5.23.2009
ఉద్యోగ పర్వంలో కుటుంబం పాత్ర
LSAT - India పరీక్ష ఆంధ్రప్రదేశ్ మొత్తమీద ఒక్క హైదరబాద్‍లో జరుగుతోంది , ప్రాంతీయంగా జరిగే లాసెట్ పరీక్ష వేరు. ఈ పరీక్ష ఇండియా మొత్తం మీద జరుగుతూ వీళ్ళకి మంచి ర్యాంక్ కనక వస్తే విదేశాల్లో చదువుకొనే అవకాశం ఉన్న పరీక్ష. ఈ పరీక్షకి నేను ఒక్కదాన్నే ఇన్విజిలేటర్‍గా ఎన్నికయ్యాను. రేపే పరీక్ష, చీఫ్ ఇన్విజిలేటర్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి ముందస్తుగా ఢిల్లీ నుండి ఆడియో కాన్‌ఫరెన్స్, జరిగి వాటిలో నెగ్గితే చీఫ్ ఇన్విజిలేటర్ ఇంటర్వ్యూ. అన్ని అయి చివరికి వచ్చాము. నేను లాసెట్ పరీక్ష రాశాను కాని ఇంత హైరాన పడలేదు. చీఫ్ ఇన్విజిలేటర్ వచ్చి ఏదో చెప్తున్నారు టెబుల్ మీద ఫోన్ మోగింది.
******
రెండు రోజుల క్రితం ఆఫీస్‍లో చేసే ట్రైనర్స్ ఇద్దరిని అర్జంట్‍గా ఖమ్మం రమ్మనమని ప్రభుత్వ ఉత్తర్వు (మాది రాజీవ్ ఉద్యోగశ్రీకి సంబంధించిన ఆఫీసు) మేము ఫెకాల్టీస్‍ని కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకొన్నాము కాబట్టి ప్రస్తుతం మాకు అందుబాటులో ఎవరు ట్రైనర్స్ లేకపోవడం వల్ల కాంట్రక్ట్ కి సంబంధించిన ట్రైనెర్స్‌కే ....పరిస్థితి ఇది ... అని చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు ఖమ్మం వెళ్ళడానికి ఒప్పుకోడంతో అన్ని ఏర్పాట్లు జరిగిపోయి వీరి పేర్లు అక్కడి ప్రభుత్వాధికారులకి చెప్పడం జరిగంది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది.
సాయంత్రం 6.30 కి: నేను ఇంటికి బయల్దేరుతున్న సమయంలో ఫోన్ మోగింది పంపించాలి అనుకొన్న వారిలో ఒక ట్రైనర్ "మాడమ్ మీతో కొంచం మాట్లాడాలి" అంటే, మర్నాడు ప్రయాణం కదా ఆఫీస్ తరపునుండి ఎమన్నా కావాలేమో స్టడీ మెటీరియల్ మొ! అనుకొని చెప్పండి అన్నా.. "మాడమ్ మా కాంట్రాక్ట్ వాళ్ళు మాకసలు శాలరీస్ పే చెయ్యడంలేదు, దీని గురించి మీ మానేజ్‍మెంట్ కలగజేసుకొంటే బాగుంటుంది " అని అన్నారు. అప్పుడే చెప్పాను "మా వైపు నుండి మొత్తం సెటిల్‍మెంట్ అయిపోయింది కదా... ఇహ మేము కలగజేసుకొనేదేముంది? అది మాకు మర్యాద కాదు అని ".. సరే మాడమ్ మీతో మా వైఫ్ మాట్లాడతారట.. అని ఫోన్ ఆవిడకి ఇచ్చారు. పరిచయం కాబోలు అనుకొన్నా! ఫోన్ తీసుకొన్న ఆవిడకి నేను తెలీదు, నాకు ఆవిడ తెలీదు మర్యాదకన్నా పరిచయం చెసుకోవాలి కదా! "మాడమ్ నాకు మీ ఆఫీస్ పొజిషన్ తెలియాలి " అంటూ మొదలు పెట్టారు. ఇలా మాట్లాడే వాళ్ళకి సమాధానం ఏమని చెప్తాము. "సారీ అండీ నేనిప్పుడు కొంచం బిజీగా ఉన్నాను తరువాత నేనే ఫోన్ చేస్తాను" అని ఫోన్ పట్టేసాను. ఇక ఆ తరువాత ఇంటి కొచ్చాక ఆ విషయం మర్చిపోయాను .
నైట్ 11 కి మేము మర్చిపోలేదు అనుకొంటూ .. మళ్ళీ అదే ఫోన్, ఆ టైంలో నిజానికి చాలా కోపం వచ్చేసింది కాని మర్నాడు వాళ్ళు ఊరెళ్ళాలి. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇబ్బందవుతుందని తీసాను. ఆ సంభాషణ చూడండి, "మాడమ్ నాకు రెండు మంచి అవకాశాలు వచ్చాయి. మీరేమో ఖమ్మం వెళ్ళమంటున్నారు. నేను అటు వెళ్తే ఈ రెండు అవకాశాలు డ్రాప్ చేసుకోవాలి, లేదు ఇటే వెళ్ళమంటే మరి నా పరిస్థితి ఎంటి?" అప్పజెప్పినట్లుగా చెప్పేసి.... ఫోన్ వాళ్ళ వైఫ్‍కి ఇచ్చెసారు. ఆవిడ "ఇప్పుడు చెప్పండి మాడమ్" అని, అదేదో నాకు "నేనే గెలిచాను చూశావా " అని అన్నట్లుగా. ఇదో రకమైన బ్లాక్‍మెయిలింగ్. అంత రాత్రి నేను ఏవిధమైన సలహా ఇవ్వగలను? ఒక్కటే చెప్పాను "ఒ .కే మీరు ఇంకో అవకాశం అంటున్నారు... వెళ్తే వెళ్ళండి, కాని ఇంత రాత్రి చెప్పడం వల్ల నాకు ఇంకో మార్గంలేదు వేరే ట్రైనర్ చూసుకోడానికి, సో ! మీరు అ రెండు అవకాశాల అధికారులని సమయం అడగండి, ఇహ ఆ తరువాత మీ ఇష్టం" అని చెప్తే సదరు భర్తగారికి సంబందించిన ఇల్లాలు, వారి అమ్మగారు నాతో ఫుట్ బాల్ ఆడుకొన్నారు. ఎమనాలి ఇలాంటి వాళ్ళని?
