8.10.2016
ప్రేమకి (పెళ్ళికి ) స్వీట్ 16 .....................20.........23
అదన్నమాట సంగతి ! అలా మొదలయి .. ఇలా 20 లోకి అడుగుపెట్టి ... ఇంకో మైలు రాయి చేరుకున్నాము..
ఇరు మనసులని/తనువులని కలిపే పెళ్లి ఒక గొప్ప కళ
కాని ఆ పెళ్లితో
కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండడం 64 కళల్లో కల్లా గొప్పది." రమణి రాచపూడి.
కాని ఆ పెళ్లితో
కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండడం 64 కళల్లో కల్లా గొప్పది." రమణి రాచపూడి.
****
22 సంవత్సరాల క్రితం ఈరోజు పెళ్లి కూతురిని చేసారు.., కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ,అరుచుకుంటూ.. అన్యోన్యగా 22 సంవత్సారాలు పూర్తీ చేసాము. ఈరోజుకి . రేపు 23 ఏట అడుగుపెతున్నాము ఒక్కో మైలు రాయిని దాటుకుంటూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ...
16 ఏళ్ళ క్రితం ఆగస్ట్ 11 తెల్లవారుఝామున
"ఏంటే ఈ నిద్ర, లే అవతల పంతులుగారు హడావిడి పడ్తున్నారు, అమ్మాయిని తీసుకుని రమ్మనమని, ఇంత మొద్దు నిద్ర అయితే ఇహ మొగుడితో కాపురం ఎలా చేస్తావు, లెమ్మంటుంటే ముహూర్తం మించిపోతుంది.."
"అబ్బా.. ఈ అర్థరాత్రి పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారమ్మా బాబు!, నిద్ర లేపి మరీ .. తరువాత చేసుకుంటాలే పడుకోనీ"
"బాగుంది సంబరం.. వచ్చినవాళ్ళందరిని నీ నిద్రకోసమని వెను తిరగమంటావా? అతి వేషాలు మాని తొందరగా లే. ఆ మూడు ముళ్ళేవో పడిపోతే కాస్త నా ప్రాణం కుదుటపడుతుంది. "
*****
ఆరు నెలల తరువాత
"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"
"ఇదిగో ఇంకొంచం దూరమే అదిగో అక్కడ కనిపిస్తోందే హోటెల్, అక్కడికి వెళ్ళి కొంచం టిఫిన్, కాస్త కాఫీ తాగేసి బయల్దెరుదాము సరేనా.. నడవాలి నడవకపోతే తరువాత నువ్వే సమస్యలు ఎదుర్కుంటావు. నా బంగారం కదా కాస్త దూరమే.."
"కాస్త దూరమా .. మళ్ళి బయలుదేరడమా ఆటోలో వెళ్ళిపోదామండీ నాకే టిఫిన్లు అవి వద్దు, నడవడమే కష్టంగా ఉంది. (కళ్ళనీళ్ళ పర్యంతంతో) "
"తొలిచూలు కదా ఎంత నడిస్తే అంత మంచిదని మా బామ్మ చెప్పేది. వినకపోతే ఎలా? కాస్త ఓపిక పట్టు..."
"ప్చ్.. అబ్బా ... ఇదేమి నరకం భగవంతుడా!! ఇంత దూరం నడకా ఇలాగా??"
"తప్పదు"
****
మొదటి సంవత్సరం పెళ్ళిరోజు
" సంవత్సర కాల మన వైవాహిక జీవితంలో ఎప్పుడన్నా నన్నెందుకు చేసుకున్నానో అని బాధ పడ్డావా?"
