10.30.2009

భారతదేశం నా మాతృ భూమి

నేను నా దేశాన్ని మరే దేశంతో పోల్చలేను కాని, నా చిన్ని ప్రపంచంలో నా పరిధిలో నేను చెప్పాలనుకొన్నది చెప్దామని చిన్ని ప్రయత్నం. మనకెప్పటినుండో ఉన్న సామెత "భారతీయుడు సగర్వంగా తలెత్తుకొని, స్వదేశంలోనే తెలివితేటలని ఉపయోగిస్తే భారత దేశం ప్రగతిపధంలోకి రాగలదు కాని తలొంచుకొని ఎక్కువ సంపాదనకోసమో, మరింకో లాభాపేక్షో మొత్తానికి పెట్టే బేడా సర్దుకొని విదేశాలల్లో మన తెలివితేటల్ని కుదువ పెట్టి బానిస బతుకు బతుకుతున్నాము" అంటారు . మన దేశంలో మన ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ మన బాస్ ఏదన్నా అంటే కోపం నషాలానికి అంటుంది కాని, పక్కదేశంలో మనల్ని తప్పుపడితే మరింత తలొంచుకొని బతికేస్తాము మనము మనకలవాటయిన .. పక్కదేశంవాళ్ళు అలవాటు చేసిన బానిస బతుకు కదూ ఇది ..

"ప్రపంచంలోనెలకొన్న ఆర్థికమాంద్యం (financial recession) ఇంకా కొనసాగుతుందని, దీనికిగాను చాలామందిని ఉద్యోగాలలోనుంచి తొలగించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తెలిపారు"

ఈ ఆర్థికమాంద్యం అమెరికా నుండి మా ఆఫీసు తలవాకిట కూడా వాలింది, మాకు తెలిసినవాళ్ళ రూపేణా... "ఏదన్నా జాబ్ చూడగలరా మావారు అమెరికా నుండి వచ్చేస్తున్నారు, ఇద్దరం సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నవాళ్ళమే, ఇండియాలో తప్ప ఎక్కడ చూసినా చేస్తాము." అని ఎందుకు ఇండియా అయితే ఏమయ్యింది అని నా అనుమానం , అడగకపోతే ఇక అది అలాగే తొలిచేస్తుందని, "ఎందుకు? ఇండియాలో అయితే ఏంటి సమస్య" అని అడిగేశాను. "అమ్మో ఇండియాలోనా చాలా తక్కువ ఇస్తారు, అసలు ఉండలేము ఇక్కడ, అక్కడ అలవాటు పడినవాళ్ళు ఇక్కడ ఉండలేము..". 23 ఏళ్ళు ఇండియా లో గడిపి పెళ్ళయి 5 సంవత్సారాలుగా అమెరికాలో ఉంటున్న ఓ అతివ ఉవాచ. వినగానే నవ్వొచ్చింది నాకు. ఇక్కడ కష్టాలనుభవించి అక్కడికెళ్ళి సుఖాలని అలవాటు చేసుకొంటాము. కాని కష్టాలని గుర్తుపెట్టుకోపోకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది, సుఖపడి కష్టపడలేము.

మన భారతదేశంలో కూడా కష్టపడి పైకొచ్చినవారి జాబితా చాలానే ఉంది. ఏ ధనవంతుడిని కదిలించినా, ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసాననో, పేపర్లు వేసేవాడిననో, పచ్చళ్ళు అమ్మాననో, చీరలమ్మానో మనకి వారు పడ్డ కష్టాలు ఏకరువు పెడ్తారు. మన ఇండియాలోనే కాక ఎక్కడయినా సరే కష్టానికి తగ్గ ఫలం ఎప్పుడూ దక్కుతుంది. కాకపోతే ప్రతిచోటా వచ్చే అడ్డంకులని ఇగో పొరల్లో కప్పుకోకుండా ఎదిరించగలిగితే ఎక్కడయినా విజయం సాధించగలమని నా నమ్మకం. ఇక ఏపనయినా పనిచేయగలిగే ఈ ధనవంతులు తమ పిల్లలు తమలా కష్టపడకూడదు అని ఆలోచిస్తారు కాబట్టి, వారి పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేయనివ్వకుండా వాళ్ళ సంస్థల్లోనో సంపాదించే అవకాశం కల్పిస్తారు కాబట్టి, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదం మధ్యతరగతి వాళ్ళకి వర్తిస్తుంది. పిల్లలు కష్టపడకూడదు కాని వాళ్ళకి రూపాయి విలువ, కష్టం తెలిస్తే చాలు అనే ఆలోచన..... ఆ ఆప్యాయత మన భారతీయులకి ఆభరణం. వారి ప్రేమాభిమానాలతో పిల్లలికి కష్టం తెలియకూడదంటూనే కష్టాలు నేర్పుతారు. ఒక పెద్ద సినిమా నటుడు తన కొడుకు కష్టం తెలియాలని కాలేజ్ కి బస్లోనే వెళ్ళమని ఆదేశించారట.

మనకీ తెలుసు కష్టాలు సుఖాలు. కాకపోతే మనకి మనం ఎప్పుడు నచ్చము, మనల్ని మనం ఎప్పుడు ఇష్టపడము. "పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు" అని ఈమధ్య ప్రతిచోట నిరూపణ అవడం బాధాకరమైన విషయమే.

మనం మన తెలుగు మాట్లడకూడదు, మన చదువులు మనకోసం కాదు , ఎక్కడో దేశం కాని దేశంలోని ఏదో ప్రాజక్ట్ వర్క్ ని ఉద్దరించడానికి. మనం వేసుకొనే దుస్తులు మనవి కాకూడదు, ఇదే మన ఆచారం మన సాంప్రదాయం. మనం మారము, మారి మన తెలుగు మాట్లాడితే.... మన దేశాన్నే పొగిడితే , మనకొసమే ఉంటే
మన మెళ్ళో ఇంకెన్ని బోర్డ్‌లు తగిలిస్తారో ...

ఈ మధ్యకాలంలో నాకు అమితంగా నచ్చిన వ్యాఖ్య, నా దేశంపై నాకున్న మమకారాన్ని మరింతగా ఇనుమడింపజేసింది. అందుకే ఈ వ్యాఖ్య ఇక్కడ పొందుపరుచుకొన్నాను.

తాడేపల్లి said...


