4.23.2011

డైరీలో ఈరోజు 22/04/2011-2nd part


...... పాప ఉంది కదా.. ఆ అమ్మాయి మొన్న అగస్ట్ రక్షాబంధన్ రోజు ఒక అబ్బాయికి రాఖీ కట్టి, "నేను నీకు రాఖీ కట్టినంత  మాత్రాన నువ్వు నాకు సోదరుడివి కాదు ఫ్రండ్‌వి అని అందిట.. " నా జోక్యం ఉండకూడదు అని అనుకున్నా..  అయినా కాని ఒక relation కి నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు అని చెప్పా" నేను చాలా సెన్సిటివ్ నువ్వలా మాట్లాడకు అని రిప్లై వచ్చిందిట.. మా పాప తనకి సంబంధించిన విషయం కాదని కాం అయింది. ఇది పరీక్షల మునుపు జరిగింది.

పరీక్షలు అయ్యాక,...  వీళ్ళ షెటిల్ విషయంలో పొద్దున్నే పాప లేచి వెళ్ళేసరికి ఆ పాప పైన ఉన్న అంకుల్‌తో ఆడుతోందిట. అందుకని "ఒకటి రెండు సార్లు నేను వచ్చినా,  నువ్వు ఆ అంకుల్తోనే ఆడుతున్నావు కదా.. ఇక నన్ను పిలవకు.. అని ముందురోజు అందిట. " ఆ అమ్మాయి ఈ మాత్రానికే నన్ను అంత మాట అంటావా? మా పేరెంట్‌స్ వింటే ఎంత బాధపడ్తారు, నేను చాలా సెన్సిటివ్.. ఎప్పుడు అంకుల్‌తో ఆడతాను అని అంటావా?" (ఎదిగి ఎదగని వయసు , ఆ వయసు చూపే ప్రభావం, తెలిసితెలియని తనం, సినిమాల ప్రభావం.. ఆ పాప చేత మాట్లాడించిన లేత మాటలివి) అని అందిట.. పోని  ఆడుతున్న  ఆ ఇంటి మీద పెంకుల్ అయినా పోనిలే   చిన్నపిల్లలు అని సరదాగా తీసుకున్నాడా అంటే.. హక్కుల గురించి ప్రస్తావించాడుట.. "నీకసలు మేమిద్దరం ఆడుతున్నామనే హక్కే లేదు" (ప్చ్! అర్థం ఉందా అసలు ఈ మాటకి) అని అప్రస్థుత మాటలు.. "నేను మాట్లాడినది నువ్వు క్యాచ్ చేయడంలో ఉంటుంది మీనింగ్.. నీవన్నీ  తప్పుడు ఆలోచనలయితే అలాగే ఇది కూడా తప్పు అవుతుంది.. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ అవుతుంది.. మనకొక కోచ్ ఉన్నారనుకో అతను అంకులే కదా అలాగే ఆలోచిస్తావా.. అతను మనకి  నేర్పే గురువులా తీసుకోవాలి కాని"  అని చెప్పేసి వచ్చేసిందిట.

అదండి సంగతి.. నాకు పూర్తిగా చెప్పినతరువాత తెలిసితెలియని వీళ్ళ మాటలకి నాకు బాగా నవ్వు వచ్చింది.. నవ్వితే చిన్నబుచ్చుకుంటుందని నవ్వలేదు కాని, చివరిలో చెప్పిన ముక్తాయింపు భలే నచ్చేసింది నాకు..

"అసలిదంతా కాదమ్మా నేను బురదలో డాన్స్ చేస్తాను కాని నాకు అస్సలు బురద అంటకూడదు అని అనేవాళ్ళకి మనమేమి చెప్తామమ్మా?   "

బాగుంది కదా ఇలా చెప్పడం..
****

1 comment:

  1. రాఖీ కడతాను కానీ స్నేహితునివే అందా ఆ అమ్మాయీ! ఆ మాత్రం దానికి అంతగా కట్టడం ఎందుకంట :))

    సీమ టపాకాయ్ పేరు విన్నారా? అల్లరి నరేశ్ కొత్త సినిమా లెండి. నిజమో కాదో గానీ ఓ వార్త చూసా - ఆ సినిమా మీద. పత్రికా విలేఖరుల సమావేశంలో హీరోయిన్ను మై స్వీట్ సిస్టర్ అన్నాట్ట నరేశ్. ఆమె కూడా తగ్గకుండా మై స్వీట్ బ్రదర్ అందిట. ఇప్పుడిక ఈ అన్నా చెల్లెళ్ళ రోమాన్స్ చూడాలి కాబోలు.

    బావుంది మీ పాప ఆలోచనా విధానం.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...