"నాలో కలిగిన ఈ అంతర్మధానినికి దగ్గరగా ఉండే ఈ ఆలోచనలు ఒక అమ్మాయి నుండి రావడం కొత్తగా ఉంది"-నేను రాసిన 'సప్తపది' టపా స్పందనగా దిలీప్ గారి వ్యాఖ్య.
పై వ్యాఖ్య నా ఆలోచనలనో ఊపు ఊపింది నిజం చెప్పాలంటే.
దిలీప్ గారి ఈ ఆలోచన వల్ల నాకు మొదట్లో " ఎందుకు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కలగకూడాదా?"అని ప్రశ్నించాలని అనిపించినా, తరువాత నా ఆలోచనలని కాస్త అటువైపు మరలిస్తే, అందులో నిజం లేకపోలేదనిపించింది. ఎందుకంటే, "మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుంది" అంటూ ఆడవాళ్ళు ఎప్పటికి అధారపడేవాళ్ళే చల్లని పందిరి ఉండాల్సిందే, ఫలానా వాళ్ళ కూతురు, ఫలాన వాళ్ళ సోదరి, ఫలాన వాళ్ళ బార్య అంటూ ఎప్పటికప్పుడు ఎవరిదో ఒకరి పేరు తగిలించి ఆధారపడేలా చేస్తారు తప్పితే వాళ్ళ సొంత పేరుతో గుర్తించే వారు ఎంతమంది? ఈ విధమైన ఆధారపడడం అనే విధానాన్ని, ఉగ్గుపాలతో సహా నేర్పేయడం వల్ల వాళ్ళకంటూ స్వతంత్ర అభిప్రాయాలు, సొంత ఆలోచనలు తక్కువే ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు). మరి అలాంటప్పుడు దిలీప్ గారి ఆలోనలు తప్పు లేదు అనిపించింది.
దిలీప్ గారి ఈ ఆలోచన వల్ల నాకు మొదట్లో " ఎందుకు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కలగకూడాదా?"అని ప్రశ్నించాలని అనిపించినా, తరువాత నా ఆలోచనలని కాస్త అటువైపు మరలిస్తే, అందులో నిజం లేకపోలేదనిపించింది. ఎందుకంటే, "మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుంది" అంటూ ఆడవాళ్ళు ఎప్పటికి అధారపడేవాళ్ళే చల్లని పందిరి ఉండాల్సిందే, ఫలానా వాళ్ళ కూతురు, ఫలాన వాళ్ళ సోదరి, ఫలాన వాళ్ళ బార్య అంటూ ఎప్పటికప్పుడు ఎవరిదో ఒకరి పేరు తగిలించి ఆధారపడేలా చేస్తారు తప్పితే వాళ్ళ సొంత పేరుతో గుర్తించే వారు ఎంతమంది? ఈ విధమైన ఆధారపడడం అనే విధానాన్ని, ఉగ్గుపాలతో సహా నేర్పేయడం వల్ల వాళ్ళకంటూ స్వతంత్ర అభిప్రాయాలు, సొంత ఆలోచనలు తక్కువే ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు). మరి అలాంటప్పుడు దిలీప్ గారి ఆలోనలు తప్పు లేదు అనిపించింది.
అసలెక్కడిదాకో ఎందుకు? నేను రాసిన 'సప్తపది ' ఆర్టికల్ కి మహిళా పాఠకుల స్పందన మటుకు ఎంతవరకు ఉంది? (theresa గారు తప్పితే) అక్కడికీ నా స్నేహితులని ఒకరిద్దరిని "మీ అభిప్రాయం ఏంటి" అని అడిగితే "బాగుంది" తప్పితే ఇంకేవిధమైన స్పందనా లేదు. మా ఆడవాళ్ళమంతా ఇంతే, టి.వి లో అత్తా కోడళ్ళ ఏడుపుగొట్టు సీరియళ్ళను, మా శక్తి కోలదీ కన్నీళ్ళు కార్చేస్తూ, రెప్పేయకుండా అసలేవిధమైన ఆలోచన లేకుండా చూసేసి, ఆనక అంతే కోపంతో సదరు అత్తాకోడళ్ళని శాపనార్ధాలు పెట్టేస్తూ, దీని గురించి అనవసరంగా అర్ధం లేని చర్చలు చేసేసుకొంటాము వెరసి ఫొను బిల్లులు, సెల్ బిల్లులు తడిసి మోపెడంత అయ్యేలా.
ఒక అర్ధవంతమైన చర్చ ఏదన్నా జరుగుతుంటే అరంగుళం కూడా ముందుకు కదలము, పైపెచ్చు అదేదో మగవాళ్ళ పనే మనకి సంభందం లేదన్నట్లు ఉంటాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరో ఇద్దరో ఇందుకు కొంచం భిన్నం గా ఉంటే, మిగతావారికి "ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా ?" అని అనుకోవడం సహజమేగా మరి.
రోజూ సాయంత్రం నేను నా స్నేహితురాలు కలిసి ఎక్కే ఓ లోకల్ ట్రైన్ లో మా ముందు స్టేజ్ లో ఒక మహిళ ఎక్కుతారు, ఎంతో హుందాగా, చిరునవ్వుతో ఆ పలకరించే విధానం అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో ఆవిడని చూడగానే ఒక విధమైన గౌరవం దానితో పాటు ఆవిడ మాట్లాడే విధానం, అదీ చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. మాట్లాడకుండా ఆవిడనీ, ఆవిడ మాటలని గమనిస్తూ ఉంటాను.
ఓ రోజు మాటల సంధర్భంలో, ఈ విషయం నా స్నేహితురాలితో మామూలుగా అన్నాను.
"ఆ! ఆవిడకి అంత లేదు లెండి, వాళ్ళాయన పచ్చి తాగుబోతు, తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు" అంది నా స్నేహితురాలు వ్యంగ్యంగా.
వాళ్ళయన తాగి పడిపోడానికి, నాకు ఈవిడ మాట్లాడే తీరు నచ్చడానికి అసలు సంభందమంటూ ఏమైనా ఉందా? ఒక అమ్మాయిని/మహిళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతోనో లేదా భర్త ప్రవర్తనతోనో అంచనా వేయడం ఎంతవరకు సబబు? ఎవరికి మటుకు ఉండదు తన భర్త క్షేమంగా ఉండాలని, అలా ఈవిడ మటుకు చెప్పుకోదా ఇది మంచి పద్దతి కాదని? అతను వినకపోతే ఈమె ఏమి చేస్తుంది? అంతమాత్రానికి వాళ్ళని వాళ్ళ సొంత వ్యక్తిత్వాన్నీ చులకన చేస్తామా? చేతనైతే ఓదార్చగలగాలి, కాని భర్త ని అడ్డుపెట్టుకొని మనిషిని చులకనగా అంచనా వేయడం అంత సబబు కాదేమొ అనిపిస్తుంది నాకు.
నా మటుకు నాకు, భర్త హోదాని అడ్డుపెట్టుకొని ఆడంబరంగా ఉండడమో లేదా భర్త చెడు అలావాట్లని తలుచుకొని కృంగిపోతూ మనల్ని మనం చులకన చేసుకొవడం అంటే నచ్చని విషయం. మన సొంతంగా మనమేమి చేయగలము అనేది ఆలోచించాలి. భర్త పేరో, లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరో వాడుకొని పని చేయించుకోవడం అంటే , అప్పు చేసి పప్పు కూడు తింటున్నామేమో అనిపిస్తుంది.
మారుతున్న ఈ తరంలో ఆడవాళ్ళు ఇలా భర్తని బట్టి బార్య అన్నట్లుగా ఉంటే, మరి ఇలాంటి అంతర్మధనం అమ్మాయిలో కలగడం కొత్తగా ఉంది అని అనడం అమోదయోగ్యమేగా మరి.
