10.06.2010

బ్లాగ్ ప్రయాణంలో నేను


బ్లాగు లోకంలో నా అనుభవం గురించి చెప్పమంటున్నారు. నేనేమో మురిసిపోయి, ఓ సినీ హీరోయిన్ తరహాలో" అబ్బే! నిన్న గాక మొన్నేగా అడుగిడింది. నాకు తెలిసంది చాలా తక్కువ " అని చెప్దామనుకొంటుండగా, "నీకంత సీన్ ఉన్నట్లులేదు, నువ్వు తెలిసిన వాళ్ళే చాలా తక్కువ పిచ్చి మొహమా!" అని మనసు నిజం వెళ్ళగక్కేసింది. నిజం చెప్తే నిష్టూరమంటారు అది నిజమేనండి! నాకయితే నా మనసుమీద చాలా కోపం వచ్చేసింది అలా నిజాల్ని ఎంత నిర్ధాక్షిణ్యంగా చెప్పేస్తోంది కదా అని. ప్చ్! నాతో ఇతర బ్లాగు మిత్రుల అనుభవాలు కాదుగా అడిగింది , నా అనుభవాలు అడిగారు కాబట్టి.. . మనసులోతుల్లోంచి వచ్చిన మధురమైన అనుభూతుల్ని ప్రోది చేసి ఇదిగో మీకోసం.

"ద్వాపరయుగంలో బల రాముడు, శ్రీకృష్ణుడు ఆడుకొంటూ ఉండగా, శ్రీ కృష్ణుడు మన్ను తిన్నడం చూసి బలరాముడు...

"అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా!
అని రామన్న తెలుపగా..
హన్నా! అని చెవి నులిమి యేశోద , ఏదన్నా నీ నోరు చూపమనగా
చూపితివట నీ నోటన్, బాపురే పదునాలుగు భువనభాంఢమ్ముల,
ఆ రూపం గన్న యశోదకి , తాపము నశించి జన్మ ధన్యత గాంచేన్.... "

అవకాశాలు ఎప్పుడు ఉంటాయి! మనము సద్వినియోగం చేసుకోగలగాలి, ఆ నమ్మకం మనకుండాలి. అలా ఆ నమ్మకంతో 14 భువనభాంఢాలాంటి ఈ లోకంలో అడుగుపెట్టాను, కాస్త భయంగా, మరికొంచం బెరుకుగా ఈనాడు పత్రిక చూసి నాకై నేను కొన్ని చదివి, తెరిచిన తొలి బ్లాగు "తీయని తెలుగు". (3 నెలల క్రితమే మూసేసాను).

*******

బ్లాగు లోకంలోకి అడుగిడాలంటే "కూడలి" గేటు తియ్యాలని , శ్రీ కృష్ణుడి నోరు, ఎలాగో ఇక్కడ ఈ బ్లాగు లోకంలో కూడలి అలా అని, ఇదిగో ఈ "మనలో మన మా "బ్లాగ్ కి ఆరంభం పలికేప్పుడు తెలిసింది. "అసలు నా బ్లాగు కి వచ్చి వ్యాఖ్యలు ఎలా ఇస్తున్నారబ్బా?" అని హాశ్చర్యపోయాను మొదట్లో. ఆ తరువాత తెలిసింది అది కూడలి గొప్పతనమని.

అప్పుడు కొత్త కదా! నెమ్మది నెమ్మదిగా తప్పటడుగులు వేస్తుంటే జగ్రత్తగా , కాలు జారకుండా అడుగులు నేర్పిన వారు చాలా మంది ఉన్నారు, వారందరూ నాకు హితులు, సన్నిహితులు వెరసి బ్లాగు మిత్రులు.

