2.01.2011

చేతులెత్తి...ప్రార్థిస్తున్నా మీరూ తోడు రారూ.. :(

ఏడుపంటే యాఆక్క్క్క్క్...  

అని అనుకుని కూడా ఏడవకుండా ఉండలేకపోతున్నా.. కళ్ళు రెండు మసకబారుతున్నాయి, అక్షరాలు అసలు కనపడడం లేదు. కన్నీరు వరదలై పారుతోంది. (బయట  ఎదో కలకలం వినిపిస్తోంది ఒకసారి.. ఒహో వరదలైన నా కన్నీరుని బిందెలతో పట్టుకోడానికి వచ్చారులెండి :) ) . బ్లాగు జీవితమంటే విరక్తి పుడుతోంది. ఎదో ఒకటి చేయాలి, ఏమి చేయాలి? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు ప్చ్.. అయినా మా ఇంట్లో ఎందుకుంటాయి రాత్రి 9 అయ్యిందంటే చాలు సుష్టుగా భోజనం చేసి,  గురక పెట్టి మరీ నిద్దుర పోతాము మేము నలుగురం (నేను మా బుచ్చిబాబు, మా పాప,  బాబు అన్నమాట) ఇక స్లీపింగ్ పీల్ కి మా ఇంట్లో స్థానం లేదు. స్లీపింగ్ పీల్ ఎందుకా? ఆత్మ హత్యన్నమాట. ఇంత మాట పడ్డాక ఇంక నేను బతకడం కష్టం,  అసలెంత మాట అనుకున్నారు.. పోని ఉరి... ప్చ్..నా హైట్ కి fan  హైట్ సరిపోడం లేదు, ఏమి చేయను నా పాపానికి నిష్కృతి లేదా? రైలు కిందా... (అమ్మో నిజంగా ఎవరూ రాకపోతే.. రక్షించడానికి హిహిహి )  .

అసలునె నేనేమి చేశాను అంటారా? ఇంతవరకు ఒక్కసారి కూడా గీతచార్య బ్లాగు కాని, ప్రియ బ్లాగు కాని , సృజన గీతం బ్లాగు కాని చదవకపోవడం, కమెంట్ రాయకపోవడం.. ఇప్పుడు కూడా అట్లాంటిక్ లో పెళ్ళిట అని ఎవరో అంటే గూగులమ్మని వేడుకుంటే మలక్ గారి పోస్ట్ చూపించింది తప్పితే , అసలు ఆ గోల ఏమిటో ఆ కథ ఏమిటో మన ప్రియ అయ్యంగారు దెయ్యంగారయిన తరువాత కదా అప్పుడప్పుడు అక్కడ అక్కడ బ్లాగుల్లో వారు ఇచ్చిన లింక్ ద్వారా ఒకటి అర పోస్ట్ చదువుతున్నా.. ఎక్కడయినా నా కమెంట్ కనపడిందా? ఎంత తప్పది? ఎక్కడన్న ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు కాని, పెళ్ళిరోజు ఆశీర్వాదాలు కాని కనీసం ఒక్కటంటే ఒక ఫోటో కాని ఉందా అసలు. ఎంత పెద్ద తప్పది, ఈ బ్లాగు ప్రపంచంలోనే ఉంటూ అలాంటి బ్లాగులను పట్టించుకోకపోవడం .. ఛ ఛ నాకే చాలా విరక్తి కలుగుతోంది ఈ బ్లాగు మీద. అందుకే అందుకే ఆ విరక్తి తోటే, ఆ పశ్చాతాపం తోటే ఇదిగో ఇప్పుడు ఆత్మ హత్య అనుకున్నాను కాని, వర్క్ ఔట్ అవడం లేదు. 