"నీతో ఎవరన్నా మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పొతారు, నువ్వెవరితోనన్నా మాట్లాడకపోతే అది నీ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పోతావు " అని అనుకొని మన అభిప్రాయాలని నిరభ్యంతరంగా చెప్పగలగాలి.
మీరు చెప్పింది నిజమే రమణిగారు,
ReplyDeleteఆడవాళ్ళు ముందు తమని తాము ఎలా ఉండాలి అని ఆలోచించాలి. భర్త పేరుతో కాని భర్తపై ఆధారపడి ఉండడమా? లేదా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకోవడమా అని.. అలా గుర్తింపు కావాలనుకుని కష్టపడే మహిళలు తప్పకుండా విజేతలవుతారు. అందుకు నేనే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇది గొప్ప కాదు. నేను ఉద్యోగం చేయడం లేదు. నాకంటు సంపాదన లేదు. ఏదో టైమ్‍పాస్ కి కుట్లు అల్లికలు, పెయింటింగ్ లాంటివి నేర్చుకున్నాను. కాని అవి తాత్కాలికం. కాని నా కుటుంబ వ్యవహారములు చెడకుండా, నాకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాను, ఎంతో మంది శ్రేయోభిలాషులను నా చుట్టు చేర్చుకున్నాను. ఇలా నేను ఎవరి వల్లా గుర్తింపబడకుండా. నేను నేనుగా గుర్తింపు పొందాను అంటే నేను అలా అనుకున్నాను కాబట్టి. మీ టపాలో చెప్పినవన్నీ అక్షరసత్యాలే. కాని అలాంటి వాళ్ళు ఉన్నారు కాని తక్కువ మంది. ఎంతోమంది ఆడవాళ్లకి పెళ్ళయ్యాక ఇక చేసేదేముంది. మొగుడు సంపాదిస్తాడు. ఇంకా నేను చేసేదేముంది. నాకెందుకు ప్రత్యేక గుర్తింపు. పేరు, ఐన ఐది నా వల్ల అయ్యే పనా? అవసరమా ? అని కాలం గడిపేస్తుంటారు. అలాంటి వాళ్ళను ఎవ్వరూ మార్చలేరు.
మీరు రాసిన సప్తపది టపాను నేను ఐదుసార్లు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఉహూ.. అంత సీరియస్ విషయాలు నా బుర్రకెక్కవు అని అర్ధమై వదిలేసా. క్షమించండి..
bAgA ceppAru.
ReplyDeleteమీ స్నేహితురాలి వ్యాఖ్య, దానికి మీరిచ్చిన విశ్లేషణ నాకు బాగా నచ్చాయి. నా భావాలకి దగ్గరగా ఉన్నాయి.
ReplyDeleteఈ రకైమన ఆలోచన అమ్మాయిలు చేయ్యొచ్చు... కానీ ఆ ఆలోచన బయటపెట్టడం నాకు కొత్తగా అనిపించింది...
ReplyDeleteతను ప్రేమ అనుకునే ప్రేమకి, భధ్రత అనుకునే భధ్రతకి, భాధ్యత అనుకునే భాధ్యతకి ఎప్పటికప్పుడు ఆడది లొంగిపోకుండా ప్రశ్నించి, ప్రతిఘటించినట్టైతే ప్రపంచం ఇప్పుడున్నట్టు ఉండేది కాదు...అంటే మగవాడి పేరు మీద చలామణి అవ్వడం,మతాలు,కులాలు ఉండేవి కావు... కానీ ఆలోచిస్తే తనకి ఇంకోలా చెయ్యడానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తుంది,అలా లొంగిపోకపోతే తన ద్వారా నెరవేరాల్సిన ప్రకృతి ధర్మం నేరవేరేది కాదేమో....
మొదట్లో ఉన్న ప్రేమావేశపు మత్తు మెల్లగా పోయేసరికి తనకి చూసుకోవడానికి ఒక బిడ్డో, ఇద్దరో తయారవుతారు... ఇక అప్పుడు ప్రశ్నించే అవకాశమే లేదు... ఎందుకంటే తన బిడ్డలకి ప్రేమని పంచాలి, భధ్రత కలిగించాలి, వారి పట్ల తన భాధ్యత నెరవేర్చుకోవాలి... ఎప్పుడైతే తనకి, తన భర్తకి మధ్య సంఘర్షణ ఎదురవుతుందో, తను దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది... ఎందుకంటే తన ప్రశాంతత, భధ్రత నేరుగా తన పిల్లలకి పంచాల్సిన వాటితో ముడిపడి ఉంటాయి కాబట్టి... తను రాజీపడి పోయి అసలు ఆ ప్రశ్నలు తనకి తెలియనట్టే జీవితం గడిపేస్తుంది...
ఇప్పటికీ ఎక్కువగా అలానే జరుగుతుంది... కానీ మార్పు మొదలైంది...
ఆడది చాలా వరకు తన భధ్రత, భాధ్యతలు తనే చూసుకోగలుగుతుంది ఈ కాలంలో... తను ఆలోచించడం మొదలుపెట్టింది... తనకి అన్నిటికన్నా ముఖ్యమైన ఆ రెండు ప్రాధమిక అవసరాలు చాలా వరకు తనే తీర్చుకోవడం వల్ల మిగిలిన విషయాలనీ తను నిర్లక్ష్యం చెయ్యడం లేదు... ఇప్పుడు ఎక్కడ ప్రశ్న ఉదయిస్తే అక్కడే,అప్పుడే అసెర్టివ్ గా ఉంటున్నారు.... కానీ ఈ మార్పు సమర్ధత పెంచుకున్న అందరి ఆడవారిలోనూ కనపడటంలేదు...
ఇదంతా రాసే సరికి ఇక్కడ నేనెందుకు రాస్తున్నా అనిపించింది.... ఈ మాటల్లోని ఆలోచనలే ఈ టపా చదివిన ఏవరో ఒక అమ్మాయి ఎందుకు రాయలేదు? సమర్ధించుకోవడానికైనా రాయొచ్చు కదా? రాసినా వృధా అనా? తరాలుగా తను అలవాటు చేసుకున్న స్తబ్ధత తనని ఇంకా పూర్తిగా వీడిపోలేదనా? ఆ స్తబ్ధతతోనే తను ఇలాంటి విషయాలకి దూరంగా ఉంటుందా? ఇంకా చాలా ప్రశ్నలు వస్తున్నాయి....
ఇందాకే ఈనాడు వసుంధరలో ఒక సోక్రటీస్ కొటేషన్ చదివాను... ఏంటంటే...
"స్త్రీ ఏ రంగంలోనైనా సాధికారతను సాధించాలే గాని... ఇక ఆ రంగంలో వారిని అధిగమించడం పురుషులకి కాని పని." అని ఆ తత్వవేత్త రెండు వేల సంవత్సరాల క్రీతమే చెప్పాడు....
మనం మరో ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాము...
ఆడవారిలో ఈ reflected value తరాల కండిషనింగ్ తో పాటూ, కొంత సహజసిద్ధంగా వచ్చిన మానసిక లక్షణం.ఆడవారు తమ సంబంధాలద్వారా తమ వ్యక్తిత్వాన్ని కొలుచుకోవడం ఈ లక్షణానికి పరాకాష్టమాత్రమే.ఇక మిగతా ఆడవారూ వాటినే కొలబద్ధగా చూడడం "ఆడదే ఆడదానికి శతృవు" అనడాన్ని మరింత నిజం చేస్తుందంతే!
ReplyDeleteఈ విషయం గురించి మగవాడికోణంలో కొంత objective గా నా బ్లాగులో ఒక టపా రాయడం ఇప్పుడే మొదలెట్టాను చూడగలరు.