౧. భారతదేశంలో జఱిగే అనేక విషయాలపై భోగట్టా సేకరించే సంస్థలు గానీ, వ్యక్తుల విజయాల మీద పుస్తకాలు/ వ్యాసాలూ రాసేవారు గానీ, రాస్తే కొని చదివేవారు గానీ ఎవరూ లేరు. అదొక్కటే కాదు, ఈ దేశంలో ఏ విషయం మీదా మీకు గణాంకాలు గానీ, వివరాలు గానీ లభించవు. అందుచేత ఇతర దేశాల్లో మాదిరే కష్టించి పైకొచ్చినవాళ్ళు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నప్పటికీ అది మనకి తెలియక మనమీద మనమే తప్పుడుగా వ్యాఖ్యానించుకుంటున్నాం. నేను వ్యక్తిగతంగా చాలామందిని చూశాను. వారిలో నా బాస్ లున్నారు. నా దగ్గఱ చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. నా బంధువులున్నారు. నా స్వస్థలం గుంటూరులో నా పరిచయస్థులలోంచి అలాంటివారిని కనీసం ఒక వందమందిని చూపించగలను. అలా దేశమంతటా ఉంటారు. ఉన్నారు కాబట్టే ఈ దేశం 1950 ల నాటి సోషలిస్టు వ్యవస్థకి భిన్నంగా ప్రభుత్వ సంస్థల హస్తాల్లోంచి బయటపడి ఈనాడు పాఠశాలలూ, వైద్యశాలలనుంచి కంప్యూటర్లూ, ఎయిర్ లైన్సుతో సహా అన్ని రంగాల్లోను స్వదేశీ ప్రైవేట్ సంస్థల ద్వారా నడుపుకునేటంత గొప్ప శక్తిసామర్థ్యాల దిశగా పయనించగలిగింది. కష్టపడకుండానే అంత ప్రైవేట్ పెట్టుబడి ఎలా పోగుపడుతుంది ?

౨. నిజానికి భారతీయులతో పోలిస్తే అమెరికన్లు వట్టి సోమరిపోతులు. వాళ్ళు ఆ సోమరితనాన్ని వ్యక్తిగతాల వెనుకా, హక్కుల వెనుకా దాచుకుంటారు. వాళ్ళలో కొద్దిమంది శ్రమజీవుల్ని చూసి. చూపించి అమెరికన్ లంతా ఏదో సాధించేస్తున్నారంటే నేను నమ్మజాలను. అయితే దాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయంగా గౌరవిస్తాను. భారతదేశంలో 24 గంటలూ పనిచేసే హోటళ్లున్నాయి. 24 గంటలూ పనిచేసే వైద్యులున్నారు. 24 గంటలూ పనిచేసే పోలీసులున్నారు (నిజానికి మన పోలీసులకి పనిగంటలూ, సెలవులూ లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి). అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా doubts clarify చేసే లెక్చరర్లున్నారు. ఏరి చూపించండి ఇలాంటివాళ్ళని కనీసం ఒక్కఱిని అమెరికాలో ? ఇక్కడే కాక అన్ని దేశాల్లోను భారతీయులు కష్టించి పనిచేసే జాతిగా గుర్తింపు పొందారు. నా ఉద్దేశంలో భారతీయులు పని కోసం వారాంతాన్ని కోరుకుంటారు. తద్భిన్నంగా అమెరికన్లు వారాంతం కోసమే పనిని కోరుకుంటారు.

౩. భారతీయులు తమ తరువాతి తరాలకోసం సంపాదించడం, అందునిమిత్తం పొదుపు చేయడం చాలా మంచి విషయం. ప్రపంచమంతా అమెరికన్ల మాదిరే కేవల వర్తమాన వాదులై జీవితాన్ని నమిలేసి తుక్కులా ఊసిపారేస్తే భావితరాల గతి అధోగతే. భావితరాల పట్ల ఏ రూపంలో బాధ్యత గలిగి ఉండడమైనా ప్రోత్సాహనీయం. అలాంటి బాధ్యతాభావం ఉంది కనుకనే ఇండియా అమెరికాలాగా దివాలా ఎత్తలేదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలకే కాక కుటుంబాలక్కూడా నికరమైన Asset base ఉంది. అమెరికన్ల మాదిరి అది చెక్కకొంపల తుక్కు Assets కావు. అదీగాక భారతీయులు ఎంతో అవసరమైతే తప్ప అప్పుచేయరు. అదే వారిని ప్రపంచవ్యాప్తమైన ఆర్థికమాంద్యం నుంచి రక్షఱేకులా కాపాడింది. ఇటీవలి విదేశ వాణిజ్య పరిణామాల ఫలితంగా భారతదేశంలో వృద్ధిశాతం (growth rate) తగ్గిపోయింది. కానీ వ్యవస్థ మాత్రం అలాగే చెక్కుచెదఱకుండా ఉంది. ఈ సందర్భంగా భారతీయుల పొదుపు వారి సంపాదనలో 33 శాతం అని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను.

అమెరికన్లకి దేశం పట్లనే కాదు, కనిపెంచిన తల్లిదండ్రుల పట్లా, భార్యాబిడ్డల పట్లా కూడా ఏ విధమైన బాధ్యతా లేదు. వాళ్ళని చూసి మనమెందుకు నోరు వెళ్ళబెట్టాలో నాకర్థం కాదు. బాధ్యత లేనివాళ్ళు శ్రమజీవులు కావడం అసాధ్యం. పాపం, వాళ్ళు నిజంగా అంత శ్రమజీవులే అయితే అమెరికాలో శరీరశ్రమ అవసరమైన అన్నిరకాల బండలాగుడు పనులకీ హిస్పానిక్కులే ఎందుకు దిగుతున్నారో, ఒక్క స్థానిక అమెరికన్ కూడా ఎందుకు మూటలు మొయ్యడో తెలుసుకోవాలని ఉంది. స్థానిక US పౌరులు నడ్డివంగని, మడత నలగని వైట్ కాలర్ పనులు తప్ప ఇంకేమీ చెయ్యడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసుకోవాలనుంది.

*******

10.29.2009

మరి వీళ్ళనేమి చేద్దాము?


