అతడు: నీ పైట నా పడవ తెరచాపకావాలా...
ఆమె: నీ చూపే చుక్కానిగా దారి చూపాలా...
మగచూపులకి సంబంధించి ఆర్టికల్ చదివాను. సినిమాల్లోనూ బయట ఆడవాళ్ళని మగవాళ్ళు చూసే విధానాన్ని విడమర్చి చెప్పారు రచయిత్రి. హుందాగా రాసారు.
కాకపోతే అనాగరిక కాలం నుండి ఇప్పటి వరకు కూడా మగవాడు చూస్తేనే స్త్రీలు ప్రతిస్పందిస్తేనే కదా సృష్టి జరిగింది ఆ క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నారు? ఆడదాన్ని వస్తువుగా పరిగణించి చూపుల వ్యాపారం జరుగుతోంది అంటున్నారు, అన్నిచోట్లా కాదు కాని కొన్ని వాణిజ్య ప్రకటన్ల్లో జరుగుతోంది వాటిని నిరసిద్దాము. ఇక అసలు మగ చూపులే లెకపోతే ఆడవాళ్ళ అందానికి న్యాయం/ఉనికి ఉందా? అందం అస్వాదించే నైజం/గుణం మగవాడికి లేకపోతే ఈ వర్ణనలు ఎలా వస్తాయి? ఏముంది కళ్ళు ముక్కు , చెవులు అని అనేస్తే సరిపోతుంది కదా! శంఖం లాంటి మెడ, కలువల్లాన్టి కళ్ళు, చంద్రబింబం అంటూ మగ చూపులే ఆడదాన్ని అందంగా వర్ణించేది ఆ రసిక హృదయం ఉండాలి కదా! మనుగడో, మానసిక ఉల్లసామో , ఆహ్లాదకరమయిన ఆనందమో ఏదయితేనేమి అదంతా కలిపితే శృంగారం అయినప్పుడు మగవాడి చూపుని మడి కట్టుకోమనడం సబబా? అదే జరిగితే అసలు ఈ శృంగార కవులు ఎలా పుట్టుకొచ్చారు? ఏ అనుభవం ఏ రసాస్వాదన లేకుండా ఆడవాళ్ళకి కాలికొన గోటి వేలినుండి తలవెంట్రుక దాక ప్యాక్ చేసేసి కలం పెట్టి శృంగార కవితలు రాసారా?
వెకిలి చూపులు వెకిలి చేష్టలు లాంటి మృగచూపులు ఉండకూడదు కాని మగచూపులు కావాలి ఏ ఆడదానికయినా.. ఎవరో అన్నారు ! సినిమాలు విజయం సాధించిన ఇంద్రసూయి, కిరణ్‌బేడి లాంటి సినిమాలు తీయాలి అని మనలో మనమాట వాళ్ళు కూడా ప్రకృతి సహకరిస్తే సృష్టి కార్యం అంటే మగచూపులు తగిలితేనే మనకి ఈరోజు కనిపిస్తున్నారు. వారు హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు. వినిపించే విజయ గాధలలో సాహసకృత్యాలు చెప్తారు కాని, కనిపించే సినిమాలో హుందాగా ఒకటో రెండో సంసార తరహా సీన్స్ చూపిస్తారు.
ప్రకృతి తరువాత అంత అందమయినది స్త్రీ. నిండుగా కట్టే చీరలో కూడా మగవాడి చూపుల్ని కట్టిపడేస్తుంది మరి ఆ చూపులే వద్దంటే? పెద్దవాళ్ళెందరినో ఉదహరించి ఆఖరికి వాళ్ళు కూడా చూపుల వస్తువుని చేసేసారు ఆడదాన్ని అంటే? ప్రకృతి అందాల్ని చూడడానికి అరకులోయ , ఊటి , కొడైకనాల్ అంటూ వెళ్తాము అక్కడికె వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకుంటామా? అందాన్ని ఆస్వాదిస్తాము. సౌందర్యారాధన అది, వద్దంటే ఎలా?