మీ సప్తపది లింక్ ఇంకా నా కళ్ళబడలేదు. :-(
ReplyDeleteదయచేసి లింక్ ఇవ్వగలరని ప్రార్ధన!!
దిలీప్ గారు చాలా చక్కగా "కొత్త" అంటూ ఎన్నెన్నో అంతరార్ధాలు దాచేసారు ఆ పదం వెనుక. వారి ఉద్ధేశ్యం.. ఆడవారు ఇంటువంటి వాటి గురించి ఆలోచించ(లే)రు, ఆలోచించినా వ్యక్తీకరించలేరూ అన్నది "అయితే".. నేను దాన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా!! ;-)
ReplyDeleteచిన్నప్పటినుండీ.. ఎంచుమించు అవే చదువులు చదివి, కాన్వెంట్ వాతావరణంలో పెరిగి, పై చదువుకై విదేశాలకు ఒంటరిగా వెళ్తున్న నేటి తరం అమ్మాయిలను కూడా.. "మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుంది" అంటూ పాతకాలపు ఉపమానాల్లో ఇరికించడం "నాకు" నచ్చలేదు. అందరూ ఇలానే లేరు అన్నది మీకనిపిస్తే.. మీరన్నవారిలానే అంతా లేరు అని నాకనిపిస్తుంది. మాటి మాటికీ వెనక్కి తిరిగి.. "అయ్యో ఇంకా ఇలానే ఉన్నారే" అని ఫీల్ అయ్యే బదులు ముందుకు చూస్తూ.. "కొత్త బంగారు లోకం" కోసం శ్రమించచ్చు కదా?? జ్యోతిగారిని మించిన స్పూర్తి దొరుకుతుందా మనకు??
నా ఒకానొక బ్లాగులో "పరిధుల్లో ఉండి విజయాలు సాధించాలా?? విజయం కోసం పరిమితులను కూడా అధిగమించాలా??" అని నేనడిగిన ప్రశ్నకు ఓ "అబ్బాయి" ఇచ్చిన సమాధానం ఇది:
don't recognize limitations. If commonsense wisdom tells you something about limitations, listen.. smile at them and say "well, we'll see about it"
నా జీవతంలో ఇతర విషయాలకే కాదు.. మీరిప్పుడు లేవదీసిన "ఆడ-మగ" ఆలోచనా తేడాలకు కూడా నేనిదే సూత్రం అన్వయిస్తాను. వెనక్కి లాగే కొందరుండచ్చు (ఆడైనా, మగైనా).. నాకు మాత్రం నా విజయ తీరమే లక్ష్యం.
ఇంకో విషయం.. మీ టపాకి వ్యాఖ్యలు రానంత మాత్రాన.. ఆడవాళ్ళు "ఇలాంటి" వాటి గురించి ఆలోచించరు అనడం.. అంత ఆమోదయోగ్యంగా లేదు. ఇంకా బెటర్ ఉదాహరణ తీసుకుని ఉండాల్సింది.. ఇంత సీరియస్ విషయం చర్చించదలచినప్పుడు!!
వ్యాఖ్య మరీ తీవ్రంగా, తీక్షణంగా అనిపిస్తే.. "అమ్మాయిలు" ఇలా కూడా చెప్పగలరు అని అనుకోవడానికే గాని ;-) , వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలని కాదు. "Respect personal opinions" అన్నదాన్ని నేనెప్పుడూ నమ్ముతాను!
పూర్ణిమ,
ReplyDeleteనువ్వు సప్తపది చదవావో లేదో తెలియదు... నువ్వు ఖండించాల్సిన అవసరం లేదు... ఖండించాల్సిన అవసరం వస్తే ముందు నేను ఉంటాను :-)
నేనెప్పుడు ఆలోచించరు అనలేదు, వ్యక్తీకరించలేరు అనలేదు... చాలా సంధర్భాల్లో వ్యక్తీకరించరు... పైన నే రాసిన వ్యాఖ్యలో గతంలో ఆడవాళ్ళు ఎందుకు అలా ఉన్నారో, ఇప్పటికీ ఎక్కువ మంది అలా ఎందుకు ఉంటున్నారో అని నాకు తెలిసిన కారణాలని రాసాను... నాకు కనపడుతున్న మార్పుని కూడా రాసాను...
పూర్ణిమ తో ఏకిఇభవిస్తున్నాను.నిజమే వ్యాఖ్య రాయన0త మాత్రాన ఆలోచి0చట్లేనట్టు కాదు.వ్యాఖ్య రాసే తీరిక లేకో,మాటల్లో పెట్టగలిగే సామర్ధ్య0 లేకో,చర్ఛల వల్ల ప్రయోజన0 లేదనుకునో....కారణ0 ఏదయినా అయ్యు0డొఛ్ఛు.ఆడది నాకు,నామాటకి విలువ ఇవ్వవా అని అరిచిన0త కాల0 ప్రేమ పెళ్ళయినా,పెద్దలు చేసిన పెళ్ళయినా పెటాకులు అయిపోతున్న రోజులివి.అదేమిటో ఆడవాళ్ళు మారుతున్న0త వేగ0గా ఆలోచనల్లో గానీ,అభిప్రాయాల్లో గానీ మగాళ్ళలో కదలిక కనిపి0చదు.నన్ను గౌరవ0గా చూస్తే నీకు గౌరవ0 ఇస్తాను అనే రోజులే.ఇది ప్రేమ పెళ్ళిళ్ళలోనే అని కాదు మామూలు ద0పతులకు కూడా వర్తిస్తు0ది.ఎవరో ఒకరు సర్దుకు పోకపోతే [ఎవరో ఒకరి మాట నెగ్గి0చకపోతే] బ0ధాలు వదులయిపోతున్నాయి.మన స్వాతి కుమారి గారు ఒక పోస్టులో అన్నారు "ప్రేమ0టే త్యాగ0 చేయడ0 కాదు , అభిప్రాయాలను గౌరవి0చడ0 " అని.ఇది తెలుసుకున్న రోజు,ఆచరి0చిన రోజు ఏ బ0ధమయినా కలకాల0 నిలుస్తు0ది.సప్తపదిలా0టి సినిమాలు ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తాయి.నిజమే.కులాలపేరుతో గొడవలు పడెవాళ్ళకే అది నిర్ధేశి0చబడి0ది.కానీ ఆయన ఏమి చెప్పాలనుకున్నాడో అది చక్కగా చెప్పగలిగారు.అలాగే ఇ0కో సినిమా రాజే0ద్రప్రసాదు అనుకు0టాను.స్కూల్ మాష్టార్ అనేదో ఉ0టు0ది.అ0దులో మతా0తర వివాహ0 వల్ల తరువాత జీవిత0లోని సమస్యల్ని చక్కగా చెప్పారు.
ReplyDeleteమీ స్నేహితురాలికి చక్కని సమాధాన0 చెప్పారు.ప్రతీవారికి తమదయిన వ్యక్తిత్వ0 ఉ0టు0దని చాలా మ0ది ఎ0దుకు అనుకోరో?
