ఎంటో ఈ అడుగులు.. ఎప్పుడు తొందరగా నడుస్తానో, ఎప్పుడు పరిగెడ్తానో, ఆమధ్యెప్పుడో .. "ఎక్కడా ఇంకా 30+ " అంటే .. "ఇంకో మాట చెప్పు " అన్నారు బ్లాగర్లందరూ ఇప్పుడేమో ఇలా... నెమ్మదిగా అడుగులో అడుగు నత్త నడక.. మొన్నెప్పుడో శ్రీవారు కూడా అననే అనేసారు "ఈమధ్య మరీ నెమ్మదిగా నడుస్తున్నావు, నత్త నడక అయిపోతోంది" అన్నారు. వాళ్ళకేం వాళ్ళు ఎన్నన్నా అనేస్తారు "పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదని సర్దిపుచ్చుకొని కాస్త అంటే కాస్త ఏదో మావారి కంటి నీటి తుడుపుకోసమన్నట్లు నా నడకవేగం కాస్త పెంచాను. నడకయితే ఏదో నా చేతిలోపనే కదా కాస్త చక చకా మార్చేసుకొన్నాను. కాని బ్లాగుల్లో అడుగులెలాగా? ఒక్కోసారి అసలేమి రాయాలో తోచదు, రాద్దామని ఏదో పాయింట్ దొరుకుతుంది, అప్పుడు పనిలో తలమునకలవుతాము.
ఇలా ఏదో నా మానాన నేను అడుగులు వేస్తుంటే తెలుగురత్న వారు ఆహ్వానించారు, సరే ఇదేదో బానే ఉంది ముగ్గురు చదివేది నలుగురు చదువుతారు. పర్లేదు అని అక్కడ కొన్ని వ్యాసాలు రాశాను. అలా మలి అడుగు వేసాను.
కొన్ని చర్చలు, కొన్ని వ్యాసాలు, మరికొన్ని కథలు... పర్వాలేదు అక్కడ కూడా ఆదరించారు అంతర్జాల మిత్రులు పడిపోకుండా అడుగులేయడానికి తోడ్పడుతూ..
ఇదిగో మరి మరో అడుగు ఇక్కడ, కొన్ని తెలియని తప్పులు, నెమ్మదిగా ఏమన్నా అడుగుల్ని నిలదొక్కోగలనేమో చూడాలి మీ ఆధరాభిమానాలతో.... మరో అడుగుని .... మరింకో అడుగుకి నాంది పలికేలా చేస్తారని కోరుకొంటూ... :-)

మీకు నా దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteఅభినందనలు రమణి గారు, మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మీ కుటుంబ సభ్యులకీ దీపావళి శుభాకాంక్షలు !
ReplyDeleteమీరు ఇంకా, ఇంకా, ఇంకా, చాలా అడుగులు...నెమ్మదిగా కాదు.. చాలా స్పీడ్ గానే వేసేయగలరు. దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteనాకు ఇష్టమైన నవల.. ఇక మీకు చెప్పాలనుకున్నది (ముగింపు రాయడం గురించి) బ్లాగ్మిత్రులు ఆల్రెడీ మీ దృష్టికి తేవడం, మీరు జవాబివ్వడం అయిపోయాయి.. మరిన్ని అడుగులు వేయాలని కోరుకుంటూ...
ReplyDelete