2.17.2011

అక్కడే ఆగాలి ఆడ(బ్లాగర్లు)వాళ్ళు

శరత్ గారు ఈ పోస్ట్ మీకొసం ప్రత్యేకం. 

శరత్ గారు రాసిన ఆక్కడే ఆగిన... 2 భాగాలు ఈరోజే చదివాను. శరత్ గారి శైలి ఎలా ఉంటుంది అంటే, చదువుతూ ఉంటే..  అవును, మనం ఎంత అజ్ఞాతం/అజ్ఞానంలో ఉన్నాము, ఈరోజుల్లో కూడా ఇలా ఉన్నామా, ఇదేదో బాగానే ఉందే అని అనిపించేలా రాస్తారు చదవడము అయిపోయి వాస్తవానికి (అప్పట్లో చలంగారి పుస్తకాలు చదువుతుంటే ఇలానే అనిపించేది వాస్తవాన్ని మరిచిపోయేవాళ్ళము ఒక్కోసారి) వచ్చి చూస్తే, అవునేంటి ఇలా ఆ లోచిస్తున్నాము, ఇవన్నీ రాస్తే ఇంకేమయినా ఉందా? మనవాళ్ళు ఎంతమంది మన బ్లాగులు చదువుతారు? మొన్నామద్య అన్నయ్య .. నువ్వు రాసిన ఫలనా పోస్ట్ చాలా బాగుంది అని అన్నాడు, ఇలాంటివి చదివితే వాళ్ళింటికి వెళ్ళి ముఖా ముఖీ మాట్లాడగలనా?  అని మన ముందున్న తెరని తొలగింపజేసుకుంటాము. (అంటే వాళ్ళెవరు చదవకపోతే రాస్తారా అని అడగకండి అలాకూడా రాయను, రాయకూడదు, మనకంటూ మన పూర్వీకులు నియమించిన పరిధిలు ఎప్పుడు దాటకూడదు) మనకి  ఒక ఉనికి ఇచ్చి, ఒక పేరు పెట్టి ఫలానా వాళ్ళ అమ్మ, అక్క, చెల్లి, మొ పేర్లు, మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం, ఒక ప్రయోజనంతో మన కుటుంబంతో సహజీవనం చేస్తున్నవాళ్ళము.   అజ్ఞాతంగా రాయడన్మంటే అసలు అంత ముసుగు అవసరమా? ఎదో చేయరాని ఘోరం చేసినట్లుగా అని అనిపిస్తుంది.  

అలా అనుకుని ఎవరో "సీతాకాలం " అని శరత్ గారి  బ్లాగు కి దగ్గర్లో ఉన్న పేరు చూసి అటు వెళ్ళి చదివితే ఇదా శరత్ గారు రాయమన్నది.. ఇలాంటి రచనలా?  ఇవే కావాలనుకుంటే పూర్తిగా తెల్లారకుండానే వచ్చే దినపత్రికలలో కావల్సినవి బోలెడు, రోజుకో పోస్టేమి కర్మర్యాగింగ్ అనే శిర్షిక కింద ఒక బుట్టెడు వార్తలు దొరుకుతాయి, ఏ ఛానెల్ పెట్టినా ఎమున్నది గర్వకారణం, ప్రతి ఛానెల్‌లో ఆతరువాత అతనేమి చేశాడు, ఆమెని పెళ్ళి చేసుకున్నాడా? చేసుకుందామనుకున్నాడా, అలా అనుకుంటే మౌనం ఎందుకు, చూడండి బ్రేక్ తరువాత అంటూ …. సవాలక్ష ఎపిసోడ్స్ ప్రసారం చేస్తాడు. అసలు వీటికి కొదవేముందండి? పత్రికలు తిరగెస్తే ఇదో స్పెషల్ ఫీచర్ ఇందులో సమస్యలు, సందేహాలు, పరిష్కారాలు, ప్రతి ఒక్కరు ఎదో ఒక అక్రమ సంబంధం అంటూ సందేహాలు వెలిబుచ్చేవారే ఇంక జనాలకి వేరే పని లేదన్నట్లు. అర్థరాత్రి వచ్చే ప్రసారాల్లో కూడా వాళ్ళ రేటింగులు పెంచుకోడానికో లేక పబ్లిసిటీ కోసమో ఆడవాళ్ళనే యాంకర్లని పెడ్తున్నారు. ఇంక మళ్ళీ బ్లాగుల్లో ఎందుకో నాకర్థం కావడంలేదు.