@ పూర్ణిమ గారు:నెనర్లు. తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నందుకు, కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లు నా టపాలకి సవాలక్ష కారణాల వల్ల వ్యాఖ్యలు రావచ్చు/రాకపోవచ్చు అది అప్రస్తుతం. నాకు వ్యాఖ్యలు రావట్లేదనో, రావాలనో ఆవేశంతో రాసిన టపా కాదు గమనించగలరు. ఎటొచ్చీ ఈ టపాలో అన్నది స్పందన విషయం,స్పందన వ్యాఖ్య ద్వారా కావచ్చు, తదితర సాంకేతిక పరికరాల ద్వార కావచ్చు లేదా బ్లాగు/బయట మహిళా పాఠకులు ద్వారా కావచ్చు లేదా నా స్నేహితురాళ్ళు కావచ్చు, మీరేదో నాకు వ్యాఖ్యలు రాలేదు కాబట్టి, అని ఊహించేసుకొంటే నేనేమి చేయలేను నేను టపాలో బ్లాగు పాఠకులు అని కూడా అనలేదు, మహిళా పాఠకులు అంటే అందరూ లెక్కలోకి వస్తారు కాదంటార చెప్పండి(ప్రత్యేకంగా థెరెసాగారు వ్యాఖ్య రాసారు కాబట్టి ఉదహరించాను అంతే కాని అక్కడ ఇతర పాఠకులని ఏదో అనేసానని అనుకోవడం కాదు)
ReplyDeleteమీకు వీలయితే టపా మళ్ళీ ఇంకోసారి చదవండి, "మల్లె తీగ వంటిది మగువ జీవితం" అని అధారపడమని పెద్దవాళ్ళు ఉగ్గుపాలతో నేర్పేస్తున్నారు అని అన్నాను కాని ఆ ఉపమానంతో నేనేమి మహిళాజాతిని కాని, (ఎటొచ్చి నేను మహిళనే అన్న విషయం మీరు మర్చిపోయినట్లున్నారు), నేను రాసిన టపాని ఇరికించలేదని గమనించగలరు.
ఇంకో విషయం నేను గుడ్డిగా రాసేసి ఆడవాళ్ళందరిని తిట్టెద్దామని కంకణం కట్టుకోలేదు. అక్కడ ప్రత్యేకంగా రాసాను ఒకరిద్దరి స్నేహితులని కూడా అడిగాను వాళ్ళు సమాధానం చెప్తారేమో కనీసం చర్చిస్తారెమో అని, కాని, "బాగుంది" అని వదిలేసారు అని చెప్పాను కదా.
మీ ప్రపంచంలో నేనన్నవారిలా లేని వారిని మీరు చూసారు కాని, నా ప్రపంచంలో నేనన్నవాళ్ళు ఇలాగే వున్నారని ఇప్పటికీ చెప్తున్నాను.అలాంటి వాళ్ళ గురించి రాసిన టపా ఈ ఆడవాళ్ళమండీ మేము.
మీరేదో కొంచం ఆవేశంలో చదివినట్లున్నారు పూర్ణిమ గారు. బి కూల్.
ప్రస్తుత కాలామాన పరిస్తితులననుసరించి ఆలోచిస్తే , దిలీప్ గారు చెప్పిన ఒక అమ్మాయినుండి రావడం "కొత్త" అనేది నాకు ఇప్పటికి సమంజసంగానే అనిపిస్తుంది. దానికి కారణం కూడా దిలీప్ గారు చక్కగా విశదీకరించారు.
దిలీప్ గారు:
ReplyDelete>>ఆడవారు ఇంటువంటి వాటి గురించి ఆలోచించ(లే)రు, ఆలోచించినా వ్యక్తీకరించలేరూ అన్నది "అయితే".. నేను దాన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను
"అయితే" అన్నదాని కోట్స్ లో పెట్టినా మీరు మిస్స్ అయ్యారా?? అయితేనే నా వ్యాఖ్యకి అర్ధం.. కాకపోతే అసలు గొడవేలేదు కదా!!
సప్తపది పై నా అలోచనలు అక్కడే చూడగలరు!!
రమణి గారు:
ReplyDeleteనాకు వ్యాఖ్యలు రాయడం అస్సలు చేతకాదు.. అందుకేనేమో చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయినట్టున్నాను.
తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తుంది.. ఒకవేళ దిలీప్ గారికి ఆ అభిప్రాయం ఉంటే, ఆ అభిప్రాయాన్ని!! ఇంకదేన్ని.. మరెవరినీ కాదు. నేనీ టపాకి వ్యాఖ్యాన్నించేటప్పటికి దిలీప్ గారి 1st వ్యాఖ్య లేదు. అందుకే నా ఆవేశానికీ అర్ధం ఉంది.
మీరు థెరిస్సాగారి వ్యాఖ్య గురించి ప్రస్తావించకపోతే.. నేనూ అలా అనుకునేదాన్ని కానేమో!! It did mislead me!! మీరీ వివరణ ఇవ్వకపోతే ఇప్పటికీ నేనలానే అనుకునేదాన్ని!! బ్లాగులో ఆర్టికల్ పెట్టారు కావున.. వ్యాఖ్యలని "స్పందన"లూ అంటారు కావున!! Thanks for clearing the air!!
"అందరూ ఇలానే లేరు అన్నది మీకనిపిస్తే.. మీరన్నవారిలానే అంతా లేరు అని నాకనిపిస్తుంది" అని నేను రాస్తే... "మీ ప్రపంచంలో నేనన్నవారిలా లేని వారిని మీరు చూసారు కాని, నా ప్రపంచంలో నేనన్నవాళ్ళు ఇలాగే వున్నారని ఇప్పటికీ చెప్తున్నాను." అంటూ మీరు రాసారు!! మనమిద్దరమూ ఒకటే అంటున్నాము!! :-)
కొంచెం ఆవేశం కాదండీ.. చాలా ఆవేశంలో ఉన్నా.. అసలు మీ టపా చదివి ఇక్కడ వ్యాఖ్యాన్నించకుండా.. మీ టపాను ప్రస్తావించకుండా.. నేనో టపా రాస్తే సరిపోయేదోమో అనిపిస్తుందిప్పుడు. బ్లాగ్లోకంలో బుడిబుడి అడుగులు కదా నావి.. మెల్ల మెల్లగా నేర్చుకుంటాలెండి!! ఓపికగా మీ అభిప్రాయాన్ని నాకోసం మరలా చెప్పినందుకు ధన్యవాదాలు!! మీరేమి చెప్పదలచుకున్నారో నాకర్ధమయ్యింది. నా ఆవేశం అర్ధం కాకపోతే.. లైట్ తీసుకోండి. అది అందరికీ అర్ధం కావాలనుకున్నప్పుడు నేనూ రాస్తాను. :-)
ఆ వ్యాఖ్యా.. ఈ వ్యాఖ్య.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్ధేశ్యించి రాయలేదు. గమనించమని మరోసారి ప్రార్ధన!!
పూర్ణిమ గారు: మీకు వ్యాఖ్య రాయడం రాదు అని ఎవరన్నారండీ? అలా అన్న వాళ్ళకి చదవడం రాదు అని అనుకోడం మంచిది . (మీకు మీరే ఓ నిర్ణయానికి వచ్చేస్తే నేనెమి అనలేను కాని, అందరి టపాల్లో మీరు రాసే ప్రతి వ్యాఖ్య నేను చదువుతాను, చాలా బాగా రాస్తారు, అలాగే మీ "ఉహల్లన్నీ ఊసులై" బ్లాగు కూడా నాకు చాలా నచ్చిన బ్లాగు[ప్రమదావనంలో చెప్పిన గుర్తు,పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు మీ బ్లాగు పుట్టగానే మంచి ఖ్యాతి గాంచింది ]).
