తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది అనుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.
ఇలాంటి తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.
ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు.
అలాంటి తెలుగు భాషా గొప్పదనాన్ని మనం కాపాడుకోవాలి, మార్పు మననుండి మొదలవ్వాలి , మొదటి అడుగు మనదయితే వెనక పది అడుగులు కలుస్తాయి. ఇదే ఆలోచన ఫేస్ బుక్ స్నేహితులుగా ఉన్నా ప్రపంచ తెలుగు కవిత్వోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులది, ఎదో ఒకటి చేయాలి, మన తెలుగును మన భాషని ఉనికి కోల్పోనివ్వకుండా భావి తరాలకి పంచాలి, పాఠశాలలో చెప్పినట్లుగానో , పేపర్లో మన ఘోష చెప్తేనే తెలుగు భాష ఉనికిని మనం ప్రచారం చేయలేము, ఎలా , ఎలా మరెలా? క్లుప్తంగా మనసులోతుల్లోని భావాలని పొందికగా పేర్చి, వినసొంపయిన పదాలతో మాటల కోటలని కడితే వచ్చేదే కవిత, మనసులోండి బయటకి వెలువడే అక్షర మాల ఆ కవితలనే ఆధారంగా చేసుకుని కవిత్వాన్ని ఒక ఉత్సవంగా చేసుకుందామని తలపెట్టారు. “జయహో కవిత్వం ” అన్నారు.
నాంది పలికారు ఇలా: click here you will get details..
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.