కార్తీకమాసం ఏకాదశో మరి పౌర్ణమో తెలీదు కాని మా చుట్టాలెవరో సత్యనారయణవ్రతం చేసుకొంటున్నారంటే ప్రసాదానికని అమ్మ నన్ను పంపింది. అందరూ శ్రద్ధగా కథ వింటున్నారు. ఐదో కథ అయిపోయింది, వెంకటేశ్వర దీపారధన చేసి, మంగళహారతి పాడేసి ఇక ఉద్యాపన చెప్పడమే.. "మంగళహారతి ఎవరో ఒకరు పాడాలి " అని అన్నారు పంతులుగారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొన్నారు, అందరికంటే చిన్నగా నేనే కనిపించాను .. "నువ్వు పాడవే " అంటూ అందరూ నన్నడిగారు నేను అప్పుడు 6 వ తరగతి చదువుతున్నా.. మా స్కూల్ ప్రభావమో ఏమో ..అసెంబ్లిలో నించుని ఎంతో దీక్షగా నలుగురితో పాడేదాన్ని కాబట్టి, జంకు బొంకు లేకుండా పాట అందుకొన్నా. పాట మొదలెట్టగానే అక్కడున్నవారు "ఆపేయ్ !!." మేమే పాడుకొంటామని గట్టిగా అరిచేసరికి.. భయంతో ఒక్కసారిగా వణికిపోయను. ప్రసాదం తీసుకొని... బయటకి వచ్చేప్పుడు కళ్ళనీళ్ళతో అడిగేశాను వాళ్ళని "ఎందుకు ఆపమన్నారు నేను బాగా పాడలేదా?" అని.. ఆవిడ నామీద గట్టిగా అరిచేసింది. "ఇక్కడ జరుగుతున్న పూజ ఏంటి, నువ్వు పాడిన పాట ఏంటి? తప్పు కదా " అని.. నిజానికి ఆ పాట పాడకూడదని నాకసలు తెలీదు అప్పట్లో ఇప్పటిలాగ 6 వ తరగతికే జ్ఞానాలు వచ్చేవి కాదు, టీచర్ ఇలా చెయ్యమంది అంతే. అదొక్కటే మనసులో ఉండేది. ఎక్కడ ప్రార్థన జరిగినా ఈ పాట పాడాలి అని చెప్పిన తెలుగు టీచర్ మాట అది. తరువాత అమ్మ కి చెప్తే .. అమ్మ కూడా చెడా మడా దులిపేసింది. ఇంతకీ నేను పాడిన పాట నడిపించు నా నావా నడి సంద్రమున దేవా.. అల్లేలూయా ... అల్లెలూయా (అంతగా గుర్తులేదు) అంటూ పాడేను.

ఎప్పుడో చిన్నప్పుడు 6 తరగతిలో జరిగిన ఈ సంఘటన , ఎవరు సత్యనారయణవ్రతం చేసుకొన్నా... మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాయడానికి కారణం .. మైదకూరులో పిల్లల మెళ్ళో వెళ్ళాడతీసిన బోర్డ్... తెలుగుని అపహాస్యం చేసిన వైనం. ప్రతిఒక్క తెలుగు భాషాభిమాని బాధపడేంతగా జరిగిన ఆ సంఘటన. ఇది తల్లి తండ్రుల తప్పా? ఉపాధ్యాయుల తప్పా? అని చర్చినుకొంటున్నారు అందరూ.

క్లాస్ రూముల్లో "మనది మనవతావాదం, మనది మానవకులం వెరే ఏ కులాలు లేవు, మతాలు లేవు అంటూ భోదించి తరగతి గడపదాటాగానే పిల్లలిని తెలియకుండా మతం అనే ఊబిలోకి లాగుతున్నారు. అంటే స్లో పాయిజన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మిషనరీ స్కూల్స్‌లో
జరిగేవి ఇవే. మాజి దివంగత ముఖ్యమంత్రిగారు తనలా చాలా మంది మంత్రులని ఇంకో మతంలోకి మారేలా చేసారని ఎక్కడో చదివాను. ఈ మతాభిమానుల ప్రధమ కర్తవ్యం అదేనేమో అని అనిపిస్తుంది.

మిగతా స్కూల్లో ఎలా ఉందో నాకు తెలీదు కాని, మొన్నామధ్య మా పాప పుట్టినరోజుకి వాళ్ళ మావయ్య చక్కటి రోజా పువ్వుల బోకే పంపితే "అమ్మా రోజుకో పువ్వు తల్లో పెట్టుకొని వెళ్తానని " సంబరపడి దాచుకొని మొదటి రోజు పెట్టుకొని వెళ్ళింది మా పాప. అంతే 5 రూపాయలు పరిహారం పూలు పెట్టుకొన్నందుకు.. పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బొట్టు అసలు కనిపిస్తోందా లేదా అన్నట్లు పెట్టుకోవాలి.అసలు పెట్టుకోపోతే మరీ మంచిది కాళ్ళకి పట్టీలు పెట్టుకోకూడదు. ఆఖరికి చెవులకి కూడా ఏమి వద్దంటారు, అందరు విధ్యార్థులు ఒక్కటే ఒకలానే ఉండాలి , ఐకమత్యం అని ఇలా యునిఫార్మ్ పెట్టడం మంచిదే .. కాని, వాళ్ళ అభిరుచుల్ని చంపేయడమెందుకు? ఎప్పుడో ఖర్మకాలితే ఇవన్నీ తీసేయ్యాలని అనేవారు పెద్దవారు. అదిప్పటినుండి అలవాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది.

పాఠ్యాంశాలలో మత ప్రస్తావన లేకపోయినా, ఇలా పాటల ద్వారా, వారి యునిఫార్మ్ రూపేణా వారిలో ఒక భావాన్ని జొప్పించేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన సౌందర్యాభిలాషణని ఇలా మొగ్గలోనో తుంచేయ్యడమేమొ అనిపిస్తుంది. నేనే ఊరుకోలేక ఒకసారి ఈ విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. " వాళ్ళకి వేరేవాటిమీద దృష్టి మళ్ళకుండా ఒక్క చదువుపై మాత్రమే ఆసక్తి కలిగేలా చేయడానికి ఇలా..." అని సమాధానం ఇచ్చారు ఆ ప్రిన్సిపల్. ఈ ఆలోచన మరి వాళ్ళకి చదువులు చెప్పే ఉపాధ్యాయులమీద లేదా? స్లీవ్లెస్స్ బ్లౌజులు, కట్టామా లేదా అన్నట్లు కట్టే చీరలు, ఇవన్ని చెప్తే?? మనమా.... పిల్లలికి ఎల్లవేళల్లో అందుబాటులో ఉండము గబుక్కున నామీద కోపం వస్తే .... పిల్లలే బలి అవుతారని నోటిమీద వేలేసుకోడం.... ఇదే మన సంస్కృతి. .