ReplyDeleteఇక వ్యాఖ్య విషయానికి వస్తే, మీ ముందు వ్యాఖ్య కి నేను సమాధానం ఇచ్చిన తరువాత ఆలోచించా, అసలు మీరు ఇలా రాసినందుకు నేను ఆనందించాలి+అభినందించాలి కదా(మీరు దిలీప్ గారి వ్యాఖ్యని ఖండించడం అనే విషయం పక్కన పెడితే, అసలు నన్నడిగితే ఈ విషయంలో కూడా అనందించవచ్చు కనీసం ఒక్కరైన ధైర్యంగా తమ ఆలోచనలు ఇలా వ్యక్తీకరిస్తున్నారు అని, "దిలీప్ గారు! అవునంటార?" ) ఎందుకలా ఆవేశంగా రాసారు అని అనడం అని. అసలు నా టపా ఉద్దేశ్యం ఏమిటి? మహిళలందరూ అలా ఆధారపడడం అనే ఉచ్చులో ఉన్నారు, దాని నుండి బయటకి వస్తే బాగుంటుంది అనే కదా, మరి దానికి మీరు లేదు నా వైపు ఎవరూ ఆధారపడడం అనే విధానంలో చిక్కుకొని లేరు, ఆడవాళ్ళు కూడా అన్ని భావాలని నిరభ్యంత్రంగా వ్యక్తీకరించగలరు అనే కదా మీ వాదన. మరి దానిని నేను గాని, దిలీప్ గారు కాని ఖండించాల్సిన అవసరమేముంది? ఉన్నారని మీరన్నారు , లేరని నేను అన్నాను. ఒకవిధంగా మీ వాదన నెగ్గితే ఆ మార్పు రావాలనే కదా ఎవరన్న కోరుకొనేది, సో! ఈ వాదనలో నేను ఓడిపోవడమే నాకిష్టం. ఎందుకంటే అలాంటి ఆధారపడడం అన్న విధానం లేదు కాబట్టి. ఇక్కడ నేనే ఒప్పుకొంటున్నది+కోరుకొనేది ఎంటంటే, నా ప్రపంచంలో నేను చూసినవారు కూడా అలా మారాలని.
బ్లాగు లోకంలో మీవి బుడి బుడి అడుగులైనా కిందపడకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నందుకు అభినందనలు. నావి తప్ప(ప్పు)టడుగులండి. అప్పుడప్పుడు ఇలాంటి గెలుపులాంటి అపజయం కూడా కలుగుతూ ఉంటుంది.
మీరు రాసే టపా కోసం ఎదురుచూస్తూ ఉంటాను . నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా వుంది.
పూర్ణిమ ఇక్కడ ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఎవరి ఆలోచనలని వాళ్ళు నొక్కి చెప్పడమే..రమణిగారి ఆలోచన మెజారిటీ మహిళలని ప్రశ్నిస్తుంటే, మీ ఆలోచన మైనారిటీ మహిళలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అవును మీ ఆలోచన మైనారిటీ మహిళలదే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను చూసిన ఆ మార్పుకి మీరు ప్రతినిధులేమో! అంతే...
ReplyDeleteకానీ...
సప్తపదిలో నీ వ్యాఖ్యని చదివాను...
" కులం, మతం, భాషా, ఆదర్శాలు, ఆలోచనావిధానాలు.. ఇవేవీ ఒక బంధాన్ని "నలిపేసేంత" ఎదగలేవు.. ఆ బంధంలో సమతుల్యం ఉన్నంత వరకూ. నీ కులం పేరా?? నా దా?? అని కొట్టుకునే వారు... "మీ నాన్నమ్మ పేరా??", "మా నాన్నమ్మ పేరా?" అని కూడా కొట్టుకోవచ్చు!! అంతా వాళ్ళ ఆలోచనా విధానంలో ఉంటుంది."
ఈ వ్యాఖ్య చూసి నువ్వు బంధాలని అర్ధం చేసుకున్నావు అని చెప్పగలను కానీ, సప్తపదిలోనూ, ఈ టపాలోను లేవదీసిన విషయాన్ని అర్ధం చేసుకోలేదు అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నీ ఆలోచనంతా పెళ్ళి అనే బంధంలో ఎలా విజయం సాధించాలి అని ఉంది. అది నిజంగా అభినందనీయం. కానీ ఈ టపాల్లో చర్చించిన సమస్యకి అది సమాధానం కాదు... అసలు ఈ టపాలు భార్య భర్తలు కొట్టుకోవడమో, అన్యోన్యంగా కలిసి ఉండడం గురించి కాదు...
"మా నాన్నమ్మ పేరో, మీ నాన్నమ్మ పేరో.." ఇది అసలు సమస్యే కాదు.. ఒకవేళ అయినా అది వారిరివురి సమస్య మాత్రమే గానీ... సమాజానిది కాదు... మహిళా లోకానిది కాదు...
నీ కులం పేరా? నా కులం పేరా?... నీ మతం పేరా?నా మతం పేరా?... అనేవి మాత్రమె సమస్యలు...
ఆడవారికి సమతులమైన బంధం కావాలి.. వారికి ప్రేమ కావాలి,భద్రత కావాలి అవి అన్నీ సక్రమంగ అందుతుంటే మిగిలిన ప్రాపంచిక విషయాలని/ఆశ్చర్యంగా పుట్టింటివారినీ అసలు పట్టించుకోరు.. పట్టించుకుని ప్రశ్నిస్తే తన భర్తతో బంధంలో ఆ సమతులత దెబ్బతింటుంది అనుకుంటే అసలు పట్టించుకోరు... తన ప్రేమతో మెట్టినింటిని కూడా గెలుస్తుంది.. అక్కడ అందరి ప్రేమని పొందుతుంది... కానీ ఎప్పుడైతే మెట్టినింత వారి కట్టుబాట్లు, వారి కులం పేర్లు, మతం పేర్లు ఉపయోగిస్తున్నారో తను వాటిని ప్రశ్నించి అక్కడ ఉన్న సమతులతని దెబ్బతీయదు... రాజీ పడిపోతుంది... ఇది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న మెజారిటీ మహిళలు అనుభవించేది... నేను ఇంతకు ముందు ఉదాహరణ చెప్పినట్టు కొంతమంది మహిళలు ఆ విషయంలోను ఎసెర్టివ్గా ఉంటారు... కానీ అది చాలా తక్కువ...
ఇప్పుడు మహిళల్లో ఆర్ధిక స్వేచ్చ ఉంది... ప్రశ్నిస్తున్నారు... కానీ ఆ మార్పు పూర్తిగా లేదు... అన్ని విషయాల్లోను రాలేదు... ఎప్పటి నుండో అలవాటు పడి పోయిన కొన్ని విధానాల్ని ఇంకా అందరూ మార్చుకోవడం లేదు... ఆర్ధిక స్వేచ్చ ఉన్నా, "ప్రేమ" అనేది ఇప్పటికీ ఆడదాన్ని రాజీపడిపోయేట్టు చేస్తుంది!
ఇక్కడ నేను నిన్ను విమర్శించడానికి ప్రయత్నించడం లేదు... నువ్వు మిస్ అయిపోతున్నావు అనిపించిన ఒక కోణాన్ని నీకు తప్పకుండా తెలియచెయ్యాలనే నా అభిలాష.ఎందుకంటే నీకు అర్ధమయితే వందమందికి అర్ధమయ్యేట్టు చెప్పగలవు కాబట్టి..
రమణి గారు: :-)
ఇప్పుడే ఈ చర్చం అంతా గమనించాను. ఇటీవల బ్లాగ్లోకంలో చెలరేగిన ఒకట్రెండు దుమారాల హోరులో ఇంత చర్చ కొంచెం మరుగున పడిందేమో దురదృష్ట వశాత్తూ.
ReplyDeleteనేనిక్కడ కొత్తగా చెప్పేది ఏం లేదు. అందరూ ఈ టపాలో చెప్పిన లాంటి మార్పుని కోరుకుంటున్న వారే గాక, తమ తమ అభిప్రాయాల్ని చక్కగా వ్య్కతప్రిచారు కూడా.