 ఏ మగవాడయినా..

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మోగ కలహంస నడకల కలికీ ….. ఎక్కడికే ..... అని అడిగితే,

స్వామీ నీ ప్రణయ సన్నిధికే ...

అని ముగ్ధ మనోహరంగా చెప్పాలనుకుంటాడు కాని,

ఓయ్! ఎక్కడికిరా? వస్తావా … “ అంటూ  ఆడవాళ్ళు  తమని తాము మర్చిపోయి  అలా అడగాలి, ఇలాంటి అభ్యుదయం రావాలి/కావాలి  అనుకోరు, నిజానికి అలా అడిగితే కోపం వస్తుందేమో కూడా..

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమే ముద్దు
విరిసి విరియని  పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు.

గుప్పిట మూసినంత వరకే అందులో ఎముందో అని ఆరాటం, అది తెరిస్తే ఏమి లేదు అన్న నిరుత్సాహమే.

మన పెద్దవాళ్ళు , జీవితం విషయంలో,. భవసాగరాల విషయంలో మనల్ని అలా గుప్పిట మూసే ఉంచి మనల్ని ఊరిస్తూ పెంచారు, మనకి గుప్పిట మూసే,  మంచి చెప్పారు. వాళ్ళే కనక  మన చిన్నతనంలో జీవితమంటే ఏమి లేదు ఇంతే అని గుప్పిట తెరిచి ఉంటే మనమెలా ఉండేవాళ్ళం? విరక్తి కలిగేదేమో కూడా,  జీవితమంటే ఇంతేనా….  అని,  ఎదయినా  విరిసి విరియనంతవరకు, తెలిసి తెలియనంతవరకు  అందం.

ఇది మన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయం. అందుకే మన బంధాలు గట్టిగా ఉన్నాయి. మనం కూడా కట్లు తెంచుకుని పాశ్చ్యాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడి విచ్చలవిడితనం ప్రదర్శిస్తే వాళ్ళలాగే బంధాలన్ని మనకి దూరమవుతాయి. ఇదే జరిగేది మీరు (శరత్ గారు) చెప్పినట్లుగా చేస్తే. అందుకే అక్కడే ఆగాలి ఆడవాళ్ళు, మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామంటే ఎలా?

"వాళ్ళకో అవగాహన తీసుకురావద్దా?"  అని అడిగితే, తీసుకురావాలి వద్దన్నది ఎవరు? ఇలా రోజు పేపర్లో వచ్చేవి బ్లాగుల్లో రాసి కాదు, నాకిలా జరిగింది పెళ్ళి కాకముందు, లేదా బస్‌లో ఇలా జరిగింది….  ఇదంతా అవసరమా? "చేయి కోసుకుంటుంది జాగ్రత్తమ్మా" అని జాగ్రత్తలు చెప్పాలి కాని,  ఇలా కోసుకుంటుందమ్మా అని చాకుతో కోసి చెప్పడం కాదు.  ఒహో ఇంతే కదా అని మన తరవాతి తరం అనుకోకుండా , కొత్తగా పెళ్ళి అయిన వధూవరులు కొత్తని  ఆస్వాదించగలగాలి అంటే,  ఇలాంటి వెకిలి రాతలు ఉండకపోతేనే మంచిది. రాయండి..పెళ్ళి ఎప్పుడా??  అని ఆలోచించే విధంగా రాయండి. మనసు చిలిపి అల్లర్లు చేసేలా రాయండి. అంతే కాని ఇలా వెగటుగా కాదు. చెప్పగలిగే విధంగా చెప్పి,  ఈ తరానికి ఆసక్తిని పెంచగలగాలి. మన పెద్దవాళ్ళ లాగ గుప్పిట మూసే జీవితాన్ని చూపించాలి. తెలుసుకున్న తరువాత ఇహ ఎవరెలా వాళ్ళ శైలిని మార్చుకుంటారో అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.  అందుకే మరోసారి  అక్కడే ఆగాలి అందరూ. (ఆడవాళ్ళు .. మగవాళ్ళు కూడా)


******

38 comments:

 1. నేనూ ఈ రోజే శరత్ కాలం వ్రాసిన రెండు పోస్టులు చదివాను. భూమిక సత్యవతి గారు స్త్రీవాది కాదు. వీళ్లు భార్యలని కొట్టే భర్తలని అరెస్ట్ చెయ్యమంటారు, మహిళలపై యాసిడ్ దాడులు చేసేవాళ్లని శిక్షించాలంటారు, కులాంతర వివాహాలు, హోమోసెక్సువల్ వివాహాలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలంటారు. ఈ విషయాల చుట్టే ఉంటుంది భూమిక వంటివారి స్త్రీవాదం. మా ఊర్లో RTC మెకానిక్ ఒకాయన కులాంతర వివాహం చేసుకున్నాడు. అతని భార్యది ఏ కులమో తెలియదు. మా కులం కాదు అని మాత్రమే తెలుసు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ భార్య ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండిపోయింది. ఇక్కడ కుల సంబంధాలలో మార్పు కనిపించిందే కానీ స్త్రీ-పురుష సంబంధాలలో ఏ మార్పూ కనిపించలేదు. హోమోసెక్సువల్ వివాహాలు ఒకటి రెండు చూశాను (ఏ ఊరో గుర్తు లేదు. ఇలాంటివి హైదరాబాద్ లాంటి సిటీస్‌లోనే జరుగుతాయనుకునేవాళ్లు ఉన్నారు.) ఇద్దరు ఆడవాళ్లు స్వలింగ వివాహం చేసుకున్నారు. ఒకామె బయటకి వెళ్లి సంపాదిస్తోంది. ఇంకొకామె ఉన్న ఉద్యోగం మానేసి ఇంటి పట్టున ఉంది. కేవలం సెక్స్ స్వేచ్ఛ, హోమోసెక్సువల్ వివాహాల వల్ల స్త్రీల జీవితాలలో పెద్ద మార్పేమీ రాదు. రేప్‌లు ఎలా జరిగాయో చెప్పుకుంటే ఏమి లాభం? ప్రాక్టికల్‌గా రేప్ చేస్తే జైలుకి వెళ్తామనే భయం ఉన్నవాళ్లు అలాంటివి విని నోరు కార్చుకుని సంతృప్తిపడతారు. అలాంటివాళ్ల కోసం వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం ఎందుకు?

  ReplyDelete
 2. ప్రవీణ్ గారు: ప్చ్.. యధా ప్రకారం నాకు మీ కమెంట్ అర్థం కాలేదు. ఎవరికైనా అర్థం అవచ్చని పబ్లిష్ చెశాను.
  ఇలాంటి సంఘటనలన్నీ మీ వూర్లోనే ఎందుకు జరుగుతాయో :(

  ReplyDelete
 3. ఇప్పుడే ఈ కామెంట్, లింక్ మెయిల్ లో వస్తే చూస్తున్నా.. కేకో కేక !
  ఓలు బ్లాగులోకం లో ఎవడైనా సరే, ఈ టపాకు పైన ఉన్న కామెంటుకు సంబంధం ఏంఇటో చెబుతారా???

  ReplyDelete
 4. #..మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామంటే ఎలా.. "చేయి కోసుకుంటుంది జాగ్రత్తమ్మా" అని జాగ్రత్తలు చెప్పాలి కాని, ఇలా కోసుకుంటుందమ్మా అని చాకుతో కోసి చెప్పడం కాదు
  Well said!

  #భూమిక సత్యవతి గారు స్త్రీవాది కాదు...ఈ విషయాల చుట్టే ఉంటుంది భూమిక వంటివారి స్త్రీవాదం.
  Perfectly said! ఆమె రాతలు చాలా గందరగోళంగా ఉంటాయి! ఒక వైపు నాస్తిక అంటారు, మరో వైపు బుద్దుడు అంటారు. మరోసారి బ్రాహ్మలు చేసిన దేవుళ్ళు కాబట్టి హిందూ దేవుళ్ళని నమ్మను అంటారు. ఇదో విచిత్రవాదం, తెలిసీతెలియని పైత్యం.
  నాలుగు ఫోటోలు, మరి నాలుగు వాదాలు! మరదే స్త్రీవాదం అంటే, వాకే!

  #హోమోసెక్సువల్ వివాహాలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలంటారు.
  విచ్చలవిడితనం కానంతవరకు ఇందులో ఏమీ తప్పులేదు అన్యా! నిజానికి క్రైస్తవం దీన్ని ఒప్పుకునిఉంటే ఇది ఎప్పుడో ప్రపంచ ఆమోదం పొందేది, దీనికో "దినం" కూడా ఏర్పడేది.