పోని స్కూల్ మార్చేద్దాము అనవసరంగా పిల్లలు దృష్టి చదువునుండి మరల్తోంది అంటే దగ్గర్లో అంతకంటే చెప్పదగ్గ స్కూల్స్ లేవు. ఉన్నా ఈ కోవలోకి చెందినవే, పొయ్యి మీంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది. స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళిష్టం ఇంట్లో మనమే పిల్లలికి నెమ్మదిగా నేర్పుకోవాలి. అలాగే తెలుగు భాషా విషయంలో కూడా తల్లి తండ్రులకే సరైన అవగాహన ఉండాలి. స్కూల్లో ఏమి చెప్తే అది అంతే, మీరలానే ఉండాలి అని వాళ్ళని ఆధారపడేలా కాక, వాళ్ళంత వాళ్ళు ఆలోచించుకొనే అవకాశం ఇవ్వగలిగేది, వాళ్ళకి మార్గదర్శకులయ్యేది తల్లితండ్రులే నా ఉద్దెశ్యంలో. ఇలా భాష విషయంలో , మతం విషయంలో స్లో పాయిజన్ ఇస్తుంటే ప్రత్యామ్నాయాలు తల్లితండ్రుల దగ్గిరే ఉంటాయి. కాబట్టి మన పిల్లలిని మనమే మార్చుకొందాము...మనము మారిపోకుండా...

"మనము మారిపోకుండా....." అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మావాళ్ళకి తెలిసినవాళ్ళ అమ్మాయి ఈ భోదనలకో, పాటలకో ఆచరించే విధానాలకో, అకస్మాత్తుగా ఎదో డబ్బు వచ్చేస్తుందనే ఆశతోటో తెలీదు కాని వెరే మతంలోకి వెళ్ళి పెద్దవాళ్ళతో వాదించి,, " మీకు ప్రాణమున్న నేను కావాలా? నేను అలంకారానికి పెట్టుకొనే ప్రాణంలేని బొట్టు కావాలా" అని నిలదీసిందిట, "బొట్టుతో కళ కళ లాడే నువ్వు కావాలి" అని అనడంపోయి తల్లితండ్రులు కూడా మారిపోయారట . . కాబట్టి పుట్టినప్పటినుండి మనకి మతమంటే ఎంటో తెలియనప్పటినుండి చక్కటి అలంకరణ చేసుకొనే మనం ఎవరో ఏదో చెప్తున్నారని గుడ్డిగా ఆచరించడం ఎంతవరకూ సమంజసం? మరి వీటికి కారణభూతులయ్యేవారిని మనమేమి చేద్దాం? అసలేమి చేయగలము?
******

10.16.2009

మరో అడుగు.....


ఎంటో ఈ అడుగులు.. ఎప్పుడు తొందరగా నడుస్తానో, ఎప్పుడు పరిగెడ్తానో, ఆమధ్యెప్పుడో .. "ఎక్కడా ఇంకా 30+ " అంటే .. "ఇంకో మాట చెప్పు " అన్నారు బ్లాగర్లందరూ ఇప్పుడేమో ఇలా... నెమ్మదిగా అడుగులో అడుగు నత్త నడక.. మొన్నెప్పుడో శ్రీవారు కూడా అననే అనేసారు "ఈమధ్య మరీ నెమ్మదిగా నడుస్తున్నావు, నత్త నడక అయిపోతోంది" అన్నారు. వాళ్ళకేం వాళ్ళు ఎన్నన్నా అనేస్తారు "పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదని సర్దిపుచ్చుకొని కాస్త అంటే కాస్త ఏదో మావారి కంటి నీటి తుడుపుకోసమన్నట్లు నా నడకవేగం కాస్త పెంచాను. నడకయితే దో నా చేతిలోపనే కదా కాస్త చక చకా మార్చేసుకొన్నాను. కాని బ్లాగుల్లో అడుగులెలాగా? ఒక్కోసారి అసలేమి రాయాలో తోచదు, రాద్దామని ఏదో పాయింట్ దొరుకుతుంది, అప్పుడు పనిలో తలమునకలవుతాము.

ఇలా ఏదో నా మానాన నేను అడుగులు వేస్తుంటే తెలుగురత్న వారు ఆహ్వానించారు, సరే ఇదేదో బానే ఉంది ముగ్గురు చదివేది నలుగురు చదువుతారు. పర్లేదు అని అక్కడ కొన్ని వ్యాసాలు రాశాను. అలా మలి అడుగు వేసాను.

కొన్ని చర్చలు, కొన్ని వ్యాసాలు, మరికొన్ని కథలు... పర్వాలేదు అక్కడ కూడా ఆదరించారు అంతర్జాల మిత్రులు పడిపోకుండా అడుగులేయడానికి తోడ్పడుతూ..

ఇదిగో మరి మరో అడుగు ఇక్కడ, కొన్ని తెలియని తప్పులు, నెమ్మదిగా ఏమన్నా అడుగుల్ని నిలదొక్కోగలనేమో చూడాలి మీ ఆధరాభిమానాలతో.... మరో అడుగుని .... మరింకో అడుగుకి నాంది పలికేలా చేస్తారని కోరుకొంటూ... :-)

10.15.2009

దివ్వీ ....దివ్వీ .....దీపావళి


దివ్వీ ... దివ్వీ దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితీ
ఎప్పుడు తిందాము చలిమిడి ముద్ద



అంటూ.... గోంగూర కాడలకి చివర తెల్లటి వస్త్రాలని కట్టి నూనిలో నానపెట్టి దీపావళికి దివిటీలు కొట్టించేది అమ్మ, టపాసులకన్న ఇవి కొట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవాళ్ళము నేను మా అక్క. ఎందుకంటే దీపావళికి అమ్మ పాలకోవా చేస్తుంది ..ఈ దివిటీలు కొట్టినతరువాత పాలకోవ పెట్టేది. అదెంత రుచిగా ఉంటుందంటే ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు దివిటీలు కొట్టేసి పాలకోవా తిందామ అని ఎదురుచూసేంతగా ఉంటుంది.