నా బ్లాగు చూసారు కదా మీరంతా. మొదట చాలా సీరియస్ గా సమాజంలో సమస్యలగురించి నా ఆవేశాన్ని వెళ్ళగక్కుతూ టపాలు రాసేదాన్ని. ప్చ్! ఎవరికి నచ్చలేదులా ఉంది, ఇహ ఇలా లాభంలేదని హాస్యం వైపు దృష్టి మళ్ళించా అలా రాసిందే నేను 'రమణి' అని నలుగురికి తెలిసేలా చేసిన ఆ టపా హ్హ..హ్హ.. హ్హ.

ఇప్పుడు నేను ఒక్కో ఒక్కో బ్లాగు చెప్తాను, కాని మీరందరూ ఆ లింకులని క్లిక్ చేయనని మాటిస్తేనే. నా ఈ టపా ఓపికతో మొత్తం చదివిన తరువాత ఇహ మీ ఇష్టం.

ఇప్పుడు మీకు ఇంకో బ్లాగు చూపిస్తాను, ఈ బ్లాగు పేరు "కొత్త పాళీ " (" అప్పుడే లింక్ క్లిక్ చేయకండీ ప్లీజ్!! టపా మొత్తం చదివి.." ) ఎందరో ఏకలవ్యులకి, అభినవ ద్రోణాచార్యులు శ్రీ కొత్తపాళీ గారు. నా బ్లాగులో అమూల్యమైన వ్యాఖ్యల ద్వారా నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన ప్రముఖ వ్యక్తన్నమాట. వీరి ప్రోత్సాహంవల్ల నాకు నేను రాయగలనని నమ్మకం వచ్చింది.

"జ్యోతక్క అందరికీ అంటే బ్లాగ్ లోకంలో అందరికీ అక్కే!.నా బ్లాగులో ఆ చందమామా.. మా చిచ్చర పిడుగుల ఫొటోలు, నా బ్లాగంతా సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, అంతే ప్రోత్సాహంతో వ్యాఖ్యలు రాసి, అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకొన్నప్పుడు "మేమున్నామని" ధైర్యం చెప్పిన బ్లాగు అక్క జ్యోతక్క.

మొదట్లో నేను తెలియక అన్నీ చుక్కలు చుక్కలు పెట్టి అసలు అర్ధం కాకుండా రాసేదాన్ని చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండేవి, అదిగో అప్పుడు నా బ్లాగ్ ప్రేవేశం చేసారు శ్రీ నాగరజు పప్పుగారు (బ్లాగ్ మూసేసారు చూపిద్దామంటే) , అప్పుడే నాగరాజుగారు "హన్నా! అన్నీ తప్పులు రాస్తున్నారు" అని చెవి నులిమి ఖోప్పడే సరికి, భయమేసి మార్చేసానన్నమాట. మరి శరముల వలేనే ఛతురోక్తులను చురుకుగా విసిరే చక్కటి నైపుణ్యం గల నాగరాజు గారి పరిచయం ఇలా బ్లాగుద్వారా కలగడం నేను గర్వించతగ్గ విషయం.

అక్కడక్కడ, అప్పుడప్పుడు నా బ్లాగు కేసి తొంగి చూసేవారు శ్రీ తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు. వారి బ్లాగు "కలగూరగంప". ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఇలా నా బ్లాగు వైపు తొంగి చూసి వ్యాఖ్యల ద్వార ప్రోత్సాహం ఇచ్చేవారు.

ఇక సి బి రావు గారు వీరి బ్లాగు పేరు "ధీప్తి ధార", మంచి మంచి సాంకేతిక పరమైన, బ్లాగు పరమైన సలహాలు, సూచనలు ఇస్తూ, మంచి ప్రోత్సాహమిస్తారు. ఇంకా ఇలా సాకేంతిక సలహాలు ఇచ్చేవారిలో, తెలుగు వాడి ని గారు, నల్లమోతు శ్రీధర్ గారు , శివ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ! వీళ్ళందరి వల్ల నా బ్లాగుకి ఓ రూపం వచ్చిందన్నమాట.