*******
రెండు రోజుల తరువాత ఇదిగో LSAT-INDIA పరీక్షకని జరుగుతున్న ఇంటర్వ్యూ కి మధ్యలో మోగిన ఈ ఫోన్ వల్ల ఎన్ని అవాంతరాలో (ఈ పొస్ట్ రాస్తుండగా ఇప్పటికి ౩ సార్లు అదే ఫోన్) ఉద్యోగ పర్వంలో కుంటుంబం పాత్ర ఎంత వరకు? మన ఆఫీసుకి సంబంధించిన విషయాలు అవీ ..మన దగ్గిర పనిచేస్తున్న వాళ్ళ కుంటుంబానికి మనమెందుకు చెప్పాలి అన్నది ప్రశ్న. మేము కాదు అక్కడ బాధ్యత వహించాల్సింది, వాళ్ళు ఎవరో కాంట్రాక్ట్ వల్ల వచ్చిన వాళ్ళు అక్కడ తేల్చుకోవాలి. అంతే కాని, మాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎంత రాత్రి ఫోన్ చేసినా మేము చెయ్యగలిగినదేమి లేదు. అక్కడికీ వాళ్ళ వాళ్ళకి మా ప్రయత్నంగా చెప్పి చూశాము ఇహ మేమేమి చెయ్యగలం? ఇదే విషయాన్ని వీళ్ళకి చెప్పడం జరిగింది. మన ఆఫీస్‍లో మనమేమి పనిచేస్తామో , ఒక పని పట్ల మన బాధ్యత ఎంటీ అన్నది భర్త/బార్య కాని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నేను నా మనిషికి సొంతమే కాని, రోజులో ఒక 8 గంటలు ఇంకోకరికి ఇచ్చేసాము చెప్పాలంటే .. అలాంటప్పుడు నా భర్త అర్థం చే్సుకోవాలి, నా మనషిక దా అని నేను వెళ్ళమంటే వెళ్ళాలి లేకపోతే మానేయ్యాలి అనే తత్వం ఉంటే, ఇహ మన ఉద్యోగానికి నీళ్ళొదులుకోవాల్సిందే..సరదాగా ఓరోజు ఇంట్లో ఉండమనడం పెద్ద సమస్య కాదు కాని, నిరంకుశత్వం కష్టమే. అలాగే తన భర్త తను గీసిన గీత దాటకూడదు, తనేం చేస్తున్నా తెలియాలి అన్నది ఇంటి వరకే పరిమితం చేసుకోవాలి కాని, ఇలా భర్త తరుపునుండి ఏమి మాట్లాడాలన్నా నేనే మాట్లాడతాను , అంతా నేనే అంటూ ....ఇలా విసుగు చెందకుండా ఫోన్ చేసి విసుగు తెప్పించే వాళ్ళని ఎమి చెయ్యాలి? నా మటుకు నాకు ఇలా ఇంటిని ఆఫీసుకి , ఆఫీసుని ఇంటికి తీసుకురాడం సుతారం ఇష్టం ఉండదు.

5.19.2009
స్త్రీత్వం
డిసెంబర్ 5 : అక్క స్నేహితురాలి పెళ్ళి. నాకు అప్పటికి పెళ్ళయి 5 నెలలయ్యింది. పెళ్ళి కూతురు అక్కకి స్నేహితురాలే నాకు స్నేహితురాలే చిన్నప్పటినుండి కలిసి ఉండడం వల్ల. మావారేమో తన బంధువుల ఇంటి పెళ్ళికి నేను ఈ స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయ్యింది, విందుభోజనాలప్పుడు నాకేదో కొంచం ఒంట్లో వెలితిగా అనిపించడం మొదలయ్యింది. ఇహ ఇంటికెళ్ళకుండా అటునుండే హాస్పిటల్‌కి వెళ్ళాను. ప్రెగ్నెంట్ అని చెప్పారు. నాకయితే అప్పుడే లోపల బేబీ కి కాళ్ళు చేతులు వచ్చేసినట్లు కదులుతున్నట్లు భావన. ఎదో తెలియని ఆనందం. అసలేమి తెలియని అనుభూతి. ఇది అని చెప్పలేని ఒక సంతోషం. తొలిచూలు.. నాకు నేను గర్వంగా ఫీల్ అయిన రోజు.
*****
మావారు తనకి సంబంధించినంత వరకు నన్ను కళ్ళల్లో పెట్టుకొని/పువ్వుల్లో చూసారని చెప్పాలి. ఇలాంటి మంచి అనుభూతి కోసమైతే ఎన్ని సార్లు తల్లి అయినా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇదో మధురమైన భావన. ఇంటినుండి ఆ మాట ఈ మాటా చెప్పి కళ్ళనీళ్ళు వచ్చేదాకా నడిపించేవారు. అటువైపు ఎదో ఒక హోటెల్ కి వెళ్ళి కాస్త కాఫీ నో టిఫిన్ టైం అయితే టిఫినో చెయ్యడం మళ్ళీ ఇంటి దాకా నడవలేక నడవలేక నడిచేదానిని. అందరిలాగే 7 నెలకి అమ్మావాళ్ళింటికి వెళ్ళాను. అత్తగారికి, అమ్మకి కలుసుకొని మాట్లాడే వీలు లేక నా శ్రీమంతం అలా అలా ఈ నెల కాదు ఇంకోనెల అంటూ 9 వ నెల దాకా పొడిగించారు. ఆగష్ట్ 3 వ తారీఖు డెలివరీ అవ్వాచ్చు అని డాక్టర్ చెప్పారు. జూన్ 26 కి 9 నెల వస్తుంది కదా జులై 3 కి శ్రీమంతం చేద్దాము అని రెండు వైపుల ఒక అవగాహనకి వచ్చారు. రోజు మా వారు వచ్చి చూసి వెళ్తునే ఉన్నారు. లోపల బేబీ తన కదలికల అల్లరితో నన్ను మరిపిస్తూ ఉంది .
ఇహ అమ్మ వాళ్ళింట్లో, అన్నయ్యకి ఇంకా పెళ్ళి కాలేదు. తమ్ముడు చదువుకుంటున్నాడు. అక్కకి పెళ్ళి అయి ఊర్లో ఉంది. నేను అమ్మ.. మధ్యలో తను వచ్చి క్షేమ సమాచారాలు తెలుసుకొంటున్నారు కాబట్టి పర్వాలేదు అనుకొని ధైర్యంగానే ఉన్నాను. తొలి చూలు , పునర్జన్మ అంటారు ఎలా ఉంటానో, లోపల బేబీ ఏమి చేస్తున్నాడో ఏమిటో అని ఆలోచనలలో 8 నెలలు పూర్తి కావచ్చాయి. జూన్ 26 వ తారీఖు కి 8 వ నెల పూర్తి అయి 9 నెల వచ్చింది. డాక్టర్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకొంటే మంచిది అని చెప్పారు. జూన్ 28 సాయంత్రం ఒక స్నేహితురాలు వచ్చింది. ఈలోపులో జూలై 3 వ తారీఖు శ్రీమంతానికి అమ్మ ఎవో ఏర్పాట్లలో ఉంది. వచ్చింది బాల్య స్నేహితురాలు కాబట్టి ఆమె వెళ్ళేప్పుడు సాగనంపుదామనే ఇంటి గేట్ దాకా వచ్చాను. ఎమంత ఇబ్బంది గా కూడా అనిపించలేదు.