సంక్రాంతి రోజు వాకిలంతా ముగ్గులు కనీసం కాస్త స్థలం కూడా వదలకుండా పెట్టించేది అలాగే దీపావళికి "అటు గోడ , ఇటు గోడ మొత్తం దీపాలు పెడ్తామమ్మ " అంటే అహ.. తులసిమొక్కదగ్గిర గుమ్మాలదగ్గిర పెట్టించేది "చాలు ఇంకా కార్తీకమాసమంతా తెల్లవారుఝామున దీపాలు పెట్టాలి, కార్తీక పౌర్ణమి దీపాలు... ఆవునెయ్యి ఈరోజే అయిపోతే ఎలా" అంటూ నాకేమో మా ఇంటి పిట్టగోడలన్ని దీపాలతో వెలిగిపోవాలని కోరిక. అందుకని ఖర్చు అయితే అయ్యిందని పెళ్ళయినప్పటినుండి దీపావళికి మటుకు మొత్తం దీపాలతో అలంకరించేస్తా.. అదో ఆనందం.

ఈసారి ఇంకొంచం ముందడుగు వేసి రంగు రంగుల ప్రమిదలు కొన్నాను .. మా అక్క వాళ్ళ పాప చేసిన అందమైన దీపాలు చూస్తుంటే భలే ముచ్చటేసింది, నాకు పంపించమంటే "తప్పకుండా పిన్నీ " అంటూ పంపింది.

మరి కొత్తగా కొన్న ఈ రం
గు రంగు ప్రమిదల అందమైన డిజైన్లతో మీకందరికీ కూడా మా





దీపాళి శుభాకాంక్షలు



10.12.2009

మరణం తధ్యమని....తెలిసినా...


బాధ ఎక్కూవయితే ఏమి చెయ్యాలి? మాటల్లో చెప్పలేని బాధ, ఒక్కసారి ఒకే ఒక్కసారి గట్టిగా ఏడ్వాలనిపించే బాధ, భోరున ఏడ్వాలనిపిస్తోంది, కాని నేనలా ఏడిస్తే వింతగా చూస్తారు, అసలు నీకేంటి అంత సంబంధం ఏడావల్సినవాళ్ళు ఏడ్చి ఏడ్చి సొమ్మస్లిల్లి పడిపోయారు. వాళ్ళనే ఓదార్చలేకపోతున్నాము మళ్ళీ నువ్వెందుకు?? పరిచయం కూడా పెద్దగాలేదు అని.. నా వైపు వింతగా చూస్తారని ఏడవలేకపోయాను. సాధారణంగా ఏడవను, నాదేప్పుడు మౌనరోదనే, ఏడుపుని నటించడం నాకిష్టంలేని పని, అవతలి మనిషి నాకు బాగా తెలుసా లేదా అన్నది కాదిక్కడ సమస్య, అతనెలాంటి వాడో నా మనసు అంచనా వేసేసి మరీ ఏడుస్తుంది. లేకపోతే మౌనంగా ఉంటూ చుట్టుపక్కల వారిని గమనిస్తుంది. ఇక్కడ భోరున ఏడ్చేసి , పక్కకి వెళ్ళి, నవ్వుకోడాలు, అప్పుడే చూస్తున్నట్లుగా పలకరింపులు, అనవసరమైన పరామర్శలు అన్నిటికి మించి అదోరకంగా ఏడవడం నాకు రాని విద్యలు.

******

జోస్యుల సత్యనారయణ మూర్తిగారు, ఇద్దరున్నారు ఈ పేరుతో నాకు తెలిసినవాళ్ళు. ఒకరు స్వయాన మా పిన్నిగారి అల్లుడు, ప్రస్తుతం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. రెండోవారు మా పిన్నత్తగారి అల్లుడు, కువైట్ సంపాదించగలిగినంత సంపాదించేసి , ఇక పిల్లలు చేతికందొస్తే 'కృష్ణా ..రామా... ' అనుకొంటాను అంటూ ఈ మధ్యే ఇండియా వచ్చేసారు. 'కృష్ణా ...రామా ' అనుకోడానికి ఆయనేమన్నా చాలా పెద్దాయన అనుకొంటారేమో, పూర్తిగా 40 ఏళ్ళు ఉండవు. ఇద్దరు పిల్లలు.

కువైట్ వచ్చినప్పటినుండి దాదాపు ఒకటే ఆలోచన, ప్లాట్
కొనాలి, ఇల్లు కట్టుకోవాలి. ఏలా కుదిరిందో, లేక ఎవరన్నా కుదిర్చారో తెలీదు కాని, నాగారంలో ఇల్లు కట్టుకొంటున్నారు. ఇంకా పూర్తి అవలేదు వాళ్ళు ఉండడానికి కట్టుకొని దగ్గర ఉండి కట్టిద్దామనుకొన్నారేమొ మొన్న ఫిబ్రవరిలో గృహప్రవేశం చేశారు. ఎవరో, ఎప్పుడో , ఎక్కడో , ఏదో పెళ్ళిలో అన్నారనుకొంట, "జోస్యుల వారు వాళ్ళ బార్యని ప్రేమగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకొంటారు" అని ఆమధ్య "ఐ సి ఐ సి ఐ" ఎవరో తెలిసిన వాళ్ళుంటే మా ఆఫీసుకొచ్చి మరీ ఇన్స్యూరెన్స్ చేయించారు. "ఏంటన్నయ్యా ఎవరిపేరు? " అంటే "నాకెందుకమ్మా? కనీసం జలుబంటే ఏంటో తెలీదు, తనకోసమే గబుక్కున తనకేమన్నా అయితే ఉంటాయి కదా " అని.... ఇలా ఈ ఒక్కటే ఆధారంగా చేసుకోడంలేదు, చాలా , చాలా సంఘటనల ఆధారంగా చెప్తున్న విషయాలివి, బార్యంటే అమితమైన ఇష్టం, అత్యంత గారాబం వెరసి అనీర్వచనీయమైన ప్రేమ. ఇలా ప్రేమున్నవారినే ... కువైట్ అంటూ దూరంగా ఉంచేసి, ఆ దూరాన్ని అలా అలవాటు చేసి, ఆ ప్రేమని ఇనుమడింపజేస్తాడేమో!! ఆ భగవంతుడు అనిపిస్తోంది.

మరి ఇప్పుడు తను మీరు కువైట్లో ఉన్నారనుకొంటుందా? లేక ఇకా తిరిగిరాని చోటుకి వెళ్ళారనుకొంటుందా? ఆ ప్రేమకి ఫలితం ఇదేనా? ఆ పిల్లలు? డబ్బుకి ప్రేమ తెలుసా? ప్రేమించాలి , ఆప్రేమకి డబ్బు కావాలి అని అంత దూరం వెళ్ళి సంపాదించారు మరిప్పుడు?