కూడలి మొరాయిస్తేనో, బ్లాగు నావల్ల కాదంటేనో, ఆది గురువు "వీవెన్ గారు"కి ఓ మెయిల్ రాసేసి ఏమి చెయ్యాలో తెలుసుకోవడం అలా వీవెన్ గారితో బ్లాగనుబంధం ఏర్పడింది.

ఇంకా చాలా మంది ఉన్నారు. ! అందరు హితులే, అందరం స్నేహితులమే. ఓ కుటుంబంలా ఉంటాము. సలహా సంప్రదింపులు చేసుకొంటాము. ఏదన్నా సమస్య వస్తే , అందరము కలిసి చర్చించుకొంటాము. ఒక్కొక్కరిగా అందరూ ఇదిగో:
(పేర్ల చివర 'గారు ' చదువుకోగలరు).

1. సిరిసిరిమువ్వ-నాలాంటి అమాయకులని దుత్తలు చేసేసి, కోపతాపాలు వెళ్ళగక్కేస్తారు. చక్కటి శైలి, స్నేహభావం. చక్కటి చదువ(రోధిని)రి.
2. మనసులో మాట-అనతి కాలంలోనే అందరి మెప్పు పొంది తన మనసులో మాటలు చక్కగా వివరించగల దిట్ట.
3. ఊహలన్నీ ఊసులై- ఊహలన్ని ఊసులుగా చెప్తూనే, చక్కటి పుస్తక సమీక్షలు రాస్తూ ఉంటారు
4. విశాఖ తీరాన- నేను రాసే అచ్చుతప్పులను సహృదయంతో అర్ధం చేసుకొని క్షమించేస్తారు.
5. సాహితి యానం - యనాం కవి.
6. తె . తులిక - ఈ మధ్య నా బ్లాగు ప్రవేశం చేసి, లాభం లేదు మీ అబ్బాయి మీద ఆశ వదిలేసుకొన్నానంటూ మంచి స్నేహితురాలయ్యారు.
7. గడ్డిపూలు- మొన్నే చెప్పారు తన పేరు సుజాత పాత్రో అని, భలే రాస్తారు చక్కటి శైలి.
8. తెలుగు4కిడ్స్- ఇదైతే లలితగారు పిల్లలకోసం రూపొందించారు. నా బ్లాగు లో చక్కటి వ్యాఖ్యల ద్వారా పరిచయమై కనుమరుగైన బ్లాగరు.
9. అంతరంగం- తన అంతరంగంలోని భావాలని చిన్ని తెరమీద చక్కగా చూపగలిగే నేర్పరి.
10. బ్రహ్మి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ -హాస్యం ఆశువుగా రాయగలరు.
11. వేణు శ్రీకాంత్ -చక్కటి చిక్కటి ఫిల్టరు కాఫి రుచి చూపించారు.
12. పర్ణశాల-వాడి పదాలతో చర్చలలో మనోభావాలను సూటిగా, ఏకధాటిగా మాట్లడించగలిగే మహేష్ గారి బ్లాగరు.
13. తెలుగోడు- (అబ్రక దబ్ర గారు మీరు ఒకేఒక్క కామెంట్ రాసారు)-మంచి శైలి, విశ్లేషణ వీరి సొంతం.
14. చదువరి-రాజకీయ చతురత.
17. మీనాక్షి , అశ్విన్ బూదరాజు
19. కస్తూరి మురళీ కృష్ణ
20. కల
21. భూమిక 22 . ఓ అరుణం 23. నివేదన 24. 25. మురళి 26.ప్రసాదం 27. సౌమ్య 28. దిలీప్ 29 రానారే 30.గిరి గారు 31.వికటకవి 32.ప్రవీణ్ గార్లపాటి 33. మేధ 34. పెదరాయుడు, హనుమంతు, ఊకదంపుడు, నువ్వుశెట్టిబ్రదర్స్, భావకుండన్, భైరవభట్ల కామేశ్వర రావు, మాగంటి వంశి, స్వాతి,లలిత..... ఇంకా ఇంకా ఇలా చాలా మంది మొత్తం కూడలి బ్లాగుల సమాహారం లో ప్రతి ఒక్కరూ నా ప్రయాణంలో నన్ను కలిసి పలకరించినవారే. . నేను అందరి బ్లాగులు చదువుతాను. అందరూ నా బ్లాగుకి రావాలని ఆకాంక్షిస్తాను. ఎవర్ని మర్చిపోయినా మరోలా భావించకండి. రమణి ఓ మతిమరుపు మనిషి అనుకొండి.

