బ్రహ్మదేవుడు ముందు పురుషుడిని సృష్టించి ఆ తరువాత స్త్రీని భూమి మీదకి పంపాడట. స్త్రీని సృష్టించేప్పుడు బ్రహ్మ మదిలో లక్ష్మీ దేవి విష్ణు మూర్తి పాదాలు వత్తుతూ, పార్వతీ దేవి శివుని అర్థభాగమై నాట్యం చేస్తూ, సరస్వతీ దేవి (తన బార్య) వీనుల విందుగా వీణని వాయిస్తున్నట్లుగా, కనిపిస్తూ ఉంటే స్త్రీని సృష్టించాడు . ఈ అన్నిటి కలబోతే స్త్రీ. అంటే ముగ్గురమ్మల ప్రతీక, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యషుమాతలా అన్నమాట.
ఇది చదవగానే అభ్యుదయభావాలు గల నాలాంటి మహిళలకి చివ్వున కోపం వచ్చేస్తుందని నాకు తెలుసు. పెళ్ళయిన కొత్తలో , "మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు.. నేను చేస్తున్నాను నేనెందుకు మీ అందరికీ సేవలు చేయాలి ? మీరే నాకు చేయండి" అని తెలిసీ తెలియని జ్ఞానంతో మా అత్తగారిని అడిగినప్పుడు .. కొత్త కదా నీకిప్పుడు తెలీదమ్మా, లక్షలు సంపాదించినా మనం ఆడవాళ్ళమే. మనవాళ్ళకి మనం మహరాణుల్లా ( దాసిలా కాదు అని కూడా అన్నారు) చేయాల్సిందే.
"నా కుటుంబం" అని చెప్పుకోడంలో ఎంత గర్వం , ఎంత దర్పం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ "నా" కుటుంబంలో పురుషాధిఖ్యత.. సమానత్వం అంటూ అర్థం లేని చిచ్చురేపి కుటుంబాన్ని బుగ్గి పాలు చేసుకోడమెందుకు, పూర్తి వంటింటి సాధికారాన్ని మనచేతికిచ్చారని ఆనందించక.. అనిపిస్తుంది ఒక్కోసారి.
మనం వండి పెట్టకపోతే వాళ్ళే వండుకుంటారు నల భీములు వాళ్ళే కదా. కాని మన వంట కోసం ఎదురుచూసే ఆ ఆకలి బాగుంటుంది, ఆవురావురమంటు "ఈ కూర బాగుంది" "ఆ పచ్చడి బాగుంది" అనే ఆ పొగడ్తలు ఎంత ఆనందంగా ఉంటాయి. సమానత్వ పోకడలో ఇవి ఉన్నాయా?
అసలు సమానత్వం అంటే ఏంటి? నువ్వు చేసే పని నేను చేయగలను అని చెప్పడమా? లేక ఎదురుపడిన ప్రతివారిని ధూషిస్తూ.. నేను అబలని కాదు సబలని , మొగరాయుడిని అని కాలర్ ఎగరేయడమా (ప్రస్తుతం స్త్రీలు ఈ ఆకారంలోనే ఉన్నారు :) ఇది తప్పని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ) .
సున్నితత్వం ఇది ఆడదానికి భూషణం. అసలు స్త్రీత్వం అంటేనే సున్నితత్వం. కాని ఇప్పటి స్త్రీ తత్వం మోటుగా కనిపిస్తోంది. పైకి తేలరు కాని , ప్రతి మగవాడికి అంతో ఇంతో సున్నితంగా ఉన్న స్త్రీ అంటేనే ఇష్టపడతారు. మరీ స్త్రీత్వాన్ని మర్చిపోయి మోటుగా మాట్లాడేవారంటే పక్కకి తప్పుకోడానికే ప్రయత్నిస్తారు.
ఆడవాళ్ళు వేషాధారణాలంకారంలో పురుషుడికి దగ్గరై, మాటల తూటాల మనస్థత్వంలో దూరమవుతున్నారట. ఇదే ఇప్పుడున్న ఆధునిక స్త్రీ అభ్యుదయం.
మరి ఈ అభ్యుదయమంతా స్త్రీత్వంలో అంటే పిల్లల్ని కనడంలో చూపించగలుగుతున్నారా?? ఈ సమానత్వం అప్పుడెక్కడికి వెళ్తుంది? ఇంతటి అదృష్టం అసలు మనకి ఉన్నందుకు మనం గర్వపడాలి. ఆ విధంగా మనం పురుషులకంటే ఆధిక్యంలో లేదా సమానంగా ఉన్నామని అనుకోవాలి . అంతటి గొప్ప వరం స్త్రీత్వం (తల్లి కాగలగడం.) అదో సున్నితమైన భావన.
అలాంటిది "నువ్వెంత" అంటే "నువ్వెంత" అని పరిచయం కూడా లేనివారిని , ఒక పద్దతిలో ఉండే పెద్దవారిని, వారేమాత్రం ఊహించలేనివిధంగా.. వెఱ్ఱి సినిమా పోకడలతో చాలా ఆధునీకంగా ఉన్నామన్న భ్రమతో , పరుష పదజాలంతో హింసిస్తుంటే, స్త్రీత్వానికి, స్త్రీ సున్నితత్వానికి విలువ ఉంటుందా?
