సాంకేతిక నిపుణుల సలహాలు, WPC లో వారి సహకారంతో ... నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు కూడా..
"మాకు తెలిసిందే కొత్తగా మీరు చెప్పేదేముంది" అని తెలిసినవాళ్ళు వాళ్ళ సమయం వృధా చేసుకుని చదివినందుకు ధన్యవాదాలు తెలియనివాళ్ళు.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకి వచ్చే ప్రమాదాలని అధిగమించవచ్చు అని చిన్ని ప్రయత్నం.
మన జీమైల్ అకౌంట్ కి ఏమన్నా అజ్ఞాతల ఉత్తరాలు, బెదిరింపులు లాంటివి వస్తే, వారి ఐ . పి అడ్రస్ ని కనుక్కొకనుక్కోవచ్చట ఇలా.

మన జి-మెయిల్ అకౌంట్ మనము కాక ఇంకెవరన్నా ఒపెన్ చేస్తున్నారా.. అన్న విషయం తెలియాలంటే ఇదిగో కింద ఈ చిత్రం చూడండి, మన inbox కింద ఈ విధంగా ఉంటుంది అందులో మూడో లైన్‌లో లాస్ట్ అకౌంట్ activity ... అంటూ మనము ఇంతకుముందు ఎప్పుడు లాగిన్ అయ్యాము, ఆ ఐ.పి అడ్రస్ ఇస్తుంది. మరి మనము ఆ టైంలోనే లాగిన్ అయ్యామా అదే ఐ పి అడ్రస్ అవునా .. కాదా అని చూసుకుంటే సరి. డిటైల్స్ చూస్తే , ముందు రెండురోజుల చరిత్ర అంతా మనముందే. అది కనక మన ఐ.పి అడ్రస్ తో సరి కాకపోతే మన జి- మేయిల్ ఎవరో ఒపేన్ చేస్తున్నారని అర్థం. సో, మహిళలూ మరి కొంచం జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ జోనే కదా.
విరోధినుండి వికృతిలోకి అడుగుపెడ్తూ.. మనందరికీ జయం కలగాలని ఆశిస్తూ.... బ్లాగర్లందరికి వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శత్రువు అంటే కేవలం మనిషే కాదు.సమస్య చిరాకు,ఇబ్బంది,అసంతృప్తి,ఇవన్నీ కూడా మన శత్రువులే. వీటితో పోరాటమే యుద్ధం. మన శత్రువు ఎపుడూ మరణించడు.ఆ శత్రువు మీద నిరంతర విజయం సాధించడమే మన సంతృప్తి. సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంటుంది.సమస్య లేకపోతే ఆనందమే లేదు. కాబట్టి తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు.. ఇలా షడ్రుచుల సమ్మేళనం మన ఆనందమయ జీవితం కావాలని ఆశిస్తూ ఇప్పటికిక సెలవు
******
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.