12.29.2009

29/12/2009 contd...

ఆఫీసులో ఎవరిదో పుట్టినరోజు.. బాగా జరిగింది, భోజనాల ఖర్చులు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాయి.... ఇంతలో ఇంటినుండి ఫోన్, ఈరోజు వంటలు ఎక్స్‌టాడరీగా ( టైపాటు కాదు ఇది మన కొరియోగ్రాఫర్ల భాష) ఉన్నాయి అని.. :-) "దేనికన్నా దంతసిరి ఉండాలే" అంటుంది అమ్మ.. అంటే ఇదేనేమో..

ఈరోజు ఆఫీసులో నైపుణ్యతకి సంబంధించి పరీక్షలు...(Performance test ) , కార్పోరేట్ కల్చర్ :-) ... అడిగే ప్రశ్నలకి సమాధానాలు రావు కాని పక్కవాడంటే ఎంత మంటో చెప్పడం.. నాకెందుకు చెప్తారో అనిపించింది. మనలో మన మాట ఇది నాకు పరీక్ష ఏమో ..ఈ పరీక్షలో నేను నెగ్గితే ప్రమోషన్ ఉంటుందేమో.. బాస్ ఏమంటారో.. బాస్ అంటే గుర్తొచ్చింది మా బాస్ గురించి రాయాలి రాయాలి అనుకుంటాను చూడాలి ఒక సుధీర్ఘ పోస్ట్ రాయాలి ఎప్పుడో..


మళ్ళీ రేపు బందుట ..బందులకి అలవాటుపడాల్సి వస్తోంది. ఉద్యోగాలకి అలవాటుపడిన తరువాత ఇంట్లో కూర్చోవాలంటే కొంచం బోరే. ఎప్పుడో ఒక రోజంటే పర్వాలేదు కాని మరీ ఇలా రోజు విడిచి రోజు బందులంటే సామాన్యుడి జీవితం ఎలాగో..

*****

చెప్పదల్చుకుంటే పెన్నుని,వినదల్చుకుంటే పుస్తకాన్ని ఆశ్రయించాలిట..... బాగుంది కదా .. :-)


1 comment:

  1. ఎక్స్‌టాడరీగా :-)
    హ హ మీరు కొన్నాళ్ళా టీవీలో డ్యాన్స్ ప్రోగ్రాములకు రియాల్టీషోలకు కాస్త దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిదేమో కాస్త ఆలోచించి చూడండి :-) మళ్ళీ తర్వాత ఇంతమంది స్నే’హితులు’ ఉన్నారు ఒక్కరూ హెచ్చరించలేదు అని మమ్మల్ని అంటే లాభంలేదు :-)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...