆడుకోడం లాంటివి చేయలేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఎంత బాల్యం కోల్పోయి ఉంటారో కదా అనే ఉద్దేశ్యం. పోని, ఆవిడ కూడా పిల్లలతో ఉంటూ వారికి కాస్త ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఉండి ఉంటే, ఇలా అనాల్సి వచ్చేది కాదు కదా. తల్లే కదా మరి ప్రధమ గురువు .. అవునా?

ఎవరు దీనికి మినహాయింపు కాదు. మీకు ఎదురయిన అతి తక్కువ అనుభవాలతో పూర్తిగా ఒక వర్గం వారిని అవహేళన చేయకండి: ఏ వర్గాన్ని అవహేళన చేయలేదండి... అలా అవహేళన కాకుడని నా కోరిక అందుకే ఈ పోస్ట్.

మీకు ఎదురయిన లాంటి వారు మొత్తం వర్గంలో ఎంత శాతం ఉండచ్చని మీ అభిప్రాయం. మీకు నచ్చని అలవాట్లు మీరు నిరభ్యంతరంగా మార్చుకోండి ఎవరు కాదన్నారు. : sure..

మీ ఇంటి మీదకి గొడవకి కాని వచ్చారా ఆ ఫలానా వర్గం వారు.:మా ఇంటి దాకా వస్తే విషయం బ్లాగు దాకా రాదండి ఎలా సమస్యని పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు.

ఇకపోతే నీతులు చెప్పడం..... నీతి అంటేనే ఇంకొరికి చెప్పేదే కానీ పాటించేది కాదు అని ఈ రోజుల్లో నిర్వచనం. ప్రతి వాడు చేసేదే అది. దీన్ని కూడా మీరు ఒకే వర్గానికి ఆపాదిస్తున్నారు.: ఏ వర్గ వివక్షత గురించి నేను మాట్లాడలేదు మేడం.

అలాంటి వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తీ మీకు నీతులు చెప్పేవరకు ఎందుకు వస్తాడు. దారిన పోతుంటే ఆపి చెప్పడుగా మా వంశం మా తాతలు తండ్రులు అని. చెప్పినా ఎవరు విలువ ఇస్తారు, అనేదేదో మొహం మీద అనేస్తారు. ముందు నీ సంగతి చూసుకో నాకు నీతులు చెప్పడం ఎందుకు అని. అంతేగానీ ఇలా ఇంటికొచ్చి మొత్తం ఆ వర్గం వారు అందరూ అంతే అని తేల్చేయడం తప్పు.: ఒక సంఘటన ఇలా బ్లాగు దాకా తీసుకుని వచ్చింది అలాంటి వారు (ఏ వర్గం వారయినా సరే) ఎవరన్నా ఉంటే మార్పు అవసరం చెప్పే ప్రయత్నమే తప్పితే ఇలా వర్గం , వంకాయ అంటూ వివక్షత చూపడానికి కాదు స్వర్ణమల్లిక గారు .

మీకు ఎదురయిన చెడుని అక్కడే ఖండించండి.: నా దాకా వస్తే బ్లాగు దాకా రాకుండానే ఖండిస్తాను ఆ వ్యక్తిత్వం నాది, ఇలా మీతో చెప్పించుకునేదాకా రాను.

దాన్ని మొత్తం ఒక వర్గానికి ఆపాదించకండి. : మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు..

మరి నాకు తెలిసిన చాలా మంది అదే వర్గం వారు వారి క్రమశిక్షణ వలన చదువుల్లోనూ, వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోనూ ఇంకా చాలా రంగాల్లో రాణించారు. దీనికి ఏమంటారు...: వేరి గుడ్ నేను అనేదేముంది అలా ఉండమనే కదా నా కోరిక..

మీరు దురాచారాలు... తొక్కా తోలు ... అని తీసిపారేసేవి వారికి నియమాలు. వాటిని చిత్తశుద్దితో పాటించడం వలన వారికి మేలే జరుగుతుంది కానీ కీడు కాదు: మేలు జరిగినవారిని పనిగట్టుకుని మానమని నేను చెప్పడం లేదే. ఎందుకంత ఆవేశం ? మార్పు దాని వల్ల సమస్య వచ్చినవారికి కదా. .

