మొదట చూసిన టూరింగ్ సినిమా…
మొదట మొక్కిన దేవుని ప్రతిమ….
మొదటిసారిగ గీసిన మీసం…
మొదట వెసిన ద్రౌపది వేషం….
మొదటి ముద్దులో తెలియనితనమూ…
మొదటి ప్రేమలో తీయందనమూ ..
మొదట రాసిన/అచ్చయిన కథ..
ఇలా మొదట చేసిన ఏ పని అయినా ఆనందాయకంగా ఉంటుంది. బ్లాగ్ లోకంలో నేను సుపరిచితురాలిని.. ఇక దిన మాస, వార పత్రికలలో నేను అపరిచితురాలిని. అక్కడ కూడా నన్ను పరిచయం చయడానికి సహకిరించారు చిత్ర మాస పత్రిక వాళ్ళు..నా కథ జూన్ మాస పత్రికలో ప్రచురించి. “అమ్మ….” కథ పేరు.
మొదటి ప్రయత్నం అలా మొదలైందని ...ఇలా ఫలించిందని.. మొదటి కథ కి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని..
కథ …. ప్రస్థుత పరిస్థితుల్లో.. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో బార్యా భర్త ఇద్దరు ఉద్యోగులయినప్పుడు, తప్పని పరిస్థితుల్లో పిల్లలిని కేర్ సెంటర్లోనో, పెద్దవాళ్ళదగ్గరో ఉంచినప్పుడు బంధువులనుండి, ఇరుగుపొరుగు వారి నుండి ఎదుర్కునే మాటల తూట్లు.. పరిస్థితుల అవలోకనం.
నాకు చిత్ర మాస పత్రికలో కొల్లూరి సోమశంకర్ గారి కథ “సం ..సం.. మాయ” కథ కూడా నచ్చింది.. ముగింపు కొంచం కన్‌ఫ్యూజ్ అయ్యాను.
Very good Madam. Good Beginning. :D
ReplyDelete