జూన్ 29 వ తారీఖు : ముందు రోజు సాయంత్రం నడిస్తే ఇబ్బందేమి రాలేదు కదా అని ఆరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజకి పూలు కోస్తున్నాను. పక్కనావిడ అననే అన్నారు నిన్ను చూస్తుంటే ఈరోజో, రెపో డెలివరీ అయ్యేట్లుగా ఉంది అని.. నవ్వేసాను. అమ్మ "పొద్దున్నే లేచింది పాపం " అనుకొంటూ చపాతి చేసింది. తింటూ ఉంటే అనిపించింది ఏదో జరుగుతోంది అని... ప్చ్! తెలియడంలేదు. తరువాత విషయాలు చెప్పేముందు ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. మా నాన్న గారు పోయినప్పటినుండి అమ్మకి బయట ప్రపంచం అంటే ఎంటో తెలీదు. తన చుట్టూ ఒక గిరి గీసుకొని వుంది. సో, ఏ హాస్పిటల్ ఎక్కడుందో తెలీదు. నాకేమవుతోందో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అన్నయ్య నిద్ర పోతున్నాడు, అమ్మతో అంటే ఇంట్లోనే డెలివరీ అయిపోతుందేమో అని కంగారుతో ఎదో హడావిడి చేస్తోంది. నాకేమి అర్థం కాక , అన్నయ్య ని లేపాను "అన్నయ్యా ఆటో తీసుకురా ఎంటోలా ఉంది.. తెలియడం లేదు " అని. అన్నయ్య లేవలేదు సరి కదా "అబ్బా విసిగించకే" అని అటు తిరిగి పడుకొన్నాడు. (అప్పట్లో మా ఇంట్లో ఫోన్ సౌకర్యం లేదు) సరే ఎదో ఒకటి అవుతుందని నేనే బయల్దేరి ఆటో మాట్లాడుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా అదృష్టమో, మావారు ప్రేమతో నడిపించిన పుణ్యమో తెలీదు కాని, వెళ్ళిన సెకండ్స్ లో ఎనిమా కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డెలివరీ అయిపోయింది, జూన్ 29 వ తారీఖు ఉదయం 11.30 కి ఎవరు తోడు లేకుండా .... " పుణ్యురాలి బిడ్డ పుట్టి పెరుగుతుంది, కష్టురాలి బిడ్డ కడుపులో పెరుగుతుంది అని అంటారు. నువ్వు పుణ్యురాలివేనే" అంది అమ్మ పాపని ముద్దాడుతూ.... అలా శ్రీమంతం ముచ్చట జరగకుండానే 9 వ నెలలోనే పాప పుట్టింది. సాయంత్రం సంతోషంగా మా ముద్దుల పాపతో ఇంటికి వచ్చేసాను.
******
పైన సంఘటన అక్షరం పొల్లు పోకుండా చెప్పడానికి కారణం, మా అన్నయ్యని చెడ్డవాడిని చెయ్యడం కాదు. మాతృత్వం , స్త్రీత్వం అంటే "అమ్మే గుర్తుకు రావాలి" అంటే నాది సంకుచిత స్వభావం అన్నారు పర్ణశాల మహేష్ గారు. దానికి వివరణ ఈ టపా. "అమ్మే గుర్తుకు రావాలి అంటే మా అమ్మ మాత్రమే లేకపోతే వారి వారికి సంబంధిన అమ్మ మాత్రమే అని కాదు దాని అర్థం. స్త్రీత్వం అంటే అమ్మతనం. అది ప్రతి స్త్రీలోను ఉంటుంది, అమ్మ, చెల్లెలు, బార్య ఇలా ... అమ్మ మాతృత్వానికి ప్రతీకలం మనమే. "నాకు నొప్పులు వస్తున్నాయి అన్నయ్య" అని చెప్పడానికి అవి నొప్పులు అని నాకు తెలియకపోవడం .. అక్కడ చెప్పుకోతగ్గ విషయం. నొప్పి తెలియకుండా పెంచింది అమ్మ . అది 'అమ్మ' గొప్పదనం. ఏదోలా ఉంది అంటే ఏదో మాములు విషయం అనుకొని వదిలేసాడు అన్నయ్య. ఇంక అంతకన్నా ఏమి చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితి అది. అందుకే చెప్తున్నా ప్రతి స్త్రీలోని అమ్మతనానికి విలువ ఇవ్వమని. బార్య తల్లి కాబోతున్నప్పుడు పక్కన తోడుగా ఉంటే ఆ ఆనందమే వేరు. మనకి సంబంధించినది కాదు .. పుట్టింటి వాళ్ళు చూసుకొంటారులే అని వదిలేస్తారు.. కొంతమంది. కాని ఆ ఆనందం పంచుకోడంలో అనుభూతి మాటలలో చెప్పలేము. స్త్రీ లో అమ్మతనాన్ని, ఆమె మాతృత్వాన్ని గౌరవించమన్నాను. అది ఎవరైనా కావచ్చు, మన అమ్మ అయినా, అక్క అయినా, చెల్లెలు అయినా సరె.
మాతృత్వం స్త్రీ కి పరిపూర్ణతని ఇస్తుందంటారు. అదే స్త్రీత్వం. ఆ పరిపూర్ణతే స్త్రీత్వం అన్నది నా అభిప్రాయం. ఇక్కడ ఈ పరిపూర్ణత అందరికీ (తల్లి, చెల్లెలు, బార్య ) వర్తిస్తుంది.
******
అలిగిన వేళలో చూడాలి.........
మోహన మురళీ గానము వినగా .....
తహ తహ లాడుతు తరుణులు రాగా....
దృష్టి తగులునని దడిసి యశోదా...
దృష్టి తగులునని దడిసి యశోదా.....
తనను చాటుగా దాచినందుకే ...
అలిగిన వేళలో చూడాలి......... గోకుల కృష్ణుని అందాలూ....
ఇలా తల్లి యశోధ తన కొడుకిని లాలించి మురిపెంగా అలకని తీరుస్తుంది పాట వరకు అర్థం అది కాని , ఈ పాటకి సినిమాలో సన్నివేశం అయితే, హీరో బార్య తనింటికి వచ్చాక తనని పట్టించుకోడం లేదు ఎంతసేపూ... మామగారు.. పనివాళ్ళు ... అంటూ తనని నిర్లక్ష్యం చేస్తోందని చిలిపిగా అలుగుతాడు. అప్పుడు బార్య పాడే పాట అది.. అందమైన మధురమైన భావన అది ముసి ముసి నవ్వుల వెనక ఉన్న తాటాకు మంట ఆ అలక.
అలాగే బార్య అలిగితే .. అలిగితివా సఖీ ప్రియా అలక మానవా.. నీవలిగితే నే తాళజాల అని బార్యని ప్రసన్నం చేసుకొంటాడు భర్త. అలుకమానవే చిలుకల కొలికిరు తలుపు తీయవే అని.. ప్రాధేయపడడం భలె సరదాగా ఉంటుంది.
మరి బార్య భర్తల మధ్య జరిగే ఈ అలకలు, కోపాల తీర్పులు .. అవి.. స్నేహితుల మధ్య ఎలా ఉంటాయి అని ఆలోచించాను.
ఇప్పటి కుఱ్ఱకారయితే "లైట్" తీసుకో అని ఎదుటివారి కోపాన్ని, వారిలో కలిగే బాధని తగ్గించే ప్రయత్నంలో వాళ్ళు దానిని లైట్ తీసుకొంటూ ఓదారుస్తారు. "ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు, నవ్వితే ప్రాణమైన ఇచ్చేస్తానంటాడు అచ్చమైన స్వఛ్చమైన స్నేహితుడు. మరి అంత మంచి స్నేహితులెవరున్నారు? మనం నవ్వితే ప్రాణం పెట్టగల స్నేహితులు లేరు కాని, బాధ కలగకుండానే "లైట్" తీసుకో అని, అవతలివాళ్ళకి నేను బాధ పడాలి కామోసూ .. లేకపోతే బాగోదు అని అనుకొనేట్టుగా ఉంటాయి కొంతమంది ఓదార్పులు.
