" బస్ ఎక్కేప్పుడూ దిగేప్పుడూ జాగ్రత్త! బస్లో ఆ ఊచ పట్టుకో, రోడ్డు దాటేప్పుడు అటూ ఇటూ చూసుకో. వెధవపీనుగులు వేగంగా వచ్చి గుద్దెస్తారు. మన తప్పులేకపోయినా శిక్ష అనుభవించాలి. హనుమాన్ చాలిసా మనసులో అనుకొంటూ ఉండు. "
"సరే వెళ్తున్నా"
"వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అను, ఎన్నిసార్లు చెప్పాను నీకు వెళ్తున్నా అనొద్దని చెవికెక్కదా. కదిలే బస్ ఎక్కకు. బస్ ఆపకపోతే దిగకు. బస్ డ్రైవర్కి చెప్పు నేను ఆపమన్నానని."
"ఊ సరే"
*****
"హల్లో ఏమి చేస్తున్నావురా?"
"ఆఫీసులో ఉన్నా... ఏంటి చెప్పు"
"ఏమిలేదు ఏమి చేస్తున్నావో అని ఫోన్ చేసాను."
*****
"హల్లో"
"ఒంటిగంట అయ్యింది భోజనం చేసావా?"
"లేదు ఇంకా చెయ్యలేదు ఇంకో అరగంటలో చేస్తాను"
"ఇంకో అరగంటేంటి? ముందు భోజనం చేసేయ్! నేను చెప్పానని చెప్పు మీ సర్ కి. ఇంకా తినకపోడమేమిటి? అవునూ.. ఇంతకీ వంటేమి చేసావు?"
అబ్బా! సాయంత్రం ఇంటికొచ్చి చెప్తాను ఆఫీసులో ఏదో పనిలో ఉన్నాను"
****
"అమ్మలూ ఎక్కడున్నావు?"
"బస్లో ఉన్నా"
"ఇంతాలాస్యమేమిటే? ఇంకా ఇంటికి వచ్చేసావనుకొంటున్నా...అవును! పొద్దునుండి పిల్లలు రాలేదు, ఒకసారి ఫోన్ చేసి చెప్పు నేను రమ్మన్నానని".
"ఫోన్ ఎందుకు ఇంటికెళ్ళి చెప్తాలే. రేపు వస్తారు ఇహ ఈరోజు రారు"
"ఊ సరే.. బస్ దిగేప్పుడు.......మళ్ళీ మొదలు ...
*********************************************************
తల్లి.. తన కూతురు కాని కొడుకు కాని ఎంత ఎదిగినా వాళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడినా... ఇంకా తన పొత్తిళ్ళల్లో పిల్లలే అని భ్రమసిపోడం కద్దు దానికి తార్కాణం .. పైన నాకు మా అమ్మకి మధ్య జరిగిన ఓ దినచర్యలా రోజూ జరిగే ఆ సంభాషణ. నెనో ఇద్దరి పిల్లల తల్లిని. కాని ఆవిడ అలా జాగ్రత్తలు చెప్తునే ఉంటుంది. ఇలా నాకొక్కదానికే కాదు నాకు నా తోడబుట్టినవాళ్ళకు ఉండే రోజు వారి కార్యక్రమం ఇది.
తన కూతురు/కొడుకు "తనవాళ్ళు" అన్న ఒకే ఒక భావన తల్లి కి ఉన్నప్పుడు, అమ్మ "మా అమ్మ" అని అనుకోడం తప్పు కాదని నా అభిప్రాయం. అందరికీ అమ్మలా చెయ్యాలనుకోడం లేదా అందరికీ అమ్మలా ఉండాలనుకోడం నా జీర్ణం కాని విషయం . మొన్నా మధ్య మాటల సందర్భంలో మా అక్క "అమ్మ నీకు మాత్రమే చెయ్యాలి నీ పిల్లలిని మాత్రమే చూసుకోవాలి అని అనుకోకూడదే" అని అంది. "నీకున్నంత విశాల హృదయం నాకు లేదక్కా" అని కఛ్ఛితంగా చెప్పేసాను. అమ్మ నాకు నా తోడబుట్టిన వాళ్ళకి ,తనకి సంబంధించిన వాళ్ళకి కాక ఎవరికో సంబంధం లేని వాళ్ళకి, వాళ్ళ పుట్టినరోజులకి ఈవిడ నడుం బిగించేసి పులిహోరలు, పరమాన్నాలు, బొబ్బట్లు లాంటివి చేసేస్తాను అంటే నా మనసు అంత విశాల భావాలతో, అంత సహృదయంతో అంగీకరించలేకపోతోంది .
