10.03.2010

కోరితినా ఒక్కటి తప్ప....

నా కాలేజ్ జీవితమంతా ఇద్దరి ప్రేమికుల మద్య ఒక మధ్యవర్తి లాగ వాళ్ళ లేఖలు వీళ్ళకి... వీళ్ళ లేఖలు వాళ్ళకి అందివ్వడంతో సరిపోయింది.. అలా చేస్తున్నప్పుడు మనసులో ఎక్కడో చిన్న కోరిక నాకు ఎవరన్నా ఒక ప్రేమ లేఖ రాస్తే బాగుంటుందని..


ఆ కోరిక అలా వుండగానే పెళ్ళి అయిపోయింది ... మా వారికి చెప్పాను ఒక మంచి ప్రేమ లేఖ రాయండి అని... ఇద్దరం ఒకే చోట వున్నాము కదా నువ్వు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు రాస్తాను అని అన్నారు.

ఆరోజు రానే వచ్చింది... అక్కని చూడాలని ఉంది అంటే అక్కావాళ్ళింటికి పంపారు నన్ను... వెళ్తూ వెళ్తూ ఇంకోసారి గుర్తు చేసాను మావారికి కోరితినా ఒక్కటి తప్ప అంటూ.. మావారు కూడా తప్పకుండా రాస్తాను అన్నారు నన్ను అక్కా వాళ్ళింటిలో దింపి వెళ్తూ.....
ఆరోజు పోస్ట్ అని పిలిచిన ఆ పిలుపు నా చెవుల్లో పన్నీరు పోసినట్లుగా అనిపించింది… నేను అనుకున్నట్లుగానే అది మావారు రాసిన ఉత్తరమే.... సారి!! సారి !! ప్రేమలేఖే… నా అనందానికి అవధులు లేవు చక్కటి గులాబి రంగు కాగితాలు కనపడీ కనపడనట్లు వున్న గులాబి పూల పేపర్ అది..గుండ్రంగా తీర్చి దిద్దినట్లుగా వున్న అక్షరాలు.. ఎంతో ఆనందపడ్తూ ఉత్తరం చదవడానికి ఉపక్రమించాను.. రండి నాతో పాటు మీరు కూడా చదువుదురుగాని…బ్రాకెట్స్ లో నా కామెంట్స్….
రమ కి,
నేను బాగానే వున్నాను.. నీవెలా వున్నావు? ముఖ్యంగా నీయొక్క(ఈ యొక్క, వలనేన్, కంటెన్, పట్టీ లేమిటో!) ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించవలయును..(పుస్తకం బాష అంటే ఇదేనేమో) , నీవు వెళ్ళిన తరువాత నాకు ఇక్కడ ఏమి తోచడం లేదు.. నీవు ఇల్లు తుడిచే చీపురు ఎక్కడ పెడ్తావు? కాలు కింద పెడ్తుంటే బాగ ఇసకలో వున్నట్లుగా అనిపిస్తోంది .. తుడుద్దామంటే చీపురు కనపడలేదు… నువ్వు ఊరు వెళ్ళిన మర్నాటి నుండి పని అమ్మాయి రావడం లేదు రావద్దని చెప్పావా?? కంది పొడి చేసాను అన్నావు.. అలా అనుకొని మొన్న అన్నంలో వేసుకొంటే అది సెనగపిండిలా అనిపించింది(ఉప్పు కర్పూరంబు .... గుర్తోస్తోంది).మనకి మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయి?? మొన్న పక్కింటావిడని అడిగితే పాపం ఓ జగ్ నీళ్ళు ఇచ్చారు..ఇలా ఇంకా చాలా.. చాలా.. చివర్లో మటుకు నీ ఆరోగ్యం జాగ్రత్త.. ప్రేమతో...ఇలా సాగింది మా వారి ప్రశ్నల (ప్రేమ)లేఖ..

13 comments:

  1. బాగుంది మీ శ్రీవారి ప్రేమ లేఖ!పాపం మీవారికి కందిపొడి ఎక్కడ దాచారో చెప్పారా లేదా :)

    ReplyDelete
  2. భేష్! మా సోదరులకి అనేకానేక అభినందనలు చెప్పండి .. గులాబి రంగు కాయితమ్మీద రాశారు సంతోషించండి.
    ఆ మధ్యనెప్పుడో ఒక మెయిల్ ఫార్వర్డ్ వచ్చింది .. సాఫ్టు వేరు భాషలో బాయ్ ఫ్రెండ్ 7.7 ని మొగుడు 1.0 కి అప్డేట్ చేస్తే వచ్చే నష్టాల గురించి మీవంటి ఒక భామామణి కస్టమరు సర్వీసుకి ఫిర్యాదు చేస్తుంది .. ఏ స్థితిలో జరగాల్సిన ముచ్చట్లు ఆ స్థితిలో జరగాలి అంటే ఇదేనేమో ..అన్నట్టు కాంతం కథల్లో మునిమాణిక్యం గారు మీ కథకి రివర్స్ కథ రాసి ఉన్నారు .. ఈయనేమో మాంఛి భావుకంగా .. పెళ్ళానికి ప్రేయసీ, ప్రియా అని రాస్తాడు .. ఆవిడ చక్ఖగా .. తమరి పాదాలకి నమస్కరించి .. చంటిదానికి జలుబు, బియ్యం నిండుకున్నాయి .. పాద దాసి ..అదన్న మాట

