నవంబర్.. ఈ నెలంటే నాకు చాలా ఇష్టం.. జనవరిలో కొత్త కాలెండర్ ఇంటికి తీసుకురాగానే మొదట నవంబర్ లో కార్తికమాస ప్రారంభం ఆతరువాత పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. తరువాత పంచమి అనుకుంటూ ఆ పంచమి వచ్చిన డేట్ ని ఒక రెడ్ పెన్సిల్తో గుర్తుగా పెట్టుకునేదాన్ని. అలా చిన్నప్పటినుండి పెళ్ళయ్యేదాకా అలవాటయింది. పోయిన సంవత్సరం చిన్నప్పటినుండి నా జ్ఞాపకాలని తవ్వుకుని, మంచికి ఆనందిస్తూ చెడుకు బాధపడి వీడ్కోలు చెప్తూ.... గడిపాను. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ నెల నాకోసం, నేను ఆనందంగా ఉండాలి.. అనుకుంటూ గడిపాను. ఈ సంవత్సరం ఈ నవంబర్ నా జీవితానికే ప్రత్యేకం. నేను మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. అది కూడా విషాదం లోంచి పుట్టిన ఆనందం అనుభూతి అని చెప్పొచ్చు.
"ఇదిగో ఇలా తిది వారం వర్జ్యం అంటూ ఒక్కో సంవత్సరం ఒక్కో తేది చెప్తున్నావు నీ పుట్టిన రోజు ఎప్పుడో ఎప్పుడు అర్థం కాదు నాకు.. ఆ పౌర్ణమిలు పంచమిలు కాకుండా డేట్ చెప్పు అని శ్రీవారు అన్నారని అవును ఈ తెలుగు తిధులు కాస్త కష్టమే అని పెళ్ళి అయి మూడు పుట్టిన రోజుల తరువాత తిధులు మానేసి తేది ప్రకారం (నవంబర్ 20. ) చేసుకోడం మొదలెట్టాను. కాస్త మా కుటుంబ సభ్యులు ఆ తేది గుర్తు పెట్టుకుని నాకు శుభాకాంక్షలు చెప్తారని.. అదే రివాజు మొన్న మొన్నటిదాక. ఈసారి నవంబర్ ఒకటో తారీఖే మా పాపతో సరదాగా అన్నా... "ఈసారి నా పుట్టినరోజు ఆదివారం వచ్చింది సెలవ రోజు ఛట్ నేను చేసుకోను" అని ….
పుట్టిన రోజు నాకెప్పుడు ఎన్నిసంవత్సారాలయినా ప్రత్యేకమే. పాపకి కూడా అదే చెప్పాను "పండగలెన్నయినా కాని కుటుంబ సభ్యులందరు కలిసి వేడుక చేసుకోవాల్సినవి.... కాని మన వ్యక్తిగతం మనకోసం మన సంతోషం అనుకునేవి పుట్టిన రోజు, పెళ్ళిరోజు ఈ రెండు మటుకు మనం పండగలా చేసుకోవాలి. అది ఎలా అన్నది వారి వారి " ఆలోచనలు అభిప్రాయాలను అనుసరించి ఉంటాయి " అని .. ఎందుకింత చెప్పాల్సివచ్చిందో కాని, అనుకోకుండా సందర్భం లేకుండా చెప్పాను.