ఇంటికి వచ్చేఅతిధిలకి మర్యాదలు చెయ్యడం మన ఆచారం. అది మన సాంప్రదాయం వాటిని నేనెప్పుడు కాదు అనను. ఇంటికి ఎవరో వస్తున్నారని వేగు ద్వారా తెలిసింది. వాళ్ళని అమ్మకి వదిలేసి ఎవరి పని వాళ్ళు చూసుకోడం నాకంత సమంజసంగా అనిపించడంలేదు. 70 యేళ్ళ పెద్దావిడ వచ్చేవాళ్ళకి ఊడిగం చెయ్యడం నా మనసుకి ఎక్కడో గుచ్చుకోంటోంది. "చెయ్యను" అనలేని ఆవిడ అసహయతను ఆసరా చేసుకొని అడిగి మరీ పిండివంటలు చేయించుకొనేవారు ఎక్కువ. ప్రేమతో చేసేది వేరు , ప్రేరెపించి చేయించుకొనేది వేరు. మొన్నెందుకో ఒకసారి "నేనెందుకు చెయ్యాలి వీళ్ళందరికి" అని అమ్మ అని బాధ పడితే, ఇక్కడ ఉంటే మొహమాటం కొద్దీ చేస్తుంది. అసలు ఊళ్ళో లేకపోతే..... అన్న ఆలోచన వచ్చింది.
ఒక్కత్తే వెళ్ళలేదని ఎలాగు సెలవల్లోనే ఉన్నారని మా పిల్లలిని తోడు పంపాను. మనకి నలుగురి ఆచారాలు తెలియాలి మన చుట్టూ ఉన్న పలువురు ఎలా ఉంటారు అన్నది మన పిల్లలికి మనం తెలియజేయాలి. నా ఉద్దేశ్యం ఒక్కటే ఎంతసేపు మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పిల్లలికి నేర్పడం కాదు. అనుభవం వాళ్ళకి పాఠాలు నేర్పాలి. అనుభవం రావాలి అంటే వాళ్ళు నలుగుర్ని చూడాలి ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎంతసేపు మనదగ్గిరే కాకుండా కాస్త మనకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి పంపాలి, పిల్లలికి అమ్మా నాన్నతో పాటు మావయ్య, పిన్నులు, అత్తలు అందరిని ఇవ్వాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన ఆచారవ్యవహారాలు వాళ్ళకి నచ్చితే పాటిస్తారు లేకపోతే లేదు. పిల్లలిని నలుగుర్లోకి పంపడం ముఖ్యోద్దేశ్యం ఇదే. ముందుగా మాట్లాడడం తెలుస్తుంది. నలుగుర్లో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. భిన్న కుటుంబాల భిన్నాభిప్రాయల మనస్థత్వాలను చదివే అవకాశం ఉంటుంది. అందుకని ఊరు పంపాను.
నాకు గుండెల్లో గుబులే ట్రైన్ టికెట్స్ దొరకలేదని బస్ కి టికెట్స్ తీసాను.
