4.01.2011

బొమ్మను చేసి ప్రాణము పోసి...

బ్రతుకంత భాదగా
కలలోని గాధగా
కన్నీటి ధారగా
కరగిపోయే…
తలచేది జరుగదు
జరిగేది తెలియదు..
*****

ఎందుకో ఈరోజు అన్నీ ఈ పాటలే గుర్తొస్తున్నాయి. 
తలచినదే జరిగినచో దైవం ఎందులకు.. 
జరిగినదే తలచినచో శాంతి లేదు నీకూ.. అంటూ..

ఎలా చెప్పను నా బాధని.. చెప్తే మీరు మటుకు తీర్చగలరా? ఏమి చేయగలరు.. మహా అయితే ఒకసారి చదివేసి అయ్యో రమణి.. మీకింత కష్టమా.. కల్లో కూడా అనుకోలేదే అని కాసేపు నాతో పాటు బాధ పడతారు అంతే కదా.. వారం నుండి జరుగుతోంది ఇలా.. విసిగి వేసారి పోతున్నాను. ఒక్కళ్ళు ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకోరు..  

మొన్న బయటకి వెళ్తుంటే..ఒకావిడ.. " అయ్యో రమణిగారు ఏంటి అలా అయిపోయారు.. అంతెత్తున నిటారుగా ఠీవిగా కనపడేవారు, ఇప్పుడేంటి అలా అయిపోయారు? కుటుంబ సమస్యలా? "అంటూ .. పరామర్శించింది.  నన్ను చూడగానే తెలిసిపోతోంది కాబోసు నేను పడ్తున్న కష్టాలు.. నిన్నటికి నిన్న నా స్నేహితురాలు కూడా "ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అంటోంది.. " ప్చ్! 

అసలు దీనికంతటికి కారణం ఎవరు అంటే ఏమి చెప్పను? ఎందుకంత దిగులు అంటే ఎలా చెప్పను? కాని తెలియని మనోవేదన.. మరణయాతన.. ఆకాశ దేశానా.. ఆషాడ మాసానా మెరిసేటి ఓ మెఘమా అని నా గోడు విన్నవించుకుందామంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఒకే ఒక్కరు గడ్డం కింద చెయ్యేసుకుని వినడానికి ఉద్యుక్తులవుతారేమో అని ఎదురుచూస్తున్నా.. ఎవరు లేరు.. ఎవరు రారు.. అయినా నా పిచ్చి కాని ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోవడమేగా నాకు అలవాటయ్యింది.. ప్చ్.. ఎదురుచూసి.. ఎదురుచూసి .. 

"ఎహే గోలాపి బాధెంటో చెప్పండి!" అని విసుక్కుంటారని తెలుసు.. అందుకే  ఇంక పొడిగించకుండా  చెప్పేస్తున్నా.. విన్న తరువాత మీరు "అయ్యో రమణి" అని కుమిలిపోకండి.. కష్టాలు రమణికి కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పండి.. అలా అనేసుకుని సర్దుకుపొండి.. నా ఆలోచనంతా...నా బాధంతా.. 
********
*********
********
********
********
********
********
********
********
********
********
********
********
********





ఇలా మీరు నా చేతిలో ............ అయిపోతున్నారనే.. హహ్హ్హహ

2 comments:

  1. జనాలచెవిలో ఇలా ఏప్రియల్ పూలు పెట్టడంలో కలిగే ఆనందమేమిటో నాకు హెప్పటికి అర్థమవుతుందో?

    ReplyDelete
  2. అయ్యో విజయమోహన్ గారు: సారీ అండీ సరదాగా రాసాను ఏడాదికి ఒకసారే కదా అన్నట్లు.. నేను రాసేవిధానాన్నే పసిగట్టేస్తారనుకున్నాను.. ఇది మటుకు నలుగురితో నారాయణ గుంపులో గోవిందా టైపండి.. మీలాంటి పెద్దవారిని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం నాకెంతమాత్రం లేదు. నిజంగా నేను బాధ పడితే ఇలా నలుగురిలో పెడతానా చెప్పండి.. సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు పెద్దలు.. అలాంటివి పాటిస్తాను మీరు నొచ్చుకుంటే క్షమించండి.. సరదాగా తీసుకొండి.. నమస్కారములతో

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.