ఇదో చిన్న విశ్లేషణ.. అవకాశమిచ్చిన బ్లాగర్‌కి అభినందనలు. కాకపోతే ఎవరినీ నొప్పించాలని కాదు అలాగే ఒప్పించాలని కూడా కాదు...ఒకమనిషి మీద వారికి ఉన్న అభిమానం అభినందనీయమే ..... కాని మిగతావాళ్ళెవరూ గడ్డిపరకలు కాదు, అజ్ఞానులు అంతకన్నా కాదు అని చెప్దామని చిన్ని ప్రయత్నం... ఎక్కడ చదివానో గుర్తులేదు కాని బ్లాగులో ఒక వాక్యం చదివాను.. ఆ వాక్యాన్నే విశ్లేషిస్తున్నా.. వాక్యం చివర్లో ఇస్తాను.
*****
ఎదుటి మనిషిలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకతని బేస్ చేసుకుని వారిని గౌరవించడం తప్పు కాదు కాని..... అదే ప్రత్యేకత అతిగా ఆదరించేసి, ఆ ప్రత్యేకతలు లేని వాళ్ళని చులకన చేయకూడదని నా అభిప్రాయం..
ఇప్పుడు మన బ్లాగుల్లోనే తీసుకొండి... సాధారణంగా ఛలోక్తులు విసురుతూ సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ .... ఎంతటి అద్భుతమైన భావాన్ని ప్రకటిస్తున్నారు.... దాగి ఉన్న నైపుణ్యాన్ని అప్పుడప్పుడు అలా మనకి చూపిస్తున్నారు.. అలాగే పెయింటిగ్స్... ఫొటోస్ ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. కొత్తగా వచ్చారా, పాతవాళ్ళా అన్నది తరువాత విషయం కాని ఎవరి ప్రత్యేకతని వాళ్ళు చాటుకుంటున్నప్పుడు, ఆ ప్రత్యేకతని గుర్తించి గౌరవించాలి ... అంతేకాని అవతలివారిని అజ్ఞానులనుకోవడం ఎంతవరకూ సబబు?
ఎవరూ ఎవరికీ తక్కువ కాదు... ఒకళ్ళు రాయడంలో ఘనాపాటి అయితే ఇంకొకరు వంటల్లో, ఇంకొకరు పాటల్లో.. ఇంకొకరు... ఇంకో విషయంలో ఇలా ఇంతమంది ప్రత్యేక మనుషులు ఉన్న్నప్పుడు ఒకరిపైనే దృష్టి నిలిపి వారి అభిమానాన్ని చూరగొనాలన్న ఆలోచనో ఎమో కాని... మిగతావారిని అజ్ఞానులని చేయడం అభినందనీయం కాదేమో ఒకసారి ఆలోచించండి... ఆ వాక్యంలో చిన్న శ్లేష కూడా లేకపోలేదు ... సదరు బ్లాగరు నిర్వికారంగా అజ్ఞానులవైపు చూస్తున్నరా ?? (అది నిర్వికారంగా చూస్తున్న వారి మనోగతమా) లేక రాసిన వారి మనోగతమా? ఎవరికి ఎవరు అజ్ఞానులు?
నడత నేర్పిన మనిషిని, నడకనేర్పిన మనిషిని అమ్మగా, నాన్నగా, గురువుగా పోల్చుకుని అబినందించండి, గౌరవించండి.. ఇంకా చెప్పాలంటే ఆ భక్తి తీరలేదు అనుకుంటే కాళ్ళకి దండం పెట్టుకుని ఆ పాదధూళి శిరస్సున ధరించండి కాని వీళ్ళని పొగడడం కోసం ఎదుట ఉన్నవారందరినీ అజ్ఞానులని మటుకు చేయకండి ... తప్పనిపిస్తే మన్నించండి..