ప్రత్యేక వ్యాఖ్యాతలు (మాత్రమే) తెరేసా , ఈ మధ్య నా బ్లాగు వ్యాఖ్యల్లో చిలిపి అల్లరి చేసిన సీ గాన పెసూనాంబ. అందరూ స్నేహితులే అందరితోటి చక్కటి అనుబంధం ఉంది.

******
అదండి సంగతి. ప్రమదలందరూ " బ్లాగు లోకంలో నా అనుబంధం ", చెప్పమన్నారు. నాకేమో ఏమి రాయాలో తెలియలేదు, తీరా రాద్దామని మొదలు పెట్టేసరికి ఇదిలా చేంతాడులా అయిపోయింది. మరి 14 భువనభాంఢాలాంటి ఈ బ్లాగ్ లోకంలో ఆవగింజలాంటి నా అనుబంధం గురించి రాయలంటే అది నా తరమా? అణుబాంబ్ లాంటి వాళ్ళ మధ్య నేనెమి రాయగలను చెప్పండి? అయినా "అరెరే బానేఉందే" అని మీకందరికీ అనిపిస్తే, అలా చూసి చూడనట్లు పక్కకి తప్పుకోకుండా, కాస్త మీ కీ బోర్డ్ కి పని చెప్పేసి," మా గొప్పగుందీ ట్రిక్కూ నేను పాటించేస్తే తాప్పా?" అని అనుకొంటూ , నా దోసిట్లో ఒక్కో వ్యాఖ్య పోగేసి ఇచ్చారంటే, భద్రంగా వ్యాఖ్యలన్నీ బ్లాగులో దాచేసుకొంటానుగా... మరెందుకిక ఆలస్యం? కింద ఉన్న Post a Comment వైపు దృష్టి సారించండి మరి. ;)

37 comments:

  1. రమణిగారు, నిజంగానే మొదట్లో మీటపాలు నాకు అన్నీ అర్ధం కాలేదు. కాని ఇప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి క్రియేట్ చేసుకున్నారు. అలాగే కంటీన్యూ ఐపోండి..

    నిజంగా మీ బ్లాగు టపాలు చదువుతుంటే అనుకుంటాను.

    Jor Ka Jhatka Dheere se Laghe..

    ReplyDelete
  2. ఇదే మీ ప్రత్యేకత...! మీ ప్రయాణం గురించి చెప్తూనే మా అందరికీ బెర్తులిచ్చే సారు! విలక్షణంగా రాసారు సుమా!

    ReplyDelete
  3. మీ ప్రయాణం లో నాకో బెర్తుతో పాటు, మీ బ్లాగుల జాబితాలో నాకు చోటు కల్పించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. సుజాతగారి మాటేనామాటానూ!అయితే, నిజజీవితంలో మనం మన కార్లో ఒంటరిగా ప్రయాణం చేసెయ్యొచ్చుగానీ, బ్లాగులోకంలో ప్రయాణం మాత్రం తోటిప్రయాణికులు లేకుంటే సగం ఆనందాన్నే కలిగిస్తుంది.ఇతర బ్లాగుల్ని చదవటం, మనబ్లాగుకొచ్చే కామెంట్లూ, విసుర్లూ,విరుపులు,అభినందనలూ,విమర్శలూ ఇలా షడ్రుచులూ కలిపిన ప్రయాణాలు ఇక్కడ మాత్రమే గ్యారంటీడ్.