ఎవరో ఒకరో ఇద్దరో చేసే చెడు పనుల వలన ఇలా వర్గం మొత్తాన్నీ చిన్న చూపు చూడకండి.: :-) మళ్ళీ అదే.. నాకు చిన్న చూపు లేదు మేడం... ఎవరిని అవహేళన అపహాస్యం పాలు చేయకండి వేడుకోలు అంతే.
******

5.11.2010

శ్యామల... ఒక హాట్ టాపిక్

శ్యామల ఎవరబ్బా ఈవిడా అని అనుకుంటున్నారా? నిజానికి ఒక నెల .. రెణ్ణెల్ల ముందు దాకా నాకు తెలీదు ఈవిడ.. మీకో సెలబ్రిటీ ని పరిచయం చేస్తాము ఆవిడని మీరు ఎలాంటి స్ట్రైట్ క్వొశ్చన్స్ అన్నా వేయొచ్చు అని అదేదో టి.వి లో వస్తే ... ఎవరబ్బా ఈవిడ? పేరెప్పుడు వినలేదే అని అనుకున్నా.... ఆరోజు మర్చిపోకుండా వాళ్ళన్న టైంకి ఆ ముఖా ముఖి చూశా. ఆవిడ ఒక జోగిని... జోగిని వ్యవస్థని రూపుమాపడానికి కృషి చేస్తున్నారావిడ. ఆ కార్యక్రమంలో ముఖ్యమైన ప్రశ్నలు:

1 ప్రశ్న . అసలు జోగిని అంటే ఏంటి..

జవాబు: మాకు యుక్త వయసు రాగానే దేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి ..ఆ ఊరిపెద్ద దగ్గిర మమ్మల్ని ఉంచేస్తారు.... ఇహ ఆ ఊరి పెద్ద మా ఆలన పాలన చూసుకుంటారు.

2 ప్రశ్న . మిమ్మల్ని సెక్సీ స్టార్ అని పిలుస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు వద్దని చెప్పొచ్చు కదా.

జవాబు: అదంతా వాళ్ళ అభిమానమండీ.. అభిమానులందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకుంటారు. ఇప్పుడు భగవంతుడిని వివిధ రూపాలతో కొలవడం లేదా?? అలాగ.. నేను ఎవరికీ ఏమి చెప్పను.

3 ఫ్రశ్న: మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు..

జవాబు: మా పెద్దలు నేను ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండడమే నాకు ఇష్టం.. మా కుటుంబ వృత్తి ఇది, నెనిలాగే ఉంటాను అన్ని దేవాలయాలకి తిరుగుతాను. దేవుడి దయవల్ల నాకింత పేరు వచ్చింది ప్రజలు నా ఆశయాలని హర్షించారు, నా అశయ సాధనని నేను మరిత ఉధృతంగా ప్రచారం చేస్తాను. ఈ వ్యవస్థ నశించాలి, మేము మనుషులమే .. మాకు హక్కులుంటాయని తెలియజెప్పుతాను...మొ...

4. జోగినుల పెళ్ళికి మీరు వ్యతిరకా?

జ: లేదు జోగినులకి పెళ్ళంటూ ... వారికీ ఒక కుటుంబమంటూ ఉండాలి, నాకు తెలిసి ఒక జోగినికి వివాహం చేశాము.. 2 నెలలకు వాళ్ళ భర్త చనిపోయారు..... ??? :(

ఇవి ముఖ్యమైన ప్రశ్నలు ఆరోజు ఇంటర్వ్యూలో..

నిన్న ఇంకో ఛానెల్ లో నాకీవడ ప్రత్యక్షమయ్యారు.. మానవ హక్కుల సంఘానికి "జోగినీ వ్యవస్థ నశించాలి " అంటూ ఒక వినతి పత్రం సమర్పించారుట. అదిగో అప్పుడు గుర్తొచ్చింది ఈ ముఖా ముఖీ ప్రోగ్రాం.

మీరు విన్నారుగా/చదివారుగా .....పూర్తిగా నేను రాసినట్లే కాకపోయినా అక్కడి ప్రశ్నలకి మటుకు జవాబులు అవి..