మా అన్నగారు (పిన్నత్తగారి అల్లుడు) నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇలా....




అందుకే భోరున ఏడ్వాలనిపిస్తోంది. మూర్తి అన్నయ్యా.. మీకు నా అశ్రు నివాళి.

మరణం తధ్యమని....తెలిసినా...జనన మరణ చక్రమాగదూ ... అంటారిందుకేనేమో..

****

10.10.2009

వసుంధరలో మహిళా బ్లాగోత్సవం



సుజాత గారి బ్లాగులో వేణు గారి ద్వారా e-పేపర్ని ఎలా భధ్ర్ర పరుచుకోవాలో నేర్చేసుకొని , నేను కూడా ఈ మధుర స్మృతిని బ్లాగులో నిక్షిప్తం చేయాలన్న చిన్ని ప్రయత్నం....

సేవా కార్యక్రమాల్లో - నేను


నిజానికి మొదటిసారి, ఎప్పుడు అనుకోను కూడాలేదు. బ్లాగుల్లో మహిళల సమావేశాల్లో కూడా ఏదో ఇవ్వగలిగినంత ఇచ్చేసి, పరోక్షపాత్ర తప్పితే మొట్టమొదటిసారి ప్రత్యక్షపాత్ర సేవా కార్యక్రమాల్లో, రెండేళ్ళ కిందట అనుకొంట హైదరాబాదులో పెద్ద వర్షాల్లో ఇంటి
దగ్గర్లోనే చిక్కుకుపోయి మొకాలోతు నీళ్ళల్లో ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఏ తోడులేకుండా ఉన్నానని బెంబేలెత్తిపోయాను. ఆ తరువాత ఏదో అధారం దొరికి ఇంటికెళ్ళిపోయాను అది వేరె సంగతి. ఒక 10 నిముషాలు అంతలా అల్లాడిపోయాను మరి కర్నూల్ వరద బాధితులు 5 రోజులు అలా ఎవరు లేక ఆకలితో, అసహనంతో ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉంటారో అని ఆలోచించడానికే నాకు వణుకు పుట్టింది.

క్షమించండి! చెప్పాల్సినది చెప్పకుండా అనవసర ప్రసంగం అనుకొంటున్నారా? పైన నేను చెప్పిన ఆలోచనా ప్రేరణే మనం కూడా ఏంతో కొంత చేద్దామని మనసు ఉసిగొల్పింది. దానికితోడు మలక్పేట రౌడీ గారి బ్లాగులో సేవా కార్యక్రమాలు కాస్త ప్రోత్సాహాన్ని .... స్ఫూర్తిని ఇచ్చాయి. మొదలు పెట్టాను....మొదటి రెండు రోజులు డీలా పడ్డాను. ఎవరూ స్పందిచకపోయేసరికి ... నేనేమి చెయ్యలేనేమో అన్న ఒక ఆత్మన్యూనతా భావం కూడా వచ్చేసింది. ఇదే సమయంలో మార్తాండ గారి ఉత్తరం "నేను సహాయాం చేద్దామనుకొన్నాను కాని , అంతా అనుకొన్నవాళ్ళకి చేరదు సగం తినేస్తారు" అని. మనసులో మాట నన్ను కూడా అలా అపార్థం చేసుకొంటారేమో అని.. నిజంగానే భయపడ్డాను. ఇలా భయపడ్తున్న సమయంలొనే, శ్రీ వేణు శ్రీకాంత్ గారు పంపిన అమౌంట్ బ్యాంక్‌లో చేరింది చిన్నగా మొగ్గ తొడిగిందో ఆశ. పర్వాలేదు .. అని. సరే! అంతకు ముందే మా ఆఫీసులో విరాళాల గురించి వివరంగా చెప్పడంతో చిన్న చిన్న మొత్తాలు చేకూర్తున్నాయి. ఇలా పెద్ద స్పందన లేకపోయినప్పటికి నేను సేకరించినది మటుకు Rs. 25,000/-

ఇందులో ఐదుగురు (మా అక్కతో సహా) బ్లాగర్లు, మా ఆఫీసువాళ్ళు, కోచింగ్ తీసుకొంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. మొదటినుండి అనుకొన్నదే సేకరించిన సొమ్ముతో ఎవో వారి జీవనానికి కావల్సినవి కొందామని, హైదరాబాదులో పాయింటు కూడా సి
ద్ధంగా ఉందని .. జీవని గారు కూడా అన్నారని ఇక జంకు లేకుండా వీలయినన్ని బట్టలు కూడబెట్టడం, వస్తువులు కొనడం జరిగింది. అదీ కాకుండా విరాళాలు ఇచ్చేప్పుడు చాలమంది సలహా కూడా "నగదు వద్దు ఏవన్నా అవసరమైనవి కొని ఇవ్వండి" అని. విశ్వామిత్ర - మరోప్రపంచం బ్లాగరు శ్రీ పప్పు శ్రీనివాస్ గారు కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించి మరీ నొక్కి వక్కాణిస్తూ తన వైపు నుండి 1 రైస్ బ్యాగ్, బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు. వారికి బ్లాగుముఖంగా కృతజ్ఞతలు.

సరే! ఇక సేకరించిన విరాళాలతో నేను కొందామనుకొన్నవి జీవని గారు చెప్పినట్లు రైస్ బ్యాగ్స్ .. బ్లాంకెట్స్, టవల్స్ .. శనివారమన్నాను ... ఈలోపులోనే కొని ఉంచేస్తే సరిపోతుంది అని నిన్న మధ్యాహ్నమే మా ఆఫీసు వాళ్ళు వెళ్ళి ఒక 20 బస్తాల దాకా కొనేసి ఇంటి దగ్గిర వేయించేసారు, ఇక నేను బ్లాంకెట్స్, టవల్స్, కొన్ని నిత్యావసర సరుకులు, కొంత వంట సామాగ్రి కొని ఇంటికి చేరుకొనేసరికి నైట్ 8 దాటింది. ఇంటికి రాగానే మా పాప "అమ్మా మా స్కూల్ వాళ్ళందరూ రేపు కర్నూలు వెళ్తున్నారు నీ చీరలు అవి ఇవ్వు" అని... ఇటు చూస్తే జీవని గారు నాకు పాయింట్ చెప్పలేదు, సరే స్కూల్ యాజమాన్యాన్నే అడిగి నేరుగా చేరవేస్తే.... అని ఆలోచించి.. ముందు అక్కడికి స్కూల్ కెళ్ళి పాప ప్రిన్సిపల్ ని సంప్రదించి.. "బాధితులకి స్వయంగా అందాలని తాపత్రయం" అని చెప్పగా వారు అంగీకరించారు. నిజానికి వారికి ఒక వ్యాన్ కి సరిపడా సామాన్లు ఉన్నాయి... అంత రాత్రి స్వయంగా నేను వెళ్ళి మాట్లాడి రావడంతో అప్పటికప్పుడు ఇంకో వ్యాన్ అరేంజ్ చేశారు (రాజు తలుచుకొంటే..... ) అలా ఈరోజు తెల్లవాఝామున 5 గంటలకు బయలుదేరిన స్కూల్ వ్యాన్లో మా దగ్గిర ఉన్న సరుకులన్ని నేరుగా కర్నూల్ వారికి అందజేసే ప్రయత్నం జరిగింది. (అందజేశామని కబురు కూడా చేరింది ) .

