పండగ ఇంకా రాకుండానే మా ఇంట్లో హడావిడి మొదలయ్యింది. కారణం ఒకటే మావారి వైపు వాళ్ళందరూ దసరా పెద్దఎత్తున చెస్తారు. చిన్నప్పటినుండి ఇక్కడే పెరగడంవల్ల వచ్చిన అలవాటది. నేనూ ఇక్కడే అనుకొండి కాని, అమ్మ దగ్గరినుండి వచ్చిన అలవాటు సంక్రాంతి పండగని పెద్ద ఎత్తున చేసుకోడం. అలా అని దసరా అంటే చిన్నచూపు లేదు.
సో! తన అలవాటు ప్రకారం, ఏ పండగ పట్టించుకొన్నా పట్టించుకోపోయినా ఈ దసరాకి మటుకు మావారు బట్టలు కొనడం దగ్గరినుండి హడావిడి చేసేస్తారు. సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళడానికి వెనుకంజవేసే మా బుచ్చిబాబు దసరాకి మటుకు "నన్ను మర్చిపోతారా?" అనే చందాన ఈసారి మాతో పాటు బట్టలు ..తదితర పండగ సంబంధిత సామాన్లు కొనడానికి ఉద్యుక్తులయ్యారు. ఇహ పిల్లల సంబరం వేరే చెప్పాలా.. వాళ్ళు ఆడింది ఆట.... పాడింది పాట.
మొన్న 8వ తారీఖున మాబాబు పుట్టినరోజు జరిగింది.... కాబట్టి వాడు కొంచం పెద్దరికం ఫోజొకటి పెట్టి, "డాడీ ! మొన్నేగా నాకు బట్టలు కొన్నది, ఇక పండగకి వద్దు , ఇంకోసారెప్పుడన్నా చూద్దాము" అన్నాడు వెళ్ళేముందే. " ఏమి పర్లేదు నాన్నా... నేనున్నాగా, అందరికీ కొంటూ ....నిన్నేలా వదిలేస్తాను" అంటూ ఓ అభయహస్తమిచ్చేసి మరీ బయల్దేరారు మా శ్రీవారు.
నేను ఆఫీసునుండి ... వాళ్ళు ఇంటినుండి బయల్దేరి, అందరం అనుకొన్న ప్రకారం బట్టల షాపులో తేలాము. " డాడీ మీకిది బాగుంటుంది, తమ్ముడూ నీకయితే ఇది సూపర్రా!...... అక్కా ఇది చూడు...." లాంటి హడావిడిలో మొత్తం బట్టలన్నీ కొనేసి, పక్కనే హోటల్ లో డిన్నర్ కానిచ్చేసి ఇంటి దారి పట్టాము. పండగ హడావిడి బాగుందనిపించింది. పిల్లల ఆనందం చూసి. ఇద్దరూ ఒకటే మాట అన్నారు. "అమ్మా నీతో వచ్చినా బాగుంటుంది, డాడి ఒక్కరితో ఎక్కడికన్నా వెళ్ళినా బాగుంటుంది, కాని మీ ఇద్దరితో మటుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుందమ్మా!" అని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మనసులో మాటని చెప్పారు. నిజమే ఎవరి హడావిడిలో వాళ్ళుండి, పిల్లలిని పట్టించుకోకపోవడమంటూ లేదు కాని, ఎవరికి కుదిరితే వాళ్ళము ఏదో వాళ్ళ బాధ్యతని పంచుకొన్నట్లుగా ఆ సమయానికి ఒకరు లేని లోటు తెలియకుండా ఇంకోకరం వారి సరదాలను సంతోషాలను, పంచుకోడానికి ఉంటాము. ఇదిగో ఇలా ఇద్దరం కనిపించేసరికి వారి ఆనందం ఇలా చెప్పారన్నమాట.