వాక్యం:
"అఙ్ఞానులని
చూస్తున్నట్టు నిర్వికల్పంగా _______________ నవ్వుతూ చూస్తుంటే, మిగిలినవాళ్లందరూ ఆవేశంగా అంత్యాక్షరి
ఆడేసేరు. "
థాంక్స్ మేడం మీ కామెంట్స్ కి.. మిమ్మల్ని బయల్పరచడం నాకిష్టం లేదు.. మీకు చెప్పేంతటి పెద్దదాన్ని కాదు కాని ఎందుకో చదవగానే బాధ అనిపించి రాశాను తప్పితే... పెద్దవారు మీరు మన్నించమనడం మాకూ మంచిది కాదు.. ఏంటంటే ఇలాంటివి మాములుగా అనుకున్నంతసేపు బాగుంటాయి కాని చిన్నవిషయాలయినా అవతలి వారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాయి .. మరోసారి కృతజ్ఞతలు.. మీ కమెంట్స్ ప్రచురించడంలేదు... విషయాన్ని సాగదీయడం ఇష్టం లేక.. అభిప్రాయం చెప్పేంతవరకే ఈ పోస్ట్
ReplyDeleteఅవును నిజం చెప్పారు...పాత వాళ్ళు కొత్త వాళ్ళను ప్రోత్సహించాలి
ReplyDeleteచక్కగా చెప్పారు.
ReplyDeleteఎవ్వరూ ఎక్కువ కాదు ఎవ్వరూ తక్కువ కాదు ఎవరి టాలెంట్ వారిది. ఎక్కువ, తక్కువలు పక్కవారితో పోల్చుకున్నప్పుడు మాత్రమే వస్తాయి కనుక ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండటమే మంచిది.ఇహ పాత, కొత్త ఏముందండీ ఎంత కొత్తయినా పాత పడక మానదు కదా!ప్రోత్సాహం ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహాన్నిస్తుంది!
ReplyDeleteకల్లా కపటం కానని వాడా లోకంపోకడ తెలియని వాడా ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా! ఇది నాది కాదందోయ్. పాత సినిమా పాట. ఏంచేస్తాం చెప్పండి, జూనియలని, సీనియర్లు రేగింగ్ చేస్తారుకదా........తప్పదులెండిది.మనసుగతి ఇంతే....
ReplyDeleteచూస్తే మీరు సీనియర్లా ఉన్నారు....:)
ReplyDeleteశశికళ గారు, అనికేత్ గారు : థాంక్స్ అండీ
ReplyDeleteరసజ్ఞ గారు: కరెక్ట్‌గా చెప్పారు.. మీతో ఏకీభవిస్తున్నాను
@kastephalegaru: ఎవరండీ సీనియర్లు... ఎవరు జూనియర్లు..అసలేది బేస్ చేసుకుని సీనియర్ అని, జూనియర్ అని అంటారు.. స్కుళ్ళల్లో, కాలేజిల్లో అయితే ఒక సంవత్సరం ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి ఆ తేడాలు.. ఇక్కడ మన బ్లాగు, మన రాతలు, మన అనుభూతులు, మన అనుభవాలు మనకు నచ్చినట్లు రాసుకుంటున్నప్పుడు రాజకీయ నాయకుల్లా అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తామన్నట్లు..అందంగా తుమ్ముతున్నారు, మరింత అందంగా ఆవలిస్తున్నారు... అంటూ వందిమాగధులు, భట్రాజులు అయిపోవాలా? అయ్యారుపో.. మిగతావాళ్ళు అజ్ఞానుల అవ్వాలా.. ఏంటో ఈ రాజకీయాలు.. నేను 2008 లో వచ్చాను.. అలాగే ఉన్నా నో చేంజ్ అప్పుడెలా రాస్తున్నానో ఇప్పుడు అలాగే రాస్తున్నా.. నేను సీనియర్ని కాదు, జూనియర్ని అంతకన్నా కాదు. నేను రమణిని.
నేను 2011 సెప్టెంబర్ లో బ్లాగులోకం లోకి కళ్ళు మూసుకుని దూకేశానండీ. అయ్యో! "మీరెంత గొప్పగా చెప్పేరు, మీరెంత అందంగా అవులించారు, అబ్బ మీదగ్గరే నేర్చుకోవాలండి అన్నీ, మీరు విజ్ఞాన సర్వస్వం మింగారండీ" ఇదండి వరస. అదీ ఇప్పుడు జరుగుతున్నదండి. నేను జూనియర్నండి.ఎక్కువ వాగినట్లున్నా! మన్నించండీ!!
