2.13.2011

అవును అందరూ మనకి క్షమాపణ చెప్పాల్సిందే....కాని...


క్లాసులో ఒక పిల్లాడు తప్పు చేస్తే క్లాస్ మొత్తానికి శిక్ష వేస్తారు ఆ టీచర్లు. అలాగే జరుగుతోంది బ్లాగుల్లో, గత కొద్దిరోజులుగా బ్లాగులకి నేను దూరంగా  ఉండడంతో (అదే బాగుంది హాయిగా :) ) ఏమి జరిగింది అని నాకు పూర్తిగా  తెలీదు,  ఎప్పుడో పర్ణశాల బ్లాగులో "అమ్మ " పోస్ట్ విషయమై నా బ్లాగులో  ఒక పోస్ట్ రాసాను దానికి కమెంట్ వచ్చింది నాకు,  మన అభినవ పతివ్రతా శిరోమణి గారినుండి.  ఇదిగో ఇప్పుడు ఆవిడ పోస్ట్లు  చదువుతుంటే అనిపించింది మీరంతా అంటే మగజెంట్‌స్ (బ్లాగర్లంతా ) మా ఆడలేడీస్‌కి క్షమాపణ చెప్పాల్సిందే అని. రామయణంలో సీతమ్మవారిని ఎదో అనేస్తున్నారని అంటున్నారే కాని, అలాంటి సీత మీ బార్య, మీ చెల్లెలు, మీ అక్క, మీ అమ్మాగారిలా  కనపడడంలేదా మీకు,  సో, ఆవిడ అంటున్నది చెల్లెలినో, తల్లినో, అక్కనో , బార్యనో వెరసి తనని తానే అనుకుంటున్నారు కదా! మరి అలాంటప్పుడు అందరూ సీతమ్మవారికి ఎదో అనేస్తున్నారని క్షమాపణ స్తొత్రాలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేసేసుకుంటే పాప పరిష్కారం అయిపోతుందా?

మరేమి చెయాలి అని అలా ఎక్కువగా ఆలోచించకుండా .. ఆవిడ సీతమ్మవారిని తన అస్త్రంగా ఎందుకు ఉపయోగించారో చెప్పారు కాబట్టి,  మనం కూడా సీతమ్మ అడుగుజాడలలో ఆవిడని నడిపిద్దాము. రండి మనందరం ఆమెకి తోడుగా ఉందాము.  ఆవిడ మహిళాలోకానికి క్షమాపణ చెప్పేస్తే చాలు అంటున్నారు మా పాతివ్రత్యాలని, మా వ్యక్తిత్వాలని కాపాడేవారు మీరే(మగజెంట్‌స్) . కాబట్టి, మాకందరికి ఒక లీడర్గా ఆవిడనే ఎంచుకున్నాము. ఆవిడకి మద్దతుగా మా మహిళాలోకం ఉంది. కాని... ఆమె చెయాల్సినది చేస్తే....  మేమంతా ఆమె వెనకె మీరంతా మరి క్షమాపణతో రేడీ గా ఉండండి. లేకపోతే "ఆమె బ్లాగులు మూసేసుకుని వెళ్ళిపోవాలి."   ఇదీ షరతు.

 రామాయణంలో సీతమ్మవారిని చాకలివాడేదో అన్నాడని రాములవారు శీలపరీక్ష అని, అగ్నిపరీక్ష పెట్టారు. మరిక్కడ తన ప్రశ్నలతో మనముందు వచ్చిన సాధ్వీమణి నేను పతివ్రతను కాదా  అని అడుగుతున్నారు.. ఎవరికి తెలుసు ఆవిడ పాతివ్రత్యం గురించి? నాకయితే తెలీదు. నేను (మేము)  ఆమె వెనక ఉండాలి అంటే,  ఆవిడ ప్రశ్నకి ఆవిడే సమాధానం చెప్పగలగాలి. రామాయణంలో  సీత అగ్నిపునీత అయి లోకులందరికి తానెంతటి పతివ్రతో  చెప్పారు. అలాగే ఈమె  ఆమెతో పోలుచుకున్నారు  కాబట్టి,  ఈమెను  కూడా అగ్ని పునీతని అవమనండి. అదికూడా సోనియమ్మ సమక్షంలో, ఎందుకంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకోగలరు.