*****
నేను కంప్యూటర్ కోర్స్ చేసేప్పుడు నాకు ఇంకో అమ్మాయికి మధ్య పోటి చాలా తీవ్రతరంగా ఉండేది. మా ఇద్దరికి ఇంకో కోర్స్ చేస్తున్న ఒక సీనియర్ స్నేహితురాలు ఉండేది. ఆమె ప్రోత్సాహం కూడా మా ఇద్దరి పోటి స్థాయిలోనే ఉండేది. ఎలాగాయినా నువ్వే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని నాకు ఆమెకి కూడా చెప్తూ ఉండేది. సో, ఆమెకి ఎవరు గెలిచినా పర్వాలేదు. ఇద్దరికి ఆమె ప్రోత్సాహం ఉంది కాబట్టి. అనుకొన్నట్లుగానే పరీక్షలు మొదలయ్యాయి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పింది మా శ్రేయోభిలాషి అయిన ఆ స్నేహితురాలు.
ప్రాక్టికల్స్ కాబట్టి వెంటనే మాకు ఫలితాలు చెప్పేస్తారు. పరీక్ష రాసి వచ్చేప్పుడు పోటిపడ్డ అమ్మాయికన్నా నాకు ఒక్క మార్క్ తక్కువ వచ్చింది. .. నిజానికి ఇక్కడ బాధ పడాల్సిందంటూ ఏమి లేదు కాబట్టి మరీ అంత బాధ లేదు. నేను కష్టపడలేదు అనుకొన్నా అంతే, మా స్నేహితురాలు మటుకు నేనేమన్నా బాధ పడిపోతున్నానేమో అని అనేసుకొని, నన్ను ఓదార్చే ప్రయత్నంలో కొంచం తిక్క తిక్కగా మాట్లాడింది. నిజానికి లేని బాధని కొని తెచ్చుకోవాలేమో అనిపించింది నాకు ఆమె మాటలు వింటుంటే . ఆమె అన్న మాటలు.. మీరు చూడండి.
" లైట్ తీసుకోవోయ్! బస్ ఇంకో గంట లో వస్తుంది, అదిగో చూడు ఆ వస్తున్నామేని 89 .... 90 యేళ్ళు ఉండవూ.. ఎలా వడి వడి గా వస్తోందో, అంత వయసు అనిపించడంలేదు కదా.. ఈ ఏడు మా అమ్మ ఆవకాయ పెడ్తుందో పెట్టదో, అవునూ అన్నయ్యకి పెళ్ళి చేద్దామనుకొంటున్నారు. మా వదిన తెలుగు సినిమాలు చూడదట, ఇంగ్లీషు అంటే ప్రాణం అట. రాత్రెందుకో అస్సలు నిద్ర పట్టడం లేదోయ్!.. నువ్వు మటుకు లైట్ తీసుకోవోయ్!.. "
ఇలా ఉంది. ఈమె సమయస్ఫూర్తో, నా తలరాతో కాని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనుభవం పాఠాలు నేర్పేస్తొంది. బాధ కలగడాలు , బాధ పోవడాలు కాదు కాని వెఱ్ఱినవ్వు వచ్చేస్తోంది. మనలో మన మాట .... మాటల కిటుకంటారా దీనిని. ..నిజానికి అలకలు , బాధలు, కోపాలు, తీర్చడం ఒక కళే కదూ .. లేని వాటిని కాదు సుమా.. ఉన్నవాటినే.. ప్చ్ ! లైట్ తీసుకొండి... కొన్ని మాలాంటి అర్థం కాని జీవితాలింతే.
*****
5.18.2009
భాషలో నుడికారాలు, జాతీయాలు...
బస్‌లో వెళ్తూ ఆలోచించాను. "గాజులు తొడుక్కోడం లేదా వేసుకోడం" అనే పదానికి అర్థం తెలియాలంటే, భాషలో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి . వాటి సొగసు, వాడుక తెలిసిఉండాలన్నమాట అని.. ఇవన్నీ తెలుసుకొంటే మనము ఎదుటి వారు చెప్పే విషయాలని వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోయి వారి ఆంతర్యాలని ఇట్టే ఆకళింపు చేసుకొగలమని .. నాలాంటి పామరురాలికి ఇదో కొత్త పాఠం ఈరోజు .
ఇలా ఆలోచిస్తున్న నాకు ముందు సీట్లోంచి మాటలు వినపడ్డాయి, ఎక్కడో విన్నట్లుగా ఉందే అని మనసు ఉండబట్టలేక లేచి మరీ ముందుకెళ్ళి చూసాను. మీకు తెలుసా ! వాళ్ళిద్దరూ మా స్కూల్ టీచర్లు. ఒక్కసారిగా ఎగిరిగంతెయ్యాలన్న ఆవేశం వచ్చిందంటే నమ్మండి. ఉన్నది బస్లో అని జ్ఞప్తికి రాగానే "వద్దులే " అనుకొని వాళ్ళకి ఎదురుగా సీట్‌లో కూర్చుని వాళ్ళని పలకరించాను. నన్ను చాలా సులువుగా గుర్తుపట్టడం వాళ్ళ గొప్పతనం. నా గురించి మొత్తం కాకపోయినా ఓ 10 యేళ్ళు వాళ్ళకి నేను తెలియడం అందులో నేను వారికి శిష్యురాలిని కావడం ఆ కాసేపు వాళ్ళ సమక్షంలో నేను చిన్నపిల్లని అయ్యాననే చెప్పాలి.
చదువుకొనే రోజులు అవి తలుచుకొంటూ ఉన్నట్టుండి .. అప్పట్లో నాకు గుర్తొచ్చిన ఒక అంశాన్ని కాస్త ఉడుక్కుంటూనే వాళ్ళని "ఏంటి టీచర్ అప్పుడలా చేశారు " అని అడిగితే.. "పిచ్చిదానా ఇంకా ఆ అలక పోయినట్లులేదే" అని మా టీచర్లు ఒక మొట్టికాయ వేసి మరి నా అలకని తీర్చారు. ఇంతకీ ఏంటా అంశం అంటారా? హు! భాషలో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి. వాటి సొగసు, వాడుక తెలిసిన మహామహులకి పైన సంభాషణ బట్టి నేను అడిగింది ఇట్టే గ్రహించేయగల నైపుణ్యం ఉంటుంది , కాని నాలాంటి పామరులని దృష్టిలో పెట్టుకొని ఆ అంశం చెప్తున్నాను. "అవును టీచర్ మీరు ఎప్పుడు ముందు కూర్చున్న మా వైపు కాక వెనకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే ప్రశ్నలడగడం, వాళ్ళకే పాఠాలు చెప్తున్నట్లుగా అక్కడే నిలబడి చెప్పడం ఎందుకు చేశారు? మేమెవ్వరం మీ విధ్యార్థులం కాదా ? " అని అడిగాను.
అప్పుడు అందులో ఒక టీచర్ ఇలా చెప్పారు "మీరెలాగు తెలివైన వారు, సొంతంగా అన్నా వ్రాయగలరు పాపం వెనక ఉన్నవారిని మనం ప్రోత్సహించాలి, వాళ్ళు చూసి రాసే విధానాన్ని మానిపించాలి అంటే అలా వెనకాల వాళ్ళనే ప్రశ్నలు అడగాలి, వాళ్ళకే పాఠం చెప్తున్నామన్న భ్రమ కలిగించాలి" అని చెప్పారు.
