కొత్తగా ముస్తాబై వచ్చిన వనితామాలిక చదివారా?? ఈసారి మన ముళ్ళపూడివారికి స్మృత్యంజలి ఘటిస్తూ.. మాయమయిపోతున్న తెలుగు అక్షారలకై లలితగారి ఆవేదన , వెలిబుచ్చిన వ్యధతో ..
శివరాత్రి, శివపంచాక్షరి ప్రాముఖ్యత వివరిస్తూ..కూరగాయలమ్ముతూ సామాన్య జీవితం గడుపుతూ కోట్లు దానం చేసిన ఒక అసామాన్య మహిళని పరిచయం చేస్తూ.. ఎండల తాకిడికి పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో? అని తల్లడిల్లే
తల్లులకు ఉపాయాలు చెప్తూ..వేసవిలో వసంతం కురిపిస్తూ పిల్లలు కాసేపు పుస్తకాలు పక్కన పెట్టి చదవడానికి ఒక
చందమామ కథని వినిపిస్తూ.. అసలువీటన్నిటికీ పరమార్థం ఏమిటి? ఈ జీవితం ఏమిటి అని అనుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరగలమా అని సంపాదకీయంలో ప్రశ్నిస్తూ.. చేరలేకపోయి.. దుర్భర జీవితం గడిపిన "అడబాప" వనజని పరిచయం చేస్తూ.. లక్ష్యాన్ని చేరే ముందు కొంత ఎంజాయ్మెంట్ ఉండాలని "ఇండియన్ స్టూడెంట్ డే" జరుపుకున్న సరికొత్త వనితా మాలిక..
మరి మీరు కూడా వనితా మాలిక తో పాటు ఈ సంబరాలు చేసుకోడానికి ఇదే ఆహ్వానం..:-)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.