ఇక్కడ మనిషి అన్న ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాధమిక హక్కులుండాలి . ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండాలి. అలాగే ఈవిడ ఆశయం కూడా మెచ్చుకోతగ్గదే. కాని.. తను పాటించాలి కదా, ఎవరెలా పిలిస్తే అలా పలుకుతాను, ఎవరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తాను కాని, జోగిని వ్యవస్థ అనేదే ఉండకూడదు అని చెప్పడం... శ్యామలగారు ఒక జోగినినే, జోగినలకి పెళ్ళి చేయాలి, వాళ్ళకీ ఒక కుటుంబం అంటూ ఉండాలి, వాళ్ళకి సంఘంలో గౌరవం ఉండాలి అని ఆశిస్తున్నప్పుడు, ఎవరో జోగీనికి పెళ్ళయింది.. కాని రెండు నెలలకే భర్త చనిపోయాడు.. మా సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను అని సమాధానం ఎందుకు? మరి మిగతావాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మనము మారాలి అంటే ... ఆ మార్పు వల్ల ప్రయోజనం ఆశించాలి కాని, మార్పు చెడు కాకూడదు కదా.. ఇంత చిన్న విషయం ఈ సెలబ్రిటీకి అర్థం కాలేదా? ఫోన్ చేసిన ప్రతిఒక్కరికి తన మెయిల్ అడ్రస్స్ ఇస్తూ మెయిల్ చేయమనడం?? అసలు నచ్చని వ్యవస్థ అంటూ ఒకటి ఉన్నప్పుడు దానిని రూపుమాపాలి అని నడుం బిగించిన నాయకురాలి లక్షణాలు.???..

తను మారి దీని వల్ల ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి నేనిలా అడుగుతున్నాను అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది కదా..

ఏంటో ! నాకిలాంటివి అర్థం కావు... అసలు ఎవరికి తెలియనివారిని పిలిచేసి, ఇలా ముఖా ముఖీ అంటూ ... ప్చ్ ! ప్చ్ ! మరీ ఇంత రేటింగ్ పిచ్చా?

జోగిని వ్యవస్థ అనేది ఇంకా ఉందా? ఉంటే మరి అది ఉండాలా ? వద్దా?? .. శ్యామలగారికి ఈ సమాధానం తెలుసా? ఈవిడ మమ్మల్ని కించపరుతోంది అని ఇంకొకావిడ పేపర్ లో స్టేట్‌మెంట్ ఇచ్చిందిట ఇటూ ఒక లుక్కేయండి.. శ్యామల జోగిని కాదు! సీనియర్ జోగిని రేవతమ్మ
*****

ముగింపు: ఆరోజు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్‌తో (అందరూ మగవాళ్ళేనట) ఆ ఛానెల్ రేటింగ్ రికార్డ్ స్థాయి కి చేరుకుందిట. :) మగవాళ్ళు మీకు జోహార్లు.
*****

5.06.2010

WATERMELON AND EGGS...awesome...

WATERMELON AND EGGS

These are truly incredible. You'll love the cool watermelons,


but you'll be blown away by the eggs!

These egg shells were cut with a high intensity precision Laser Beam. This gives a very good idea of what can be achieved with a Laser Beam. This gives you an idea what laser surgery performed on one's eye is all about. Is it any wonder how one's vision can be improved in just a few moments? Science is sometimes wonderful, and it's still on the frontier of gaining new knowledge. Incredible what can be done with an eggshell and a laser beam.





















5.04.2010

ఎవరా నలుగురు? అయినా... నాకెందుకులెండీ ..

ఆమధ్య పోటిలకి.... ఆధిపత్యానికి తట్టుకోలేక, ఎవరో చిన్న హీరో ఆత్మహత్య చేసుకోబోయి, చావు తప్పి కన్ను లొట్టపోయి, "మా సినిమాలనికూడా ఆదరించండి" అంటూ .....సినీపరిశ్రమ ఎవరో నలుగురి పెద్దల చేతిలో ఉంది కాపాడండి.... అని మానవహక్కుల సంఘానికి పిర్యాదు చేసారుట. సరే, ఆ కథ ఏమి జరిగిందో కాని, బ్లాగుల్లో కొత్తవారి పరిస్థితి ఆ చిన్నహీరోలాగే ఉన్నట్లుగా ఉంది.