  #కేవలం సెక్స్ స్వేచ్ఛ, హోమోసెక్సువల్ వివాహాల వల్ల స్త్రీల జీవితాలలో పెద్ద మార్పేమీ రాదు. రేప్‌లు ఎలా జరిగాయో చెప్పుకుంటే ఏమి లాభం?
  Aptly said!:))

  ReplyDelete
 5. #..యధా ప్రకారం నాకు మీ కమెంట్ అర్థం కాలేదు..
  Thatz very bad! అన్యా వ్యాఖ్యలు అర్థం కావట్లేదని చెప్పడం ఈమద్య కామెడీ అయినంట్టుంది. దీన్నివాళ్ళ ఆయనకేమీ లాస్ లేదు!

  ReplyDelete
 6. Dude Rajesh,
  >>దీన్నివాళ్ళ ఆయనకేమీ లాస్ లేదు!
  ఆయనకు దేని వల్లా లాస్ లేదు(వాళ్ళ బంధువులు బ్యాంకు ఉద్యోగస్థులు కదా మరి ;))
  ఎటొచ్చీ చిక్కేమిటంటే, టపాకు కామెంటుకు సంబంధం ఏమిటో తెలియకపోవటం సగటు బ్లాగర్ల ప్రారబ్ధం :)

  ReplyDelete
 7. >>ఎదయినా విరిసి విరియనంతవరకు, తెలిసి తెలియనంతవరకు అందం.
  నా మనసులో ఉన్న అభిప్రాయం అంత ఖచ్చితంగా ఎలా చెప్పారో...మీకు హ్యాట్సాఫ్..

  ReplyDelete
 8. >>రేప్‌లు ఎలా జరిగాయో చెప్పుకుంటే ఏమి లాభం? ప్రాక్టికల్‌గా రేప్ చేస్తే జైలుకి వెళ్తామనే భయం ఉన్నవాళ్లు అలాంటివి విని నోరు కార్చుకుని సంతృప్తిపడతారు. అలాంటివాళ్ల కోసం వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం ఎందుకు?

  రమణి గారూ, ప్రవీణ్ ఇక్కడ మిమ్మల్ని సమర్ధించారని అర్థం చేసుకోవాలి...

  ReplyDelete
 9. >> మిమ్మల్ని సమర్ధించారని అర్థం చేసుకోవాలి
  కళ్ళు తెరిపించారు బాబూ తెరిపించారు :D

  ReplyDelete
 10. శరత్ కాలానికి భూమిక సత్యవతి పేరు స్మరించడం కొత్త కాదు. ఆ టపాలలోనూ ఆవిడ పేరు స్మరించాడు. అంతే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది?

  ReplyDelete
 11. $అన్యా
  నాకు తెలిసి వారికి అర్థకానిది కింద పేరా! ఈ పేరా, పై టపాకి సంబంధం లేదు కదా?

  "
  మా ఊర్లో RTC మెకానిక్ ఒకాయన కులాంతర వివాహం చేసుకున్నాడు. అతని భార్యది ఏ కులమో తెలియదు. మా కులం కాదు అని మాత్రమే తెలుసు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ భార్య ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండిపోయింది. ఇక్కడ కుల సంబంధాలలో మార్పు కనిపించిందే కానీ స్త్రీ-పురుష సంబంధాలలో ఏ మార్పూ కనిపించలేదు.
  "
  ఇంతకీ అసలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే "మార్పు" వస్తుంది అంటారా? ఈ రోజుల్లో ఇంట్లోఉండి వంటచేసి పెట్టి భార్యల్ని ఉద్యోగాలకి పంపిచేవాళ్ళూ చాలామంది ఉన్నారు. ఇవి ఆర్ధికఅవసరాలు అంటారా లేక మార్పేనా?.

  ReplyDelete
 12. ప్రవీణ్ : శరత్ గారి ఆ పోస్ట్ ఆంతర్యం సత్యవతిగారినో ఇంకొకరినో స్మరించడం కాదనుకుంట.. ఆయన స్మరించారు కాబట్టి నేను స్మరిస్తున్నాను అర్థం చేసుకొండి అనడం హాస్యాస్పదం. అయినా ఓ కె .. మీరు నేను రాసిన ఈ పోస్ట్ తో ఏకీభవించారు కదా నెనర్లు. ఇంక మీ ఊరి విశేషాలు మీ బ్లాగులో రాసుకొండి.