"లేదే, అలా ఎందుకు అడుగుతున్నారు? "
"నాలో ఏమన్న నచ్చని అంశం ఉంటే చెప్పేయి, నేను మార్చుకుంటాను, అలాగే నీలో ఏమన్న నాకు నచ్చకపొతే కూడా నేను చెప్పేస్తాను. "
ఆ తరువాయి రెండేళ్ళ తరువాత
"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"
"మరీ కొత్తలా ఏంటది, తెలుసు కదా పాప పుట్టడం ఎంత సులువయిందో, అలా నడవబట్టే కదా మరి మళ్ళి ఎందుకు అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కష్టం గానే ఉంటుంది తరువాత నువ్వే ఇబ్బంది పడతావు నీ మంచికోసమే కదా నడవరా..."
"హు! తప్పదా.. పాప అప్పుడు ఏమి కాలేదు కదా .. ఇప్పుడు కూడా ఏమి కాదు లెండి వదిలేయండి బాబు నడక కాస్త కష్టంగానే ఉంది. "
"ఉహు! తప్పదు"
******
అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో మధురానుభూతులతో, మరెన్నో మలుపులతో ఇంకెన్నో మార్పులతో.. తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అని చెప్పుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మా పెళ్ళిని(ప్రేమ ) టీనేజ్లోకి తీసుకొచ్చాము. అంటే స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అన్నమాట.. ఇంకా ఎన్ని పండగలు చూస్తామో, ఎంతవరకో పయనం?
బోల్డు బాధ్యతలు బంధాల నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రతిసారి తను అడిగే మాట .. "నాతో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డావా?" ఎన్నో పొరబాట్లు చర్చించుకుంటూ ...సరిదిద్దుకుంటూ.. నడిపే ఈ భవసాగరానికి 16 ఏళ్ళు. (ఇప్పుడు 20 ఏళ్ళు) ఇంకో 3 ఏళ్ళు కలుపుకోవాలి 23 ఏళ్ళు ... మలుపులకోసమో మార్పులకోసమో ఎదురుచూపులు. ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు ఇదేనా జీవితం, జీవన పరమార్థం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.. :-)
*****
8.05.2016
గోరంతదీపం కొండంత వెలుగు
ఈరోజు జాతీయ శరీర అవయవదాతల దినోత్సవంట గోరంతదీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు అని నా తదనంతరంకూడా నేను ఉండాలని ఇలా.. 2014 నవంబర్ నెలలో ..
ఉన్నంతవరకు నావే..కాని నిజానికి ఈ అవయవాలు తరువాత ఎవరివో.. కాపాడుకుంటూ వస్తున్నా.. నావన్న స్వార్థంతో... వేరొకరికి ఇవ్వాలన్న ధ్యేయంతో.
8.03.2016
ఏపీ గవర్నమెంట్ డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ కార్యకలాపాల్లో "Thalsemmia వ్యాధి" చేర్చబడింది
Malathi Sourabhaalu(మాలతి సౌరభాలు ) మాలతి గారి పోస్ట్ కి తెలుగు అనువాదం.
ఆల్మైటీ/గురువులందరి కృప వల్ల ఈరోజు మన కలలు మనం చేసిన ప్రయత్నం సఫలీకృతం అయింది. ఏపీ గవర్నమెంట్ డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ కార్యకలాపాల్లో "Thalsemmia వ్యాధి" చేర్చబడింది ఇది చిన్న విషయం కాదు అమాయకులయిన చిన్నారులకి ఈ వ్యాధి నిర్ధారణ, జీవితకాలంపాటు చికిత్స చేయడమంటే ఏంతో మంది సామాజిక కార్యకర్తల నిరంతర కృషి , ఈ అమాయక చిన్నారుల కోసం అలుపెరుగని సేవ. కాని ఇక్కడితో మన పని అయిపోలేదు నిజానికి ఇంకా ఎక్కువయింది... ఈ పధకం ప్రజల దగ్గరికి రావాలి వ్యాధి బారిన పడ్డ ప్రతిఒక్కరు ప్రయోజనం పొందాలి. కాబట్టి ప్రియమయిన మిత్రులందరికీ ఇదే నా విన్నపం , సామాజిక సంస్థలన్నీ ముందుకు వచ్చి వ్యాధి బారిన పడిన చిన్నారుల సమాచారాలని సేకరించండి. క్వార్టర్స్ / ప్రధాన పట్టణాలు / బ్లడ్ బ్యాంక్స్ ఆస్పత్రులు ల దగ్గర కింది సమాచారాన్ని / వివరాలు సేకరించండి
.
