7.20.2010

మానవ సేవ - మాధవ సేవ ఓ సత్‌ సంకల్పం

ఒక మంచి ఆశయంతో మళ్ళీ ఇలా మీ అందరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఒక ఉడతాభక్తి సహాయంలో ప్రమదావనం, ఇంకొన్ని సేవాశ్రమాలకి నేను సైతం చిన్న ప్రమిదలా సహాయం చేశాను. మాహా సంకల్పానికి, మహా ఆశయాల కట్టడికి ఒక్క ఇటుక ఖర్చు మనదైనా మన జన్మ ధన్యమవుతుందిట పెద్దవాళ్ళు చెప్పారు. "ఫలనా అనాధశ్రమంలో పిల్లలికి పుస్తకాలు పంచాము" .. "ఎంత గొప్ప ఆత్మీయ స్పర్శ" వృద్ధాశ్రమంలో వృద్ధులను ప్రమదలు కలుసుకున్నప్పుడు,  వారు చెప్పిన ఆ అనుభూతిని పరోక్షంగా  అక్కడ జరిగినంతగా ఆనందాశృవులతో అనుభవించగలగాలి.. అలాగే అర్థరాత్రి పెనుచీకటిని లెక్కచేయక,  తనవారి సహయంతో దుప్పట్లు పరిచిన సంఘటన నిజానికి ఎంతటి ధైర్యశాలి అని అనుకోకుండా ఉండలేము. మరి  ఆమర్నాడు ఆభాగ్య జీవులు ఆ కప్పిన దుప్పట్లను చూసుకుని మురిసిపోయి, ఇచ్చిన పుస్తకాలను ఆ కొత్త పుస్తకాల వాసనను చవి చూసి....అత్మీయుల స్పర్శని ఆనందించిన తరువాత?? తరువాత మరి వాళ్ళకి యధాప్రకారం రోడ్డుమీద అడుక్కోవడమో,  ఇంకా ఆ కొత్త వాసన పూర్తిగా ఆస్వాదించకుండానే పుస్తకాలు తీసెసుకునే గురుతుల్యులు.. ఒకసారి అందించిన చేయి మరల ఎప్పుడొస్తుందా అన ఎదురుచూపులు వెరసి వీరందరిది అనాధ జీవితం..  ఇదే వారి జీవితం. మనం ఎప్పుడో ఒకసారి వారికి చేయుతనివ్వగలము, ఎపుడో ఒకసారి మన మనసు చలించి అన్నదానమో, అత్మీయస్పర్శ ఇవ్వగలము ఒక్కసారి అర్థరాత్రి అపరాత్రి లెక్కచేయకుండా దుప్పట్లు దుస్తులు పరవగలము.. (ఈశావ్యాసోపనిషత్తు గుర్తొస్తుంది :) ) తరువాత వారి యధాతధ జీవితాలు అలాగే ఉండాలా? ఈ ఆలోచనే మమ్మల్ని కదిలించింది మా హృదయాలను ప్రశ్నించింది. అందుకే మేము తీసుకున్న నిర్ణయం ఒక సేవాశ్రమం నిర్మించాలి (కాస్త కష్టమైనా) ఇలా మా సంకల్పాన్ని  దృఢపరుస్తూ, సాయిబాబావారి కటాక్షాలు మాపై ఉండాలని ఆశిస్తూ....  మేము పౌర్ణమి అనగా 25/07/2010 తేదీన మా స్వగృహమునందు పూజ, భజన చేయ నిశ్చయించాము.  సేవాశ్రమవాసులకు మాధవసేవ పరమార్థం తెలుపుటకు అక్కడ ఒక గుడి కూడా నిర్మిద్దామని మరో శుభ సంకల్పం. మరి ఈ  సంకల్పాలు విజయవంతం కావాలని సాయి భక్తులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని , ఆశీర్వదించాలని  మా ఆశయం.

మీకు కూడా  ఈ సేవాశ్రమానికి గాని, గుడికి గాని ఒక ఇటుక ఖర్చు నాది కూడా అయితే.. అన్న ఆలోచన కలిగితే,  మరి ఆలశ్యం చేయక మమ్మల్ని సంప్రదించగలరు.  మా మెయిల్ అడ్రస్: ramanisreepada@gmail.com.

 ఇప్పటి వరకూ మాకు సహకరిస్తున్న హితులు,మిత్రులూ వారి,వారి తాహతుకు తగ్గ దక్షిణలూ,విరాళాలూ సమర్పిస్తూ, సేవ న౦దిస్తున్నవారికి మాధన్యవాదాలు(హైదరాబాదుకు 40 కి.మీ దూరంలో స్థలం, విగ్రహ ఖర్చు, కిరీటం ఖర్చు సమకూరాయని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ) . మా ఈ స౦కల్ప౦ దృడమైనది. 2011 లో గురుపౌర్ణమికి మా సత్స౦కల్ప౦ సాయిబాబా వారి  శుభాశీస్సులతో పరిపూర్ణ౦ కావాలని మా ఆకా౦క్ష.
Loading...