  ReplyDelete
 13. రాజేష్ గారు పోస్ట్‌కి సంబంధించిన చర్చలే మంచిది కదా.. ఇలా అర్థం లేని కమెంట్ల చర్చకన్నా ఆలోచించండి. మీరడిగిన ప్రశ్నకి ప్రవీణ్‌గారు ఎదో సమాధానం చెప్తారు అక్కడ ఇంకోటేదో అర్థం కాని విషయం ఉంటుంది.. అవసరమా ఇవి కాలాయాపన తప్పితే??

  ReplyDelete
 14. మార్పు కొంత వరకైతే వచ్చింది రాజేశా. అప్పట్లో ఆడవాళ్లకి పెళ్లైన తరువాత వాళ్ల భర్తలే ఉద్యోగాలు మాన్పించేవాళ్లు. ఇప్పుడు ఆడవాళ్లు పెళ్లైన తరువాతే ఉద్యోగాలకి వస్తున్నారు. అది కుటుంబ పోషణ కోసమైనా కావచ్చు. ఉద్యోగం లేకుండా భర్త మీద ఆధారపడడం కంటే అదే బెటర్ కదా. ఉద్యోగం చేసే స్త్రీలకైనా పెళ్లి టైమ్‌లో కట్నం లాంటి ఇష్యూస్ వస్తాయి. ఇలా చాలా విషయాలలో అసమానత్వం కనిపిస్తుంది. రేప్ ఎలా జరిగింది లాంటి విషయాలు చెపితే సమానత్వం రాదు. సాధారణంగా రేప్‌లు మగవాళ్లు ఆడవాళ్లపై చేస్తారు. ఆడది మగవాడ్ని రేప్ చెయ్యగలదు అంటే నమ్మరు కదా. మగవాడి కంటే ఆడది ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ సమాజంలో ఉంది కదా. ఆడవాళ్ల విషయంలో ఇలాంటి భావనలు ఉన్నప్పుడు రేప్ ఎలా జరిగిందో చెపితే ఏమిటి? లైన్ ఎలా వేశారో చెపితే ఏమిటి?

  ReplyDelete
 15. @రాజేష్ @ ప్రవీణ్ : మీరు మీ బ్లాగుల్లో చర్చించుకుంటే బాగుంటుంది. నేను ఏది వద్దంటున్నానో అవే కామెంట్స్ వస్తున్నాయి. ప్రవీణ్ మీ కమెంట్స్ ఇంక పబ్లిష్ చేయను. నాకు మీరు రాసేవి చదివే ధైర్యం లేదు.

  ReplyDelete
 16. మీరు magnifying glass పెట్టి లేని అర్థాలు చూస్తున్నట్టు ఉన్నారు. సపోజ్. మీరు జేమ్స్ స్ట్రీట్ స్టేషన్‌లో ఏదో జరిగిందని చెప్పారనుకోండి. అలాంటివి జేమ్స్ స్టీట్ స్టేషన్‌లోనే జరుగుతాయని అర్థం రాదు. జేమ్స్ స్ట్రీట్ స్టేషన్‌కి ఈ విషయంతో సంబంధం ఏమిటి అని నేను అడగను. టపాలో శరత్ భూమిక సత్యవతి గారి గురించి వ్రాసాడు. అందుకే అతను వ్రాసిన దాంట్లోని అంతరార్థం గురించి చెపుతున్నాను. స్త్రీవాదానికి, స్త్రీల హక్కుల అడ్వొకసీకి మధ్య తేడా ఉంది. శరత్ వ్రాసినది స్త్రీవాదం కిందకి రాదు, స్త్రీల హక్కుల అడ్వొకసీ కిందకైనా రాదు. శరత్ టపా గురించి రివ్యూ వ్రాసేటప్పుడు అతని టపాని అన్ని కోణాలలో చూడాలని చెప్పడానికే భూమిక సత్యవతి గారి కోణంలోనూ చూడమన్నాను. అంతే కానీ టపాకి దూరంగా పోలేదు.

  ReplyDelete
 17. శరత్ గారు ఎక్కడున్నారు? save me..

