"congratulations మీకు ఫిమేల్ బేబి పుట్టింది" .
"మళ్ళీ ఆడపిల్లా? ప్చ్!" దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడా తండ్రి.
"ఇంటికి మహలక్ష్మి పుడితే ఎంటిరా ఆ నిరుత్సాహం? ఆనందపడక. రెపొద్దున్న చూడు అదెంత పేరు తెచ్చుకొంటుందో .. " తండ్రి నిట్టూర్పుకి ఆ ఇంటి పెద్దావిడ ఇచ్చిన సమాధానమది. అంతటి పేరు తెచ్చుకోబోయే ఆ మహాలక్ష్మి కి జన్మనిచ్చిన ఆ తల్లి పేరు ఆ తండ్రికి బార్య అంతే. ఆ ఇంటి పెద్దావిడ పేరు? అతనికి అమ్మ.
********
"ఏంటి అందరూ హడావిడి గా ఉన్నారు ఏంటి విశేషం? " ఇంట్లోని ఆడవాళ్ళంతా అలంకారాల హడావిడిలో ఉంటే ఆ ఇంటి యజమానికి కలిగిన సందేహం అది.
"ఏంటి విశేషం అని నెమ్మదిగా అడుగుతారేంటండి? పక్కింటి "రామారావు గార అమ్మాయి"పెద్దమనిషి అయ్యిందిట, పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తున్నారట, చేసుకొన్నవారికి చేసుకొన్నంత, ఆ "అమ్మాయి ఎంత అదృష్టం చేసుకొందో.. కలిగిన వాళ్ళింట్లో పుట్టింది, కనీ వినీ ఎరగని రీతిలో చేస్తున్నారట. ఊరు ఊరంతా వెళ్ళడానికి హడావిడి పడ్తుంటే మీరు నిమ్మకి నీరెత్తనట్లు అంత నెమ్మదిగా ఏంటి విశేషం అని అంత నింపాదిగా అడుగాతారేంటండి? విడ్డూరం కాకపోతేనూ.... " మెటికలు విరిచిందా ఇంటి ఇల్లాలు. ఇంతకీ ఆ రామారావు గారి అమ్మాయి పేరు??
*******
"ఏంటి అక్కడ అంత గుంపు? ఏం జరుగుతోంది? ఎవరో కొట్టుకొంటునట్లు ఉన్నారు?"
"ఆ "అబ్బాయి చెల్లెలిని " ఎవరో ఏదో అన్నారట, అంతే అన్నవాళ్ళో గ్రూపు, తన్నేవాళ్ళో గ్రూపులుగా విడిపోయి కొట్టుకొంటున్నారు"
"ఆహ! ఇంతకీ ఎవరా చెల్లెలు? పేరేంటి?"
"ఎవరికి తెలుసు? అందరూ ఫలనా వాళ్ళ చెల్లెలు రా... బాబు , ఆమెతో మనకెందుకు అనుకొంటూ ఉంటారు."
మరి ఆ చెల్లెలి పేరు?
********
"ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి చాలా బాగా చేసారు, పెళ్ళి, విందుభోజనాలు చాలా రుచి గా ఉన్నాయి. ఫలనా వారింట్లో పెళ్ళి అంటే పరిగెత్తుకొని వచ్చేట్లు చాలా సందడిగా సరదాగా జరిగిందికదూ. ఏది ఏమైనా " మా వాడికి కాబోయే బార్య " చాలా అదృష్టవంతురాలు.
ఆ కాబోయే బార్య పేరు? ..ఫోని వధువు తరుపువాళ్ళు చెప్తారేమొ అడుగుదామా?
"అబ్బో ఆ రాజుగారు వాళ్ళమ్మాయి పెళ్ళి ఘనంగా చేసారండి. కనీ వినీ ఎరుగుదుమా ...ఇంత ఆర్భాటం, దేనికన్నా పెట్టిపుట్టాలమ్మా!"
ప్చ్! ఇక్కడ తెలిసేట్టులేదు శుభలేఖలు చూసుకోవాల్సిందే....
*******
ఇలా ఒకరికి అమ్మగా, ఒకరికి కూతురుగా, ఇంకొకరికి చెల్లెలిగా మరొకరికి బార్యగా పలు రకాల పాత్రలు సమర్థవంతంగా నిర్వహిస్తూ.. తన ఉనికిని తనవాళ్ళలో చూసుకొంటున్న మహిళలకి ఈరోజుని వాళ్ళకోసం అని కేటాయించేసారు. మరి ఒకసారి మనమెవరో తెలుసుకొని, మనకోసం పాటుపడ్తున్నవాళ్ళని తలుచుకొని మనకి మనం శుభాకాంక్షలు చెప్పేసుకొందామా..
మహిళలకు, బ్లాగరిణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

సుమ గారు,
ReplyDeleteఎన్ని మహిళా దినోత్సవాలొచ్చినా, మౌలికంగా స్త్రీల విషయంలో మార్పులంతగా రాలేదని సున్నితంగా చెప్పారు మీ కథలో! ఇదే అంశంతో ఇదివర్లో పి.సత్యవతి గారు ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ తో స్త్రీని పోలుస్తూ కథ రాసారు.
చాలా బాగుంది.sumamala.blogspot.com గురించి జ్యోతి లో పరిచయం బాగుంది.అభినందనలు.
ReplyDeleteమహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ReplyDeleteము౦దుగా మహిళా దినోత్సవ శుభాకా౦క్షలు.హన్నా! నాకు కూడా తెలియకు౦డా ఇ౦కో బ్లాగు మొదలు పెడతావా? నేనేమో సుమగారు బాగా రాస్తున్నారని కామె౦ట్లు ఇస్తున్నాను.జ్యోతి ద్వారా తెలుసుకున్నా మాచెల్లే ఈసుమ అని.క౦గ్రాట్స్ మళ్ళీ రాస్తున్న౦దుకు.
ReplyDeleteపెదవే పలికిన మాటల్లొన...
ReplyDeleteలేచింది మహిళా లొకం.....
ఈ దుర్యధన,దుశ్యాసన.....
అన్న సూపర్ హిట్ పాటలను
ఆలకించినట్లు ఉంది మీ టపా.
సుమ గారు ఈ టపా మెగా హిట్.
keep going...