ఇక కొంత అమౌంట్ మిగిలింది ఒక Rs 4000/- . అది జీవని గారి అకౌంట్ కి ఈరోజే చేరవేశాను.

ఈ విషయంలో నాకు తన సలహాల రూపేణా, స
హాయం రూపేణా సహకరించిన శ్రీ శ్రీనివాస్ పప్పుగారికి , తమ విరాళాలను అందించిన వెంకట్ గారికి, వేణు శ్రీకాంత్ గారికి, నల్లమోతు శ్రీధర్ గారికి కృతజ్ఞతాభివందనములు. రాములవారి వారధికి ఉడతా సహాయం చేసే అవకాశాన్ని కలగజేసినవారందరికీ (మా సహ ఉద్యోగులకి, మా పిల్లలికి, మా కుటుంబసభ్యులకి,[అక్క, తమ్ముడితో సహా] బ్లాగర్లకి, స్కూల్ వారికి,అందరికి ) కృతజ్ఞతలు .


*********

(అకౌంట్ నంబరు ఇక్కడ గోప్యం. స్లిప్ లో వేశాము. )



@ జీవని గారు మీ మెయిల్ కాస్త ఆలస్యంగా చూశాను (మీరు ఫోన్ చేయించెప్పటికే..కొనాల్సినవన్నీ కొనేయడం జరిగింది). అయినా మిమ్మల్ని కూడా నిరాశపరచలేదనే అనుకొంటున్నాను, మీరయినా బాధితులకే చేరవేస్తారు నేనైనా బాధితులకే కాబట్టి, మిగిలిన అమౌంట్ మీరు నా పేరుతో సూచించవద్దని మనవి.

బ్లాగర్ల (పైన ఉదహరించిన వారు) పేరుతో మిగిలిన మొత్తాన్ని స్వీకరించండి.
******

10.08.2009

సదవకాశం - post updated

DUBAI .. UAE OPPORTUNITY

8:07 PM (44 minutes ago)


Dear Ramani,


Preferably the Interviews can be done at Metro cities and the salary expectation details is enclosed herewith.

Salaries are nearly INR 50,000 /-
Regards
Chandra K

Dear Ms.Ramani,

Please find our manpower requirements, and the interviews will be held within one month time.


Thanks & Regards,
Chandra K.
Manager - HR
___________________________________________________________





_____________________________________________________________
For further details please contact my mail address ramanisreepada@gmail.com

జీవనితో పాటు.. నేను(మీరు, మనం) సైతం..... -update

జీవని గారు కలెక్ట్ అయిన డబ్బులతో.. రైస్ బ్యాగ్స్, బ్లాంకెట్స్, టవల్స్ కొందామని ఆలోచనలో ఉన్నాము. శనివారం పనిలో ఉంటాను. మనము ముందు అనుకొన్న ప్రకారం.... మీరు ఆదివారం కల్లా నాకు హైదరబాదులోని పాయింటు చెబితేఅక్కడికి చేరవేస్తాను ఇది నా ఆలోచన. నాకు ఆదివారమే కుదురుతుంది .
****

10.06.2009

జీవనితో పాటు.. నేను(మీరు, మనం) సైతం..... -updated

నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతికాలు బ్లాగర్ పేపాల్ ద్వారా 20$ పంపారు.

శ్రీ వెంకట్ గారు తపన బ్లాగర్ ఈరోజే అమౌంట్ బ్యాంక్ లో వేసారని మెయిల్ ద్వార తెలియజేశారు.వెంకట్ గారు మీరు పంపిన అమౌంట్ Rs.1000/- అందిందండి థాంక్స్. (08/10/2009)

శ్రీనివాస్ పప్పు గారు విశ్వామిత్ర మరో ప్రపంచం బ్లాగర్ పంపించిన విరాళం :
Rs 1116/-

శ్రీ వేణు శ్రీకాంత్ - "నాతో నేను నా గురించి" బ్లాగర్ ... బెంగుళూర్ వాస్తవ్యులు ఇప్పుడే (6/10/2009) కొంత విరాళం పంపినట్లుగా మెయిల్ చేశారు.

@
జీవని గారు: సేకరణలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి కొంత కొంత కాకుండా మొత్తం ఒకేసారి పంపే ఏర్పాట్లు చేస్తాను.



మావాళ్ళు ప్లీజ్ మాడం మా అమౌంట్స్ ఎవరకి చెప్పొద్దు మేము ఇస్తాము అని పేర్లు రాసారు. వారి మాట కాదనలేక వారు ఇచ్చిన అమౌంట్ గోప్యంగా ఉంచుతున్నాను. ఎందుకంటే సహృదయుల మంచితనానికి ఎంత ఏంటి అని విలువ కట్టడం ఇష్టం లేదు, ఇంకా సేకరణ జరుగుతోంది. మావాళ్ళల్లో కొద్దిమంది పేర్లు ఇవి.
___________________________________________________________________

క్లాక్ టవర్ వద్ద సహాయశిబిరం దృశ్యాలు.