    మీ ప్రయాణంలో నేనూ ఒక భాగమైనందుకు ఆనందంగా ఉంది. నా అభినందనలు.

    ReplyDelete
  5. మీ బాణీ మీకే సొంతం.
    కందిపచ్చడితో ఎందరిని నోరూరించారు. తెలుగు బ్లాగులు ఉన్నంతకాలం మీరు, మీ బ్లాగు, మీ కందిపచ్చడి చిరస్మరణీయులుగా నిలిచిపోతారు.

    ReplyDelete
  6. రమణి గారూ.. నాకు మీరు బెర్త్ ఇవ్వలేదు... అయినా సరే స్టాండింగ్ లోనే మీతో పాటు ప్రయాణిస్తా!!!
    hahaha.. just kidding..

    ఈ ప్రయాణంలో మరిన్ని మధురానుభూతులు ప్రోగుచేసుకోవాలని కోరుకుంటూ...

    ReplyDelete
  7. మీ అనుభవాలతో పాటు అలరించే మరితమంది బ్లాగర్లను ఒక్కచోట పరిచయం చేసారు. కొత్తవారికి ఉపయోగంగా వుంటుంది.

    ReplyDelete
  8. మేధా! నిజంగా సారీ, గుర్తు రాలేదు. అందుకే అనేసాను రమణి మతిమరుపు మనిషి అనుకొండి అని..@ పెదరాయుడు గారు మీకు కూడా ఓ పెద్ద సారి.

    ReplyDelete
  9. ఐతే ఇప్పుడు రమణిగారు కొత్తగా టీటీయీ అవతారమా? .. అహ, తెలీకడుగుతున్నా. ఏంటో ఈ రైల్వే భాష.
    మీ బ్లాగోతం (భాగవతం పద్యంతో మొదలెట్టారు గదా!) బాగు బాగు. కొనసాగించండి మీ బ్లాగ్రైలు ప్రయాణం!!

    ReplyDelete
  10. రమణి గారూ.. అయ్యో సారీ అక్కర్లేదండీ.. చెప్పాను కదా.. Just kidding ani...

    ReplyDelete
  11. స్నేహశీలి రమణీ, Bon voyage!

    ReplyDelete
  12. మీ బ్లాగు ప్రయాణం బహు బాగు రమణి గారు, నా బ్లాగు కూ చోటిచ్చినందుకు నెనర్లు.

    ReplyDelete
  13. WOW, interesting recap!

    నా బ్లాగులో మీ వ్యాఖ్యలు చాలా తక్కువ కదా, మీరు చదవరేమో అనుకున్నా! చాలా చాలా థాంక్స్ అండి!

    ReplyDelete
  14. మీరే చెప్పినట్లు, మీరు మీ ప్రయాణంలో మేము ఆశ్చర్యపోయేలా మీ శైలి, భాష రెండూ భలే మార్చుకున్నారు. మీ బ్లాగు ప్రయాణం అనంతంగా కొనసాగాలని కోరుకుంటూ..

    ReplyDelete
  15. అయ్ బాబొయ్ ....... నన్ను రైలెక్కించుకోలేదే టండీ బాబూ అక్కడీకీ పొద్దున్నే కదండీ మీ బ్లాగులో కామెంటేసేనూ....ఇంత మతిమరుపేటండీ మీకూ.. ఆ..య్

    ReplyDelete
  16. అందరూ వేరే వేరే స్టేషన్లలో ఎక్కినా వర్చువల్ గా కలిసి చేస్తున్నా ఈ బ్లాగు ప్రయాణం చాలా బావుంది.. మీ కందిపచ్చడి చదివి మీకు వీరాభిమానినయ్యాను.. మీరు రాసే విషయాలను, సునిశిత హాస్యంతో కూడిన మీ శైలి నాకు చాలా ఇష్టం.. ఇలాంటి బోల్డన్ని టపాలు మాకందించాలని కోరుకుంటున్నాను :-)

    ReplyDelete
  17. కామెంటకపోయినా మీ టపాలు చదువుతూనే ఉంటానండీ :-)