సమాజ పరిణామానికి ఆ భాషా సాహిత్యం ఒక అద్దం అనుకుంటే .. తెలుగు సాహిత్యంలో స్త్రీ తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకోవడం గురజాడ తొలి కథ "దిద్దుబాటు" తోనే మొదలయింది. కన్యాశుల్కంలో మొదట్ గుర్తొచ్చే పాత్ర మధురవాణే. గత నూట పాతికేళ్ళల్లో ఈ స్త్రీ వ్యక్తిత్వ వికాసం పురోగమిస్తూనే ఉంది.
ఇటీవలి కాలంలో పి. సత్యవతి గారి రచనలు చదవాల్సినవి.
స్త్రీ చైతన్యం గురించి ఇంకో ఆలోచన స్ఫురిస్తోంది. చైతన్య వంతులైన స్త్రీలు ఎక్కువగా కార్యదీక్షాపరులుగా ఉండటం చూశాను. ఉట్టి మాటలతో కబుర్లు, చర్చలు, వాదనలు చేస్తూ కూర్చోవడం వారికి గిట్టని పని. తమ కుటుంబం పరిధిలో శ్రమించిన మా అమ్మ, పిన్ని వంటి వారి వద్దనుంచీ ఉద్యమాలు నడిపిన మల్లాది సుబ్బమ్మ ఇత్యాదుల వరకూ. ఐతే, రాయాల్సిన, మాట్లాడాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉన్నదని గుర్తించిన స్త్రీలు కలం పట్టి బలమైన రచనలు చేస్తున్నారు.
రమణి గారు:
ReplyDeleteఎవరో అంటే నమ్మే బాపతు కాదండీ నాది.. నిజంగానే వ్యాఖ్యలు రాయడానికి కష్టపడతాను. అలా మీకనిపించకపోతే.. అది వేరే విషయం. ఈ వ్యాఖ్యను కూడా రాయాలనుకుంటే.. "వాళ్ళే కాదు.. వీళ్ళూ ఉన్నారు" అని నిదానంగా కూడా చెప్పచ్చు. మైనార్టీలో ఉన్నానేమో.. కాస్త స్వరం హెచ్చించాను.. "ధైర్యంగా తమ ఆలోచనలు ఇలా వ్యక్తీకరిస్తున్నారు" (అక్కడే చెప్పినట్టుగా) అనుకోవాలని అలా రాసాను. అంత ఆవేశం దేనికి?? ... ఆ ప్రశ్నకు (నేనంటూ రాస్తే) నా టపా అవుతుంది. కానీ రాస్తానో లేదో!!
ఒక్క విషయం.. "ఎన్నాళ్ళిలా?? ఎందుకిలా??" అంటూ మీరు వ్యక్తం చేసిన "అసహనం" నేను అర్ధం చేసుకోగలను..ఇది కూడా ఆలోచించని వారున్నారు!! ఇంతిలా ఆలోచించే మీరు.. వీటిని పెద్దగా పట్టించుకోకుండా (ఒక్కరిద్దరి నిరాసక్తిని) మున్ముందు కూడా రాయాలని కోరుకుంటున్నాను!!
దిలీప్ గారు:
ఊ.. నాది మైనార్టీయే!! ఇండియాలో దేనిది పై చేయి.. మైనార్టీలా?? మెజార్టీదా?? ఊ?? ;-)
ఇక సప్తపది వ్యాఖ్యకి అక్కడే స్పందించాల్సింది. అక్కడే చెప్పా.. కులం ఈక్వేషన్స్ నా వల్ల కావు అని. నేను చెప్పాలకున్నది భార్యా భర్తల సంబంధం.. అది చెప్పా అని మీరే చెప్పారు!! "మహిళలు ఎందుకు ప్రశ్నించరు?" అని మీరడిగితే... "అసలు మహిళలు ప్రశ్నించాల్సిన వాతావరణం ఎందుకొచ్చింది.. అది పోగట్టలేమా?" అని నేనడుగుతా!! :-)
Anyway, these are not my cup of tea. Leave it!!
"Anyway, these are not my cup of tea. Leave it!!"
ReplyDeleteI hate that attitude or understanding. People who can influence others with their charm finally end up saying that. I dont know how can they utter those words. May be they dont want to deal with the inconvenience caused because of involving in such talk or issues. Or even I dont know if they want to be in good books of everybody such that their charm will live through everybody. In my perspective, they are losers. They only add to the agony.
and whatever I wrote here is about an attitude of people I face, not intended to anybody in particular.
I want you to give a thought about it. It is not crticism. It is just an input.
how can somebody say something as integral an issue as is in this topic "not my cup of tea"? can somebody deny their existence??
దిలీప్ గారు: ఏం చెప్పాలో అర్ధం కావటం లేదు.. ఇది అర్జెంటుగా నా బ్లాగు అయ్యిపోతే బాగుణ్ణు అని మాత్రం అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను.. "అందరికీ నచ్చాలి" అన్న వెర్రి ప్రయత్నం చేయను. అలా అనుకుంటే.. అసలు ఇంత దాకా రానివ్వను కదా!! మీరు ఆలోచించమగానే నేను ఆలోచించలేను. ఇది నేను తెలుసుకోవాల్సినప్పుడు నేను తప్పకుండా తెలుసుకుంటాను.. కాకపోతే అది నాకనిపించాలి!!
ReplyDeleteరమణిగారు: ఇలా ఇరువురి "అభిప్రాయ భేదాలు" నా బ్లాగులో జరుగుతుంటే.. నాకిబ్బందిగా అనిపించేది. ఇప్పుడు మీకూ అనిపిస్తుంటే.. నా తరుఫున క్షమాపణలు. అలా అనిపించకపోతే... బోలెడన్ని నెనర్లు!!
పూర్ణిమ
ReplyDeleteచర్చ అంతటిలోను అభిప్రాయ భేదం ఉన్నది అంటే, అది ఈ ఒక్క చోటే "It is not my cup of tea".ఆ భేదం కూడా అర్ధం చేసుకోలేకపోవడం వల్లో, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం వల్లో వచ్చినది మాత్రమే. ఒకవేళ ప్రయత్నం చేసి ఉంటే ఆ విషయంలో కూడా అభిప్రాయ భేదం వచ్చేది కాదేమో!
"మీరు ఆలోచించమగానే నేను ఆలోచించలేను. ఇది నేను తెలుసుకోవాల్సినప్పుడు నేను తప్పకుండా తెలుసుకుంటాను"
చర్చలో ఉన్నాము కాబట్టి ఆలోచించమన్నాను. అంతే గానీ, నేను చెప్తే ఆలోచించేస్తావనే పిచ్చి భ్రమలో కాదు. మనకి చర్చల్లో పాల్గొన్నప్పుడే చాలా విషయాలు బోధపడతాయని నేను నమ్ముతాను. అప్పుడే మనకి అలవాటు లేని దృక్పధాలు కూడా పరిచయమవుతాయి. మన ఆలోచనా పరిధి పెరుగుతుంది.
ఎదురయ్యి ఆలోచించే సమయానికి వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు, బంధాలకి నిబద్ధులైపోయి ఉంటారు. ప్రత్యేకించి ఈ రెండు టపాలకి ప్రేరేపించిన అంశాల్లో... అప్పుడు ఆలోచించి వాళ్ళు చెయ్యగలిగేది ఎమీ ఉండదు. చెయ్యగలిగినా నష్టాన్ని, కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటూంది...ఈ విషయంలో ఇలా జరగడం చాలా మంది ఆడవాళ్ళకి సామాజిక స్పృహ, లోక జ్ఞానం పెంచుకోకపోవడం వల్లేమో!
"ఇలా ఇరువురి "అభిప్రాయ భేదాలు" నా బ్లాగులో జరుగుతుంటే.. నాకిబ్బందిగా అనిపించేది."
Thanks for sharing this. In case, if I have to differ with your opinion on any topic in your blog, I will refrain from commenting.
రమణి గారు: ఇక్కడ ఇబ్బందిపడెంతగా ఏమీ జరగలేదనే నేననుకుంటున్నాను.