నేను వచ్చిన కొత్తలో అనుకుంట ఒక్కో ఒక్కో బ్లాగు చదువుకుంటుంటే స్ఫురించిన విషయం, బ్లాగుల్లో అంశాలు వేరు వేరు ... కాని వ్యాఖ్యలు మటుకు అన్నిటికి ఒకటే, హహ్హహహ సూపర్, చాలా బాగా రాశారు. అంటూ అన్నిటిలోను అనుకుని కాపీ పేస్ట్ చేసినట్లుగా.. అదేదో సినిమాలోలా, (ముందు హీరోయిన్ని అడిగిన ప్రశ్నలకి చెప్పిన సమాధానాలు తరువాత వచ్చే కమేడియన్ చెప్తే , ఆవిడ చెప్పిన జవాబులే ఇతనూ చెప్పాడుగా ... ఇతనికి కూడా మన కాలేజ్లో సీట్ ఇవ్వాల్సిందే అని అటెండర్ మంకుపట్టు పట్టినట్లు), అక్కడ ఏమి రాసీనా వ్యాఖ్యలు రాయాల్సిందే అని ఎవరో చెప్పినట్లుగా వస్తాయి కామెంట్లు. ఒక నలుగురి పేర్లు మటుకు కామన్‌గా... అసలు పోస్ట్ చదువుతారా ?? అన్నదే నాకు కించిత్ అనుమానం అప్పట్లో, చదవరని తరువాత తెలిసింది, నాసిరకం, చౌకబారు వ్రాతలకి ఆహా !! ఒహో !!! అని పొగిడేసేవాళ్ళని చూస్తుంటే అసలు అలాంటి వాళ్ళ వ్యాఖ్యలు మనకొద్దులే అనిపిస్తుంది.
నా పాత బ్లాగులో అనుకుంట ఎదో కథలో నాకు నాచ్చని అంశాలని ప్రస్తావిస్తూ రాసినప్పుడు , మధ్యలో వచ్చే జయదేవ అష్టపది అర్థం అందరికీ తెలీదు, కొంత అన్నా ఆ అష్టపది అక్కడ వాడిన వివరణ ఇవ్వాలి అని చెప్తూ , రచయిత/రచయిత్రి తను రాసే పదాలు సామాన్య పాఠకుడు చదివే అందుబాటులో రాయగలగాలి అంటే ఒక మెట్టు దిగాలి (పాఠకుడి పరిజ్ఞాన స్థాయికి రావాలి ) అని రాశాను. దానికి అప్పట్లో అందరూ కాస్త నామీద కినుక వహించారు " ఎంతమాట ... ఎంతమాట రచయితని మెట్టు దిగమంటావా " అని.. కాని, అదే కథలో ఒకపాత్ర ద్వారా వేరే ప్రాంతీయ భాష మాట్లాడించడం?? అన్ని ప్రాంతీయాలు వాడినప్పుడు, మరి అష్టపది అర్థం చెప్పడం తప్పేమి కాదు కదా అని అప్పట్లో చిన్న వాదన జరిగింది.

మరి ఇలాంటివన్నీ పట్టించుకునే అలాంటి గొప్ప ప్రతిభావంతులు , సూక్ష్మగ్రాహులు అయిన ఆ పాఠకులు రచయిత్రులు/రచయితలు... ఈరోజు అర్థం ... పర్థం, సరైన వ్యాకరణం లేని పోస్ట్‌లకు వ్యాఖ్యలు రాయడం నిజంగా హాస్యాస్పదం. తినగ తినగ వేప తీయగుండు అని అన్నట్లు, అవతలి వారి వ్యాకరణల్లేని ఆ భాషకి వీళ్ళు కూడా చదివీ ...చదివీ అలవాటు పడిపోతారేమో... మన సినీ పరిశ్రమలో వారసులను చూడడం మనము అలవాటు చేసుకున్నట్లుగా.. అంతేనేమో..:-)

అయినా నాకెందుకులెండీ .. "వేలుమీద గోరు మొలిచింది వెఱ్ఱిమొగుడా వేరుండు" అన్నట్లు... రమణి ఏదో రాసేసింది బ్లాగులకి దూరంగా ఉండు అనేస్తారేమో...

తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివీ బ్లాగు గోలలు. ఎదో ఆలోచన వచ్చింది అవునా... నిజమేనా.. నా ఈ ఆలోచన అని అడగడమే తప్పితే వెరే ఏ ఉద్దేశ్యం లేదు. :-)
******

ICE...IN CASE of EMERGENCY

Dear All :

We all carry our mobile phones with names & numbers stored in its memory but nobody, other than ourselves, knows which of these numbers belong to our closest family or friends. If we were to be involved in an accident or were taken ill, the people attending us would have our mobile phone but wouldn't know who to call. Yes, there are hundreds of numbers stored but which one is the contact person in case of an emergency? Hence this "ICE" (In Case of Emergency) Campaign
The concept of "ICE" is catching on quickly. It is a method of contact during emergency situations. As cell phones are carried by the majority of the population, all you need to do is store the number of a contact person or persons who should be contacted during emergency under the name "ICE" ( In Case Of Emergency).

The idea was thought up by a paramedic who found that when he went to the scenes of accidents, there were always mobile phones with patients, but they didn't know which number to call. He therefore thought that it would be a good idea if there was a nationally recognized name for this purpose. In an emergency situation, Emergency Service personnel and hospital Staff would be able to quickly contact the right person by simply dialing the number you have stored as "ICE."

For more than one contact name simply enter ICE1, ICE2 and ICE3 etc. A great idea that will make a difference!

Let's spread the concept of ICE by storing an ICE number in our Mobile phones today!

5.03.2010

వేసవి- వెన్నెల - విరిసిన మల్లెలు

వేసవి అంటే నాకు చాలా ఇష్టం.. ఎంతిష్టమంటే మల్లెపూల గుభాళింపంత, మల్లెపూల గుభాళింపు తెలియనివారుండరు నాకు తెలిసి. వేసవిలో సాయంత్రం అవుతూ ఉంటే చల్లటి పిల్లగాలులతో మొదలై, పక్కనెక్కడన్నా మల్లెతీగ అల్లుకుని ఉంటే ఆ పిల్లగాలి తీసుకుని వచ్చే ఆ మల్లెపూల గాలి తెమ్మెరల గుభాళింపు, ఈ జీవితానికిక ఇది చాలాదు అనిపించేంత భావుకత రాదూ..అలాంటి సమయంలో ఇష్టసఖి చెంతనుంటే ఇహ చెప్పేదేముంది..వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి

అంటూ వెన్నెలలో చల్లగా ... అమాయకంగా మనవైపు చూస్తూ కనిపిస్తున్న జాబిలిని ఎంటి ఇంత మాయా చేసేస్తున్నావు అని ప్రశ్నించమా?

వెన్నెలలోనే విరహమేలనో,విరహములోనే హాయి ఏలనోఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి....

ఈ నీలాపనింద నాకేమిటమ్మా? మీ ఇరువురుమధ్య నేనెందుకు అని చందమామ మబ్బుల చాటుకి చేరుకున్నప్పుడు, సన్నటి చిరునవ్వుతో.... ఏమిటీ విరహం అంటూ ప్రియురాలు అడిగితే..

మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా...మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా.....
నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే
వెన్నెల రాత్రులు ఏరోజు కారోజు కొత్తే కదూ.. మొన్నొకలా నిన్నొకలా నేడు ఇంకో వింతగా..

వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనోఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి
రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా..
రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగానీ కళలూ నీ హొయలూ చల్లచల్లగా విరిసేనే
రూపందేమి ఉంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, చల్లటి చూపు చక్కటి స్నేహం .. ఎప్పటికి మనకి సేద తీర్చే సాధనాలు.....

వెన్నెలలోనే హాయి ఏలనో, వెన్నెలలోనే విరహమేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలివెన్నెలలోనే విరహం, విరహం వల్ల వేడి, ఆ విరహం వేడే ఎంతో హాయి..
వేసవి రాత్రులు మల్లెల సౌరభాలతో కొత్తగా పెళ్ళయినవారికయినా, ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొనే షష్టిపూర్తి దంపతులకయినా నిజంగానే ఆ నిండు చంద్రుడు ఎదో మాయ చేసాడనే అనిపించక మానదు..
*****

పొద్దున్నే ఎదో తెలుగు ఛానెల్‌లో పెళ్ళినాటి ప్రమాణాలు చిత్రంలోని ఈ పాట గురించి చెప్తూ .... కొత్తగా పెళ్ళయినవారికి ఈ వేసవి వెన్నెల పాటలు అంటూ ఉంటే అనిపించింది, కొత్తగా పెళ్ళయిన వారికే కాదు దంపతులైన ప్రతి ఒక్కరు ఆస్వాదించాల్సిన చల్లటి వెన్నెల గాలులు, మల్లెల సౌరభాలు, ఇహ అదే సమయంలో దంపతులు వెన్నెలంత తెల్లటి వస్త్రాలు ధరిస్తే అనుకొకుండా అనలేమా ఇలా....