ఇక ముహూర్తం, ప్రదేశం ఆవిడ ఇష్టం.  సీతమ్మవారికి ఏమి వంకర అని వక్రంగా రాసినా , ప్రతీ మహిళని (ఇందాకే నాన్న బ్లాగులో చదివాను) ఎదో ఒక నెపంతో బయటకి లాగి దురుసు స్వభావం చూపించినా మేమంతా మీతోనే ఉన్నామని మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాము. మీరెంత పతివ్రతలో తెలియజేసి కలియుగ రామాయణాన్ని తిరగరాయండి. అగ్నిపునీత అయి వీళ్ళందరిచేత మనందరికి క్షమాపణ చెప్పించి అభినవ సీతగా పేరు పొందాలని మా ఆకాంక్ష.

చదివినవారు ఈ బ్లాగు URL  ని సోనియాగారికి పంపండి. సోనియాగారితో పాటు ఆవిడ కోరుకున్న అద్వాని గారు కూడా  వస్తారు , అభినవ సీతగారు అగ్నిపునీత అయిన మరుక్షణం మగజెంట్స్తో పాటు  ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి. :-)

మే"ఢం" గారు   మీరు ఢమ ఢమ లాడిస్తూ రాస్తున్న పోస్ట్లు  మగవారినో  ఇంకెవరినో బయటపెడదామనో కాదు ఒక్కసారి ఆలోచించండి. "సీత"  పేరు చెప్తూ మొత్తం మహిళాజాతిని అవమానిస్తున్నారు. ప్రస్థుతం మనమధ్య లేని సీత గురించి ఎందుకు?  ఉన్న మీ గురించి చెప్పుకొండి . పెట్టుకొండి శీర్షికలు, _______చెవుడా.. __________ఎన్నిసార్లు.........(రాయడానికి నాకే మనసొప్పడంలేదు)  -----------నవ్వింది???

 ఇంకా ముమైత్ఖాన్ నయం కదా !   ఆవిడ వృత్తి ధర్మం ఆవిడ నెరవేరుస్తున్నారు ఇంకొకరి జోలికి వెళ్ళకుండా.. మరి మీరు?

*******


"ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి హౌ ఎక్జంప్లరీ ఆర్ యూ ఫర్ యువర్ కిడ్స్/ఫామిలి/సొసైటి. నీ పిల్లలకు/కుటుంబానికీ/సమాజానికీ నువ్వు ఎంతవరకూ ఉదాహరణగా నిలుస్తున్నావూ అని"  
 kudos Bhaskar Ramaraju గారు.



8 comments:

  1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    ReplyDelete
  2. రామాయణంలో సీత అగ్నిపునీత అయి లోకులందరికి తానెంతటి పతివ్రతో చెప్పారు. అలాగే ఈమె ఆమెతో పోలుచుకున్నారు కాబట్టి, ఈమెను కూడా అగ్ని పునీతని అవమనండి. అదికూడా సోనియమ్మ సమక్షంలో, ఎందుకంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకోగలరు.
    _________________________________________________________________________

    :)))))))))))))))))))))))) LOOOOOOOOOOOOOOOL :))))))))))))))))))))))))))))))

    ReplyDelete
  3. Just posting my comment here also..

    నీహారిక గారూ, ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని ఇలాంటి రాతలు వ్రాయడం సమంజసం కాదేమో. మీరు మామూలుగా "నన్ను ఫలానా వ్యక్తి ఇలా అన్నారు" అంటే చాలామంది మిమ్మల్ని సమర్థించేవారేమో కానీ మీ రాతలవల్ల మీ పైన వ్యతిరేకత ఎక్కువవుతుంది. ఈ తరహా (తన గజ్జిని, మానసిక దౌర్భల్యాన్ని, పైశాచిక నైజాన్ని ప్రతిబింబించే) రాతలు రాసే "బ్లాగు టెర్రరిస్ట్" గాడి జతనే మిమ్మల్నీ కట్టేయగలరు జాగ్రత్త!!

    ReplyDelete
  4. సోనియాని ఈవిడ ఒప్పించి అగ్నిపునీత అయి నిరూపించుకోమన్నా రాష్ట్ర ప్రజలు ఈవిడకు టాంక్బండ్ మురికిగుంట మీద ఈవిడ విగ్రహం ప్రతిష్టించుకుంటారు.

    ReplyDelete
  5. Be the change, you wish to see in the world.... -M.K. Gandhi

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.