12.27.2014

మనతెలుగు టైంస్


ప్రియమైన మన తెలుగు టైంస్ మరియూ మా అందరి నేస్తాలకి, పాఠకులకి, హితులకి శ్రేయేభిలాషులకి చిన్న విన్నపం:

మనతెలుగు టైంస్ ఇంకా రోజుల పసిపాప, బుడి బుడి అడుగులు వేయాలంటే మీ అందరి సకారం కావాలి. ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకోడానికి, మంచి కథలకి, మంచి ఆలోచనలకి, అలాగే న్యూస్ కి, ఘుమ ఘుమల వంటల రుచులకి, చక్కటి సాహితీ యానానికి, అరోగ్యవంతమైన జీవనానికి, వివిధరకాలయిన కబుర్లకి మన మనతెలుగు టైంస్ ని వేదిక చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాము.

అలాగే వచ్చే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకి మీరు ఆన్లైన్లో చేయబోయే షాపింగులకి మనటైంస్ నుండి క్లిక్ చేసి మీరు కోరుకున్న వెబ్సైట్ కి వెళ్తే i,e flipkart , Amezon, infibeam , ebay మొ! మీకు డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి... మీ ద్వారా మనతెలుగు టైంస్ కు పాఠకులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాలని జారవిడుచుకోకుండా మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరు ఇష్టపడేవారికి మీ శ్రేయోభిలాషులకి మీరు ఇయ్యబోగే బహుమానాలు మనతెలుగు టైంస్ ద్వారా ఇవ్వండి.. మనతెలుగు టైంస్ కి తోడ్పాటుని అందించండి....

12.06.2014

శ్రీ వాక్యం .. రసాత్మకం - ఆర్ వి ఎస్ ఎస్ గారితో రమణి ముఖా ముఖీ

ముందుగా శ్రీ వాక్యంతో...

"కాలం ఎంత గడుసుదో .. నువ్వుంటే పరుగెత్తిపోతుంది వాయు వేగంతో..."   -శ్రీ వాక్యం

నిజంగానే రసాత్మకం కదూ :)

(ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు అద్భుతమండీ!  మీ ఏక వాక్య కవితా సహస్రం... దేనికదే సాటి .. పోటీ మాట లేదు )

శ్రీ గారి "శ్రీ వాక్యం " పుస్తకానికి గాను వండర్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్ రావడం అదే నేపధ్యంలో నేను వారిని కువైట్ ఎనారైస్ తరుపున ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన పలురకాల అంశాలను, వాక్యం రసాత్మకం గురించి అలాగే కవిత్వానికి , కవి కి గల అనుబంధం గురించి తనదైన శైలిలో చక్కగా వివరించారు.. ఇంతటి అవకాశాన్ని నాకిచ్చిన కువైట్ ఎనారైస్ వారికి, ఇంటర్వ్యూలో ఓపికగా  సమాధానాలు చెప్పిన శ్రీ గారికి అభినందనలతో....


చివరగా మళ్ళీ శ్రీ వాక్యంతో..

"పూరణ తెలిసేది వచ్చినప్పుడైనా.. లోటు తెలిసేది నీవు వెళ్ళిపోయాకే.. "

ఇంటర్వ్యూ చేయడానికి కలిసినప్పుడు పూరణ ,పూర్తి అయిన తరువాత అప్పుడే అయిపోయిందా అనే లోటు తెలిసిందన్నమాట.. :(


మళ్ళీ చివరగా

శ్రీ గారు బోల్డు బోల్డు నెనర్లు శ్రీ వాక్యం .. రసాత్మకం.. కి.గమనిక: ఇంటర్వ్యూ లింక్ ని క్లిక్ చేస్తే మీరు కువైట్ వెళ్ళి ఆయన ఇంటర్వ్యూని చదివేస్తారు. మరింక ఆలస్యమెందుకు క్లిక్ చేసేయండి.. అలా కువైట్ వరకు వెళ్ళొచ్చేద్దాము. :)
Loading...