వనజా!
బ్లాగుల్లో లేఖా సాహిత్యం వినడానికి ఎంత బాగుందో.. బాధ్యతల్లోనో బంధాల సందడిలో మనసు అలసినప్పుడు నేస్తానికి చెప్పుకోడానికంటూ ఒక చిన్న సదుపాయం, మన చిన్నతనంలో అయితే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఆరోజులు ఎంత మధురమయినవి ఎఱ్ఱటి ఎండలో పోస్ట్‌మెన్ కోసం ఎదురుచూడడం ఒక గొప్ప అనుభూతి. మన దగ్గరే ఉన్న స్నేహితులతో కబుర్లు ఒక ఎత్తయితే, మన ఎదురుగా లేని బంధువుల ఉత్తరాల సమాచారం మరొక అనుభూతి . ఇప్పుడేది ఆ ఆతృత, ఆ మాటల సందడి.. మాటలంటే గుర్తొచ్చింది వనజా అసలు మాట్లాడుకోడానికి మనుషులేరి? మనసేది? ఏ బంధమయినా ఏ అనుబంధమయినా సెల్్ఫోన్ల బిజీ తో, సెల్ఫీల సంబరాలతోనో గడిపేస్తున్నాము. టెక్నాలజీకి బానిసలమయిపోయాము. ఎదురుగుండా మనిషి మనతో మాట్లాడకపోయినా సహిస్తాము కాని ఎక్కడో ఉన్న మనిషి మనకి ఈరోజు ఫోన్ చేయలేదని సెల్ ఫోన్ వంక చూస్తూ ఆరాటపడిపోతూ ఉంటాము. మాటలకి విలువ అలాగే ఉంటుంది.. మనసు కి మటుకు ఒక మనసుని తోడు ఇవ్వలేకపోతున్నాము కదా వనజా. అసలు మనమంతా ఒంటరిగా ఉన్నమెమో అని కదా అప్పట్లో ఈ బ్లాగులన్నవి వచ్చి మనకి కాస్త ఊరటని ఇచ్చాయి. బ్లాగులంటే గుర్తొచ్చింది.. నెనేలాగు మీ అందరికన్న సీనియర్ కాబట్టి నా బ్లాగ్ అనుభవాలు మీతో పంచుకుంటాను.
బ్లాగుల మొదటి రోజుల్లో ఈనాడు ఆదివారం పేపర్లో బ్లాగుల గురించి చెప్పినప్పుడు ఒకసారి అలా ప్రయత్నించాను. ఒక నాలుగు లైన్ల ఒక టపా.. ఆతరువాత ఇంకోటి అలా ఒక్కొక్కటి రాస్తూ రాస్తూ ఒక బ్లాగర్ అనిపించుకున్నాను.
నేను బ్లాగర్ లక్ష్మి గారు |
ఈ టి వి సఖీ షూటింగ్ సమయంలో బ్లాగర్లతో |
ఇక బ్లాగ్ స్నేహితుల గురించిచెప్పాలంటే అప్పట్లో అందరూ మంచి రచయిత్రులు, రచయితలు కేవలం నాలుగు లైన్స్ రాసి మేము గొప్పవాళ్ళం అని ఎవరు అనుకోలేదు. తెలుగు అన్నా తెలుగు సాహిత్యమన్నా మక్కువ చూపే వారిలో ఆద్యులు కొత్తపాళీ గారు, రానారే గారు, నువ్వుశెట్టి బ్రదర్స్, సుజాత బెడదకోట, సుజాత మణిపాత్రుని, శశికళ, విరించి, రెండు రెళ్ళు ఆరు తోట రాముడు, భరద్వాజ్ వెలమకన్ని, పప్పు శ్రీనివాస్ , కార్తిక్ ఇంద్రకంటి, కల్పనా రెంటాల, మహేష్ కత్తి, అరుణ పప్పు, వీవెన్, నాగార్జున చారి, సౌమ్య అలమూరు, సౌమ్య, పూర్ణిమ తమ్మిరెడ్డి, మంచు.. ప్రసాద్ చరశాల, చదువరి, వరూధిని కాట్రగడ్డ, మలాకుమార్, జ్యోతివలభోజు, ప్రవీణ్ (మార్తాండ), శ్రీనివస్ ధాట్ల , కిరణ్ కుమార్ చావా, నిడదవోలు మాలతి, కస్తూరి మురళి కృష్ణ, రవి రవి, లక్ష్మి, శ్రీధర్ నల్లమోతు, బులుసు సుబ్రహ్మణ్యం (అందరికి చివర గారు ఉంది చదువుకోవాలి) ఇలా ఎంతమందో నిజానికి మేమంతా ఒక కుటుంబంలా ప్రతీ డిసెంబర్ 2 వ తేదిన బ్లాగర్ల రోజుగా జరుపుకుంటూ డిసెంబర్లో జరిగే పుస్తక ప్రదర్శనశాల లో కలుస్తూ సందడిగా గడిపేవాళ్ళం.