*****
"బస్ ఎక్కేప్పుడూ దిగేప్పుడూ జాగ్రత్త! బస్లో ఆ ఊచ పట్టుకోండి, రోడ్డు దాటేప్పుడు అటూ ఇటూ చూసుకో. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకొండి. "
"సరే వెళ్తున్నా"
"వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అను, ఎన్నిసార్లు చెప్పాను నీకు చెవికెక్కదా వెళ్తున్నా అనొద్దని. కదిలే బస్ ఎక్కకు. బస్ ఆపకపోతే దిగకు. బస్ డ్రైవర్కి చెప్పు, అమ్మమ్మ బస్ తొందరగా ఎక్కలేదని, దిగలేదని, దగ్గరుండి దింపు, అమ్మమ్మకి చెప్పకుండా మీరు బస్ దిగకండి. బస్ నంబరు గుర్తు పెట్టుకో అన్ని బస్ లు ఒకేలా ఉన్నాయి ఎదో ఒక బస్ ఎక్కెయకు. నంబర్ చూసుకొని ఎక్కండి ఎక్కడన్నా దిగితే......" ఇలా నా ప్రవాహం సాగుతూ ఉంటే మా పాప అడ్డుకొంది.
అబ్బా అమ్మా నేను 10th కి వచ్చాను, పర్లేదు అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకొంటాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేనూ తమ్ముడూ ఇద్దరం ఉన్నాము కదా.
*****
అవునూ పాప 10th కి వచ్చింది. పెద్దదయింది పాపకి అన్నీ తెలుస్తున్నాయి, మరి నాకెందుకీ కంగారు? ఇన్ని జాగ్రత్తలు చెప్పల్సిన అవసరం లేదు. అదే.... అదే ....అందరి తల్లులకి అనిపించేదే. అది నా అంత ఎత్తుకి ఎదిగినా నాకు చిన్నపిల్లలా కనపడడం. మా అమ్మ ఏమి చదువుకోలేదు కాబట్టి ఇంకా అమ్మకి తెలిసి రాలేదు అని అనుకొన్నా ఇన్నాళ్ళు.... కాని నేను చదువుకొన్నాను కదా.... అంటే తల్లి పదవికి , చదుకోడం, చదువుకోకపోడం అనేది ప్రామాణికం కాదు. తల్లికి పిల్లలే పెద్ద ప్రామాణికం. చదువుకొన్న చదువుకోకపోయినా తల్లి పదవి విశిష్టత అది. తన పిల్లలు ఎప్పటికి తనముందు చిన్న పిల్లలు ... అందరికీ ఏదో ఒకటి చేస్తూ .. సదా మీ సేవలో... అనే తల్లి మనసుకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. అలా మనం మన కృతజ్ఞత ఏరోజన్నా చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరోజుకో పరిమితం కాదు , కాని ఇలా మన అమ్మకి ఎదో ఒకరోజు కేటాయించేసి ఆ రోజుకి బహుమతులిచ్చేస్తే మన ఋణం తీరిపోతుందా? అమ్మ గోరుముద్ద తిన్న ప్రతిరోజు ప్రత్యేకమే. అమ్మతో జాగ్రత్తలు చెప్పించుకొన్న ప్రతిరోజు ప్రత్యేకమే. అమ్మ ఆశీస్సులు అమ్మకి సంబంధించిన రోజుకే కాక ప్రతిరోజు మనకేలా వస్తాయో అలాంటి రోజులన్ని అమ్మకోసమే. అమ్మవే అన్ని రోజులు. " అక్కా ! నీకు పదో తరగతి చదివే కూతురుంది " అని తమ్ముడు సరదాగా రోజు గుర్తు చేస్తుంటే ... "అబ్బా ఎందుకురా ఊరికే వయసుని గుర్తు చేస్తావు " అని పైకి అంటాను కాని ఒక్కోసారి ఎంత గర్వంగా ఉంటుందో. కూతుర్ని, కొడుకుని చూసుకొంటుంటే. తల్లి హోదా ఆనందమది అమ్మ, పిల్లలు క్షేమంగా చేరారు అని తెలిసిన ఆనందంతో ఇంకో తల్లి మనసు రాసిన అక్షరమాల ఇది.
******

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.