    ReplyDelete
  3. మీ వారు మరీ రొమాంటిక్కు :)

    ReplyDelete
  4. బాగుందండీ మీ శ్రీవారి ప్రేమలేఖ

    ReplyDelete
  5. క్రాంతి గారు, రాధిక గారు, వరప్రసాద్ గారు ధన్యవాదాలు.

    @ప్రవీణ్ గారు: ఆ టిక్కులు టెక్కు నిక్కులు తెలియక పడిపోయానండి.. ప్చ్!! పాపం కదా నన్ను చూస్తే జాలివెయ్యట్లేదూ?? మీకు..

    @ కొత్తపాళీ గారు: చదివానండి.. మాకా పాల సీసాలు.. బియ్యం డబ్బాల సమస్యలు రాకూడదనే..పిల్లలు పుట్టక ముందే అలా మావారిని ప్రేమలేఖ ప్లీజ్.. అని అడిగాను.. ప్చ్! నాకేమి తెలుసు ఈయనలో ఇంత భావుకత దాగి వుందని..

    ReplyDelete
  6. @క్రాంతి గారు: కందిపొడి డబ్బా ఎక్కడ దాచానో చెప్పడం కాదు అసలు నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోకుండా (ఏ ఊరు వెళ్ళకుండా) వున్నాను ఇన్నాళ్ళు..వెళ్తే ఇద్దరం వెళ్ళడమే.వదిలి వెళ్తే అమ్మో!! తన ప్రేమ లేఖ గొప్పతనం అలాంటిది.. మరి..

    ReplyDelete
  7. లేఖ భలే వుంది. మీ వ్యాఖ్యలు కూడా. 'నువ్వు లేకుంటే నాకు తోచదు'తో పాటు, 'నాకేమైనా తోచాలంటే నువ్వుండి తీరాల్సిందే'ననే బ్లాక్‌మెయిలింగ్ కూడా వున్నట్టుంది. :)

    ReplyDelete
  8. నెనర్లు రానారె గారు.. నాకు తోచట్లేదు అని.. అలా అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకనర్హం అన్నట్లుగా కందిపొడి, జగ్ మంచినీళ్ళు , పనమ్మాయి, పక్కింటావిడ కావేవి ప్రేమలేఖకి అనర్హం అని కాకుండా అదే కొంచం ఇలా "నీవు బిజి గా వుండే ప్రతి క్షణానికి కారణం నేనైతే ఎంత బాగుండును" .. అని నా మనసు అనుకొనేట్లుగా రాసుంటే...కొంచం ప్రేమలేఖకి న్యాయం జరిగేదేమో ... కాదంటార?? అర్ధం చేసుకోరు!! మన(గ)వాళ్ళు

    ReplyDelete
  9. భలే ఉందండీ మీ ప్రేమలేఖ .నేను మా ఆవిడని రాయమంటాను

    ReplyDelete
  10. పాపం ఆయన్ని ఆడి పోసుకుంటున్నారు, అస్సలు మీరెప్పుడయిన ఆయనకి రాసార అని. పాపం కనీసం మీరు రాస్తే అయిన నేర్చుకొని రాసేవారేమో. ఇంతకుముందు రాసిన అనుభవం లేదేమో మొత్తానికి మీ శ్రీవారి ప్రేమ లేఖ,లో చీపుర్లు కందిపోల్లు బాగున్నాయండి. అవును ఆయన ప్రేమగానే రాసారు కదండీ!

    ReplyDelete
  11. naku matram jaalestundi mimalani chusthunte. nalage miru kuda korukunnarannamata oka premaleka rapinchukovalani husband tho. nenu ila korika ayithe korukunna kani naku antha ledule. "aalu ledu soolu ledu koduku peru somalingam" lendi na pani.

    miru expect chesinattuga premleka ravalante ila cheyalsi unde. engagement ki pelli madya gap vachinapudu ade engagement ayyaka ila naku oka korika undi rayandi ani analsi unde apudu elagu iddaru duramganega undedi inka apudu ekkuva prema untundata. otherwise mire oka letter raste mi kaboye hubby mi kante uthsaham ga premalekha rasevaadu miru rasinadaniki reply gaa :) emantaru?

    ma frnds match set ayyaka thega gantalu gantalu phone lo matladukune varata. ma frnds ane kaadu evvaru chusina ide cheptaru.

    inthaki mi pelli epudu ayindi :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.