అదే తిరిగి నాకు మళ్ళీ అప్ప చెప్పింది మా పాప.. ముందు రోజే అక్కా వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇస్తే నవ్వొచ్చింది ఇలా ఉండి పుట్టినరోజు అవసరమా? .. ఇది ఒక భారం తప్ప అనుకున్నా.. కాని నేనలా అనుకోకూడదనుకున్నారో లేక ఆలోచించకూడదనుకున్నారొ మరి నాకెలాంటి ఇబ్బంది కలగకుండా నా పుట్టినరోజు వెడుక జరిపించి.. నా కళ్ళ నుండి నీళ్ళు తెప్పించారు నా కుటుంబ సభ్యులు. ఆనందం.. నేనెప్పుడు కోపం వస్తేనో, నా మాట విననప్పుడో మా వాళ్ళని కసురుతూ ఉంటా “మీరందరూ ఏ జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేసారో నేను మీకు అమ్మగా(పిల్లతో ) బార్యగా(శ్రీవారితో) దొరికాను అని అంటూ ఉంటా.... అదే మరి నేనేమి పూజ చేసుకున్నానో ఎమఒ కాని వీళ్ళంతా నాకు లభించారు అని మనసులో అనుకుంటూ ఉంటా ఇప్పుడు ... అలా నన్ను నేను మరిచిపోయేలా నాకు చేదోడుగా ఉంటున్నారు నావాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నాకు ఆనందాన్ని పంచారు.. పిల్లలిద్దరు కొత్తబట్టలు , కేక్ అంటే ... శ్రీవారి ప్రేమ ఇంకోవిధంగా , అమ్మ నాకిదిష్టం అది ఇష్టం అంటూ వంటలు, ఆప్తమిత్రుల శుభాకాక్షలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసాయి. చాలా ఆనందంగా ప్రత్యేకంగా చేసుకున్న మొదటి పుట్టినరోజు ఇది. ఏందుకిలా చెప్తున్నాను అంటే నేను ప్రస్తుతం కదలలేని పరిస్థితిల్లో కూడా చాలా మనో ధైర్యంగా ఆనందంగా ఉన్నాను .. దానికి కారణం నా కుటుంబ సభ్యులు. వారందరికి నా కృతజ్ఞతలు ఇలా చెప్తున్నాను. ఎందుకు కదలేని పరిస్థితి అంటే ఇప్పుడు ఫొటో చూపిస్తాను.. నా ప్రతి ఒక్క అనుభవం మీతో తొందరలో పంచుకుంటాను.. అంతవరకు….

ఒకసారి ముందు పుట్టినరోజుల సందడి ..... ఇక్కడ ఇంకోసారి..
20 నవంబర్ 2008 బ్లాగు రివ్యూ: మనలోని మాట – నా మనసులోని మాట
నవంబర్ 20 2010
నవంబర్ 20, 2011
నేనిలా ఉన్నా.... అయినా కాని పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేసుకున్నా.. ఆనందంగా.... ******
hmmm Belated Birthday Wishes Ramani garu.. good to know that you enjoyed your day :-) Also get well soon.
ReplyDeleteBelated birthday wishes. What happened to your foot ? Hope you will recover soon. Take care.
ReplyDeleteనాకు ఎప్పటి నుంచో ఒక సందేహం.....అసలు పుట్టిన రోజు ఎందుకు జరుపుకోవాలి? ఆహా ( ... అంటే ఎ ఆనందం లో అని??????? మన జీవితం లో నుండి ఒక సంవత్సరం కోల్పోయాం అనా ??? లేక చావు కి దగ్గర అవుతున్నమనా...లేకపోతె మనం పుట్టడం వాళ్ళ సమాజానికి దేశానికీ పెద్ద మేలు చేసామన?? అసలు ఎందుకు అని నా డౌట్.....ఇది నిజంగా డౌటే నండి .....
ReplyDeleteఏది ఏమైనా ............. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...ఆయు ఆరోగ్యాలతో ..నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ..ఆ సృష్టి కర్త ను కోరుకుంటూ,,,
మీ,
RAAFSUN
వేణుశ్రీకాంత్ గారు, సుజాత గారు థాంక్స్ అండీ..
ReplyDelete@ raafsun గారు : థాంక్స్ అండి.. ఇలా ఆలోచిస్తూ పోతే , అసలు పుట్టినరోజే కాందండి.. ఎందుకు పుట్టామన్నది కూడా పెద్ద సందేహమే.. అసలు మన జీవితమే అర్థం లేని జీవితం.. పండగలెందుకు చేసుకుంటున్నాము అంటే వృత్తిపరంగా ఎక్కడెక్కడో స్థిరపడి యాంత్రిక జీవితం గడుపుతున్న అన్నా, అక్కా, చెల్లి అందరూ కలుసుకుని సరదాగా గడపడం.. దీనికంటూ పండగలు అనేది నా ఉద్దేశ్యం.. ఇలా ప్రతీ రోజు చేయలేము కదా ఎందుకంటే మనం బతకాలి కదా :) ... అలాగే పుట్టినరోజు.. "నేను పుట్టాను" అంటే కారణమయిన అమ్మా, నాన్నలకి కనీసం ఆ ఒక్కరోజన్నా టైం చూసుకుని పుట్టినరోజు వేడుక చేసుకుంటూ థాంక్స్ చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోగలమా చెప్పండి? రోజు థాంక్స్ అంటే థాంక్స్ కి విలువ ఉండదు..