    ReplyDelete
  18. ఏమిటి మహిళలంతా వరుస పెట్టి, ఇలా బ్లాగు ప్రయాణాలు చేస్తున్నారు? ముందుగా అనుకున్నారా? మీ వ్యాసం వైవిధ్యంగా ఉండి, తోటి బ్లాగరులతో, రైలు లో ప్రయాణం చేయించటం సరదాగా, ఆహ్లాదంగా ఉంది.నేను భారతదేశం వచ్చాక, భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా? ఇంతవరకూ ఎవరికీ చెప్పని విషయం, మీకే ప్రత్యేకం. డెట్రాయిట్ నగరంలో, తెలుగు సమావేశాలలో నన్ను కలిసి ఆప్యాయంగా పలకరించారొక మహిళ. నా బ్లాగు తను చదువుతూ ఉంటానని చెప్పి నన్ను ఆశ్చర్య పరిచారు. ఆమె ఎవరో చెప్పగలరా? వారు మీకు తెలుసు.ఆమె పేరు చెప్పెయ్యనా? మీరూ పడతారు ఆశ్చర్యం. ఆమె తెరెసా (Teresa).

    ReplyDelete
  19. ఇప్పటి వరకూ చెప్పలేదు కానీ నాకు మీ హాస్య టపాలు ఎంత ఇష్టమో ఇంతకు ముందు రాసిన సీరియస్ టపాలు కూడ అంతే ఇష్టం.ఒక్క సారిగా మీరు శైలి మార్చేస్తే అలవాటు పడడానికి అప్పట్లో నాకు కాస్త కష్టం అయింది.ఎందుకంటే నెను చాలా రెగ్యులర్ గా చదివేదానిని మీ బ్లాగు.

    ReplyDelete
  20. టపాల్లో పాటల్ని కలిపి పొట్లం కట్టడంలో మీరే నంబర్వన్!
    (నంబర్వన్ - ఏదో అరవపదంలా వుంది కదా? :-))

    ReplyDelete
  21. నేనెంత ; నేనెంత అటంచున్ 1 రమణీమణి, బ్లాగుప్రయాణంలో మిత్రులకు బెర్తులు ఇచేసారు . బ్లాగ్లోకంలో మొన్ననే అడుగిడిన నా సంగతేంటి? ఈప్రయాణంలో నిలబడే చోటిస్తారా1 బ్లాగు మిత్రులందరినీ పరిచయం చేసినందుకు కృతజ్ఞ్తలు.

    ReplyDelete
  22. ramani garu sunday sakshi funday lo naa article chadavandy

    ReplyDelete
  23. బాగుంది, రమణీ మీకిటుకులతోపాటు బ్లాగరులలో హేమాహేమీలెవరో తెలిసింది నాకు ఇప్పటికి. మీ అబ్బాయి ... ఇంకా నాకు :( గానే వుంది. :)

    ReplyDelete
  24. రమణి గారూ..నన్ను మరచిపొయారు కదూ....హన్నా ..ఉండండి మీమీద నాలుక్కార్టూన్లు వెయ్యకపొతేఅడగండి...సరదాగా సుమీ,,,చాలామంది బ్లాగర్లను దండ గుచ్చి ఒక చోట చేర్చారు..చక్కగా రిఫరెన్సుకు పనికొస్తుంది...

    ReplyDelete
  25. రమణి గారు మీరు చెసిన హెల్ప్ కు ధన్యవాదములు

    ReplyDelete
  26. ramaneeyam..ramani gari blogs chadivina taruvaata..anpinchina vakyam ade...keep it up..
    seenu

    ReplyDelete
  27. ఈ ప్రయాణంలో మరిన్ని మధురానుభూతులు ప్రోగుచేసుకోవాలని కోరుకుంటూ.కొత్తగా బ్లాగ్ ప్ర్రారంబించిన నా బ్లాగ్ ఒకసారి దర్శించి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు. www.ragamrrao.blogspot.com

    ReplyDelete
  28. రమణి గారూ, బ్రాహ్మి గారు + అబ్రకదబ్ర గారి మాటే నా మాటానూ ! కొత్త పాళీ గారు అన్నట్టు బ్లాగోతం బాగుంది ! ధన్యవాదాలు !