  నేను ఎవరి పోస్ట్ కి రివ్యూ రాయలేదు. శరత్‌గారు రాసినదానికి అలా కాదు ఇలాగే ఉండాలి అని నా అభిప్రాయం చెప్పాను. అందులో ఎవరెవరి పేర్లు ఉదహరించారు, ఎందుకు, ఎక్కడ అనే అంశాలు అనవసరం మనకి, స్త్రీవాదం, పురుష వాదం అనే సంవాదం కూడా అప్రస్తుతం, స్త్రీలు ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే అలా కాదు ఇలా ఉండాలి అని నా అభిప్రాయమన్నమాట అది. ప్లీజ్ నాకు మీరు అర్థం కారు కాని వదిలేద్దామా .. ఈ టాపిక్ ఇక్కడ.

  ReplyDelete
 18. I won't write any thing if you are unable to understand. Remember that there are no hidden implications in my thesis. Your post's title indicates that you wrote review on Sarat's posts. I won't write any thing more here. I just say that it's not my fault if you look at every thing in magnifying glass.

  ReplyDelete
 19. పాపం మార్తాండ కామెంట్లు పబ్లిష్ చేసి మరీ వెటకారం చేస్తున్నారుగా :))

  ReplyDelete
 20. :)) మా ప్రవీణ్ బావా మజాకా!

  అసలు ఆడవాళ్ళు అంతకంటే ముందే ఆగిపోవాలంటాను. ఆడవారికి బ్లాగులెందుకండి? ఎవరిని ఉద్ధరించడానికి? ఎంచక్కా బురకా వేసుకొని ఇంట్లో కూర్చోక! అసలు ఆడవారు బ్లాగుల్లోని రావడం వల్లే ఈ అనర్ధాలూ, సీతమ్మ వారికి అపచారాలూనూ. బ్లాగులు వ్రాయమని ఏ భారత సంస్కృతి నేర్పిందేంటి?

  అసలు ఆడవారు అందరూ మా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలంటాను నేను. మా ఆవిడని ఎంత ప్రోత్సహించినా కూడా బ్లాగుల ముఖం కూడా చూడదు. అలా బుద్ధిగా వుండాలి ఆడవాళ్లంటేనూ. అందుకే అంటాను మా ఆవిడ వెరీ గుడ్డు అనీ :)

  ReplyDelete
 21. నా కొత్త పోస్ట్.. "మార్తాండపై జాలిపడ్డ మలక్" పాపం .....:)

  "నేను ఇటువైపు రాను" అనిపించుకున్నాగా.. పబ్లిష్ చేసి :))

  ReplyDelete
 22. "నేను ఇటువైపు రాను" అనిపించుకున్నాగా
  ------------------------------

  Yeah! Finally somebody could make him say that. Its a great achievement!

  ReplyDelete
 23. అందుకే ప్రవీణ్ ఆ రోజు సైకిల్ పంచర్ అయిందని పొలిస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ సాంబార్ లేదన్నారు కాని atm ఉంది అన్నారు అలాగె మనం బస్ ఎక్కి సిగరేట్ తాగితే పక్కనున్న జగన్ మాత్రం ఓటు వెయ్యమాన్నాడు ఇంతలో నా సేల్ ఫోన్ రింగ్ అయింది కాబట్టి నువ్వు చెప్పింది కరెక్ట్

  ReplyDelete
 24. Ramani. Don't publish my comments if you can't understand. You need not spin the old gramophone record by saying that you cannot understand my comments.

  ReplyDelete
 25. @ మలక్ గారు :) మనము అనుకున్నంతసేపు పట్టలేదు రి ఎంట్రీ కి.. :(
  @పవన్ ఎందుకిలా అయ్యారో చెప్తారా? ;)
  @ప్రవీణ్ గారు: సరే! కామెంట్ రాయను అని చెప్పి మళ్ళీ కమెంట్ రాసారేంటి? ఒహో మీకర్థం కాలేదా.. నాకర్థం కాలేదన్న విషయం. ఓ కే మీరు ఇప్పుడు చెప్పింది నాకర్థమయ్యింది, నాకర్థమయ్యిందని మీకర్థమయ్యిందనే అనుకుంటున్నాను . అర్థమయితే ఇంక కమెంట్ వద్దు, అర్థం కాకపోయినా వద్దు. అర్థం చేసుకోలేను నేను.

  అందుకని... మీకేమన్నా అర్థమయ్యిందా బ్లాగర్లూఊఊ వాఅ...