అందుకే ఫైనల్ గా తీసుకున్న నిర్ణయం హిమాలయాలకి వెళ్ళి ముక్కు మూసుకుని బ్లాగులు రాసుకోడం(ముక్కు మూసుకుంటే ప్రాణాలు పోతాయేమో కదా) సరే అయితే ముక్కు మూసుకుని కాన్సెల్. అసలిదంతా ఇంత హఠాత్తుగా ఎందుకు చెప్తున్నానంటే ...ఇదిగో చూడండి మన అన్న మార్తాండ ఛాలెంజ్ నాతో.. అందుకని ...  ముహూర్తం చివర్లో చెప్తా ఎప్పుడో.
Marxist-Leninist-Feminist Revolutionary said...
ఈ సైకలాజికల్ అటాక్ కి మీరు బహిరంగ క్షమాపన చెప్పాలి. Multiple meanings లేకపోయినా అవి ఉన్నాయంటూ TestingWheel వ్రాసిన బురద జల్లుడు విమర్శలకి మీరు కూడా బాధ్యత వహించాలి.
Marxist-Leninist-Feminist Revolutionary said...
నేను జోక్ చెయ్యడం లేదు.  పది అర్థాలు వచ్చేలా వ్రాసారని మీరు నిరూపిస్తే నేను నిజంగానే సన్నాసుల మఠంలో చేరిపోతాను. నిరూపించలేకపోతే మీరు మీ కుటుంబాన్ని వదిలేసి కాషాయం కట్టుకుంటారా? చాలెంజ్ కి రెడీ అయితే praveen@pkmct.net కి మెసేజ్ పంపండి.
నాకు ఇంకా ఈ-మెయిల్ అందలేదు. రచయిత్రులు, పాఠకుల మీద సైకలాజికల్ దాడులు చేసే వాళ్ళు నాకు ఎప్పుడైనా ఈ-మెయిల్ పంపొచ్చు. చాలెంజ్ లో ఓడిపోతే నేను నిజంగా హిమాలయాలకి వెళ్ళి వైరాగ్యం స్వీకరిస్తాను.

ఇకపోతే ఈరోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాంటే నిన్న సాయంత్రం   6.30 కి నాకు కనువిప్పు కలిగింది ఒకానొక e mail   చదవగానే. అదికూడా ఇదిగో. 

Praveen Mandangi

 to gulabi98, me, alamurusowmya
show details 6:24 PM (6 hours ago)

Geetacharya is just simpleton. Why did you harass him? He closed all of his blogs. Why didn't you respond when real nasty writings came from the kelukudu gang in the name of dhoom and kagada? Why did you make only the Geetacharya as scapegoat? I phoned to Geetacharya yesterday. Srujana Ramanujan & Priya Iyengar's profiles are fake but the Geetacharya is the real name.


&&&&&

మార్టాండ గారు మీకు రిప్లై ఇక్కడే:

Geetacharya is just simpleton: అవునా ఇంతవరకూ మాకెవరికి తెలెయలేదే ..


Why did you harass him? : మీకెందుకలా అనిపించింది ఎక్కడన్నా మా  కమెంట్ చూశారా? మేమేమన్నా అతన్ని హింసిస్తున్నట్లుగా.. బాధిస్తున్నట్లుగా ....

I phoned to Geetacharya yesterday. Srujana Ramanujan & Priya Iyengar's profiles are fake but the Geetacharya is the real name.  : మీకు నిన్న ఫోన్ చేస్తేనే  తెలిసింది, మాకు  ఆమధ్యెప్పుడో  ప్రియ చనిపోయిందన్న రెండురోజులకే ఈ విషయం తెలిసింది చాలా లేట్ మీరు.

Why didn't you respond when real nasty writings came from the kelukudu gang in the name of dhoom and kagada?:  అండగా మీరుండగా .. మాకెందుకని.:)

సింపుల్ గా అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి .. అదే ఇక్కడ మార్తాండ గారు మీకోసం

వెళ్ళవయ్యా.. వెళ్ళు .. వెళ్ళూ..
 
