అదన్నమాట సంగతి ! అలా మొదలయి .. ఇలా 20 లోకి అడుగుపెట్టి ... ఇంకో మైలు రాయి చేరుకున్నాము..
ఇరు మనసులని/తనువులని కలిపే పెళ్లి ఒక గొప్ప కళ
కాని ఆ పెళ్లితో
కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండడం 64 కళల్లో కల్లా గొప్పది." రమణి రాచపూడి.
కాని ఆ పెళ్లితో
కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండడం 64 కళల్లో కల్లా గొప్పది." రమణి రాచపూడి.
****
22 సంవత్సరాల క్రితం ఈరోజు పెళ్లి కూతురిని చేసారు.., కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ,అరుచుకుంటూ.. అన్యోన్యగా 22 సంవత్సారాలు పూర్తీ చేసాము. ఈరోజుకి . రేపు 23 ఏట అడుగుపెతున్నాము ఒక్కో మైలు రాయిని దాటుకుంటూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ...
16 ఏళ్ళ క్రితం ఆగస్ట్ 11 తెల్లవారుఝామున
"ఏంటే ఈ నిద్ర, లే అవతల పంతులుగారు హడావిడి పడ్తున్నారు, అమ్మాయిని తీసుకుని రమ్మనమని, ఇంత మొద్దు నిద్ర అయితే ఇహ మొగుడితో కాపురం ఎలా చేస్తావు, లెమ్మంటుంటే ముహూర్తం మించిపోతుంది.."
"అబ్బా.. ఈ అర్థరాత్రి పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారమ్మా బాబు!, నిద్ర లేపి మరీ .. తరువాత చేసుకుంటాలే పడుకోనీ"
"బాగుంది సంబరం.. వచ్చినవాళ్ళందరిని నీ నిద్రకోసమని వెను తిరగమంటావా? అతి వేషాలు మాని తొందరగా లే. ఆ మూడు ముళ్ళేవో పడిపోతే కాస్త నా ప్రాణం కుదుటపడుతుంది. "
*****
ఆరు నెలల తరువాత
"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"
"ఇదిగో ఇంకొంచం దూరమే అదిగో అక్కడ కనిపిస్తోందే హోటెల్, అక్కడికి వెళ్ళి కొంచం టిఫిన్, కాస్త కాఫీ తాగేసి బయల్దెరుదాము సరేనా.. నడవాలి నడవకపోతే తరువాత నువ్వే సమస్యలు ఎదుర్కుంటావు. నా బంగారం కదా కాస్త దూరమే.."
"కాస్త దూరమా .. మళ్ళి బయలుదేరడమా ఆటోలో వెళ్ళిపోదామండీ నాకే టిఫిన్లు అవి వద్దు, నడవడమే కష్టంగా ఉంది. (కళ్ళనీళ్ళ పర్యంతంతో) "
"తొలిచూలు కదా ఎంత నడిస్తే అంత మంచిదని మా బామ్మ చెప్పేది. వినకపోతే ఎలా? కాస్త ఓపిక పట్టు..."
"ప్చ్.. అబ్బా ... ఇదేమి నరకం భగవంతుడా!! ఇంత దూరం నడకా ఇలాగా??"
"తప్పదు"
****
మొదటి సంవత్సరం పెళ్ళిరోజు
" సంవత్సర కాల మన వైవాహిక జీవితంలో ఎప్పుడన్నా నన్నెందుకు చేసుకున్నానో అని బాధ పడ్డావా?"
"లేదే, అలా ఎందుకు అడుగుతున్నారు? "
"నాలో ఏమన్న నచ్చని అంశం ఉంటే చెప్పేయి, నేను మార్చుకుంటాను, అలాగే నీలో ఏమన్న నాకు నచ్చకపొతే కూడా నేను చెప్పేస్తాను. "
ఆ తరువాయి రెండేళ్ళ తరువాత
"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"
"మరీ కొత్తలా ఏంటది, తెలుసు కదా పాప పుట్టడం ఎంత సులువయిందో, అలా నడవబట్టే కదా మరి మళ్ళి ఎందుకు అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కష్టం గానే ఉంటుంది తరువాత నువ్వే ఇబ్బంది పడతావు నీ మంచికోసమే కదా నడవరా..."
"హు! తప్పదా.. పాప అప్పుడు ఏమి కాలేదు కదా .. ఇప్పుడు కూడా ఏమి కాదు లెండి వదిలేయండి బాబు నడక కాస్త కష్టంగానే ఉంది. "
"ఉహు! తప్పదు"
******
అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో మధురానుభూతులతో, మరెన్నో మలుపులతో ఇంకెన్నో మార్పులతో.. తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అని చెప్పుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మా పెళ్ళిని(ప్రేమ ) టీనేజ్లోకి తీసుకొచ్చాము. అంటే స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అన్నమాట.. ఇంకా ఎన్ని పండగలు చూస్తామో, ఎంతవరకో పయనం?
బోల్డు బాధ్యతలు బంధాల నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రతిసారి తను అడిగే మాట .. "నాతో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డావా?" ఎన్నో పొరబాట్లు చర్చించుకుంటూ ...సరిదిద్దుకుంటూ.. నడిపే ఈ భవసాగరానికి 16 ఏళ్ళు. (ఇప్పుడు 20 ఏళ్ళు) ఇంకో 3 ఏళ్ళు కలుపుకోవాలి 23 ఏళ్ళు ... మలుపులకోసమో మార్పులకోసమో ఎదురుచూపులు. ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు ఇదేనా జీవితం, జీవన పరమార్థం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.. :-)
*****
very sweet..! Wish you both million more memorable moments ahead in life!
ReplyDeleteపెళ్ళిరోజు శుభాకాంక్షలు రమణి గారు
ReplyDeleteమీ పెళ్ళి రోజు కూడా ఆగస్ట్ పదకొండేనా?పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteabba enta baaga adugutunnarandi, emanna ibbandi unda ani.. soo sweet.
ReplyDeleteWish you a very happy marriage anniversary!!
పెళ్ళిరోజు శుభాకాంక్షలు రమణి గారు
ReplyDeletehearty wishes on your marriage anniversary ramani gaaru. Wish your family many more memorable happy moments in the journey
ReplyDeleteWish you a very happy marriage anniversary!!
ReplyDeleteచాలా బాగా రాశారు, పెళ్ళి రోజు శుభాకాంక్షలు :-)
ReplyDeleteబాగుందండీ మీ జంట,ఆలాగే జీవితాంతం కలిసి నడవాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteనేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో మీ pdf వచ్చింది.అపుడు అన్నీ చదివాను. ఈ కొత్త బ్లాగింటి లోకి వచ్చాక నేను కామెంటటం లేదు కానీ ఆసక్తి కలిగితే చదువుతున్నాను.
Wish you a very happy wedding anniversary!!
శుభాకాంక్షలు తెలియజేసిన అందరకీ చాలా చాలా థాంక్స్..
ReplyDeleteపెళ్ళిరోజు శుభాకాంక్షలు రమణిగారు.
ReplyDeleteThanks mala garu
ReplyDeleteచాలా బాగా రాశారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు
ReplyDeletePelli roju shubhaakaamkshalu Ramani gaaru. God bless you.
ReplyDelete