సమావేశానికి రెండురోజుల ముందు వరూధినిగారి నుండి ప్రమదలందరూ ఒకసారి సమావేశమవుతున్నాము.. మీరు కూడా ఆహ్వానితులే అంటూ మేయిల్ ఆహ్వానం పంపారు.. మెయిల్‌తో పాటుగా మాలగారు పంపిన చూడ చక్కని ఆహ్వాన పత్రిక కూడా జోడించారు.
(కొంచం ఎడిట్ చేశాను )
(కొంచం ఎడిట్ చేశాను )
ఇంతకీ మా సమావేశ ముఖ్యోద్దేశ్యం.. మన సుజాతగారు అమెరికా వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ మనల్ని ఎప్పుడు కలుస్తారో అని.. అందరం ఒక చోట కలుసుకుని కాసేపు కబుర్లాడుకుందామన్నారు (గెట్ టుగెదర్ అన్నమాట) ఇలాంటి అరుదైన అవకాశాలు అంత తొందరగా జారవిడుచుకోను నేను... సమావేశ ముహూర్తం ఆదివారం ఉదయం 11 గంటలకు.. వేదిక మాలగారి ఇంద్రభవనం.. ఇక కాదనడానికేముంది..
వాతావరణం బయట ఎండ రూపేణా నిప్పులు చెరుగుతున్నా, మాలగారింట్లో నవ్వుల పువ్వులు వెల్లి విరిశాయి.. మా ఇంటికి చాలా దగ్గర్లోనే వారి ఇల్లు తొందరగానే చేరుకున్నాము.. నేను మా పాప. మెట్లు ఎక్కుతుంటేనే మాలగారు సాదరంగా ఆహ్వానించారు.. అప్యాయంగా ఎదుర్కోలు చెప్తూ, పి ఎస్ ఎం లక్ష్మిగారు ఎదురొచ్చి కుశలమడిగారు.. లోపలికి అడుగుపెట్టగానే తెలియనివాళ్ళు చిరునవ్వు చిందించారు.. తెలిసిన
వాళ్ళు 'హాయ్!' అంటూ చేతులెత్తి ఆహ్వానించారు... వెళ్ళగానే పరిచయ కార్యక్రమాలు అయ్యాక...సమావేశ విశేషాలు ముందుగానే తయారుచేసుకున్నారేమో, ఒక ఆట ఆడదామంటూ అక్కడివారినుద్దేశించి అనౌన్స్ చేశారు జి ఎస్ లక్ష్మి గారు.
జి ఎస్ లక్ష్మి గారు: అసలేమని చెప్పాలి ఈవిడ గురించి.. ఫలనా ఆట ఆడదాము, ఇప్పుడీ పని చేద్దాము, ఆ పని చేద్దామని ఎంతో చలాకీగా, సరదాగా గడిపి మమ్మల్నందరినీ అలరించారు ఈవిడ...శ్రీలలిత బ్లాగరి
జ్ఞాన ప్రసూనగారు: తీసుకెళ్ళిన వంటకాలను చూసి ఆసువుగా కవిత చెప్పి.. తన ముగ్ధ మనోహరమైన డ్రాయింగ్స్ చూపించి, జి ఎస్ లక్ష్మి గారు ప్రతీ ఆటకి 'సయ్యా' అంటే 'సై సై' అని సరదాగా గడిపిన ఎనర్జిటిక్ మహిళ ప్రసూన గారు.. ఎవ్రిడే సురుచి బ్లాగరి.
సి ఉమాదేవి గారు: మౌనంగా ఉన్నా.. మధ్య మధ్యలో ఆటల్లో "నేనే సుమా " అని గెలిచి హుందాగా ఉన్నారు చిన్నిగుండే చప్పుళ్ళు బ్లాగు ఈవిడదే
అన్నపూర్ణ గారు: ఇక ఈవిడ గురించి చెప్పక్కర్లేదు.. చూస్తే ఎవరో మనకి తెలీదు... పరిచయం లేనే లేదు అనుకుంటాము కాని , పరిమళం వెదజల్లుతున్న బ్లాగు నాదేనండి అంటారు.. :) ఇంక తెలియకపోవడమేముంది ఎన్నో ఏళ్ళు పరిచయమున్నట్లు కలిసిపోము ఈ సాదా సీదా పల్లెటూరి అమ్మాయితో... చాలా చలాకిగా జోక్స్ చెప్పి నవ్విస్తూ కవ్విస్తూ గడిపారు పరిమళం బ్లాగు అధికారిణి అన్నపూర్ణ గారు. అన్నట్లు ఈవిడ పాటలు చాలా చాలా మధురంగా పాడతారండీ..
