మధురభావాల సుమమాల
2.02.2020
పూర్వ విధ్యార్థుల సమ్మేళనం... సంరంభం. .
నేను చూడమని చాలమందికి లింక్ పంపాను. ఈ వీడియో లేన్త్ చూడగానే ఆ... ఏమి చూస్తాము ఇన్ని గంటలు అని అనుకుంటారు సహజం .. అందుకే నా స్నేహితులకి, బంధువులకి, ఆత్మీయులకి కొంచం వెసులుబాటుగా.... నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఇక్కడ ఇస్తున్నాను చూడండి. లంచ్ సమయంలో పాటలు మటుకు వినండి ఆనందంగా..
*******
గతం ఎప్పుడూ స్మృతులకోసమే అంటారు.. ఆ గత స్మృతులు మధురమయిన అనుభూతుల మేళవింపు ఈ వీడియో.. చూస్తున్నంతసేపు బాల్యం ఎంతో గొప్పగా అందంగా కల్మషం లేకుండా నా కళ్ళముందు కదలాడిందో ....మళ్ళీ బాల్యానికి వెళ్ళొచ్చిన నా అనుభూతి ఈ వీడియో...💐💐💐💐
2 గంటల 50 నిముషాల పైన ఉన్న ఈ వీడియో ఓపికగా మాకు సంబంధించినది కాబట్టి మేము మాత్రమే చూడగలము అందరూ చూడండి అని బలవంతగా చెప్పలేము కాబట్టి, మీరందరూ నా ప్రియ స్నేహితులు కాబట్టి నేను ఎక్కడెక్కడ అయితే ఉన్నానో వివరాలు ఇస్తాను.... చూడండి మీ ఓపికకి నా ప్రత్యేక కృతజ్ణతలు🙏🙏🙏🙏
ఈ వీడియోలో నేను ఉన్నది
3:09 దగ్గర...
5:19 దగ్గర...
18:19 దగ్గర...
1:13:14దగ్గర...
1:16 దగ్గర...
1:33 దగ్గర...
1:36 దగ్గర...
2:36 దగ్గర...
2:54 దగ్గర...
11.26.2017
వనభోజనం-మనభోజనం 7, తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి గారు
వ్యక్తిత్వం అంటే " బ్రాండెడ్" దుస్తులు వేసుకుంటేనో... పెట్టుపోతల్లో " బ్రాండెడ్" దుస్తులు పెట్టించుకుంటేనే రాదు... !!! (Y) (Y) <3 span="">3>
వనభోజనాల్లో ప్రదర్శించిన అద్భుత బ్యాటరీ ప్రయోగం ఇది
తనకు కావాల్సినవి శివుడే చేయించుకుంటాడు... సంకల్పం సగం బలం.... సంతోషం మిగతా సగం..
చీకట్లోకి వెలుగు వచ్చినంత ఆనందం!!!
అంటూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా మనం వెస్ట్ అనుకునే వస్తువులతో ఉపయోగపడే వస్తువులు చేస్తూ మూర్తిభవించిన వ్యక్తిత్వం గల వ్యక్తీ తరిగొప్పుల విఎల్లెన్ మూర్తిగారు. రామలక్ష్మి,,సదానంద రావుగారి దంపతులకి మార్చ్ 31 మండుటెండలో జన్మించిన మూర్తిగారు Star Maa లో ఉద్యోగం చేస్తున్నారు. 1992 లో భక్తీ సుమమాల తోలిప్రచురణ కాగా పునరపి జననం హైకూ కవితల సంపుటి మలి ప్రచురణ. అలాగే ఆంధ్రజ్యోతి, స్వాతి పత్రికలలో పలు కథలు ప్రచురించ బడ్డాయి.
కథలు, కవితలు, హైకులతో పాటుగా బ్యాటరీ మోటారుతో ప్లాస్టిక్ కారు బొమ్మలు తయారు చేయడం మూర్తిగారి ప్రత్యేకత.
హాస్య ఛతురోక్తులు ,హాస్య చిత్రాలతో కామెంట్స్ మరో ప్రత్యేకత.
వనభోజనాలకి వచ్చి తాను బాటరీ మోటారుతో తాయారు చేసిన బొమ్మని పిల్లలికి చూపిస్తూ అందరికి అభిమాన పాత్రులయ్యారు మూర్తిగారు. మూర్తిగారు చెంత ఉంటే స్ఫూర్తి నిజంగా మన వెంటే...
మూర్తిగారు వనభోజనాలకు మీలాంటి మూర్తిభవించిన స్ఫూర్తి కలిగిన వ్యక్తులు రావడం నిజంగా మా అదృష్టం. మీకు మా ధన్యవాదములు.
ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి వారు చేసిన బొమ్మలు కనిపిస్తాయి.
వనభోజనాల్లో ప్రదర్శించిన అద్భుత బ్యాటరీ ప్రయోగం ఇది
తనకు కావాల్సినవి శివుడే చేయించుకుంటాడు... సంకల్పం సగం బలం.... సంతోషం మిగతా సగం..
చీకట్లోకి వెలుగు వచ్చినంత ఆనందం!!!