భరద్వాజ్ వెలమకన్ని గారు, తోట రాముడు, బులుసు సుబ్రహ్మణ్యం గారు నేను |
వనజా మనం మళ్ళీ ఆరోజులని తీసుకురావాలి అంత సందడిగా గడపాలి.. రండి అందరం కలుద్దాము వారానికి ఒక టపా రాద్దాము మన ఊసులు మన కబుర్లు మన అభిప్రాయాలు.. మనం మనంగా మనసున్న నేస్తాలుగా మనసులకి ఊరటనిద్దాము.
నన్ను మీ అందరికీ పరిచయం చేసే నేపధ్యంలో బ్లాగర్లందరిని ఒకసారి అలా గుర్తు చేసుకున్నాను అందుకు మీకే కృతజ్ఞతలు వనజా.. మంచి ఆలోచన మంచి స్నేహితులు.. ఉంటే బ్లాగులు బ్లాగర్లు ఏ సోషల్ మీడియా అయినా తులసి వనం .. అని నా అభిప్రాయం.
******
******
రమణీ....బ్లాగురోజులు మధురాతి మధురం. ఆరోజులిక మళ్లీ రావు నేస్తం....బ్లాగు రాయడం, కామెంట్స్ చూసకోవడం, బ్లాగులు చదవడం కామెంట్స్ రాయడం, మన బ్లాగుల్లో కొత్త కొత్తగా హంగులు ఏం చేర్చాలా టెంప్లేట్ ఎలా మార్చాలా అని టెక్నికల్ విషయాలు తెలుసుకోవడం ....ఈలోపల బ్లాగుల్లో చర్చలు,అన్యాపదేశంగా ప్రస్తావించిన పేర్లు, బ్లాగులు,ఎవరై ఉంటారో అని మరిన్ని పోస్టులు చదవడం అన్నీ గుర్తువస్తున్నాయి. మళ్ళీ గూగుల్ బజ్జుల్లో ఎవరికి వీలైనప్పుడు వాళ్లు చేరి కథలు- దెయ్యాలకథలు, ఆటలు, సేకరించిన పాటల లిస్టులు పంచుకోవడం ఏవి తలచుకుంటే అవే మధురంగా అనిపిస్తున్నాయి. బ్లాగుల్లో మన భావాలను తెలుగులో చక్కగా పంచుకోవాలనే బలమైన కోరిక వల్లనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ నేర్చుకున్నాను. లేకపోతే వచ్చేదే కాదు. ముఖ్యంగా అభిప్రాయాలలో భేదాలు ఎన్ని ఉన్నా వాటిని మృదువుగా నొప్పించకుండా చెప్పే ధోరణి, అంతా మన వాళ్లే అనే నమ్మకంతో సహృదయంతో అర్థం చేసుకునే ధోరణి ఉండేది. ఎందుకో కానీ క్రమంగా ఈ వాతావరణం మారిపోయింది.దీనివెనక ఉన్న కారణాలను విశ్లేషించే శక్తి నాకు లేదు. ఏమైతేనేం క్రమంగా బ్లాగ్స్ చదవడం రాయడం కూడా తగ్గిపోయింది. మళ్లీ మీ పోస్టుతో బ్లాగు ప్రపంచంలోకి వచ్చాను రమణీ.బ్లాగుపోస్టుకి లైక్ కొట్టే అవకాశం లేదు కనుక కామెంట్ తోనే లైక్ కొడుతున్నాను.
ReplyDeleteటెంప్లేట్ ఎదో మార్చి మొత్తానికి మీకు రిప్లై ఇస్తున్నాను సుధా! "బ్లాగురోజులు మధురాతి మధురం. ఆరోజులిక మళ్లీ రావు నేస్తం....బ్లాగు రాయడం, కామెంట్స్ చూసకోవడం, బ్లాగులు చదవడం కామెంట్స్ రాయడం, మన బ్లాగుల్లో కొత్త కొత్తగా హంగులు ఏం చేర్చాలా టెంప్లేట్ ఎలా మార్చాలా అని టెక్నికల్ విషయాలు తెలుసుకోవడం ....ఈలోపల బ్లాగుల్లో చర్చలు,అన్యాపదేశంగా ప్రస్తావించిన పేర్లు, బ్లాగులు,ఎవరై ఉంటారో అని మరిన్ని పోస్టులు చదవడం అన్నీ గుర్తువస్తున్నాయి. " చాలా గొప్ప రోజులు అవి మళ్ళి వాటిని వెలికి తీసుకురావాలనే తాపత్రయం.. నెనర్లు సుధాజి
Deleteఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటూ ...
ReplyDeleteతెలుగు బ్లాగుల సంకలిని శోధిని
raavaali vastaayi
Deleteరమణీ ... మీరు మన బ్లాగర్లందరినీ చక్కగా గుర్తు చేసారు. మళ్ళీ ఆ బ్లాగ్ లలోకి వెళ్లి నచ్చిన పోస్ట్స్ చదువుకోవాలి. ప్రస్తుతానికి కొద్దిగా స్పందిస్తున్నాను. మళ్ళీ వస్తాను. మంచి స్నేహితులు ఉంటే.. తులసివనమే! అంగీకరిస్తున్నాను.
ReplyDeletelekha sahityam continue chestunnara Vanaja?
Deleteఅటువంటి రోజులు మళ్ళీ వస్తాయా..... ఏమో... రావాలని కోరుకుందామమ్మా.
ReplyDeleteraavaali.. hope so...
DeleteThanks andi!
ReplyDelete