జ్యోతి గారు: జ్యోతిగారి గురించి నేను అందరికి చెప్పడం అంటే తాతకి దగ్గులు నేర్పడంలాంటిది.. కాబట్టి జ్యోతిగారిని పరిచయం చేసే సాహసం నేను చేయలేను... 'మీకంటే మాకే బాగా తెలుసు' అన్నారనుకొండి నా చిన్ని మెదడు చిన్నబోతుంది మరి.. ;-)
మాలా కుమార్ గారు: ఈరోజు ప్రోగ్రాం అంతా వీళ్ళింట్లోనే కాబట్టి ప్రతీ ఆటలో, పాటలో, మిగతా విశేషాల్లో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ మావల్ల వారి శ్రీవారి భోజనానికి ఇబ్బంది పాలు చేసి, మమ్మల్ని నొప్పించక, శ్రీవారికి నచ్చచెప్పుకుని, తానొవ్వక, నేర్పుగా సమావేశాన్ని విజవంతం చేసిన "సాహితి"బ్లాగరి.
పి ఎస్ ఎం లక్ష్మి గారు: యాత్రల విశేషాలతో అలరిస్తూ.. పాత పాటల ఊపందుకుని మమ్మల్ని పరవశింపజేసిన యాత్ర బ్లాగరి.
వరూధిని గారు: "మువ్వగారు" అని బ్లాగర్లు ఆప్యాయంగా పిలుచుకునే బ్లాగరి, అభినవ ఇందిరాగాంధి గారు. వరూధినిగారు కనపడరు కాని భలే చలాకి అండీ బాబు.. "సిరి సిరి మువ్వ" బ్లాగరి
సుజాత గారు: జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు సుజాత గారి పరిచయం నేను చేయడమంటే అబ్బే.. ఎంత రాసినా తక్కువే.. కాకపోతే సుజాతగారిని 'మిస్' అయ్యామనే చెప్పొచ్చు "మెరుపులా మెరిశావు.. " అన్నట్లు అందరం 'హమ్మయ్య!' ఇక పరిచయాలయ్యాయి కాసేపు పిచ్చాపాటి అనుకునేలేపు అంతే మెరుపులా మాయమయ్యారు ... అర్జంట్ పని ఉంది అని "మనసులో మాట " చెప్తూ.. తన సుపుత్రిక సంకీర్తనతో సహా..
స్వాతి గారు: మువ్వలా నవ్వకలా.. ముద్ద మందారమా.. ముగ్గులో దింపకిలా.. ముగ్ధ సింధూరమా అని పాడుతూ మమ్మల్ని అలరించిన ముద్దుగుమ్మ స్వాతిగారు.. నువ్వు నాతోనే ఉన్నట్లు నా నీడవయినట్లు, నన్నే చూస్తునట్లు ఊహలో (మాలగారి ఇంట్లో) అని వారి శ్రీవారిగురంచి తలచుకుంటూ... గడిపారు చక్రవర్తి "భవదీయుడు" బ్లాగరు అర్థాంగి స్వాతిగారు.
ఇక మరో సుందరాంగి సాయి సుజన: మాట్లాడాలా.. వద్దా అనే బిడియం, మౌనం మరో ఆభరణం.. ఏమి మాట్లాడినా చిరునవ్వు చిందిస్తూ .. పెదవులు కదిలీ కదలకుండా ఆ ముద్దు మాటలు సుజన అంటే ఈవిడేనా.. అంత చక్కటి కవితలు అని అనుకోకుండా ఉండలేము...
క్షమించాలి చివర్లో రావడం వల్ల రచయిత్రి మంథా భానుమతిగారిని మరిచాను.. మన్నించండి మేడం.. ఆవిడ రాసిన ఆదర్శ కుటుంబం కథ . కథాజగత్‌లో ఇప్పుడే చదివాను అదే లింక్ ఇస్తున్నాను.. ఆవిడగురించి నాకు తెలిసింది తక్కువ చివర్లో కలవడం వల్ల వివరాలు తీసుకోలేకపోయాను.
ఇక నేను: ఇదిగో మధురభావాల సుమమాల నా బ్లాగు... నేను రమణినీ.. నాగురించి కొత్తగా చెప్పడానికంటూ ఏమి లేదు.. నేను వెళ్ళాను మా పాప ఫోటోలు తీసింది...ఇలా..
అలా ఆరోజు ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా గడిపాము.
****
కొన్ని ముఖ్యమైన మరిచిపోలేని అనుభూతులు:
జ్యోతిగారు ఆ పాత మధురాలు పేరిట.. తెలుగు హిందీ భాషల పాత పాటల సి డి లు అందరీకీ బహుమనంగా ఇవ్వడం.
సుజాతగారు అమెరికా వెళ్తున్న సందర్భంగా "చిరుకానుక " (నా చేతుల మీదుగా) అప్యాయంగా అందుకోడం.. సంకీర్తన భాషలో గిఫ్ట్..
"మిస్ గెట్ టుగెదర్" గా వరూధినిగారు బహుమానం అందుకోడం..