  ReplyDelete
 26. తాము మూర్ఖులమని వందసార్లు నిరూపించుకున్నవాళ్లతో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు అని చావా కిరణ్ గారు చెప్పారు. అందుకే మీతో ఆర్గ్యుమెంట్ చెయ్యదలచుకోలేదు. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లోని పాటలు వింటే పల్లెటూర్లో మన ఇంటికొచ్చే పాత పాటల దాసరి పాటలకి తేడా ఉండదు (రికార్డ్‌లోని సఘం ముక్క పాట తిరిగి రావడం తప్ప). అందుకే అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ తిప్పొద్దని సలహా ఇచ్చాను. అంతే కానీ మీతో ఆర్గ్యుమెంట్ చెయ్యడానికి నాకు టైమ్ లేదు. It's better to sleep rather than concentrating on old gramophone record songs.

  ReplyDelete
 27. hehehehe .. Ramani .. whatta failure!

  పవనూ, ఈ తుగ్లక్ సంగతి నువ్వే చూసుకోవాలి ఇంక.

  ReplyDelete
 28. శరత్ గారు: మీ కామెంట్ కి నా కామెంట్ కి మధ్య మా డిన్నర్ అడ్డొచ్చింది. ఏంటి అంటున్నారు అంతకన్నా ముందు ఆగిపోవాలా? నేను అన్నానని కాదు కాని అసలు మీరెవరండి, ఆగమనడానికి, సాగమనడానికి? మా ఇష్టమండి రాయలనుకుంటే రాస్తాము, వద్దు అనుకుంటే మానేస్తాము, ఒకళ్ళు చెప్పారని మేమెందుకు ఆగుతాము? ఏమి రాయమంటే అదెలా రాశేస్తాము.. ఎంత మీ బావ మిమ్మల్ని స్త్రీ వాది ఇస్త్రీ వాది కాదు అనేస్తే మటుకు మీరు అంత ప్రవీణ్ వాది ఎలా అయ్యారో మాకిప్పుడే తెలియాలి.. తెలియాలి అంతే.ఖళ్.... ఖళ్ మేమందరం బ్లాగులు మూసేస్తాము, మీరు మీ బావా బ్లాగులు రాసుకొండి...

  అవునేంటి మీ శ్రీమతిని కాక పడ్తున్నారు? మనలో మన మాట.. విడాకులు, మావిడాకులు అవడానికి శ్రీకృష్ణుడులో పరకాయప్రవేశం చేసి "ఓ చెలి కోపమా.. " అని అన్నారా? కరగలేదా ఆవిడ? అందుకా ఈ కాకా.. ఎందుకన్నా మంచిది కాస్త జాగ్రత్త కాళ్ళ దగ్గర ఉండకండి.. మేమంతా అంటే మీ శ్రీమతితో సహా స్త్రీ జాతి సత్యభామలం..ఖోపం విషయంలో :))))))))

  ReplyDelete
 29. అంతే కానీ మీతో ఆర్గ్యుమెంట్ చెయ్యడానికి నాకు టైమ్ లేదు
  _______________________________________

  Joke of the year yet? :))

  ReplyDelete
 30. అందితే జుట్టూ లేకపోతే కాళ్ళూ - అంతే కదండీ ఎక్కడయినా మగవాడి/మొగుడి దీన పరిస్థితి? మా ఆవిడ పాదదాసుడినని ఎప్పుడో విన్నవించుకున్నా కాబట్టి నాకు తన్నులు తగిలినా ఆ పాదం కందిపోయిందేమో అన్న ఆదుర్దా తప్ప నా గురించి ఇసుమంతయినా వర్రీ అవను సుమండీ.

  ReplyDelete
 31. ప్రవీణ్ ... ఇంక చాలు ... కామెడీ కాస్త ట్రాజడిగా మారక ముందే నువ్వు అన్ని close చేసి ఇక్కడ్నుంచి దొబ్బేయ్ .. లేదంటే (నేను చెప్పకర్లేదు ...నీకు అర్ధం అయిందనుకుంటా నువ్వు షార్ప్ కదా)

  ReplyDelete
 32. "నాకు తన్నులు తగిలినా ఆ పాదం కందిపోయిందేమో అన్న ఆదుర్దా తప్ప నా గురించి ఇసుమంతయినా వర్రీ అవను సుమండీ"

  You are a pro dude :-)
  Kumar N

  ReplyDelete
 33. హాహాహాహ్ ..... ప్రవీన్ ... ఆ ఒక్కడు .. ద ఇన్‌విన్సిబుల్.

