11.20.2010

అనుకోకుండా ఒక రోజు....(మళ్ళీ ఈరోజు)

పుడమి తల్లి పులకరించింది... ఆకాశం దద్దరిల్లింది.. మేఘాలు వర్షించాయి.... ప్చ్.. ఇంకా తెలియలేదా అక్కా.. ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు చెపుతున్నా అర్ధం కాలేదా... ఇన్ని సంఘటనలకు దారి తీసిన ఆ రోజు ఆ ఒక్క రోజు ఇంక చెప్పుకోలేకపొతున్నావంటే॥ నీకసలు నామీద ప్రేమ.. అప్యాయత అనురాగాలు అసలున్నాయా??
తమ్ముడు తన ప్రతి పుట్టినరోజుని నాకు గుర్తు చేసే ప్రయత్నంలో జరిగే ఉప్పొద్ఘాతమది.. భలే సరదాగా అంటాడు॥ ఇవన్నీ వినడం కోసమన్నా.. మర్చిపోయినట్లు నటిస్తాను ఒక్కోసారి..
చిన్నప్పుడు... ఒక రోజు మిట్ట మధ్యాహ్నం వేళ .. మా అక్క వాళ్ళ స్కూల్ లో మా ఇంటి పక్కన నలుగురమ్మాయిలు... అర్జంటుగా ఆత్మహత్య చేసేసుకొందామనుకొన్నారట .. ఏమయ్యింది అని అడిగితే....యునిట్ టెస్ట్ సరిగ్గా రాయలేదని.. అక్క పరుగు పరుగున ఇంటికివచ్చి... వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉమ, ప్రసన్న, విజ్జి, మాధవి వీళ్ళంతా అక్కడ బావిలో దూకేస్తామంటున్నారు నన్ను వెళ్ళి చెప్ప మన్నారు అంది వగరుస్తూ... వాళ్ళ ఆమ్మలందరు.. నింపాదిగా అప్పడాలొత్తుకొంటూవున్నారు..వార్త విన్న తరువాత కూడా. ఆ తరువాత కొద్దిసేపటికి.. " అలాగా!!.. నువ్వు భోజనం చేసి వెళ్ళేప్పుడు.. మా ఉమ కి చెప్పు రేపు దాని పుట్టినరోజని .... అందిట సదరు ఉమ వాళ్ళ అమ్మ.. అక్క ఈ వార్త అక్కడ చేరవేయగానే.... ఆ ఆత్మహత్యాప్రయత్నాన్ని.. కాన్సిల్ చేసుకొందట ఆ ఉమ ఆమెతో పాటు మిగతావారు ఆమె బాటే.. పట్టారు.. పుట్టినరోజా???.. మజాక...
ఇలా ఎన్నో సరదా సరదా సంఘటనలు చోటు చేసుకొన్న ఈ పుట్టిన రోజుల సంబరాలంటే... ఎవరికి మటుకు ఇష్టం వుండదు చెప్పండి.. అందుకే తమ్ముడికి (గుర్తు చేయాలి) చెప్పాలి..
సరిగ్గా కొన్నేళ్ళ కిందట..నవంబర్ 20 న పుడమి తల్లి పులకరించింది.... ఆకాశం దద్దరిల్లింది... మేఘాలు వర్షించాయి... అని తమ్ముడికి చెప్దామనుకొంటున్నాను వాడి ఫందాలోనే... చాన్స్ ఇవ్వడు॥ రాత్రి కేక్ తో ప్రత్యక్షమవుతాడు... హ్యాపి బర్త్ డే అక్కా!! అంటూ... చూడాలి...
ప్రతి మనిషి.. తన జన్మకి పరమార్ధం తెలుసుకొని......
నా జన్మకి పరమార్ధం ఇంక తెలియకపొవడమే.. విశేషం.. అందుకే ఆ పరమార్ధం ఎప్పటికైనా తెలుసుకొవాలనే ఆకాంక్షతో మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని .... అనుకొంటూ వుంటాను..

6 comments:

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు రమగారు,

    ReplyDelete
  2. రమ గారూ
    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  3. నెనర్లు కృష్ణ మోహన్ గారు

    ReplyDelete
  4. బ్లాగు రాయడంలో కొద్దిగా confuse అయినట్టున్నారు. మొదట 'తమ్ముడు తన పుట్టినరోజుని నాకు గుర్తుచేసే సమయంలో' అన్నారు. చివర్లో మీ పుట్టినరోజనే అర్థం ధ్వనించింది. ఎవరి పుట్టినరోజైనా వాళ్ళకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు రమగారూ.

    ReplyDelete
  5. లేదు వింజమూరి గారు ... అలా తమ్ముడు వాడు పుట్టినరోజును గుర్తు చేసె తీరు నాకు నచ్చుతుంది.. ఈసారి నా పుట్టిన రోజున వాడీ రీతిలో వాడికి గుర్తుచేయాలి అని రాసాను పుట్టిన రోజు నాదే.. అర్ధం చేసుకొనేలా రాయలేకపొయానేమో సారి.. Thanks for your wishes.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...