7.25.2016

ఇప్పుడే ఒక గంట ముందు జరిగిన ఒక యదార్థ సంభాషణ /సంఘటన

 ఒక వారం రోజుల ముందు సుపర్ బజార్ లో ఏవో సరుకులు తీసుకుందామని వెళ్లాను. అక్కడ షాపింగ్ మధ్యలో అమ్మ ఫోన్ చేసింది. అమ్మా ఫలానాచోట ఉన్నా! ఇంటికెళ్ళగానే ఫోన్ చేస్తా! అని పెట్టేసాను. తరువాత మర్చిపోయాను. ఇదిగో ఇందాక ఫోన్ చేశాను. "ఆరోజనగా చేస్తాను అన్నావు ఇంతవరకు చేయలేదు , రోజు తమ్ముడిని అదుగుతూనె ఉన్నాను "అక్క ఫోన్ చేసిందా?" అని నా సెల్ లో బాలన్సు లేదు, నువ్వు చేయకపోయే సరికి నా ఫోన్ పాడయిందేమో రావట్లేదేమోఅనుకున్నా అంది! ఎంత బాధ అనిపించిందంటే ఏవో షేరింగ్స్ చూస్తున్నా! ఒక వృద్ధురాలు తన మొబైల్ షాప్ కి తీసుకెళ్ళి పాడయిందేమో చూడమనడం, అంటాబాగానేఉందిఅని వాళ్ళు చెప్పడం, మాపిల్లల ఫోన్ రావడం లేదనడం. అబ్బా ! మనసు చాలా బాధపడింది.

మనల్ని ప్రేమించేవాళ్ళని మనం పట్టించుకోము.
మనం ప్రేమిచేవాళ్ళు మనల్ని పట్టించుకోరు. 
ఇదేనేమో ప్రేమ అంటే.


7.24.2016

మౌనం ఎంత గొప్పదో !

సంగీతానికి వయసు అడ్డురాదని నిరూపించిన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఎంత శ్రావ్యంగా ఉంది ఈ పాట.
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగిచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలెవో
కోర్కెల సెల నీవు
కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా!
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు
ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా!
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు.

7.23.2016

ఎక్కడో ఎదో ఆత్మవిశ్వాసం కొరవడింది.

మనకన్నా ఎదుటివాడు అధముడు అనుకుంటేనే మనం ఎదగ గలమా? ముందుకు సాగుదామనే సంకల్పం కన్నా, వెనక్కి లాగే శక్తి అశక్తుల్ని చేసేస్తోంది.


వాస్తవాన్ని ఊహ కన్నా గొప్పగా మరల్చుకోవాలని...

ఊహలు ఎప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. 
కాని వాస్తవం ఊహ కన్నాఇంకా అద్భుతంగా ఉంటే
ఊహలన్నీ అపోహలేగా.


Loading...