ఇకపోతే ఆయుష్హు.. ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్ళమనుకుంటూ చావుభయంతో రోజు బతకడమెందుకండి అసలు? అవసరమా... చస్తాం చస్తాం అనుకుంటూ బతికేకన్నా ఉన్న నాలుగురోజులు సంతోషంగా గడపాలన్నది నా అభిప్రాయం..... "ఇంకోమాట దేశానికో ప్రపంచానికో ఏదో చేయాలి" .... హహ్హాహ .. నేను ఈ విషయంలో చాలా చిన్నదాన్నండి.. నేను నా కుటుంబానికి ఏమి చేయగలను అని మాత్రమే ఆలోచించేంత చిన్నదాన్ని. ఏమి చేసాను అని .. పుట్టినరోజు గట్రా అంటే
నాకో కుటుంబాన్ని ఇచ్చిన మా అమ్మా., నాన్నల ఆశయాలు నెరవేర్చడమనే ఒక గురుతర బాధ్యతని నిర్వర్తిస్తున్నాను.. గృహిణిగా..
పిల్లలికి నేనేమి చేయగలను.. అని ఆలొచించి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నా అమ్మగా...
భర్తకి ఏవిధంగా సహాయపడగలను.. వేణ్ణీళ్ళకి చన్నీళ్ళల్లగా అని నిరంతరం శ్రమపడుతూ ఉంటాను బార్యగా/ ఉద్యోగినిగా..
నావరకూ నేను పుట్టి అంతో ఇంతో ఎదో చేయగలను చేస్తాను అనే నమ్మకం.. చావు ఎప్పుడు దగ్గరవుతుందా అనో,. ఈ సంవత్సరానికి నా ఆయువు తగ్గిందన్న ఆలోచన నాకు లేదండి.. మధ్యలో ఇలా చిన్న చిన్న అవాంతారల వల్ల నేను ఏమి చేయలేకపోతున్నానేమొ అనే బాధ తప్ప.. :)
అయ్యో ..రమణి గారు మీ మూడ్ అంతా పాడు చేశాననుకుంటా.... సారి అండి...ఏదో వేళ్ళకి వచ్చినట్లు టైపు చేస్తే మీరు ఇంతలా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు...నిజంగా సారి అండి ...నావి ఏదో పిచ్హ DOUBTS లెండి..... వదిలేయండి...
ReplyDeleteఏది ఏమైనా చాల చక్కటి వివరణ ఇచ్చారు ....మీ టైం నా వెధవ కామెంట్ కోసం వెచ్చించినా..అందరికి ఉపయోగపడే విషయాలు రాసారు....అందుకోసం నన్ను నేను పోగుడుకోక తప్పట్లేదు. (కిచ కిచ కిచ ) {కామెంట్ రాసినందుకు లెండి }.....
మీ రాతలు నాకు నా లాంటి వాళ్ళకి ఆచరణీయం ....
ఎప్పుడు మీరు నవ్వుతూ మీ బాధ్యతలని , సేవ ని కొనసాగించాలని కోరుకుంటూ ........
ఓ చిరు ప్రాణి
RAAFSUN
RAAFSUN gaaru :- :) నెనర్లు.. ఒక వివరణ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చారనే నేను అనుకున్నానండి.. విలువైన సమయం అని ఏమి లేదు.. సమయాన్నీ వివరణ ద్వారా సద్వినియోగపరుచుకున్నాను .. అని నాకనిపించింది/తోచింది చెప్పడం ద్వారా..
ReplyDeletewhat happened ..sorry to see u in that position..get well soon...
ReplyDeletewhat happened..anduke cheppa skipping ippudu koodadani..get well soon...
ReplyDeleteuthappa గారు: మీ విషెస్ కి చాలా చాలా థాంక్స్ అండి. మీరెవరు? స్కిప్పింగ్ ఏంటి? అసలు నేను స్కిప్పింగ్ ఆడలేదే.. మీరు వద్దు అనడమేమిటి? ఎమో అంతా అయోమయంగా ఉంది. ఒకసారి మీ ఊతప్ప తెరచాటు తీసి అసలు పేరుతో రండి.. నా మట్టిబుఱ్ఱకేమైనా అర్థం అవుతుందేమో చూద్దాం.
ReplyDeleteutappa ante murty.murty
ReplyDeleteutappa ante murty.murty
ReplyDeletehow r u now .r u able to walk
ReplyDeletehow r u.r u walking by now
ReplyDeleteuthappa/murty.murty gaaru thanks for your wishes no worries am ok now .. will be walk after feb 8th (Dr. said it will take 10-12 weeks)
ReplyDelete