ఈరోజు ముక్కోటెకాదశి.. దీనినే వైంకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశులు ద్వాదశులు అంటే గుర్తొచ్చేది నాకు నా చిన్నతనమే. చిన్నపిల్లలు అలా ఉపవాసాలు ఉండలేరు అంటూ అమ్మ మధ్యాహ్నం 3 గంటలకి పళ్ళతో పాటు కాస్త పలహారం కూడా చేసేసి కటికోపవాసం లంకణంతో సమానమంటూ పెట్టేది , సరదాగా జాగారణలు. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ ఆపకుండా చదివే సహస్రనామాలు , అష్టొత్తర శతనామవళులు, భలె అనిపించేది నేను ప్రయత్నించేదానిని కాని అసలు నోరు తిరిగేది కాదు నాకు.
" రాత్రి 12 గంటలదాక అన్నా మెలుకువగా ఉండాలే " అని అమ్మ చెప్పినందుకని, వైకుంఠ పాళి ఆడుకునేవాళ్ళము. నిచ్చెనలు ఎక్కెస్తే ఆనందం, పాములు మింగేస్తే బాధ పరపద సోపానానికి చేరుకొనేసరికి తెల్లవారుఝాము 4 అయ్యేది. శివరాత్రిలాగా జాగారం చేసేవాళ్ళము.
ఇప్పుడు పెళ్ళయిన తరువాత ఈ జాగారణలు లేవు, ఉపవాసాలు లేవు. ఒక్క శివరాత్రి ఉపవసాలు , కార్తిక సోమవార ఉపవాసాలు తప్ప.. పొద్దున్నే గుడికి వెళ్ళి ఒకసారి దైవ దర్శనం చేసుకొని ఆఫీసు దారి పట్టాను.
హైదరాబాదు మూడు దర్నాలు , ఆరు బందులతో అలరారుతోంది, కాబట్టి ప్రస్తుతం తాజా సమాచారమంటూ ఏమీ లేదు. ఆఫీసులో అంతా రోటీన్ పనే.
ఎందుకో అనిపిస్తుంది మన మనసుకి మాత్రం మనం ఒంటరి వాళ్ళమే అని ...
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది అన్న పాట గుర్తొస్తోంది.... :)
*****
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.