"పిల్లలూ ఎంతయ్యిందర్రా టైము ఇప్పుడు? "
"మావయ్యా! అర్థరాత్రి 12 గంటలయ్యింది అయ్యింది,..రా మావయ్యా! నువ్వు కూడా మేమిక్కడ ఎంచక్కా పాటలు పాడుకొంటున్నాము."
"మీ పాటలతో ఈ శివరాత్రి నన్ను జాగారం చేయించేట్లున్నారుగా! సరె వింటాను పాడండి.."
"ఏయ్! చిట్టి ముందు నువ్వు పాడు ఆతరువాత ఇలా వరుసగా పాడదాము".
"పిల్లలూ దేవుడూ చల్లని వారే..కల్ల కపటమెరుగని కరుణామయులే,...తప్పులు మన్నించుటయే..."
చాలు !ఒక్క లైన్ పాడండర్రా అవతలి వాళ్ళకి అవకాశమివ్వండి కొంచం!" మావయ్య గద్దింపుతో ఠక్కున పాటేపిసింది చిట్టి.,
"ఏయ్ ప్రసన్నా ఇప్పుడు నీ వంతు నువ్వు పాడు!" అంది చిట్టి.
"చిట్టి పొట్టి బొమ్మలూ చిన్నారి బొమ్మలు , ముద్దు ముద్దు బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలూ.."
అలా సాగి పోతోంది పాటల హోరు. జోరు.
చివరాఖరికి నా వంతు వచ్చింది.
నాకేమో ఒక్క పాట గుర్తు రావడం లేదు. చాలా సేపు ఆలోచించగా.. ఆలోచించగా గుర్తొచ్చింది.
"చక్కగా నా శ్రావ్యమైన గొంతుతో నేను పాట అందుకొనే సరికి ..మా మావయ్య నా దగ్గిరికి వచ్చి "సుమా! ఇంకెప్పుడు పాటలు పాడకే ప్లీజ్.." అని చెప్తే ......నాకెంత ఏడుపొచ్చేసిందో.. అందరిని ఏమో "ఒక్కలైన్ పాడండి " అని చెప్పి , నేను ఒక్కలైను పాడే సరికి పాడొద్దు అనడం న్యాయంగా ఉందా అసలు?
"ఛ! ఈ మావయ్యలందరూ ఇంతే" అని, అక్కడనుండి విస విసా వెళ్ళి పడుకొన్నాను.
******
అలా చిన్నప్పుడు శివరాత్రి రోజు జరిగినదీ సంఘటన, అమ్మావాళ్ళందరూ, పిల్లలందరిని మా మావయ్య దగ్గిర వదిలెసి జాగారణ చెయ్యడానికని, గుడికి భజనలకి వెళ్ళేవారు. ఇక పిల్లలికి మావయ్య దగ్గిర సందడే సందడి. అందులో మా మావయ్య కూడా కథలు, కబుర్లు బాగా చెప్తారు. ఆ రోజేమో పాటల ప్రోగ్రాం పెట్టారు. అలా పాటలు పాడుతూ ...పాడుతూ.. నావంతు వచ్చింది కదా ఎంతో ఉత్సాహంతో నేను పాడేసరికి "పాడొద్దని..అలా" ఇంతకీ నేను పాడిన పాట ఏంటో తెలుసా మీకు? .. అప్పుడే కొత్తగా విడలైన సినిమా అది. సెన్సషనల్ సృష్టించిన సినిమా ప్రతిఘటన సినిమాలోని... ఈ పాట..
"ఈ దుర్యోధన దుశ్శాసన........ "
ఇప్పటికి అంటూ ఉంటాడు మా మావయ్య, ఆరోజు నిజంగానే జాగారణ చేయించావు కదా నాతోటి అని.. :) ఈ శివరాత్రి మీరెవరన్నా జాగరణ చేద్దామనుకొంటే నాకు చెప్పండి ఇలాంటి కిటుకులు బోల్డన్ని ఉన్నాయి నా దగ్గిర. :)
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
*******

బాగున్నాయి మీ జ్ఞాపకాలు. మీ టెంప్లేటు బాగుంది. మీ బ్లాగు టైటిలు మొత్తం అంతా ఒకే లైనులో వస్తే ఇంకా బాగుంటుంది. ఇంతకీ ఈ శివరాత్రి మీరు జాగారం చేసారా?
ReplyDeleteసిరిసిరిమువ్వ గారు థాంక్స్ అండీ! ఇప్పుడెలా ఉంది చూడండి ఒకే లైన్ లో వస్తోంది కదా..
ReplyDeleteఊ..ఇప్పుడు బాఆఆఆ......గుంది.
ReplyDeleteనేను మీ బ్లాగు ని ఇదే మొదటిసారి చూడటం, కానీ నా పేరు మీ ఫాలోయర్స్ లిస్ట్ లో కనిపిస్తోంది, అది ఎలా వచ్చిందో నాకు తెలియటం లేదు.... మీకు తెలుసా?
ReplyDelete