నిజమే కదా! ఇదే బ్లాగులకి అన్వయించుకొంటే.....??? పిచ్చిదానిలా ఇందాక " పెద్దవారిని , పండితులని, ప్రముఖలని యావత్ బ్లాగ్లోకాన్ని అనవసరంగా నాకు వ్యాఖ్య వ్రాయాలి అనే ఉబలాటాన్ని అణగదొక్కెస్తున్నానేమో ...వ్యాఖ్యల అనుమతి పెట్టేద్దాము" అని అనుకొన్న నాకు జ్ఞానోదయం అయ్యింది. అందరూ ఇలా పేపర్ కట్టింగ్స్, సేకరణలు వ్రాసేవాళ్ళని ప్రోత్సహిస్తూ ..వారిని సొంతంగా వ్రాయించే దీక్షలో ఉన్నప్పుడు అనవసర దీక్షాభంగం కలిగించకూడదని నిశ్చయించేసుకొన్నాను. అవునూ... ఇలా నిశ్చయించుకొన్న తరువాత నాకో సందేహం వచ్చేసింది.. కూడలి అగ్రిగేటర్ కాని, గూగులమ్మ కాని తమ బ్లాగుల్లో వ్యాఖ్యల అనుమతి ఇవ్వని వారు ఏ బ్లాగు కాని, ఏ వ్యాఖ్య కాని చదవకూడదు అని వారి వారి నిర్దేశిక అంశాలలో ఎక్కడన్నా చెప్పారా? అలా చెప్పి ఉంటే మటుకు నాకు తెలియకుండానే నేను చెసిన తప్పు.. ఇంకొకరి బ్లాగులో వ్యాఖ్య చదవడం, నా బ్లాగులో వ్యాఖ్యలని విమర్శించడం. దయచేసి ఎవరన్నా తెలియజేస్తారు కదూ. "ఎక్కడ అని అడుగుతారేంటండి? మనసుంటే వ్యాఖ్యలకి మార్గాలనేకం, మన బ్లాగుల్లో ప్రముఖులు.... విశాల హృదయులు ఉన్నారు, క్షమించండి అనేస్తే చాలదూ.. "
ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. కొత్తపాళీ గారు సహృదయంతో నా పోస్ట్‌కి జ్యోతిగారి బ్లాగులో ప్రతిస్పందిచారు. అందుకు ముందుగా కొత్తపాళీ గారికి విధేయతతో ధన్యవాదాలు. గడ్డిపోచ అనో, గంజాయి మొక్క అనో పీకి /ఏకి పారేస్తారనుకొన్నాను. కాని చిన్నపాటి విలువ ఇచ్చినందుకు కృతజ్ఞురాల్ని. వ్యాఖ్యల అనుమతికి.. పైన చెప్పిన సంఘటనే నా సమాధానం. ఇహ "తమబ్లాగులో ఇతరులు వ్యాఖ్య పెట్టకుండా చేసిన వారు పనిగట్టుకుని ఎవరో ఎక్కడో రాసిన వ్యాఖ్యల్ని గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది." పెద్దవారు మీకు విడ్డూరం కలిగించింది అంటే నిజంగా చెప్పుకోతగ్గ విషయమే. మిమ్మల్ని విడ్డూరపరచగల గొప్పతనం నాది అని చెప్పుకోవచ్చన్నమాట. :) "పనిగట్టుకొని ఎవరో ఎక్కడో రాసిన వ్యాఖ్యల్ని..... " మిమ్మల్ని కూడా వేడుకొంటున్నాను. నా బ్లాగులో వ్యాఖ్యలు లేకపోతే.. ఏ బ్లాగులు చదవకూడదని ఎక్కడన్నా.....?? మరోలా భావించక శ్రమ అనుకోక వీలు చూసుకొని/చేసుకొని తెలియజేస్తారు కదూ...
"తెనాలి రామకృష్ణ సినిమాలో "తెలియనివన్ని తప్పులని సభాంతరమ్మునన్ పలుకగరాదు ..." అనే పద్యం గుర్తొచ్చింది నాకైతే మీ వ్యాఖ్యానం చదివి." అవును ఇది నేను అనుకొన్నదే... మీకు ఆయనే .. ఆ పద్యమే గుర్తు రావాలి. ఎందుకంటే "మనకెందుకులే అని అనుకోకుండా... సంఘటితమైన శక్తితో సహాయం చెయ్యగలిగిన చేతులివి అని సగర్వంగా నిరూపిస్తున్నారు. మీ సభ్యులందర్నీ మనసారా అభినందిస్తున్నాను..... " అని మాములుగా వ్రాస్తే మీరు కొత్తపాళీ గారెందుకవుతారు? మహా మహా పండితులనే అర్థం లేని భాషలో "తోక మేక మేక తోక తోకకొక మేక " అంటూ అవతలి వాళ్ళని బురిడి కొట్టించామనుకోకపోతే ఆయన రామలింగడెందుకవుతారు?
సుమమాలగారూ, నేను ఆడవారిని కానీ వారు వేసుకునే గాజుల్ని కానీ ఆ గాజులు తొడుక్కునే వారి చేతుల్ని కానీ ఏమీ కించ పరచలేదు... నెనర్లు ... మీరలా కించపరచకూడదనే నేను అంత పొడుగు వ్యాఖ్యానం నా బ్లాగులో వ్రాసింది.

5.17.2009
ఆత్మీయ స్పర్శకి శుభాభినందనలతో.......
పైన వ్యాఖ్యలోని ఊరికే గాజులు తొడుక్కొని కూర్చోడం అనేది ఒక తప్పు అన్నట్లుగా ధ్వనిస్తోంది. గాజులు తొడుక్కోడం లేదా వేసుకోడం అనేది ఆడవాళ్ళకి అలంకారం. గాజుల చెయ్యి మన ముందు తరాల నుండి ఎప్పుడు ఊరికే లేదు. గాజులు వేసుకోడం , పసుపు రాసుకోడం ఇవన్నీ ఆడవాళ్ళ సౌందర్యాన్ని ఇనుమడించడంలో భాగం. కాబట్టి ఊరికే కాకపోయినా డబ్బులిచ్చి కొనుక్కొని అయినా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఊరికే గాజులు తొడుక్కోడం, గాజులు తొడుక్కొని కూర్చున్నామనుకొన్నావా లాంటి పదాలు గాజులు మురిపెంగా వేసుకొనే వాళ్ళకి వినడానికి ఇబ్బందే. గాజులు వేసుకోడం తప్పా?? అన్న ఆలోచన రాకమానదు
సంధర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ...మన తెలుగు సినిమాల్లో ఆడవాళ్ళను అవమానపరిచే మరో విషయం.. " ఇంట్లో ఊరికే కూర్చొని ఏమి చేస్తున్నారు? బాగా తిని ఒళ్ళు పెంచుకోడం తప్ప " అని , ఇలా అనడం ఎంత అవమానకరమంటే, ఊరికే తినడం అనేది వినడానికి ఇబ్బందే, ఇది నేను చాలా చోట్ల బయట కూడా విన్నాను. అదేదో హాస్యం అన్నట్లుగా వినేసి నవ్వేసే ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా ఇంట్లో కూడా ఊరికే ఉండరు, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు అనేకం. కాని ఇలాంటి సంభాషణలు అసంఖ్యాకం. అలాగే మనవాళ్ళే, మన ఆడవాళ్ళే మగవాళ్ళ పౌరుషాన్ని పరీక్షిస్తూ అనే మాటలు "గాజులు తొడుక్కొని రండి.." పసుపురాసుకొండి మొ!... రాను రాను ఈ సౌందర్య ప్రతీకలైన గాజులు, పసుపు అనేవి మనం రాసుకొంటే /వేసుకొంటే తప్పేమో ...అని అనుకొనే స్థాయికి మనమే దిగజారుతున్నాము. మనల్ని మనమే "గాజులు తొడుక్కొన్నామనుకొంటున్నారా.." అంటూ అవమాన పరుచుకొంటున్నాము. మీరే ఆలోచించండి నేనన్నది తప్పుగా అనిపిస్తోందా? మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరంలేదు. మన నిత్య అలంకార సౌందర్య సాధనాలను ఆధారం చేసుకొని అవహేళన చెయ్యకపోతే చాలు. పైన వ్యాఖ్య అభినందనీయమే. కాని ఆ ఒక్క పదం ఉపయోగించకుండా ఉండిఉంటే బాగుండేది. పెద్దవారు .... చెప్పతగ్గ వాళ్ళము కాదు కాని, ఎందుకో .... గాజులు , పసుపు , కుంకుమ, ఇవన్నీ పిరికితనానికి ప్రతీకలు కావు అని చెప్పాలనుకొన్నాను కాని , ఒకరిని తప్పు పట్టాలన్న ఉద్దేశ్యం నాకు లేదు.
