హాయ్!! అందరూ బాగున్నారా? చాలా రోజుల తరువాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా పలకరించడం.. ఎప్పటికప్పుడు చాలా రాయాలి అన్న తపన ఉంటోంది కాని దానికి తగ్గట్టు టైం సెట్ చేయడమే కష్టంగా ఉంది. వీక్ ఎండ్ లో ఎదో ఒక ప్రోగ్రాం అనుకోడం రాయడం అనే నా కోరిక వాయిదా పడడం జరుగుతోంది.
అవునూ! మీలో ఎవరికన్నా XBRL సాఫ్ట్ వేర్ గురించి తెలుసా? తెలిసినవాళ్ళు ఆ సాఫ్ట్ వేర్ ఎక్కడ దొరుకుతుంది? ఏఅ రేంజ్లో దొరుకుతుంది ఇత్యాది విషయాలు చెప్పగలరా.. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో XBRL కొత్తగా ప్రేవేశపెట్టారు. జులై 15 నుండి ఉపయోగించవలసి ఉంది. తెలిసినవాళ్ళు కొంచం చెప్తారుగా మరి.
MCA Mandate
- All companies listed in India and their Indian subsidiaries.
- All companies having a paid up capital of Rs. 5 crores and above.
- All companies with a turnover of Rs 100 crores and above.
XBRL (Extensible Business Reporting Language)అన్నది వ్యాపారసంస్థలు తమ ఆర్థిక నివేదికలను ఒక ప్రామాణిక పద్ధతిలో (ప్రభుత్వానికి లేదా సంబంధిత చట్టబద్దమైన సంస్థలకు) నివేదించడానికి ఉద్దేశించిన ఒక markup language. ఈ రూపంలో కంపెనీలు నివేదికలను దాఖలు చేయడం వల్ల ఆ భోగట్టాని ఉపయోగించేవారు (అంటే వారి కంప్యూటర్ ఉపకరణాలు) ఆ నివేదికలను చదవడం, పరిక్రియాపన చేయడం తేలికవుతుంది. అలానే ఆ సమాచారాన్ని వివిధ రీతులలో ప్రదర్శించడానికి వీలవుతుంది. పలు సంస్థల ఆర్థిక సమాచారాన్ని పోల్చి చూడడానికీ పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. XBRL అన్నది XML ఫార్మాటులో ఉండటం మూలంగా వహనీయత (portability) సంబంధ సమస్యలు ఉండవు. XBRL అన్నది ప్రపంచ వ్యాప్తంగా ప్రామాణికం (లేదా సమీప భవిష్యత్తులో) అవుతుంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో వ్యాపార సంస్థలు చాలా మట్టుకు తమ ఆర్థిక నివేదికల్ని XBRL ఫార్మాటులో SEC (సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమీషన్) కి దాఖలుచేస్తున్నాయి. కొన్ని రకాల కంపెనీలకి ఇది తప్పనిసరి కూడా.
ReplyDeleteఇక XBRL సాఫ్ట్‌వేర్ అంటే, ఆర్థిక సమాచారన్ని XBRL ఫార్మాటులో తయారుచేయడానికి లేదా ఆ ఫార్మాటులో ఉన్న భోగట్టాని చదవడానికి ఉపయోగపడే ఉపకరణాలు అన్నమాట.
మరింత సమాచారం కోసం ఈ లంకెలను అనుసరించండి:
* XBRL గురించి వికీపీడియా వ్యాసం
* XBRL సాఫ్ట్‌వేర్ ఉపకరణాలు