కిన్నేసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మ్రోగా కలహంస నడకల కలికి ఎక్కడికే ... అంటేస్వామీ!! నీ ప్రణయ సన్నిధికే.... అనే సమాధానం ...

ప్రస్తుతం ఉన్న కాంక్రీటు అరణ్యంలో డాబాలు, మల్లె తీగలు... వెన్నెల విస్తరించాడాలు లేకపోయినా ఉన్నంతలో ఇలాంటి వాటిని ఆస్వాదించడం మన తెలుగువారి గొప్పదనం.

నాకు ఇష్టమైన పాటలు ఇవి.. అందుకే మరోసారి ఆ ఆలోచనలు మీతో పంచుకున్నానిలా.
****

5.01.2010

ఆ పాత మధురాలు

"అమ్మా అంత చిన్నప్పుడు పెళ్ళి ఎలా ఒప్పుకున్నావు?" అని ఆ మధ్యెప్పుడో మన మీడియాలో బాల్య వివాహాలు పై ప్రముఖుల చర్చ జరుగుతున్నప్పుడు, మా అమ్మని అడిగిన ప్రశ్న. "మాకేమి తెలుస్తాయే, ఎవో కొత్త పట్టుబట్టలు, మెళ్ళో నగలు వస్తున్నాయి కదా అని సంబరపడిపోయి తలొంచేశాము. 7 రోజుల పెళ్ళి చేశారు మీ తాతగారు నాకు మీ పిన్నికి (తనకి తన చెల్లెలికి) " అని ఇప్పటికి ఆ సంబరాల హేల చెప్తూ ఉంటుంది అమ్మ ఎదో నిన్నో మొన్నో జరిగినట్లుగా పూస గుచ్చినట్లులా , అసలు మా నాన్నగారి అమ్మగారికి ... అంటే మా మామ్మకి మా అమ్మ కాస్త చామన ఛాయలో ఉంటుంది అని అసలు నచ్చలేదుట.... "నువ్వేమో ముట్టుకుంటే కందిపోయేంత ఎరుపు , ఏమి బాగుందిరా నల్లగా "అంటూ ఎద్దేవా చేసేదిట. నాన్నగారు "చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే ఇహ పెళ్ళే చేసుకోనని "మంకుపట్టు పడితే ... అలా ఏడేళ్ళ పిల్లని, 15 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి చేసిన వైనమిది.. అనుకోకుండా మా పిన్నికి కూడా అప్పుడే ఎదో దగ్గిర సంబంధం కుదిరితే అక్కా చెల్లెళ్ళిద్దరికి కలిపి చేసేసి ఒక అందమైన ఫోటో ఇలా......
ఒకవిధంగా మా నాన్నగారిది ప్రేమ వివాహమన్నమాట. మొదట ఎడమనుండి నాన్నగారు-అమ్మ. మా బాబాయ్ -పిన్ని (అమ్మ చెల్లెలు)


మూడో చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతుండగా, అసలు వీళ్ళ నలుగురి ఫొటోలు లేనేలేవంటే ఎలా ఉన్నవాళ్ళు అలా కూర్చుని తీయించుకున్న ఫొటో మా అమ్మా.. వాళ్ళ చెల్లెళ్ళు... కుడినుండి ఎడమకి అమ్మ, పెద్ద చెల్లెలు, రెండో చెల్లెలు, మూడో చెల్లెలు..


A very important message to everyone

A very important message to everyone, please read it carefully.

1 Egg, & 2 Mobiles
65 minutes of connection between mobiles.
We assembled something as per image:
FunAndFunOnly (www.mails4u.net.tc) - SridhaR

Initiated the call between the two mobiles and allowed 65 minutes approximately...
During the first 15 minutes nothing happened;
25 minutes later the egg started getting hot;
45 minutes later the egg is hot;
65 minutes later the egg is cooked.

FunAndFunOnly (www.mails4u.net.tc) - SridhaR
Conclusion: The immediate radiation of the mobiles has the potential to modify the proteins of the egg. Imagine what it can do with the proteins of your brainswhen you do long calls.

Please try to reduce long time calls on mobile phones . :-)

*****