పూర్ణిమగారు : ఒక చర్చ అంటూ అనుకొన్న తరువాత, అభిప్రాయ బేధాలు ఉంటాయి, అభిప్రాయాలు ఏకీభవించడం ఉంటుంది . కాబట్టి నేను మీ నెనర్లని (బోల్డు) స్వీకరిస్తున్నాను . నాకేమి ఇబ్బందిగా లేదు, ఇలాంటి చర్చల వల్ల తెలియని విషయాలని, అర్ధం చేసుకోలేని (చాలా) విషయాలని తెలుసుకోవడం లేదా అర్ధం చేసుకోవడం జరుగుతుంది.
ReplyDeleteదిలీప్ గారు: ఇబ్బంది పడెంతగా ఏమి జరగలేదు. చర్చలో చాలా విషయాలు తెలుసుకొన్నాను.
చర్చ మంచి రసవత్తరంగా సాగుతోంది. అభినందనలు. పూర్ణిమ, దిలీప్ ఇద్దరూ ఈ స్థాయిలో చర్చిస్తున్నారంటే,‘ఎక్కడ’ వారికి రమణిగారి టపా ‘తగిలిందన్నమాటే!’
ReplyDeleteఒక్కొక్క వర్గం మీదా ఉన్న అభిప్రాయాలు ఒక్కరోజులో వచ్చినవి కావు. వాటిని పూర్తిగా కొట్టిపారెయ్యడం కూడా పనికిరాదు.
ReplyDeleteSocial prejudices, however flawed they may appear in certain cases, are not entirely unfounded. They represent a a body of collective wisdom accumulated over centuries of observation and generations of experience.
Political correctness కంటే కూడా నిజజీవితంలో మనం స్వయంగా అనుభవించే factual correctness కి ప్రాధాన్యమివ్వాలి.
సమాజం కొద్దిపాటి మినహాయింపుల్ని ఎప్పటికీ generalize చెయ్యదు. Generalize చెయ్యడానికి కొంచెం పెద్దదైన Survey Sample అవసరం. మనక్కనిపించే మినహాయింపులు ఇంకా ఆ స్థాయికి రాలేదు. వేచి చూడాల్సిందే !
Hmm... lemme first get me the air clear, over here!!
ReplyDeleteFirst things first.. "ఇలా ఇరువురి "అభిప్రాయ భేదాలు" నా బ్లాగులో జరుగుతుంటే.. " అని రాసినప్పుడూ కాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. అక్కడ నా ఉద్ధేశ్యం "out of context" విషయాల గురించి. "అమ్మాయిలు మాట్లాడగలరు" అన్న విషయం ఒప్పేసుకున్నాము. ఈ టపాకి చర్చ ఆగి ఉండాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ.. సప్తపదిలో నా వ్యాఖ్య గురించి. దిలీప్ గారి ప్రకారం "నేను కులం అను విషయాన్ని" అర్ధం చేసుకోలేదు. అది నేనా వ్యాఖ్య మొదల్లోనే రాసాను. నాకు వీటి మీద అంతగా ప్రాక్టికల్ అనుభవం లేకపోనూ లేదు.. అంటే.. కులాలున్నాయని.. అవి మన సమాజంలో ఎంతగా పాతుకుపోయాయనీ.. కులాభిమానులు ఎలా ప్రవర్తిస్తారని.. కొన్ని సార్లు భయం కలిగించేంతగా ఉంటాయని.. ఇవ్వన్నీ తెలుసు. నా స్నేహితుల్లో కొందరు ప్రాంతీయాభిమానం, కులాభిమానం కలిగిన వారున్నారు. కానీ వారి అభిమానాల్లెప్పుడూ నా స్నేహానికి అడ్డు రాలేదు. నా మిత్రుల్లో కొందరి ప్రేమవివాహాలు జరగకపోవడానికి కారణం "కులం" అనీ తెలుసు. అయినా ఇరివురి మధ్య "కులం" అడ్డు వచ్చిందంటే.. నేనింకా అది ఆ ఇద్దరి మనుషుల సమస్యగానే చూస్తాను. అలా చూడకపోవటానికి నాకు కారణాలు కనిపించటం లేదు. భార్యాభర్తల సహజీవనంలో చాలా వాటిమీద "అభిప్రాయ భేదాలు వస్తాయి.. అవ్వన్నీ వారెలా పరిష్కరించుకుంటారో.. ఈ కులం సమస్యనీ పరిష్కరించుకోవాలనీ అనుకుంటాను.
భర్త దగ్గరనుండి సరియైన సహకారం లభించకపోతే.. అమ్మాయి ఏం చేయాలి? కాంప్రమైజ్ అవడంలో తనకేమి వస్తుందో.. తెంచుకునే అంత పెద్ద విషయమా అది.. అది వ్యక్తిగత నిర్ణయం. ఆనంద్ సినిమా పేరు గుర్తు రాని వారు.. "చీర కోసం పెళ్ళి చెడగొట్టుకుంటుంది చూడు హీరోయిన్" అని చెప్పటం చాలా సార్లు విన్నాను. ఆ అమ్మాయి చీర కోసం కాదనలేదు.. ఇక పై తనని తను ఎప్పుడూ "చంపుకుంటూ" బ్రతకాలన్న నమ్మకం ఏర్పడింది కాబట్టి.. ఆ పెళ్ళిని కాదంటుంది. అదే తనకి వాళ్ళ అమ్మ చీర కట్టుకోవాలని లేకపోతే.. అత్తారింటి చీరపై ఎలాంటి వ్యతిరేకమూ ఉండేది కాదేమో!! అంటే తను వేరే ఆచారాలకి మారుతుంది.. తన మనోభావాలు దెబ్బతిన్నంత వరకూ!! (ఇప్పుడీ పిల్లా మైనార్టీనే... అలా అందరూ చేయలేరు అంటారు.)భర్త పట్ల పూర్తి ప్రేమతో.. గౌరవమర్యాదలతో.. మనస్పూర్తిగా అలవాట్లను మార్చుకుంటే తప్పు లేదు. అలా కాకుండా ఎవరో ఒకరికి భయపడి గమ్మున చేసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా ఉంటే.. తనకి ఎదురు నిలిచే ధైర్యం లేదన్న మాట. మతాంతరమైనా. కులాంతరమైనా.. వివాహంలో కొన్ని సూత్రాలను పాటిస్తే.. అది విజయవంతమవుతుందని ఇంత "చర్చ" జరిగినా నేను నమ్ముతున్నాను!!
ఇది నా అవగాహన లోపం కావచ్చు.. జీవితాన్ని, మనుషులని నేను అర్ధం చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు.. నాకు అలాంటి "అనుభవాలు" లేకపోవటం వల్ల కావచ్చు.. లేక పూర్తిగా నా "పిచ్చితనం" కావచ్చు.. కానీ ఈ క్షణాన నాకు "మనుషుల" మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలనిపిస్తుంది. వారి పెంచి పోషించుకున్నా "గోడల"కన్నా!! ఈ నమ్మకం ఏదోనాడు shatter అవ్వాల్సిందేమో.. అయ్యే క్షణంకోసం నేనూ వేచి చూస్తాను.. కొత్తగా పాఠం నేర్చుకుంటాను!! My belief is not so fragile that a couple of counter arguments in a discussion would break it.