దాతల నుంచి దుస్తులు స్వీకరిస్తున్న జీవని కార్యకర్తలు






పాపంపేట వద్ద కూడా సహాయ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రవాస భారతీయ బ్లాగర్లు (డాలర్లలో)

116 - భాస్కర రామరాజు

150 - ప్రవీణ్ ఖర్మ


050 - అశోక్ చౌదరి

100 - భావన

050 - ఏకలింగం

050 - శరత్

050 - భాస్కర రామిరెడ్డి

050 - పానీపూరీ( బ్లాగు పేరు)

116 - శశాంక్

100 - భరద్వాజ్

025 - బేబీ అనఘ
_________________________________________________________________________
post updated
Manchu Pallaki - $50
Swetha Gunna - $151
RK - $50
Padma (Mohanaraagaalu) - $100
Korivi Dayyam (Pramaadavanam) - $100
Sri - $116
Rajashekar Cheryala - $50
Ranjit Devadas - $50
Ravi Piriya - $100
____________________________________________________________________


(amount in rupees)


our staff 3 members = 1000.00
myself = 1116.00
from students (few) - 500 approx.
telugu bloggers - do not know
my brother : 500.00
my daughter = 100.00
my son = 100.౦౦
వేద - వనితావని వేదిక బ్లాగర్ - 500.00

ఎవరన్నా ఆసక్తి ఉండి విరాళాలు ఇవ్వదలుచుకొనేవారు సంప్రదించవలసిన చిరునామ:


jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001

_____________________________________________________________

వరదబాధితులకోసం జీవని తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చి అనంతపూర్లో భారిగా విరాళాలు, వంట సామాగ్రి, తదితర వస్తువుల సేకరణకు పూనుకొంది. మరి మనం కూడా మనవంతుగా చేద్దామని
...

హైదరాబాదులోని మరియూ కుదిరిన ఇతర ప్రాంత తెలుగుబ్లాగర్లందరికి/ (బ్లాగర్లు కాని వారు కూడా అర్హులే) మా విజ్ఞప్తి. హైదరబాదులోని మరియూ ఇతర ప్రాంతవాసులు సహాయం చేద్దామనుకొన్న తెలుగు బ్లాగర్లు వారికి తోచినంత సహాయం చేయగలమనుకొన్న పక్షంలో నన్ను మెయిల్ ద్వారా సంప్రదించగలరు. మీ మెయిల్ కి నా ఫోన్ నంబర్ పంపిస్తాను లేదా అక్కౌంట్ నంబర్ ఇస్తాను.

ముఖ్యంగా చిన్న విన్నపం. ఒక సదుద్దెశ్యంతో ఈ సహాయ కార్యక్రమం చేపడదాము అన్నది మా సంకల్పము. దయచేసి మీ అనామక(మిక) మెయిల్ ఐడిలు పంపకండి. మీరు ఫలాన బ్లాగరని ఉదహరించడం మరవకండి, బ్లాగర్లు కాని వారు సహాయం చేయదల్చుకొన్నవారు పూర్తి వివరములు పంపవలనెనని విజ్ఞప్తి.
my mail address: ramanisreepada@gmail.com
****

10.03.2009

జీవనితో పాటు.. నేను(మీరు, మనం) సైతం post updated

our staff 3 members = 1000.00
myself = 1116.00
from students (few) - 500 approx.
telugu bloggers - do not know
my brother : 500.00
my daughter = 100.00
my son = 100.౦౦

ఎవరన్నా ఆసక్తి ఉండి విరాళాలు ఇవ్వదలుచుకొనేవారు సంప్రదించవలసిన చిరునామ:


jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001

_____________________________________________________________

వరదబాధితులకోసం జీవని తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చి అనంతపూర్లో భారిగా విరాళాలు, వంట సామాగ్రి, తదితర వస్తువుల సేకరణకు పూనుకొంది. మరి మనం కూడా మనవంతుగా సహాయం చేద్దామని .......


హైదరాబాదులోని మరియూ కుదిరిన ఇతర ప్రాంత తెలుగుబ్లాగర్లందరికి/ (బ్లాగర్లు కాని వారు కూడా అర్హులే) మా విజ్ఞప్తి. హైదరబాదులోని మరియూ ఇతర ప్రాంతవాసులు సహాయం చేద్దామనుకొన్న తెలుగు బ్లాగర్లు వారికి తోచినంత సహాయం చేయగలమనుకొన్న పక్షంలో నన్ను మెయిల్ ద్వారా సంప్రదించగలరు. మీ మెయిల్ కి నా ఫోన్ నంబర్ పంపిస్తాను లేదా అక్కౌంట్ నంబర్ ఇస్తాను.

ముఖ్యంగా చిన్న విన్నపం. ఒక సదుద్దెశ్యంతో ఈ సహాయ కార్యక్రమం చేపడదాము అన్నది మా సంకల్పము. దయచేసి మీ అనామక(మిక) మెయిల్ ఐడిలు పంపకండి. మీరు ఫలాన బ్లాగరని ఉదహరించడం మరవకండి, బ్లాగర్లు కాని వారు సహాయం చేయదల్చుకొన్నవారు పూర్తి వివరములు పంపవలనెనని విజ్ఞప్తి. ఆయా పేర్లని తరువాతి పోస్ట్‌లో ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపే సదావకాశాన్ని మాకు కలగజేయండి.

ఇక జీవని గారు: ముఖ్యంగా ప్రస్తుతం బాధితులకి కావాల్సినవి వంట సామాగ్రి, బట్టలు, కొంత పైకం, వీలయినంతవరకు ఈ సామాగ్రి, బట్టలు, విరాళాలు అందజేసే కార్యక్రమంలో ఉందాము. ఇంకా ఏమేంటి అంటే మీరు కర్నూల్ వెళ్ళేది మంగళవారం అంటున్నారు కాబట్టి అప్పటి అక్కడి పరిస్థితులని బట్టి నిర్ణయించుకొంటే బాగుంటుందని నా అభిప్రాయం.

my mail address: ramanisreepada@gmail.com

జీవనితో - చేయూత


చేయూతకై బ్లాగు మిత్రులకిదే ఆహ్వానం. కనీ వినీ ఎరగని రీతిలో కర్నూలో వరద అక్కడి వారిని నిరాశ్రయులని చేస్తోంది. మావల్లే , మేము చెప్పడంవల్ల, మేమున్నాము కాబట్టి అని ఒకరి తరువాత ఒకరు పోటిగా చెప్తూ వరదని రాజకీయం చేస్తున్న మీడియాని పట్టించుకోక మనమేమి చేయగలం అని ఒక్కసారి ఆలోచించి ఆచరణయోగ్యమైనవేవొ చేద్దాము రండి. సేవాకార్యక్రమాలకు తదుపరి వివరాలకి రౌడిగారి బ్లాగుని చూడండి.
*****