ఆటల్లో జ్ఞాన ప్రసూన గారు, ఉమాదేవి గారు, జి ఎస్ లక్ష్మిగారు, జ్యోతిగారు బహుమానాలు గెల్చుకోడం...
జ్ఞాన ప్రసూన గారి art పెయింటింగ్స్ ....
ఇదంతా ఒక ఎత్తయితే..
రాత్రి 9 గంటలకి మాలాకుమార్ గారు పులిహోర బాగుందని వాళ్ళ శ్రీవారు చెప్పమన్నారని, నాకు ఫోన్ చేసి చెప్పడం.. (మెచ్చుకోలు కొంచం తృప్తే కదా)
మాల గారి ఇంద్రభవనం లాంటి ఇల్లు..
****
గమనిక: ఏమన్నా, ఎవరినన్నా మర్చిపోతే క్షమించమని ప్రార్థన.
చాలా సరదాగా గడిపారండి. మీ అందరికీ నా అభినందనలు.
ReplyDeleteరమణి గారూ మీ పరిచయవాక్యాలు బావున్నాయండీ...
ReplyDeleteజయగారు థాంక్స్ అండీ.. బాగున్నారా? మిమ్మల్ని మిస్ అయ్యామండి మేము.. మాల గారిని అడిగాము కూడా మీరు రాలేదేమని.. వచ్చి ఉండాల్సింది..:(
ReplyDeleteజ్యోతిర్మయి గారు థాంక్స్ అండీ
mee ammaayi photolu chakkagaa teesindi.nuvvu sarasamgaa andarigurinchivraasaavu. marapuraani sandhatanalu ivi.
ReplyDeleteSo nice.. Very nice.
ReplyDeleteఛక్కని భావజాలం,చక్కని ఫోటోలు!అమ్మాయికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి!
ReplyDeleteచక్కని పరిచయం. జ్యోతి గారు నన్ను అడిగినప్పుడే రాలేకపోతున్నందుకు బాధనిపించింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఇంత చక్కగా వివరించేస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉంది ;)
ReplyDeleteమీరంతా ఇంత చక్కగా కలిసి సంతోషంగా గడిపినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండీ!మీ వలన ఎంతో మంది బ్లాగర్లని చూడగలిగాను. ధన్యవాదాలు.
చక్కని పరిచయం.. మౌనిక ఫోటోస్ బాగా తీసింది..
ReplyDeleteమా ఇల్లు ఇంధ్రభవనం వావ్ :)) థాంకూ .
ReplyDeleteబాబోయ్ నేనిత లావున్నానా ? ఇహ డైటింగు , వాకింఘూ ఎక్కువ చేయాల్సిందే :)
మా అందరినీ బాగా చూపించారు కాని మీ ఫొటో నే సెపరట్గా పెట్టలేదు వూ (((((. . . . .
nice meetup
ReplyDeleteజ్ఞాన ప్రసూన గారు.. చాలా చాలా థాంక్స్.. పాపకి కూడా మీ ఆశీస్సులు అందాయి అంతకన్నా ఏమి కావాలి చెప్పండి.. "సరసంగా" హహహ మరోమారు కృతజ్ఞతలు.
ReplyDeleteసుజాతగారు, ఉమాదేవిగారు, రసజ్ఞ గారు, జ్యోతిగారు: థాంక్స్ అండీ
రసజ్ఞ గారు : రావాల్సింది మిమ్మల్ని మేమూ మిస్ అయ్యామన్నమాట... ఇంకోసారి అనుకుంటున్నారు మరి వివరాలు తీసుకుని ప్రయత్నించండి...
జ్యోతిగారు: మౌనికకి అందజేసాను మీ కాంప్లిమెంట్స్.
మాలాకుమార్ గారు: పాప దగ్గరనుండి తీయడంతో మీకలా మీరు లావుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కాని.. మీరు కరెక్ట్గానే ఉన్నారండి.. వాకింగ్లు డైటింగులు అంటూ హడావిడి చేసేయకండి.. ;-)
ప్లస్స్ లో నా ఫొటోస్ అన్నీ పెట్టేశానండి.... ఇక్కడ కూడా అంటే చూసి చూసి బ్లాగర్లు, ప్లసర్లు "ప్లీజ్ మీరు ఫోటోలు పెట్టకుండా రాయడానికి ప్రయత్నించండి " అని అనేస్తారేమో అని.. ;-)
puranapandaphani gaaru: thanks a lot
ఈ పోస్ట్లోని ఫోటోలని క్లిక్ చేస్తే వాళ్ళ బ్లాగుల్లోకి వెళ్ళొచ్చేస్తారు.. బ్లాగర్లు మరి క్లిక్ చేశారా?
ReplyDeleteపరిచయం బాగుందండి. ఎందరో మహానుభావిణులూ అందరికీ వందనమూ....
ReplyDelete