నోట్: మరీ ముఖ్యంగా చెప్పాలనుకొన్న విషయం నేను ఇక్కడ వ్యాఖ్యాతని విమర్శించలేదు, వ్యాఖ్యలోని ఆ ఒక్క పదానుబంధాన్ని మాత్రమే విమర్శించాను గమనించగలరు.
****
5.11.2009
పదవి
" బస్ ఎక్కేప్పుడూ దిగేప్పుడూ జాగ్రత్త! బస్లో ఆ ఊచ పట్టుకో, రోడ్డు దాటేప్పుడు అటూ ఇటూ చూసుకో. వెధవపీనుగులు వేగంగా వచ్చి గుద్దెస్తారు. మన తప్పులేకపోయినా శిక్ష అనుభవించాలి. హనుమాన్ చాలిసా మనసులో అనుకొంటూ ఉండు. "
"సరే వెళ్తున్నా"
"వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అను, ఎన్నిసార్లు చెప్పాను నీకు వెళ్తున్నా అనొద్దని చెవికెక్కదా. కదిలే బస్ ఎక్కకు. బస్ ఆపకపోతే దిగకు. బస్ డ్రైవర్కి చెప్పు నేను ఆపమన్నానని."
"ఊ సరే"
*****
"హల్లో ఏమి చేస్తున్నావురా?"
"ఆఫీసులో ఉన్నా... ఏంటి చెప్పు"
"ఏమిలేదు ఏమి చేస్తున్నావో అని ఫోన్ చేసాను."
*****
"హల్లో"
"ఒంటిగంట అయ్యింది భోజనం చేసావా?"
"లేదు ఇంకా చెయ్యలేదు ఇంకో అరగంటలో చేస్తాను"
"ఇంకో అరగంటేంటి? ముందు భోజనం చేసేయ్! నేను చెప్పానని చెప్పు మీ సర్ కి. ఇంకా తినకపోడమేమిటి? అవునూ.. ఇంతకీ వంటేమి చేసావు?"
అబ్బా! సాయంత్రం ఇంటికొచ్చి చెప్తాను ఆఫీసులో ఏదో పనిలో ఉన్నాను"
****
"అమ్మలూ ఎక్కడున్నావు?"
"బస్లో ఉన్నా"
"ఇంతాలాస్యమేమిటే? ఇంకా ఇంటికి వచ్చేసావనుకొంటున్నా...అవును! పొద్దునుండి పిల్లలు రాలేదు, ఒకసారి ఫోన్ చేసి చెప్పు నేను రమ్మన్నానని".
"ఫోన్ ఎందుకు ఇంటికెళ్ళి చెప్తాలే. రేపు వస్తారు ఇహ ఈరోజు రారు"
"ఊ సరే.. బస్ దిగేప్పుడు.......మళ్ళీ మొదలు ...
*********************************************************
తల్లి.. తన కూతురు కాని కొడుకు కాని ఎంత ఎదిగినా వాళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడినా... ఇంకా తన పొత్తిళ్ళల్లో పిల్లలే అని భ్రమసిపోడం కద్దు దానికి తార్కాణం .. పైన నాకు మా అమ్మకి మధ్య జరిగిన ఓ దినచర్యలా రోజూ జరిగే ఆ సంభాషణ. నెనో ఇద్దరి పిల్లల తల్లిని. కాని ఆవిడ అలా జాగ్రత్తలు చెప్తునే ఉంటుంది. ఇలా నాకొక్కదానికే కాదు నాకు నా తోడబుట్టినవాళ్ళకు ఉండే రోజు వారి కార్యక్రమం ఇది.
తన కూతురు/కొడుకు "తనవాళ్ళు" అన్న ఒకే ఒక భావన తల్లి కి ఉన్నప్పుడు, అమ్మ "మా అమ్మ" అని అనుకోడం తప్పు కాదని నా అభిప్రాయం. అందరికీ అమ్మలా చెయ్యాలనుకోడం లేదా అందరికీ అమ్మలా ఉండాలనుకోడం నా జీర్ణం కాని విషయం . మొన్నా మధ్య మాటల సందర్భంలో మా అక్క "అమ్మ నీకు మాత్రమే చెయ్యాలి నీ పిల్లలిని మాత్రమే చూసుకోవాలి అని అనుకోకూడదే" అని అంది. "నీకున్నంత విశాల హృదయం నాకు లేదక్కా" అని కఛ్ఛితంగా చెప్పేసాను. అమ్మ నాకు నా తోడబుట్టిన వాళ్ళకి ,తనకి సంబంధించిన వాళ్ళకి కాక ఎవరికో సంబంధం లేని వాళ్ళకి, వాళ్ళ పుట్టినరోజులకి ఈవిడ నడుం బిగించేసి పులిహోరలు, పరమాన్నాలు, బొబ్బట్లు లాంటివి చేసేస్తాను అంటే నా మనసు అంత విశాల భావాలతో, అంత సహృదయంతో అంగీకరించలేకపోతోంది .
ఇంటికి వచ్చేఅతిధిలకి మర్యాదలు చెయ్యడం మన ఆచారం. అది మన సాంప్రదాయం వాటిని నేనెప్పుడు కాదు అనను. ఇంటికి ఎవరో వస్తున్నారని వేగు ద్వారా తెలిసింది. వాళ్ళని అమ్మకి వదిలేసి ఎవరి పని వాళ్ళు చూసుకోడం నాకంత సమంజసంగా అనిపించడంలేదు. 70 యేళ్ళ పెద్దావిడ వచ్చేవాళ్ళకి ఊడిగం చెయ్యడం నా మనసుకి ఎక్కడో గుచ్చుకోంటోంది. "చెయ్యను" అనలేని ఆవిడ అసహయతను ఆసరా చేసుకొని అడిగి మరీ పిండివంటలు చేయించుకొనేవారు ఎక్కువ. ప్రేమతో చేసేది వేరు , ప్రేరెపించి చేయించుకొనేది వేరు. మొన్నెందుకో ఒకసారి "నేనెందుకు చెయ్యాలి వీళ్ళందరికి" అని అమ్మ అని బాధ పడితే, ఇక్కడ ఉంటే మొహమాటం కొద్దీ చేస్తుంది. అసలు ఊళ్ళో లేకపోతే..... అన్న ఆలోచన వచ్చింది.