ఇక నాకు "out of context" అనిపించింది ఏంటంటే.. ఒక మనిషి "attitude"ని ప్రశ్నించిన విధానం. అది ఈ చర్చకు ఏమాత్రం అవసరం లేదు. నా వల్ల కాదు.. నాకంత పరిజ్ఞానం లేదు అని ఒప్పుకుని చర్చనుండి తప్పుకోదలచుకున్న నాకు మాత్రమే ఆ ప్రశ్నకానీ, విమర్శ కానీ, ఇంపుట్ గానీ వర్తించేవి!! నేను దానికి బదులివ్వచ్చు.. అది ఇంకో వ్యాఖ్యకి దారి తీస్తుంది. అసలు విషయం వదలి చర్చ పూర్తిగా తప్పుదారి పడుతుంది. ఆ వ్యాఖ్యల ప్రహసనం పూర్తిగా వ్యక్తిగతం అయ్యే అవకాశమూ లేకపోలేదు. అలా జరగటం వేరొకరి బ్లాగులో నాకిబ్బందనిపించింది.
దిలీప్.. మీరన్న ఆ ఆటిట్యూడ్ ప్రాబ్లం ని నేనసలు పట్టించుకోలేదు.. అది కేవలం perspective మాత్రమే అని. And moreover it wasn't against "me".. right!! I do respect personal opinions, even while they are against me/ my opinions, just like I'm ok with ur thesis of charm-inspire-good books etc. You needn't refrain from anything in my blog!!
@mahesh: దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యిందంటే నమ్మండి :-))) అయినా నా నమ్మకం.. ప్చ్!!
ReplyDeleteపూర్ణిమ,
ReplyDeleteరెండు సార్లు "out of context" అని ఉపయోగించావు.. రెండు సార్లు నాకు అలా అనిపించలేదు. ఈ టపా సప్తపదికి అనుబంధంగానే తీసుకున్నాను కానీ దీనిని వేరుగా చూడలేదు నేను. చర్చ అక్కడ మొదలైంది,ఇక్కడ కొనసాగింది.
ఇంక రెండో సంధర్భానికి వస్తే అది కూడా నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే నేను అక్కడ చెప్పుకున్నాను. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు,అది నా పరిశీలన అని. అది అందరికీ. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. అది చర్చల్లో పాల్గొనే చాలా మంది గురించి.
ఆ విధంగా ప్రశ్నించడం వల్ల "not my cup of tea" అని వదిలేస్తున్న విషయాన్ని ఆలోచిస్తావనే అభిలాషతో మాత్రమే ప్రశ్నించాను.
ఇక మిగిలిన విషయం గురించైతే, చాలా ముచ్చటగా రాసావు. ప్రపంచంలో ఏ సమస్య అయినా, నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు అది ఒక వ్యక్తి సమస్యగానో, ఇద్దరి వ్యక్తుల మధ్యగానో, ఒక కుంటుంబానిదిగానో తయారవుతుంది. అప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారో అనేదాన్ని బట్టి అది అసలు సమస్యా కాదా అని తేలిపోతుంది.
"భర్త పట్ల పూర్తి ప్రేమతో.. గౌరవమర్యాదలతో.. మనస్పూర్తిగా అలవాట్లను మార్చుకుంటే తప్పు లేదు. అలా కాకుండా ఎవరో ఒకరికి భయపడి గమ్మున చేసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా ఉంటే.. తనకి ఎదురు నిలిచే ధైర్యం లేదన్న మాట. మతాంతరమైనా. కులాంతరమైనా.. వివాహంలో కొన్ని సూత్రాలను పాటిస్తే.. అది విజయవంతమవుతుందని ఇంత "చర్చ" జరిగినా నేను నమ్ముతున్నాను!!"
ప్రేమ, గౌరవ మర్యాదలు అలవాట్లని మార్చుకోవాలని చెప్పవు. ఒక వేళ మనకి ఇష్టమైనవి మార్చుకోవలసి వస్తే, అది ప్రేమతో అయితే ఏంటి, భయంతో అయితే ఏంటి మారుతున్నాము. మనిషి ఒకరిని ప్రేమతో తనకిష్టమైనట్టు మార్చుకోచ్చు అనుకున్నప్పుడు ప్రేమలోనే ముంచెత్తుతాడు. భయపెట్టి మార్చుకోవాలి అనుకుంటే భయపెట్టి మార్చుకోగలడు.
కానీ ఆ వ్యక్తి ఎందుకు మారుతున్నారు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇద్దరు కలిసి జీవించడానికి అవసరమయి మారుతున్నారా? లేక కేవలం రెండో వ్యక్తికి ఇష్టమని మారుతున్నారా? లేక తనకి ఇష్టమయ్యి మారుతున్నారా?
ఎందుకంటే ఆ ప్రశ్నల్లోనే ఒకరి అస్థిత్వం ఉంది... ఎట్టి పరిస్థితుల్లోను దాన్ని కోల్పోకూడదు...
నేను ఒకవేళ బంధంలో మారుతున్నా అది నా అస్థిత్వాన్ని ప్రశ్నించే మార్పు అవ్వకూడదు.ఎందుకంటే అది నా విలువల మీద, నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది..
కాబట్టి నాలో వచ్చే మార్పుకి నా భార్య మీద ప్రేమ, మర్యాద కారణం కాదు. మా బంధం పరిపూర్ణమవ్వడానికి అది అవసరమైతేనే మారతాను.
సమాజంలో నాకు ఎదురయ్యే వాటి గురించి ఆలోచిస్తాను. సమాజంలో ప్రతీదీ నాకు సంభందించిన విషయమే. ప్రతీదీ నా టీ కప్పులోనిదే. అలానే కులాంతర మతాంతర వివాహాల గురించీ ఆలోచించాను. ఇలాంటి విషయాల్లో అస్థిత్వానికి సంభందించిన ప్రశ్నలు మరిన్ని తలెత్తుతాయి. ఇద్దరు కులాంతర, మతాంతర వివాహాలకి సిద్ధపడినప్పుడు వాళ్ళు ఆ రెండు లేనట్టే బతకాలి. ఆ నమ్మకంతోనే వాళ్ళు కలిసారు. ఆ నమ్మకంతోనే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవనాన్ని సాగించాలి. అదే నమ్మకాన్ని తరవాత తరంలో జీవింపచెయ్యాలి.
కుటుంబంలోని ఒకరి మీద ప్రేమ, గౌరవ మర్యాదలకి లొంగిపోయి అస్థిత్వానికి సంభందించిన విషయాల్లో మారకూడదు...
ఇంకా ఇక్కడ కులాంతర, మతాంతర వివహాలు విజయవంతం కావు అని ఎవరూ అనలేదు... బంధం చివర వరకూ నిలబడటమే విజయమయితే 99% విజయవంతమైనవే.. ఏలా నిలబెట్టుకుంటున్నారు అనేదే ప్రశ్న!! ఆడ వారు ఎందుకు వారి అస్థిత్వాన్ని నిలుపుకోవడం లేదు అనేది ఇక్కడ చాలా వరకు చర్చకు వచ్చిన విషయం...
aadhara padi undatam anagane naaku anpinchindi. aadavaari meeda aadharapade magavaaruu vunnaru.aadavallandi meeru konchem taggi vundandi annattundi ramanigaaru ee vyakhya.sthreeni deevatamoortiga chusee ee desamlo, oka akkaga,chelliga,bharyaga,talliga mamataanuraagalu panthutu tananu taanu gurterugaka sramistuu, kutumbamlo ennenni kashtalu kaligina oorputo,chirunavvuto annintinee negguku ragaligedi shtree matrame. enno sandharbhalalo prati purushudi vijayam venuka shtree vuntundi antaru.manam positive ga think cheste manaki manam gouravaneeyulam.appude andariki gouravaneeyulam avutaamu. kani meeru cheppinattu manalo manake padadu. nijamga oka shtree, inko shtreeni chusi asuya lekunda nishkalmashamga parasparam prema,sneham kaliginaroju ee gurtimpula kosam patu padanavasaram ledanukuntanu.idi na abhiprayam.emantaru ramanigaru....
ReplyDelete