ReplyDeleteశర్మగారు.. ;)) మీ బ్లాగు చదివాను.... శ్రీపాద సుబ్రహ్మణ్యంగారి అభిమానులన్నమాట.. బాగుంది.. వారి అభిమానులు కాబట్టి బాగుంది అని అనలేదు.. శైలి బాగుంది అని అంటున్నాను.
ReplyDelete2011 లో వచ్చినా.. చాలా తొందరగా సూక్ష్మం గ్రహించారు.. అభినందనలు.. మీలాంటి ఏకసంధాగ్రాహులు, సూక్ష్మగ్రాహులు ఉన్నచోట.. మాలాంటి శ్రీపాదవారింటి ఆడపడుచులకి లోటేముందండి.. చక్కటి భావ చాతుర్యంతో పాటు, ఛలోక్తులు కూడా మీ సొంతం చేసుకున్నారన్నమాట.. .. మీలాంటి పెద్దవారు మాలాంటి వారిని మన్నించమని అడగకూడదు మాకు ఆయుక్షీణం.. మరొక్కసారి కృతజ్ఞతాభినందనలు. సూక్ష్మం గ్రహించినందుకు..
నేను శ్రీ పాదవారి అభిమానిని. మరొకరు రావి శాస్త్రి గారు. మీరు శ్రీపాదవారి ఆడపడుచులా, ధన్యోస్మి. ఇప్పుడు మీరు చెప్పిన/ నేనన్నది బాగా నడుస్తోందండి.జూనియర్ ని కదండి అందుకు కొద్దిగా ఎక్కువగానే బాధపడ్డానండి. మీరు ఏదో అన్నారు, ఎక సంధా........బాబోయ్ పారిపోతున్నా. మీరు నా బ్లాగుకు వచ్చి చూసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమధుర భావాల సుమమాల -- ఎంత అందమైన పేరు -- మరి ఏమిటి రమణీ ఈ పోస్టు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, ఎంతో అందంగా రాసే రమణి ఇలాంటి పోస్టు రాసిందేమిటని. మీరు ఇంతకుముందు రాసిన బ్లాగు క్రీడల రమణులగాంచిరి కూడా ఇప్పుడే చూశాను. ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించండి..ఇలా ఎందుకు రాశానా అని మీకే అనిపిస్తుందనుకుంటాను. అందరం కలిసి ఎంత సరదాగా గడిపాము. మరీ అందర్నీ నేనెంత ఆటపట్టించాను. ఒక సీనియర్ కి బ్లాగు ఎలా ఓపెన్ చెయ్యలో నేర్పుతానన్నాను ..మా అమ్మాయిల వయసున్నవారిని మామ్మగారూ అని పిలిచాను..వాళ్ళేమనుకోవాలి.
ReplyDeleteమీరూ మంచి రైటర్. మీ భావాలను మీకు నచ్చిన విధంగా రాస్తారు. అఫ్కోర్స్ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని కూడా అనుకుంటారు. రచన అందంగా రావాలని మంచి మాటలు వాడదామనుకుంటారు. కానీ మనకి తెలియకుండా, మనం వూహించకుండా, మనకా వుద్దేశ్యం లేకపోయినా ఎప్పుడన్నా ఎవరన్నా వాళ్ళనే వూహించుకుని బాధ పడవచ్చు.
సమావేశం మొదటినుంచి చివరిదాకా నేను అక్కడే వున్నాను కదా. ఎవరూ ఎవరినీ ఎత్తేసినట్లుగానీ, దించేసినట్లుగానీ నాకు అనిపించలేదు. ఎందుకంటే అక్కడున్నవారంతా వ్యక్తిత్వం కలవారే.