******





ఇంత జరిగిన తరువాత నేనిక్కడ ఎలా ఉండగలను? మీరే చెప్పండి, అందుకే నాతోపాటు మీ అందరికి కూడా నా అహ్వానం మనందరం కలిసి హాయిగా హిమలయాల్లో బ్లాగుదాం వచ్చేయండొచ్చేయండొచ్చేయండి. :) ఇక ముహూర్తమంటారా ఇదుగిదిగిదుగో :

 శుభవాసర,  శుభ నక్షత్ర,,  శుభ యోగే.. తేదీ  " 25-20-2011" 

అందరు నాకు తోడు వస్తున్నారుగా మరి.. ఏది వచ్చేవాళ్ళందరూ " ఓ"  అని ఒక వ్యాఖ్య రాసేయండి. :)

 *******

10 comments:

  1. 2009 ఆగస్ట్ నెలలో గీతాచార్య నాకు ఫోన్ చేశాడు. అప్పట్లో నేను గీతాచార్యని తిట్టినా బాగానే మాట్లాడాడు. నిన్న ఫోన్ చేసినప్పుడు మొదట్లో నన్ను గుర్తు పట్టలేదు. అతను నన్ను గుర్తు పట్టిన తరువాత నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశానని అసలు విషయం చెప్పాను. అతను ఫేక్ ప్రొఫైల్స్ పెట్టిన మాట నిజమే కానీ అతన్ని తిట్టడానికి 'ప్రియ దెయ్యంగారు' పేరుతో బ్లాగ్ పెట్టడం బాగాలేదు.

    ReplyDelete
  2. ప్రవీణ్ నేను వచ్చెసా .... ప్రియా ను తిట్టడం బాలేదా లేక ఆ బ్లాగు పెట్టడం బాలేదా

    ReplyDelete
  3. ప్రవీణ్ నీ కామెడి ఆపు అక్కడ తార నీ మీద సినిమా తీస్తున్నాడు నువ్వు అక్కడకు వచ్చెయ్ .... మనం పోరడదాం

    ReplyDelete
  4. వామ్మో మీ బ్లాగు చూసేవరకూ నాకు మైల్ వచ్చిందనే విషయమే తెలీలేదు (చూసుకోలేదు)...ఈ దాడికి అంతెపుడో!

    నేనూ హిమాలయాలలోకి మీతోపాటే....

    ReplyDelete
  5. మార్టాండ గారు మీకు రిప్లై ఇక్కడే:
    -------------
    రమణి గారు ఇది అసలు బాగాలేదండి మీరు ఇలా ప్రవీణ్ ను కూడా పట్టించుకోని గారు అని రాయడం మా అభిమానులకు అసలు నచ్చదు .. ప్రవీణ్ గాడు అంటేనే ఆ పేరుకు కళ

    ReplyDelete
  6. అలాగే చదివేసుకొండి పవన్ గారు.. సౌమ్యా మనందరిదీ ఒకే దారి చైనాలో హిమాలయాల దారి :)

    ReplyDelete
  7. ఇలాంటి వేదింపులను అరికట్టడానికి సైబర్ సెల్ లో కేస్ బుక్ చెయ్యండి. సైబర్ సెల్ వాల్లు వేగంగా స్పందిస్తున్నారు. సైబర్ కేప్ యజమాని అయ్యుండీ ఇలాంటి వేదింపులకు దిగితే శిక్ష ఎక్కువ పడుద్ది. టీవీల వాళ్ళకి మంచి మసాలా న్యూస్
    " సైబర్ కేప్ యజమాని వేదింపులు " అంటూ .

    ఇంకో మార్గం ఏమిటంటే ఇతని ఈ మెయిల్ ని spam కింద మార్క చెయ్యండి. అంతే , ముందు ముందు ఈ ఐడీ నుంచి వచ్చేవి అన్ని స్పాం బాక్స్ లోకి పోతాయి ..

    ReplyDelete
  8. అయ్యో ...అలాంటి తొందరపాటు పనులు చెయ్యకండోయ్ రమణిగారు...అదే హిమాలయాలలోకి వెళ్ళడం కాదు...అది మీయిష్టం. ఈ ప్రవీణ్ గారి మెయిల్స్ ని స్పామ్ లో పెట్టడం గురించి నేననేది. బోల్డు వినోదం మిస్సయిపోతాం...చాలా రోజులయింది హాయిగా నవ్వుకొని.మీబాధ నాకు ఆనందమా అని కోపం తెచ్చుకోకండి మరి..మనందరం హిమాలయాలు దద్దరిల్లేలా నవ్వుకుందాం లెండి.

    ReplyDelete
  9. అన్నకి జనాల్లో ఇంత క్రేజ్ ఉండనుకోలేదు . బాబు చిట్టీ..............

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.