1. రోగి పేరు.
2. సెక్స్
3. బర్త్
4. బ్లడ్ గ్రూప్
5. వ్యాధి confirmative పత్రాలను తేదీ
6. వైట్ రేషన్ కార్డు
7. చిరునామా
8. మొబైల్ నెంబరు (ఫోటో కాపీలు).
.
1. రోగి పేరు.
2. సెక్స్
3. బర్త్
4. బ్లడ్ గ్రూప్
5. వ్యాధి confirmative పత్రాలను తేదీ
6. వైట్ రేషన్ కార్డు
7. చిరునామా
8. మొబైల్ నెంబరు (ఫోటో కాపీలు).
అంతేకాదు.. నేను వ్యక్తిగతంగా మన ఫేస్ బుక్ స్నేహితులకి , వాట్సప్ స్నేహితులకి విన్నవించుకునేది ఏంటంటే ప్లీజ్ ఈ సమాచారాన్ని వీలయినంతమందికి చేరవేయండి. రాష్ట్రంలో ప్రతిఒక్కరికి చేరాలి. దీని ద్వారా వ్యాధి భారిన పడిన ప్రతిఒక్కరు లబ్ది పొందాలని నా ఆకాంక్ష.
ధన్యవాదాలతో
మాలతి సౌరభాలు
మా ఆసరా టీం
Contact no 8008419454
E mail : dechiraju@gmail.com
మాలతి సౌరభాలు
మా ఆసరా టీం
Contact no 8008419454
E mail : dechiraju@gmail.com
8.02.2016
నేను రాసిన ఒక పోస్ట్ లో నాకే నచ్చిన నాలుగు మాటలు.. (అప్పుడేప్పుడో ఒక రెండు సంవత్సారాల క్రితం రాసాను_
"ప్రేమించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ముఖ్యంగా ఒకే వయసువాళ్ళ ప్రేమలు, ఎక్కువగా వయసు వేడిమీదే ఉంటాయి, ఆ ఆకర్షణలో ఉండి ప్రేమ అనే వ్యూహం లో చిక్కుకుంటారు. ఏ మతం ఏ కులం కాదు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. ప్రేమించడం అంటే గౌరవించడం , చులకన చేయడం కాదు.. నాది అనే హక్కు గౌరవం నుండి రావాలి, కాని చులకన నుండో హేళన నుండొ మాత్రం కాదు. అర్థం చేసుకుంటారనే ఇంత రాసాను ముఖ్యంగా తల్లి తండ్రులు కూడా కొంచం ఆలోచించండి . ప్రేమ వివాహాల పట్ల, ఆకర్షణల పట్ల అరచాకల పట్ల, శృంగారం పట్ల, , రేప్ వ్యవహారాల పట్ల పిల్లలికి కొంచం అవగాహన ఇవ్వండి. మనం మాట్లాడకూడదు అంటూ ఏమి లేదు మనమే పిల్లలికి మొదటి గురువులం మనకి తెలియకుండా వాళ్ళు చెత్త వీడియోలు చూసి తెలిసీ తెలియని వయసులో వెఱ్ఱి మొఱ్ఱి వేషాలు వేస్తూ బయట అమ్మయీలు/అబ్బాయిలు వెనకాల తిరిగుతూ యసిడ్లు, రేప్ లు , లాంటి దాడులకి వాళ్ళు తయారవకుండా ఉండాలంటే వారికి జీవితం, జీవిత చక్రం, కుటుంబం దాని విలువ గురించి చెప్పగలిగేది మనమే.. మనమేలా మాట్లాడతాము అని కాదు.. గుప్పిట మూసి ఎముందో అని ఊరిస్తూ చెప్పగలగాలి కాని గుప్పిట తెరిచేసి జీవితం అంటే ఇంతే ఏమి లేదు అని చెప్పడం కాదు .. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి కాని ముందే వీడియోలు ప్రేమలు అంటూ ఉన్మాదులుగా తయారవకుండా చూసే బాధ్యత మనదే. అంటే మన తల్లి తండ్రులదే
8.01.2016
మన గోదారోళ్ళు !