బహుశా రాసినవారు కూడా ఆ వాక్యం ఇంత దుమారం సృష్టిస్తుందని వూహించి వుండరు. కదా.
psmlakshmi
రమణిగారూ,
ReplyDeleteఎక్కువకాలంగా రాస్తూ ఉన్నవారు సీనియర్లూ కారు, కొత్తగా వచ్చినవారు జూనియర్లూ కారు నా ఉద్దేశ్యంలో.మనం రాసేవాటిలో నాణ్యతా, quality, sense of humour, awareness ఉండి మనకి ఎంత ఎక్స్పోసర్ ఉంది అన్నవాటిమీదే బ్లోగుల సక్సెస్ ఉంటుందనుకుంటాను. కొత్తగా వచ్చినవాళ్ళైనా- వాళ్ళకి లోకం కనుక ఎక్కువ తెలిసి, తమ అనుభవాలని చక్కగా వ్యక్తపరచగలిగితే ఆ బ్లోగులనే బహుసా ఎక్కువమంది చదువుతారేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏళ్ళగా రాస్తూ కూడా చదివేవాళ్ళు ఉండకపోయిన తరువాత లాభం ఏమిటి ?అలాంటి సీనియారిటీకి ఏ ప్రయోజనం ఉండదేమో మరి..
నాకు మీ ఈ పోస్ట్ దేని గురించో తెలియదు కానీ నేను ఇక్కడ ఉన్న కొద్దికాలంగా గమనించినది రాజకీయాలు లేని చోటన్నది లేదేమో అన్నదే. ఇది ప్రతి చోటా నిజమే అనుకుంటాను. బ్లోగులే అవనక్కరలేదు.
లక్ష్మిగారు: చాలా థాంక్స్ అండి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు... మనం కలిసిన చోటే ఇలాంటివి జరిగిఉంటే నేనసలు ముందు పోస్ట్(బ్లాగు క్రీడల...) రాసి ఉండేదాన్ని కాదు.. అసలు రాయలేను.. ఆట పట్టించడం అనేది నాకు సరదానే నేను మీ అందరితో సమంగానే ఆడాను , పాడాను అక్కడ మనకెలాంటి బేషజాలు లేవు.. మీరన్న చివరి వాక్యం కూడా 100% నేను ఒప్పుకుంటాను అక్కడ ఎవర్నీ ఎత్తెయలేదు, ఎవర్నీ దింపనూ లేదు.. ఇందులో ఏ ఒక్కటి అక్కడ జరిగినా నా ముందు పోస్ట్ (బ్లాగు క్రీడల...) పోస్ట్ ఉండేది కాదు.. ఆ పోస్ట్ ఎవరి మెప్పు కోసమో లేదా నా శైలి ప్రావీణ్యత చూపిద్దామనో రాసింది కాదు.. మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా రాసిందే..
ReplyDeleteఅక్కడున్న అందరికీ వ్యక్తిత్వం ఉంది: యెస్.. ఇదే నేను చెప్పేది.. మీరూ ఒకసారి నిలకడగా నేను చెప్పేది ఆలొచించండి.. అక్కడ మనందరికీ ఉన్న ఆ వ్యక్తిత్వం ఈ ఒక్క వాక్యంతో మరుగున పడలేదంటారా? సరే మీరన్నట్లు నేనీ విషయం ప్రస్తావించలేదు.. పోని రాయలేదు.. ఆ వాక్యం అలాగే ఉంటుంది.. అంటే అక్కడికి వచ్చినవాళ్ళనదరూ అజ్ఞానులని ఒప్పుకున్నట్లా? ఎవరి స్వతంత్ర్య వ్యక్తిత్వం వాళ్ళకున్నప్పుడు.. ఇంకొకరి ప్రతిభావాపాఠవాలని ఆసరా చేసుకుని అందరూ అజ్ఞానులనో.. లేదా ఆ పర్టికులర్ వ్యక్తి తను అజ్ఞానిననో చులకనచేసుకోడం ఎందుకు? ఇప్పుడు నేను మాట్లాడకుండా ఊరుకుంటే రెపోద్దున్న ఇంకో బ్లాగులో ఇంకో మాట రాదా.. ఇదేనా మన వ్యక్తిత్వం?
