4.27.2011

డైరీలో ఈరోజు 26/04/2011- నాకు నచ్చిన కమెంట్..



 

 (సత్య సాయి బాబా గారి విష్యంలో  నాకు నచ్చిన కామెంట్ ఇది. )  లాహిరి గారి బ్లాగులో

మీ రాసే విధానం బాగానే ఉంది. ఆలోచనలలో స్పష్టత ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే...రాయడానికి సరిపడా సరుకుంది మీ దగ్గర. కాకుంటే ఒక అంశాన్ని లేదా విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు దాని గురించి పరిపూర్ణమయిన సమాచారం ఉన్నప్పుడే చెబితేనో..రాస్తేనో అందంగా ఉంటుందని నా అభిప్రాయం. విమర్శలు చేసే ముందర స్థాయీ బేధాలు చూడటం కనీస ధర్మం కదా..మీకు తెలియని విషయమేమీ కాదనుకోండి. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ఏమి రాసినా ఆది సబబుగా ఉండదు. మన ఆలోచన మరో పదిమందిని ఆలోచింపచేసే విధంగా ఉండాలి కానీ...బాధించే విధంగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. మండలం గడిచాక నడిచొస్తాను...పదేళ్ళు ఇంకా ఉంటాను అనడం ఇంకోటి...మరోటి....అవి ఎప్పుడు...ఎలాంటి సందర్భాల్లో చెప్పిన విషయాలో...దాని వెనుక ఉన్న అసలు అర్ధం ఏమిటో...అసలు ఆ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అలా ఆయన అన్నారో...తదితర విషాయల మీద మీకు స్పష్టమయిన సమాచారం..కనీస అవగాహన ఉంటే నిరభ్యంతరంగా రాయొచ్చు. పోనీ...లేదు అనుకుంటే...కనీసం తెలుసుకునే ప్రయత్నమయినా చేసి పటిష్టమయిన సమాచారం ఉంది అనుకున్నప్పుడయినా రాయాలి కదా.. ఒకరు రామా అని పిలిస్తే...అది పదో మనిషి చెవిలో పడేటప్పటికి "రామా" కాస్తా, "రమా" అయిపోవడం సహజం. ఇలాంటి చిన్న విషయాలపై కూడా తమరు దృష్టిపెట్టి ,నాణేనికి ఒకేవైపు కాకుండా మరో వైపు కూడా ఉంటుందని గ్రహించి సమాంతరంగా ఆలోచించి రాస్తే బాగుంటుందని నా మనవి. ఆ మాటకొస్తే షిరిడీ సాయి బాబా గురించి కూడా అందరం చరిత్రలో చదువుకోవడమే కానీ....నిజంగా కళ్ళతో చూసినది అయితే కాదు కదా. మరి ఇంతమంది కళ్ళకి ఇన్ని ఋజువులు చూపిన మనిషిని పట్టుకుని అలా నిష్టూరాలాడటం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి. ఎవరయినా ఒక్క ఒక్కరినీ...లేదా పది మందిని...లేదా వందమందిని...మేరీయీ చేతనయితే వెయ్యిమందిని మోసం చేయొచ్చు.. ఇలా లక్షల మంది...ఆ మాటకొస్తే కోట్ల మంది ఇలా ఆయన పాదాక్రాంతం అవుతూంటే..మోసం...మాయ అని కాకుండా...మరో కోణం ఏదయినా ఉంది ఉండొచ్చు అని నిష్కాల్మశంగా ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అని నా సలహా. ఇన్ని చెప్పాను కదా అని నేను భక్తుడినేమో...కాబట్టే ఇలా రాసుంటాడు అని ఆలోచించకండి. నేను మానవతావాదిని.."

ఎవరో కూడా తెలీదు కాని చక్కగా తమ అభిప్రాయాన్ని చెప్పారు కుడోస్- రమణి
--

3 comments:

  1. బాబా పై వచ్చిన కామెంట్స్ గురించి ఎవరో కానీ బాగా రాశారు . బాబా ను సమీప బందువులు చూసి వచ్చిన వార్తను టివి లో చూశాక ఒకరు దేవునుకి సమీప బందువులు ఉంటారా అని ఒకరు బ్లాగ్లో రాశారు. బ్లాగ్లో కొన్ని కామెంట్స్ చూశాక రాక్షస బందువులు బోగస్ నిర్వహిస్తూ, కామెంట్స్ చేస్తున్నప్పుడు దేవుడికి సమీప బందువులు ఎందుకు ఉండరు అనిపించిది. దేవుడు అంటే ఎవరు అని నిర్వచించుకుంటే సమాదానం దొరుకుతుంది. పన్నెండు చేతులు, ఆరు కాళ్ళు ఉంటేనే దేవుడు అనుకుంటే బాబా లో దేవుడు కనిపించరు . పేదలకు నిరు, వైద్యం అందించిన వారు దేవుడు అనుకుంటే బాబా లో దైవం కనిపిస్తారు. నేను నాస్తికత్వాన్ని ఇష్టపడతాను , దైవత్వాన్ని ఇష్టపడతాను. మానవత్వాన్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతాను. సహాయం చేసే అవకాశం లేక్కపోయిన మంచి కనిపించినప్పుడు అభినందిద్దాం

    ReplyDelete
  2. నాకు తెలిసి ఆ సమాధానం జయహో గారు ఇచ్చివుండొచ్చు. ఏవైనా వేరే వారి వ్యాఖని ఒక టపాగా మలిచిన మీకు కూడా కుదోస్ రమణి గారు.

    బుద్ధా మురళి గారు, చక్కగా చెప్పారు. మీకు కుదోస్ మరి :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...