  ReplyDelete
 34. ఒక్క డౌటు...ఆడవాళ్లు మత్రమే అక్కడే ఆగాలా? మగవాళ్లు ఏవైనా రాయొచ్చా? వాళ్లకి కూడా ఒక ఉనికినిచ్చి ఒక నాన్న, అన్న, తమ్ముడు, కొడుకు అని బంధాలిచ్చారుగా..మరి వాళ్లెంత దూరం పోవచ్చో?

  చివర్లో "అక్కడే ఆగాలి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా" అన్నారు గానీ పోస్టంతా ఆడవాళ్ల గురించే ఉంది,అలాగే టైటిల్ లో కూడా...అందుకే డౌటు వచ్చింది.

  ReplyDelete
 35. ఒక్క డౌటు...ఆడవాళ్లు మత్రమే అక్కడే ఆగాలా?
  ----------------
  ఆడవాళ్ళు ఎక్కడ అగాలో అక్కడ ఆగీతేనే వాళ్ళకున్న గౌరవం వాళ్ళకుంటుంది .. ఒకవేళ ఆగకుంటె దాన్ని బరితెగించడం అంటారు ..
  మగవాళ్లు ఏవైనా రాయొచ్చా?
  రాయవచ్చు ... రాసిన దాని తరువాత ఫలితాలను ఎదుర్కోనే పరిస్ధితులు వాళ్ళకుంటాయి .
  మగాడు చెడిపోతే ఒక్క వ్యక్తి లేదా ఒక కుటుంబం నష్టపోతుంది అదే ఆడది చేడి పోతే తన కటుబంతో పాటు ఇంకో నాలుగు కుటుంబాలు నష్టపోతాయ్

  ReplyDelete
 36. సౌమ్య గారు: :-) ప్రశ్న ఆడవాళ్ళనుండి మొదలయింది.. ఆడవాళ్ళు ఎందుకు ఆగాలి అని ప్రశ్న.. అందుకని ఆడవాళ్ళని బేస్ చేసుకుని రాశాను తప్పితే, మగవాళ్ళు ఏమైనా చెయ్యొచ్చని నా ఉద్దేశ్యం కాదు. మగవాళ్ళు కూడా వాళ్ళ పరిమితులకి లోబడే ఉండాలన్నది నా అభిప్రాయం. ఎవరన్నా "కాయ" గురించి అడిగితే "పండు" గురించి చెప్పాననుకొండి విషయం అర్థం కాదు కదా. మగవాళ్ళయినా ఆడవాళ్ళయినా మన పరిధిలు దాటుతున్నామంటే మటుకు బాధ్యత ఇద్దరిది అవుతుంది. మగవాళ్ళు ఏమైనా చేయొచ్చా అన్న ప్రశ్న ఉదయించకూడదనే చివర్లో మగవాళ్ళు కూడా అని రాసాను కాని , ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు అనేదే ముఖ్యంగా ప్రస్తావించాను. అక్కడే ఆగాలా "అందరూ " అని అడిగిఉంటే "అందరూ" ఎందుకు ఆగాలో చెప్పి ఉండేదాన్ని. దీని గురించి విపులంగా మరో పోస్ట్ రాస్తాను.

  @పవన్: మగవాడు ఎదుర్కోగలడు ఆడవాళ్ళు ఎదుర్కోలేరు.. ప్రస్థుత పరిస్థితుల్లో మీరన్నది నిజమే. :) ఎటొచ్చి పురుషాధిఖ్య ప్రపంచం కదా మాటలు పడేది మటుకు మా ఆడవాళ్ళే.

  ReplyDelete
 37. ఈసారి కూడా నిజంగా అంటే నిజంగా మీ కమెంట్ అర్థం కాలేదు ప్రవీణ్. మీ బ్లాగ్ లో మీ "సొంత గొంతు" అని అంటున్నారు కదా.. హమ్మయ్య థాంక్ యూ. కమెంట్ రాయను.. రాయను అంటూ మళ్ళీ.. మళ్ళీ రాయకండి..

  ReplyDelete
 38. నాకు మీ అంత తెలివి తేటలు లేవు. అర్థం చేసుకునే జ్ఞానం తక్కువ .. అదే పాత గ్రాంఫోన్ రికార్డ్.. అన్నమాట. :)

  ReplyDelete

Loading...