అసలు మనకి ఈ పిల్లల్ని కనడం, మన సున్నితత్వం, ఎక్కువగా ఎంతో సేపు నించుని ఉండలేకపోవడం ఇవన్నీ గమనించే " స్త్రీలని గౌరవించడం మన (భారతీయుల) సాంప్రదాయం .. వాళ్ళ సీట్లలో వాళ్ళని కూర్చోనిద్దాము " అంటూ ఎక్కడచూసిన స్త్రీల మీద గౌరవాన్ని మన సాంప్రదాయ్యాన్ని (చేతలలో ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రాముఖ్యం కాదు) కొనసాగిస్తున్నారు. మరి ఆ గౌరవాన్ని మనం అంటే మన మహిళలు కాపాడుకోగలుగుతున్నామా? అక్కడ పొరపాటునో లేదా సంబంధింత స్థలంలో ఎవరూ స్త్రీలు లేరు కదా అని ఎవరన్నా కూర్చున్నారో ఇక అతని పని అయిపోయిందనుకోవాలి. ఎదో ఘోర తప్పిదం చేసినట్లు అతన్ని ఆడిపోసుకుంటున్నాము. మరి ఏది అక్కడ మన సమానత్వం ? మనకి సమానత్వం కావాలని అడుక్కోడమే అసలు పెద్ద తప్పు, "మాకు లేదు మీరివ్వండి " అంటూ అక్కడ మళ్ళీ పురుషుడికే అధిపత్యం కట్టబెట్టాము. ఇచ్చిన స్వత్రత్ర భావాన్ని వినియోగించుకోడంలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాము. మన స్త్రీల తత్వం ఇదా? స్త్రీత్వం సున్నితం కోల్పోతోందా?
రామాయణాల్లో, భారతాల్లో మనం ఆచరించడానికి మంచి ఉంది , చెడు ఉంది. నిజానికి అర్థమయితే... చెడుని వదిలేద్దాము, మంచిని స్వీకరిద్దాము. అసలివి జరిగాయా లేదా అనే చర్చ కన్నా, సీతనో సావిత్రినో ఎదన్నా అంటున్నప్పుడు.. ఆ యుగపు ఆడవాళ్ళు వాళ్ళయితే ఈ యుగపు ఆడవాళ్ళం మనం అని ఆలోచించుకోగలగాలి (దేవుళ్ళు దేవతలు పక్కన పెడితే అందరం స్త్రీలం) వాళ్ళేమి చేశారు అని కాదు, వాళ్ళు చేసినవి మనం ఆచరించతగ్గవా లేదా అని బేరీజు చేసుకోడానికి ప్రయత్నించాలి కాని , ఎదో చేసేస్తున్నాము ఎదో కనిపెట్టేసాము అని కన్ను మిన్ను కానక గడప దాటడానికి ప్రయత్నిస్తే ఎదురుదెబ్బ తగిలి బోల్తా పడేది మనమే. మనల్ని అనే అవకాశం మనమే ఇస్తున్నాము, ఆపై సమానత్వం అంటూ గోల చేస్తాము. మనం ఎంత మంచి ఆధునికత ఉన్న స్త్రీలమో కదా !

అసలు నిజానికి మనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగే వాళ్ళమయితే ఇక్కడ ఇలా కూర్చుని, రాసుకుంటూ కాదు, ఏ మార్గంలో వెళ్తే మనమనుకుంటున్న ఈ మందిరాలు, మసీదులు నిర్మించగలమో ఆ మార్గాలు వెతుక్కుని అక్కడికెళ్ళి నేరుగా ఆ పనులు తలబెట్టినప్పుడు మన మహిళాపాటవం నలుగురికి తెలుస్తుంది. అలా చేద్దాము. కూర్చుని తీరిగ్గా రాసుకుంటే వచ్చేదేమి ఉండదు. పోయేది మన మహిళల పరువే.
*****
*****
;)
ReplyDeleteఅసలు నిజానికి మనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగే వాళ్ళమయితే ఇక్కడ ఇలా కూర్చుని, రాసుకుంటూ కాదు, --------------------------- కూర్చుని తీరిగ్గా రాసుకుంటే వచ్చేదేమి ఉండదు. పోయేది మన మహిళల పరువే.
ReplyDelete--------------
ఇక్కడ చపట్లు చిటికేలు మంగీనీలు
baagundhandi.
ReplyDeleteNice Objective Analysis. Good Post.
ReplyDeletebagundi
ReplyDeleteAwesome :-)
ReplyDeleteI dont understand wats your conclusion you did finally from your topic.......
ReplyDeletewhy the topic of construction of temples and masjids included in your conclusion which is completely out of your topic and pointless.....!!!!!!!
@Bhardwaj Velamakanniగారు: నెనర్లు
ReplyDelete@సుమలతగారు: నెనర్లు
@కత పవన్గారు: నెనర్లు
@శరత్ 'కాలమ్'గారు : నెనర్లు
@prabandhchowdary.pudotaగారు:నెనర్లు
@Rao S Lakkarajuగారు:నెనర్లు
@karthikగారు:నెనర్లు
@chaituగారు:నెనర్లు
@ishika గారు: నెనర్లు; conclusion : మనమేదన్నా చేద్దామనుకున్నప్పుడు ఇలా అవేశంగా మేమిది చేస్తాము, అది చేస్తాము అని రాయడం కాదు చేయగలిగితే చేసినతరువాత రాద్దము అన్న సందేశం.
మరెందుకు రాశారు అని అడిగారనుకొండి ;) నేనేమి చేద్దాము అనుకోలేదు , ఇలా చెప్దాము అనుకున్నాను అంతే. ;) పైన రాసినదానికి కింద ముగింపుకి అర్థం ఉందండి. కరెక్ట్‌గా విషయాలు ఫాలో అయితే.