అన్నిటికన్నా ముఖ్యంగా మావాడు, బట్టల విషయంలో తన భావన చెప్పిన తీరు నా కళ్ళముందు బొమ్మరిల్లు సినిమా తలపింపచేసింది. ఒక రెండు క్షణాలు నేను ఏమి మాట్లడలేకపోయాను. వాడన్న మాటలు ఇదిగో. :
"అమ్మా నాకేందుకో డాడీ నచ్చుతారమ్మా.. ఎప్పుడు మనతో రారు. ఈరోజు వచ్చారు, ""చింటూ నీకిది బాగుంటుంది నాన్నా... అన్నారు" అంటే డాడికి నేను టి షర్ట్స్ వేసుకోడం ఇష్టం లేదు. డీసెంట్గా కనపడాలనుకొంటారేమో, నాకెందుకో డాడి మాట వినాలనిపించింది. నాకు కూడా నచ్చింది. అందుకే డాడీ మీరేదంటే అదీ అనేసాను. డాడి నన్నెలా చూడాలని ఇష్టపడ్తున్నారో నేను కూడా అలాగే ఉండడానికి ఇష్టపడతాను. " ఈ మాటలు వాడికి సినిమా ప్రభావమనుకోవాలో, వాడి ఎదిగీ ఎదగని ఆలోచనల ప్రతిరూపమనుకోవాలో నాకు తెలీదుకాని, ఎందుకో ఈ విషయాన్ని మావారితో కూడా చర్చించాను. ఆయననే మాటలు, "నేనేమి వాడి అభిప్రాయాన్ని కాదు అనలేదే, వాడినే మొదట చూసుకోమన్నాను, "మీరు చూడండి డాడీ" అన్నాడని, నేను చూసాను". అని అన్నారు బాబు అక్కడ వాడికి కొన్న డ్రస్ బాలేదు అని చెప్పడం లేదు. "నాన్న కోసం" అని అంటున్నాడు అది అర్థం చేసుకొండి అని నేను. ఇది ఎప్పటికి తెగదని అర్థంతరంగానే ఆపేసామనుకొండి.
విషయమేమైతేనేమి, ఈ తరం పిల్లల ఆలోచనలు మటుకు మళ్ళీ వెనకటి తరాన్ని స్మృతిపధంలోకి తీసుకొస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో! మాబాబు తరువాత ఎలా ఉంటాడో?? ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నాడు ... అని తరువాతి విషయం గురించి మధనపడక ప్రస్తుతాన్నీ ఆస్వాదించడమంత గొప్పవిషయం ఇంకోటి లేదనిపిస్తోంది. "వాడు రాములవారి నక్షత్రంలో పుట్టాడే అన్నీ రాముడి లక్షణాలే వస్తాయి, తండ్రి మాట జవదాటడు" అంటుంది అమ్మ. అవునా ...కాదా అనే తర్జన బర్జనల కన్నా.. పిల్లలు మటుకు ఆలోచించగలుగుతున్నారు, పెద్దలని అర్థం చేసుకోగల్గుతున్నారు అన్నది మటుకు అక్షరసత్యమనిపిస్తోంది. ఇంతాచేసి ఇదంతా చెప్తుంటే మావాడేదో కాలేజ్ కుర్రాడనుకొనేరు..... వాడు 8వ తరగతి పిల్లాడు. హ! చిన్నపిల్లాడు కాబట్టి, పెద్దయ్యాక చూద్దామనుకొంటున్నారా.... చూసేదేమి లేదు చెప్పాగా ప్రస్తుతాన్ని ఆస్వాదించడం, ఆనందించడం... భవిష్యత్తు వాళ్ళదే, వాళ్ళిష్టం.
ఇక చివరగా ఈ ఆనంద సమయంలో, అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు.... మన బ్లాగ్ మిత్రులకు చాలు శుభాకాంక్షలు...
మీ అందరికీ మా అందరితరుపునా దసరా శుభాకాంక్షలు.
******

బాగా ఆలోచిస్తున్నాడండి మీ అబ్బాయి.. క్రెడిట్ పెంపకానిదే.. దసరా శుభాకాంక్షలు..
ReplyDelete