ఒక్కత్తే వెళ్ళలేదని ఎలాగు సెలవల్లోనే ఉన్నారని మా పిల్లలిని తోడు పంపాను. మనకి నలుగురి ఆచారాలు తెలియాలి మన చుట్టూ ఉన్న పలువురు ఎలా ఉంటారు అన్నది మన పిల్లలికి మనం తెలియజేయాలి. నా ఉద్దేశ్యం ఒక్కటే ఎంతసేపు మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పిల్లలికి నేర్పడం కాదు. అనుభవం వాళ్ళకి పాఠాలు నేర్పాలి. అనుభవం రావాలి అంటే వాళ్ళు నలుగుర్ని చూడాలి ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎంతసేపు మనదగ్గిరే కాకుండా కాస్త మనకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి పంపాలి, పిల్లలికి అమ్మా నాన్నతో పాటు మావయ్య, పిన్నులు, అత్తలు అందరిని ఇవ్వాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన ఆచారవ్యవహారాలు వాళ్ళకి నచ్చితే పాటిస్తారు లేకపోతే లేదు. పిల్లలిని నలుగుర్లోకి పంపడం ముఖ్యోద్దేశ్యం ఇదే. ముందుగా మాట్లాడడం తెలుస్తుంది. నలుగుర్లో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. భిన్న కుటుంబాల భిన్నాభిప్రాయల మనస్థత్వాలను చదివే అవకాశం ఉంటుంది. అందుకని ఊరు పంపాను.
నాకు గుండెల్లో గుబులే ట్రైన్ టికెట్స్ దొరకలేదని బస్ కి టికెట్స్ తీసాను.
*****
"బస్ ఎక్కేప్పుడూ దిగేప్పుడూ జాగ్రత్త! బస్లో ఆ ఊచ పట్టుకోండి, రోడ్డు దాటేప్పుడు అటూ ఇటూ చూసుకో. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకొండి. "
"సరే వెళ్తున్నా"
"వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అను, ఎన్నిసార్లు చెప్పాను నీకు చెవికెక్కదా వెళ్తున్నా అనొద్దని. కదిలే బస్ ఎక్కకు. బస్ ఆపకపోతే దిగకు. బస్ డ్రైవర్కి చెప్పు, అమ్మమ్మ బస్ తొందరగా ఎక్కలేదని, దిగలేదని, దగ్గరుండి దింపు, అమ్మమ్మకి చెప్పకుండా మీరు బస్ దిగకండి. బస్ నంబరు గుర్తు పెట్టుకో అన్ని బస్ లు ఒకేలా ఉన్నాయి ఎదో ఒక బస్ ఎక్కెయకు. నంబర్ చూసుకొని ఎక్కండి ఎక్కడన్నా దిగితే......" ఇలా నా ప్రవాహం సాగుతూ ఉంటే మా పాప అడ్డుకొంది.
అబ్బా అమ్మా నేను 10th కి వచ్చాను, పర్లేదు అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకొంటాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేనూ తమ్ముడూ ఇద్దరం ఉన్నాము కదా.
*****
అవునూ పాప 10th కి వచ్చింది. పెద్దదయింది పాపకి అన్నీ తెలుస్తున్నాయి, మరి నాకెందుకీ కంగారు? ఇన్ని జాగ్రత్తలు చెప్పల్సిన అవసరం లేదు. అదే.... అదే ....అందరి తల్లులకి అనిపించేదే. అది నా అంత ఎత్తుకి ఎదిగినా నాకు చిన్నపిల్లలా కనపడడం. మా అమ్మ ఏమి చదువుకోలేదు కాబట్టి ఇంకా అమ్మకి తెలిసి రాలేదు అని అనుకొన్నా ఇన్నాళ్ళు.... కాని నేను చదువుకొన్నాను కదా.... అంటే తల్లి పదవికి , చదుకోడం, చదువుకోకపోడం అనేది ప్రామాణికం కాదు. తల్లికి పిల్లలే పెద్ద ప్రామాణికం. చదువుకొన్న చదువుకోకపోయినా తల్లి పదవి విశిష్టత అది. తన పిల్లలు ఎప్పటికి తనముందు చిన్న పిల్లలు ... అందరికీ ఏదో ఒకటి చేస్తూ .. సదా మీ సేవలో... అనే తల్లి మనసుకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. అలా మనం మన కృతజ్ఞత ఏరోజన్నా చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరోజుకో పరిమితం కాదు , కాని ఇలా మన అమ్మకి ఎదో ఒకరోజు కేటాయించేసి ఆ రోజుకి బహుమతులిచ్చేస్తే మన ఋణం తీరిపోతుందా? అమ్మ గోరుముద్ద తిన్న ప్రతిరోజు ప్రత్యేకమే. అమ్మతో జాగ్రత్తలు చెప్పించుకొన్న ప్రతిరోజు ప్రత్యేకమే. అమ్మ ఆశీస్సులు అమ్మకి సంబంధించిన రోజుకే కాక ప్రతిరోజు మనకేలా వస్తాయో అలాంటి రోజులన్ని అమ్మకోసమే. అమ్మవే అన్ని రోజులు. " అక్కా ! నీకు పదో తరగతి చదివే కూతురుంది " అని తమ్ముడు సరదాగా రోజు గుర్తు చేస్తుంటే ... "అబ్బా ఎందుకురా ఊరికే వయసుని గుర్తు చేస్తావు " అని పైకి అంటాను కాని ఒక్కోసారి ఎంత గర్వంగా ఉంటుందో. కూతుర్ని, కొడుకుని చూసుకొంటుంటే. తల్లి హోదా ఆనందమది అమ్మ, పిల్లలు క్షేమంగా చేరారు అని తెలిసిన ఆనందంతో ఇంకో తల్లి మనసు రాసిన అక్షరమాల ఇది.

5.01.2009
తొలి అడుగులు
"ఆ.... నెమ్మదిగా.. వచ్చేయ్యాలి, వచ్చేయ్యాలి.. వచ్చేశాడొచ్చాసాడు. నా బంగారు కొండ. ...... అంటూ అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా తన చెంతకి వచ్చేసిన చిన్నారికి అక్కున చేర్చుకొని ముద్దు చేసిందా కన్నతల్లి...
అమ్మపిలుస్తోంది వెళ్ళాలి అని ....అడుగులు తడబడ్తున్నా.. పడిపోతామేమో అన్న భయం ఉన్నా .... అమ్మ అక్కున చేర్చుకొన్నప్పుడు బోసి నవ్వుల ఆనందానికి విలువ కట్టగలమా ? ఎంత చక్కటి భావన ఇది... బాల్కనిలో కూర్చుని కాఫీ తాగుతూ ఎదురు ఇంటిలోని చిన్నారికి, తల్లి నేర్పుతున్న తొలి అడుగులోని ఆనందాన్ని చూస్తూ .. ఆలోచిస్తున్న నాకు...