(పైన ఫోటోలో : ఇక్కడ ఆమె నిండుగానే ఉన్నా అందంగా ఉంది చూపు తిప్పుకోలేని అందం కనిపించినప్పుడు అధ్యక్షుడయినా సరే, మగవాడు మరి చూస్తాడు కదా.. ఇది ఆమె తప్పు కాదు అతని తప్పు కాదు అందం తప్పు. )
****
సినిమాల ప్రస్తావన: పూలరెక్కలు, కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అంటూ ఏ అనుభూతి అనుభవం, చూపుల తాకిడి లేకుండానే జఢపదార్థాలుగా మడికట్టుకుని రాసారా ఈ పాటలు మడికట్టుకునే నాభి అందాలని చూపిస్తూ వర్ణించారా సినీ కవులు, ప్రొడ్యూసర్లు? సౌందర్యారాధన తప్పు కాదు. దేవాలయాలో చెక్కిన శిల్పాల గురించెందుకు మాట్లాడరు? ఏ మగ చూపులు సోకని అందాలా అవి? రమ్యకృష్ణ నాభి సౌందర్యాన్ని సుడిగుండంతో పోల్చారు, ఎంతటి పరిశీలాత్మక ఆరాధన లేకపోతే అంత ఉపమానలంకారాలు వస్తాయి? పాత సినిమాలనుండి ఇప్పటి సినిమాల వరకు నిండుగా చీర కట్టుకున్న సావిత్రి మొదలుకొని నిన్న మొన్న జయప్రద , సౌందర్య లు కూడా మగవారి చూపుల్ని కట్టిపడేసిన వారే. ఆ చూపులే లేకపొతే ఆందానికి ఉనికి ఉందా అసలు.
ఆడదాని అందాలకి ఉనికి తెచ్చే మగ చూపుల గురించి యుద్ధం చేయకండి చచ్చు పుచ్చు వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి అవేవో స్ప్రే వల్ల ఇల్లు వళ్ళు మరిచి అతనివెంట వెళ్ళింది అంటూ ఆమె మెడలో మంగళసూత్రాలని సింబాలిక్ గా చూపిస్తూ వాటిపై ద్వజం ఎత్తండి. చూపుల శరఘాతాలని మధ్యలోనే తిప్పి పంపకండి, మనకి మృగచూపులు వద్దు మగచూపులు కావాలి.
అసలిలా మగచూపులు, బ్రహ్మచర్యాలు, సన్యాసి అవతారాలు అంటే నాకు వళ్ళు మంట... సృష్టిలో ఇన్ని అందాలని ఇచ్చి ఇంత మేధస్సు ఇచ్చి సంతోషంగా జీవించమంటే సూక్తులు రీతులు చెప్తూ ఉంటారేంటో. సంసారం రంధి సన్యాసం మంచిది అని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారో ఆ ఆంతర్యం తెలుసుకోవాలి మొదట. కామిగాని వాడు మోక్షగామి కాలేడు, రసాస్వాదన, సౌందర్యారధన, అందాన్ని అస్వాదించేలేని వాళ్ళు మగచూపుల ఆంతర్యం తెలుసుకొలేనివాళ్ళు స్పందన లేని యంత్రాలు నా దృష్టిలో.
అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే... చాలవరకు ఆడవాళ్ళ పైట తెరచాప అయితే మగచూపులు చుక్కానిగా దారి చూపేవే..
*******
అన్ని చూపులందు మంచి చూపులు వేరయా అనిపించిన మీ విశ్లేషణ బావుందండీ :)
ReplyDelete~ లలిత
Thanks Lalitha garu!
Deleteమీరు ఫీలవనంటే ఒక చిన్నమాట ! మీ బ్లాగ్ టెంప్లేట్ లో మేటర్ కట్ అవుతున్నదండీ,ఏది చెప్పాలన్నా ఇబ్బందిగా ఉంది.ఈ మధ్య బ్లాగర్లు ప్రతి చిన్నవిషయానికీ తెగ ఫీలయిపోతున్నారు !
ReplyDeleteThank you asalu feel avaledu.. change chesaanu
Delete
ReplyDeleteఅసలిలా మగచూపులు, బ్రహ్మచర్యాలు, సన్యాసి అవతారాలు అంటే నాకు వళ్ళు మంట... సృష్టిలో ఇన్ని అందాలని ఇచ్చి ఇంత మేధస్సు ఇచ్చి సంతోషంగా జీవించమంటే సూక్తులు రీతులు చెప్తూ ఉంటారేంటో. సంసారం రంధి సన్యాసం మంచిది అని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారో ఆ ఆంతర్యం తెలుసుకోవాలి మొదట. కామిగాని వాడు మోక్షగామి కాలేడు, రసాస్వాదన, సౌందర్యారధన, అందాన్ని అస్వాదించేలేని వాళ్ళు మగచూపుల ఆంతర్యం తెలుసుకొలేనివాళ్ళు స్పందన లేని యంత్రాలు నా దృష్టిలో.
same feeling for me too.... లేట్ గా వచ్చినా లేటెస్ట్ పోస్ట్‌తో వచ్చారుగా ? బాగుంది.
Thank you!
Delete