ఫేస్ బుక్ స్నేహాలని మోసం చేస్తుంది, స్నేహాలని కబళిస్తుంది. నమ్మినవాళ్ళని నట్టేట్లో ముంచుతుంది. ఫేస్ బుక్ ఒక మానియా, ఒక ఫాబియో, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. చేతిలో సెల్ ఉంటె చాలు ఫేస్ బుక్, చాటింగ్, స్టేటస్ అప్డేట్స్ అంటూ యువత పెడదారి తొక్కుతున్నారు. మరి ఇలాంటి నేపధ్యంలో ఫేస్ బుక్ తనని కాపాడి తనకి పునర్జన్మ ఇచ్చింది అని ఒక వ్యక్తీ చెప్తుంటే ఎలా ఉంటుంది? నడిరోడ్డుమీద దిక్కుతోచని స్థితిలో ఆక్సిడెంట్ కి గురి అయినప్పుడు ఏ బంధువులు, ఏ కుటుంబ సభ్యులు గుర్తు రాలేదు తన ఫేస్ బుక్ స్నేహితుడు గుర్తురావడం , ఆ మిత్రుడు అలాగే స్పందించడం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఇది.
రాంబాబు, ఇ వి వి ఫేస్ బుక్ స్నేహితులు. ఇ వి వి గారు ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ కి అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ కేవలం హాస్యం కోసమే... ఇందులో ఆడవాళ్ళందరూ సోదరీమణులుగా, మగవాళ్ళు బావా బావమరుదులుగా పిలుచుకునే అచ్చతెలుగు గోదావరి వాస్తవ్యులు. ఇక్కడ వేళాకొళాలే తప్ప, వ్యంగ్యాలు, అపహాస్యాలు ఉండవు. అందరు సరదాగా హాస్యం పంచుకుంటూ స్నేహంతో మనసారా నవ్వేస్తారు. హాస్యం, నవ్వుకోడం, ఒకరినొకరు ఆట పట్టించుకోడం ఇది ఒక కోణం..
మరోకోణం నిన్నే తెలిసింది.
అర్థ రాత్రి ఈ గ్రూప్ సభ్యుడు రాంబాబు గారు ఘోర కారు ప్రమాదానికి గురి అయ్యారు. అంత అచేతనావస్థ లో కూడా రాంబాబు గారు తన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం, అక్కడ చుట్టూ చేరినవారు కూడా “హోప్ లేదు సర్ తొందరగా రండి“ అనడం.. ఆందోళనతో ఉన్నఫళంగా ఇ వి వి గారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ పరస్థితి వాళ్ళు చెప్పినట్లుగానే ఉంది. వరసగా 4 ఆసుపత్రులు అతని కండిషన్ చూసి చేర్చుకోము అని చెప్పగా ఎట్టకేలకు బొల్లినేనిలోని ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని అతనికి ప్రాణదానం చేసారు. ఈ సందర్భంగా ఇ వి వి గారిని అభినందిస్తూ గ్రూప్ లో అనేక పోస్ట్ రావడం నేపద్యంలో తానే స్వయంగా ఏమి జరిగిందో ఇలా చెప్పారు ఇక్కడ కువైట్ ఎన్నారైస్ (please click on this word) లో చదవండి మీరు కూడా..