11.23.2017
వనభోజనం-మనభోజనం 6. పవర్ కోటేశ్వర రావు గారు
నిజానికి పవర్ కోటేశ్వర రావు గారు వనభోజనాల ముందురోజు రాత్రి వరకు నాకు తెలీదు. మెడం నా తరుపునుండి 10 దాకా వస్తారు అంటే ఎవరబ్బా అనుకున్నా... వనభోజనాలలో కనిపించినప్పుడు అదే అడిగాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానా మీరు అని అడిగా పేరు మూడు పవర్ చూసి. కాదు, నేను విధ్యుత్ శాఖలో పని చేసాను అని తన ఉద్యోగ విషయాలు తెలిపారు పవర్ కోటేశ్వర రావు గారు.
వీరు Deputy Executive Engineer, Greater Hyderabad Municipal Corporation. లో చేస్తున్నారు. సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడి ఆ వీడియోలను అందరికి ఉపయోగ పడేలా తన ఫేస్ బుక్ లో షేర్ చేసి సమయానికి తగ్గట్లుగా ఉన్న వనరులని, సంస్కృతిని , సంప్రదాయాలని సంరక్షించుకోవాలని చెప్తూ ఉంటారు.. వారి వీడియోలని మీరు ఒకసారి చూడండి నేను ఏమి చెప్పనవసరం లేదు.
మన వనభోజనాలకి మిత్రుల సమేతంగా వచ్చి ఉన్నది కాసేపయినా మన సంస్కృతీ , సంప్రదాయాల గురించి మంచి సందేశం ఇచ్చారు పవర్ కోటేశ్వర రావు గారు.
ఇలా ఎన్నెన్నో లైవ్ వీడియోస్. తానూ సామాజిక సేవా కార్యక్రమాలని చేస్తూ మిగతావారిని చేయమని ప్రోత్సహిస్తూ పవర్ కోటేశ్వర రావు గారు పవర్ ఫుల్ మెసేజెస్ ఇస్తూ యువతని ఉత్తేజ పరుస్తున్నారు. మేమెవరో తెలియకపోయినా వనభోజనాలకి వచ్చి మంచి సందేశం ఇచ్చిన కోటేశ్వర రావు గారికి ధన్యవాదములు.
పవర్ కోటేశ్వర రావు గారి ఫేస్ బుక్ లింక్.. పవర్ కోటేశ్వర రావు గారు
పైన ఉన్న పేర్ల మీద క్లిక్ చేస్తే మీరు వారి వీడియోలు కనిపిస్తాయి, వారి సందేశాలు వినిపిస్తాయి.
11.21.2017
వనభోజనం-మనభోజనం 5. ఇలపకుర్తి రాధాదేవి గారు
అనర్గళంగా మాట్లాడుతూ, ఆశువుగా అమ్మవారి పాటలను తన గొంతులో పలికించగల అమ్మగారు శ్రీమతి ఇలపకుర్తి రాదాదేవిగారు. మనకి సుపరిచితురాలు కాఫీ విత్ కామేశ్వరి గారి అమ్మగారు. సరస్వతీ కటాక్షం అమ్మగారి వర్చస్సులో గోచరిస్తూ ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు అమ్మవారు అక్కడ ఆసీనులై రాగమాలపిస్తున్నారా అన్నంత సుందరంగా ఉంటుంది ఆ గాన మాధుర్యం. తానూ రాలేకపోయినా వీల్ చైర్ లో వనభోజనాలకి వచ్చి కార్తీకమాస వనభోజనాలకి తన భక్తిరస గానమాధ్యుర్యంతో ఒక హుందాతనాన్ని తీసుకువచ్చిన అమ్మ శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారు.. ఆవిడ తన స్వీయ గీతాలని ఎలా ఆలపిస్తారు ఏవిధంగా తాను పాడగలను అన్న విషయాన్ని కూడా అక్కడ అందరికి విడమర్చి చెప్పారు. అంతా అమ్మవారి కటాక్షం నాదేమి లేదు అంటారు అమ్మ. అంతే కాదు వనభోజనాలని కూడా ఏంతో ప్రశంసించారు. సుందరకాండ ఆలపిస్తూ ....... వనభోజనాలు చాలా చూసాను ఇవే అసలయిన వనభోజనాలు అని ఆమె నుండి రావడం మనందరికీ దీవెనలవంటివి. అమ్మగారికి సదా పాదాభివందనంలతో ఇదిగో మీరు వినండి ఆ గాన మాధుర్యం.
ఆవిడే కాదు శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారి కుటుంబం వారి పెద్దమ్మాయి మన కాఫీ విత్ కామేశ్వరి, కామేశ్వరి గారి చెల్లెలు శ్రీమతి పద్మజ గారు, కామేశ్వరి కోడలు శ్రీమతి వాణి గారు, వాణి గారి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు, కామేశ్వరిగారి స్నేహితురాలు శ్రీమతి ఉమాదేవి కల్వకోట గారు ఈ వనభోజనాలకి వచ్చిన ప్రముఖులలో ముఖ్యులు.
Subscribe to:
Posts (Atom)
Loading...