రాసినవాళ్ళకే తెలీదు ఇంత దుమారం: నేను అంటున్నది కూడా అదే లక్ష్మిగారు.. ఒకళ్ళని కించపరచాలనో, ఒప్పించాలనో నేను రాయలేదు నా (మా) అందరం కలిస్తే మన వ్యక్తిత్వాలు చులకన కాకుడదు అనుకుని నా అభిప్రాయం చెప్పాను తప్పితే.. రాసినావిడ కావాలని రాసారు అని ఎక్కడన్నా అన్నానా? నా అభిప్రాయాన్ని చెప్పడానికే ప్రయత్నించాను అంతే.. రాసినవాళ్ళని బయట పెట్టే ఉద్దేశ్యమే నాకుంటే పేర్లే చెప్పేదాన్ని కదండీ.. నాకు చెప్పాలనిపించిన విషయం చెప్పడం అనేది ముఖ్యం.. అందుకే మళ్ళి మనమధ్య ఇలాంటివి రాకూడదని చెప్పాను అంతే... మధుర భావాల సుమ మాల మంచినే కోరుకుంటుందండి.. అందుకే మధుర భావాలయ్యాయి.. ఇప్పటికి ఎప్పటికి మనమందరం మంచి స్నేహితులమే......ఎవర్నీ తక్కువ ఎక్కువ చేసే ఉద్దేశ్యాలు నాకు లేవు.
వేణిగారు.. :)) థాంక్ యు.. రాజకీయాలేమి కాదండి జస్ట్ చిన్న క్లారిఫికేషన్ అంతే..
ReplyDeleteనా మాటలన్నీ నిజమేనన్నందుకు చాలా సంతోషం రమణిగారూ. ఎప్పటికీ మనమంతా ఒక్కటే. ఇవ్వన్నీ ఒడ్లగింజలో బియ్యపు గింజలు. ఇంక ఆ వాక్యం సంగతంటారా..వ్యక్తులగురించి తెలిసినవారం కనుక నేను దాన్నసలు పట్టించుకోలేదు. మనమధ్య చిన్న అపార్ధాలు కూడా వుండకూడదనే ఉద్దేశ్యంతో పై కామెంటు రాశాను. ఈ విషయం ఇంతటితో వదిలేద్దాము.
ReplyDeleteఅన్నట్లు మీ పాపకి నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే తను తీసిన ఫోటోలో నేను సన్నగా వున్నానోచ్.
psmlakshmi
లక్ష్మి గారు : తప్పకుండా.. పాపకి మీ విషెస్ తెలియజేస్తాను.. మీరు మాములుగా కూడా స్లిం & ట్రిం అండీ... ఫొటోస్‌లోనే కాదు.. ;) ఒ.కే మీ మాటతో ఇక ఈ చర్చ ఇక్కడితో వదిలేస్తున్నాను.
ReplyDeletemadam:నా కూతురనుకుని చెప్తున్నాను" చాలా చాలా థాంక్స్.. ఇలాంటి చర్చలు తల్లి కూతుళ్ళ మధ్య వస్తే స్నేహ వాతావరణంలో పరిష్కరించుకోగలం.. ఇకపోతే అభిప్రాయాలు వెలువరించేంతవరకే ఈ పోస్ట్ అని అన్నాను కదా.. ఆ అభిప్రాయాలకి ప్రశ్నలు సందేహాలు వచ్చినప్పుడు నేను మౌనం వహిస్తే నేను రాసిన పోస్ట్‌కి అయితే ఏంటి ఆ కామెంట్‌కి అయితే ఏంటి విలువ ఉంటుందా? ప్రశ్నలకి .. సందేహాలకి సమాధానం ఉండాలి కదా.. క్షమార్పణలు, మన్నించడాలు, మాట విరోధాల లాంటి కామెంట్స్ ఏవి నేను స్వీకరించలేదు కదా.. నా అభిప్రాయం తో పాటు మిగతావారు కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు వాటిని స్వీకరిస్తున్నాను.. పొడిగించడం కాదు అమ్మా! చర్చించడం.. అంతే....మీరు పొందిన అవార్డులకి నా శుభాకాంక్షలు.. మీ బ్లాగు మొత్తం చదివాను.. నిజంగానే చాలా బాగా నచ్చింది.. మంచి అనుభూతిని ఇచ్చింది. మిరిలా చక్కటి నైపుణ్యంతో రాస్తూ రచయిత్రిగా మంచి పేరు సాధించాలని ఆకాంక్షిస్తూ..... నన్ను కూతురి సమంగా ఆదరించినందుకు ప్రత్యేక అభినందనలతో.. రమణి
ఈ పోస్ట్ కి ఇక కామెంట్‌లు స్వీకరించబడవు...... శుభం