    ReplyDelete
  29. రమణీ గారు
    నన్నూ మర్చిపోయారు. నెనునూ మీ బ్లాగంతా ఒకరోజులో చదివి కామెంటినాను కదా. అయినా పర్వాలేదు. పెసూనే నన్ను వదిలేసింది. నేనా బాధ మర్చిపోడాఅనికి మీ బ్లాగ్ చదివుతున్నా. మీరు చాలా బాగా రాస్తారు. ఇలా రాస్తూ ఉండాలి. నన్ను మర్చిపోకండి.

    ReplyDelete
  30. your journey in the blogworld is fantastic.

    its a great previlage to be in your list madam.

    bollojubaba

    ReplyDelete
  31. మీ శైలి నాకు తెగ నచ్చేసింది. psmlakshmi

    ReplyDelete
  32. మీ శైలి చాలా బాగుంది అండీ.. బ్లాగు ప్రయాణం విశేషాలు బాగున్నాయి..

    ReplyDelete
  33. entamandi abhimaanulni vunchikuni kudaa ala antaarentandi.......chakkagaa raasaaru mi blog prayaanam gurinchi....

    ReplyDelete
  34. రమణీ,
    పాత రోజులు గుర్తుకు తెచ్చారు.
    మీ పాత టపాలు ఈ మధ్య మీరు బయటికి తెచ్చినప్పుడు మళ్ళీ చదువుకున్నాను.
    మీ కంది పచ్చడి టపా మళ్ళీ చదివినప్పుడు కూడా అప్పుడే చేసిన రోటి పచ్చడి అంత కమ్మగా ఉంది.
    అప్పట్లో మీరు రాసిన టపాలు ఇంకొన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను.
    బ్లాగుల ద్వార నిజంగానే చాలా మంచి పరిచయాలు అయ్యాయి.
    బ్లాగు మూసేసినా నన్ను ఇంకా గుర్తు చేసుకుంటున్నారు అప్పటి బ్లాగ్స్నేహితులు అంటేనే తెలుస్తుంది ఆ స్నేహ సంబంధం ఎంత గట్టిదో.

    ReplyDelete
  35. నాకు ఫేస్ బుక్ గురించే కాస్తో కూస్తో తెలుసు బ్లాగాయణం అస్సలు తెలీదు.ఎలా క్రియేట్ చెయ్యలో వగైరా..మీరంతా ఇన్ని సమ్వత్సరాలై ఇంత ముందుకెళ్ళినవారా అని,నేనెంత వెనకబడి ఉన్ననా అనిపిస్తోంది.అది సరే-మరి రమణి గారి ఆలోచనా ధోరణి,సమయస్పూర్తి,రాసే విధానం సూటిగా,కాస్త హాస్య ధోరణిలో నాకు బgగగ ఇష్టం.ఆవిడలో నేనే కనిపిస్తుంటా :) అంటే - birds of same branch ..... అనిపిస్తుంటుందని.. కాస్త సమాజం పట్ల బాధ్యత,ఆవేదన పాళ్ళు ఎక్కువే.ఇప్పటికి చదివనన విషయాలని బట్టీ చెప్తునా.... మిగతావీ చదివాక ఇంకా చెప్పగలను.

    ReplyDelete
  36. నెనర్లు వసంత గారు మీ అమూల్యమైన వ్యాఖ్యకి.. అప్పటి రోజుల్లో ఉన్న వైభవం ఇది ఇప్పూడంత బ్లాగాయణం లేదు.

    ReplyDelete
  37. రమణిగారు మీ బ్లాగు చాలా బావుందండి.చక్కని శైలితో రాస్తున్నారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.