"వదినా! ఇదిగోండి గారెలు అత్తయ్యగారు చేసారు " అన్న మరదలు మాటలకి ఆలోచనలనుండి తేరుకొన్నాను.
"ఏంటి ఈరోజు ప్రత్యేకం? ఆదివారమనా గారేలు" అని అడిగాను.
"లేదొదినా బాబు గడప దాటాడు ఈరోజు " అని మురిపెంగా చెప్పింది మరదలు.
"హ ...హ .. బాగుంది, గార్ల పండగ అన్నమాట ఈరోజు " అనుకొన్నా ..
పుట్టినప్పుడు మొదలుకొని, 11 రోజుల పండగ, ఉయ్యాల (బారసాల) పండగ, బోర్లా పడ్డాడని బొబ్బట్లు, అడుగులేస్తున్నాడని అరిసెలు, గడపదాటాడని గారెలు, అన్నప్రాస్న పండగ, అక్షరాభ్యాసం పండగ, ఇలా పెళ్ళి దాకా ఎదో ఒక విధంగా మనతో పాటు ఉన్నమన కుటుంబం.. వాళ్ళ క్షణ క్షణ ప్రోత్సాహంతో మన జీవనం సాగుతుంది. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బాగోగులు చూడాలి మనకి తెలియకుండానే మనలో ఆ అలోచన కలుగుతుంది. అలా జీవన విధానం మన అలవర్చుకొని, మనకంటూ మన కుటుంబం వచ్చేసరికి అదే విధమైన ఆచారాన్ని, ప్రోత్సహాన్ని కొనసాగిస్తాము. ప్రతి పనికి మనకి ప్రోత్సాహం కావాలి. తెలిసిన మనిషి అయినా, తెలియని మనిషి అయినా మనం చేస్తున్న పనిని మెచ్చుకోవాలని మన ఆలోచన. ఆ అలోచనా ఆ ప్రోత్సాహల మధ్య పెరిగినవాళ్ళము.
ఇదే విషయాన్ని బ్లాగులకి అన్వయించుకొంటే ఒకసారి ఎలా ఉంటుంది?
******
కొత్తగా బ్లాగ్ తెరిచి ఏమి చెయ్యాలో తెలియక, ఏమి రాయాలో తెలియక , ఏదో ఒకటి రాసేద్దాము అసలు స్పందన ఎలా ఉంటుందో అన్న సంధిద్ఘావస్తలో ఓ నాలుగు లైన్ల కవిత రాసి తొలి అడుగు స్పందన చూద్దామనుకొన్న బ్లాగర్లకు మొదటే పరాభవం జరిగితే?
********
నేను కొత్తగా బ్లాగు మొదలెట్టినప్పుడు, నాకు వ్యాఖ్య ఎలా రాయాలో కూడా తెలీదు అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక నా బ్లాగులోనే ఓ ప్రఖ్యాత వ్యక్తి పేరు ని ఉదహరిస్తూ (ఆయనని సలహా అడిగే నేపధ్యంలో) అదే టైటిల్ పేరు గా పెట్టినప్పుడు, వ్యాఖ్యల్లోనే "అదేంటి మీరు వ్యక్తి పేరు టైటిల్ గా పెట్టారు " అని అడిగారు తప్పితే, ఇలా కాదు ఆయన బ్లాగ్ కి వెళ్ళి మీ సందేహాన్ని వ్యాఖ్య ద్వారా ఆయనకి తెలియజేస్తే మీకు అక్కడే సమాధానం దొరుకుతుంది అని ఎవరు చెప్పలేకపోయారు , నేనేదో తెలియని ఘొర తప్పిదం చేసానేమో అని, వెంటనే ఆ బ్లాగు పోస్ట్ తీసేసాను (ఉదహరించిన ప్రఖ్యాత వ్యక్తి మటుకు సహృదయంతో నా సందేహాన్ని తీర్చారు) అలా నా తొలి అడుగు తడబడింది. నా విషయం పక్కన పెడితే, ఇప్పుడు వస్తున్న కొత్త బ్లాగర్లకి ప్రోత్సాహం పేరుతో వస్తున్న వ్యాఖ్యల వ్యంగ్యాల వల్ల , నిరుత్సాహం చూస్తుంటే ...పాపం భాష మెరుగుపరుచుకోడానికో లేకపోతే నాలుగు మాటలు చెప్పుకొని భావనలు పంచుకోడానికో , వచ్చేవారు మొదటే సొంత రచనలు ఎందుకు అని అనుకొని ఈ కృష్ణశాస్త్రి గారి కవితో, ఏ నండూరి వారి యెంకి పాటో పెడితే చదివే ఆ ప్రముఖ మరియూ సీనియర్ చదువర్లు/బ్లాగర్లు, మా స్థాయికి ఎదగలేరనుకొని వదిలేసి వెళ్ళిపోవాలి కాని, వ్యాఖ్యల వ్యంగ్యాస్త్రాల వల్ల , తొలి అడుగులు వెద్దామనుకొన్న వాళ్ళకి ప్రోత్సాహం కరువవుతుంది కదా... ఇక్కడ మరీ వింతగా అనిపించే ఇంకో విషయమేమిటంటే విషయమెంతమాత్రం లేని వాటికి ప్రాముఖ్యత ఇచ్చి రాసిన వాళ్ళు ..... 'నేనేమి రాసానబ్బా "బాగుంది " అని వ్యాఖ్య రాయడానికి?' అని ఆలోచించేలా వ్యాఖ్యల పేరున సమ్మోహనాస్త్రాలను విసిరేది వీళ్ళే అంటే అతిశయోక్తి కాదేమో.. (దీని వెనకాల ఏదన్నా స్వార్థం ఉందేమో ?? అనిపించక మానదు. బ్లాగ్ పోస్ట్ చదివిన వారికి ఈ అర్థం లేని వ్యాఖ్యల వల్ల).
******
సరే ఏదో ఆలోచిస్తూ ఏదో రాసేశాను .. అసలు నేనూ .. ఎక్కడో పలుసార్లు ప్రచురించబడిన ఓ మాంచి ఇంగ్లీష్ నవల శుబ్బరంగా కాపి చేసేసి ఏ ప్రముఖ వెబ్ మేగజైన్ కో పంపిచేస్తే ఎలా ఉంటుందబ్బా .... అని ఆలోచిస్తున్నా ఈ పోస్ట్ రాస్తున్నప్పటినుండీ... మరి సలహా ఇచ్చేయండి "ప్రముఖ " అని పేరు తెచ్చుకోడానికి వేస్తున్న తొలి అడుగు తడబడ కుండా ఉండడానికి మీ అందరి ప్రోత్సాహం కావాలి మరి. మరింతదాక వచ్చాక మీరందరు వెనుతిరిగితే ప్రోత్సాహం ఎలాగండీ ???????? :)

వ్యాఖ్య విషయంలో ఒక చిన్న అభ్యంతరం - అభ్యర్ధన...కూడాను.
చాలా సంతోషం. "ఊరికే గాజులు తొడుక్కు కూర్చునే చేతులు " కావీ ప్రమదలవి, సంఘటితమైన శక్తితో సహాయం చెయ్యగలిగిన చేతులివి అని సగర్వంగా నిరూపిస్తున్నారు. మీ సభ్యులందర్నీ మనసారా అభినందిస్తున్నాను."