9.19.2015

శ్రీకారం చుట్టుకుంది ప్రపంచ కవిత్వోత్సవం

శ్రీకారం చుట్టుకుంది ప్రపంచ కవిత్వోత్సవం….  లోగో ఆవిష్కరణతో..ఇక ఆకారం దాల్చనుంది… కవి సమ్మేళనం … డిజి లైవ్ లో..

వివరాలు ఇదిగో ఇక్కడే

ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం -లోగో ఆవిష్కరణతెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది అనుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి.  మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.
ఇలాంటి తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.
ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు.

అలాంటి తెలుగు భాషా గొప్పదనాన్ని మనం కాపాడుకోవాలి, మార్పు మననుండి మొదలవ్వాలి , మొదటి అడుగు మనదయితే వెనక పది అడుగులు కలుస్తాయి. ఇదే ఆలోచన ఫేస్ బుక్ స్నేహితులుగా ఉన్నా ప్రపంచ తెలుగు కవిత్వోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులది, ఎదో ఒకటి చేయాలి, మన తెలుగును మన భాషని ఉనికి కోల్పోనివ్వకుండా భావి తరాలకి పంచాలి, పాఠశాలలో చెప్పినట్లుగానో , పేపర్లో మన ఘోష చెప్తేనే తెలుగు భాష ఉనికిని మనం ప్రచారం చేయలేము, ఎలా , ఎలా మరెలా? క్లుప్తంగా మనసులోతుల్లోని భావాలని పొందికగా  పేర్చి, వినసొంపయిన పదాలతో మాటల కోటలని కడితే వచ్చేదే కవిత, మనసులోండి బయటకి వెలువడే అక్షర మాల ఆ కవితలనే ఆధారంగా చేసుకుని కవిత్వాన్ని ఒక ఉత్సవంగా చేసుకుందామని తలపెట్టారు. “జయహో కవిత్వం ” అన్నారు.

నాంది పలికారు ఇలా: click here you will get details.. 

ప్రపంచ తెలుగు “కవి”త్వోత్సవం – డిజిటల్ లైవ్
మన సాంకేతికత ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూ ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను,  జీవనశైలుల్ని  మనదిగా చేసుకుంటూ  మనుగడ సాధిస్తున్న మోడరన్ ఆర్ట్ కి ఎప్పటికయినా మనుగడ ఉంటుంది. ఒకప్పటి దీపాలనుండి లైటింగికి, సినోగ్రఫీ, సౌండ్ సిస్టంస్  ఇంకా  ఇంకా  చాలా  చాలా మార్పులు వచ్చాయి. డిజిటల్ మీడియా.. థియేటర్ల మీద కూడా ప్రభావం చూపుతోందని చెప్పచ్చు. లైవ్ ఆర్ట్ లో మిస్ అయ్యేవి డిజిటలో చూపించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లైవ్ ఆర్టిస్ట్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద కనిపించదు కాని దానిని డిజిటల్ ద్వారా లైవ్ ప్రొజెక్ట్ చేయవచ్చు.

ఇలాంటి విలక్షణ ప్రత్యేకతలు ఉన్న  ఈ డిజిటల్ లైవ్ మన ప్రపంచ కవిత్వోత్సవంలో ఏర్పాటు చేస్తున్నారని తెలియజేయడానికి గర్విస్తున్నాము. వివరాలు ఇక్కడ click here you will get details.. 

9.13.2015

కావ్య రచన రెండు ఆణిముత్యాలు – అంతర్వేది కవితాసమ్మెళనం..
అనంత సాహితీ సాగరంలో మునకలు వేసినవారు మోసుకువచ్చిన రెండు ఆణిముత్యాలు – మరువం ఉష
1  ప్రశ్న: చాలామంది కవులు త్వరగా కావ్య రచన మానుకుంటుంటారు కదా! ఎందుచేత?
కృష్ణశాస్త్రి జవాబు: ఒక్కొక్క మహాకవికి అంతరాంతరాల్లోనే ఒక గొప్ప రిజర్వాయర్ ఉంటుంది. ఒక పెద్ద డైనమో ఉంటుంది. సామాన్య కవులకు ఒక గరిటెడో, గంగాళమంతో శక్తి ఉంటుంది. అది అయిపోయేటప్పటికి మళ్ళీ నింపుకుంటుండాలి; మళ్ళీ చార్జి చేసుకుంటుండాలి. మన చుట్టూ అక్షయ చైతన్యంతో చలించిపోయే జీవలోకమే — ప్రకృతీ, ప్రజా — మనకు నిరవధికమైన రిజర్వాయరూ, డైనమోను. వానిలో పడిపోతూ ఉండాలి. లేకపోతే చల్లపడి పోవడం, వట్టిపోవడం, ఆరిపోవడం జరుగుతుంది. నవజీవన ప్రవాహంలో మొదట పడిపోయిన కవికి ఏదో అనుభూతి వస్తుంది. దానిని గూర్చి ఆవేశంతో వ్రాస్తాడు. తరువాత ఆ అనుభవం అంటే ఆప్యాయం చేతనో, అహంకారం చేతనో తన చుట్టూ గోడ కట్టుకుని, లేక తాను ఒక గదిలో చతికిలబడి ఆ అనుభూతినే గట్టిగా కౌగిలించుకుని కూర్చుంటే, అది అతని చేతుల్లో ఊపిరాడక నలిగిపోయి చనిపోతుంది. దానిలోకి కొత్త వేడీ, కొత్త రుచీ రావడానికి గాని, లేక కొత్త కొత్త అనుభవాలు రావడానికి గాని అన్నివైపులా మనల్ని పొదిగి ఉన్న అనంత జీవలోకంతో కవికి అవిశ్రాంతమూ, అనవచితమూ, అత్యంతాప్తమూ అయిన సంబంధం ఉండి తీరాలి! జీవమే జీవం ఇస్తుంది; గోడ గోరీ కడుతుంది.
ఇంకో విశేషం – కష్టసుఖాలతో, పందిరి బాంధవ్యాలతో నిండి ఉన్న ఈ లోకంతో సన్నిహిత సంబంధం ఉండడం వల్ల కవిలో ఒక కరుణ పుడుతుంది. జాలి కాదు; కరుణ. జాలి నీరసం. కరుణ శక్తి; కరుణ ప్రేమ. ఆర్తక్రౌంచ విరహం నుంచి ఆదికావ్యం పుట్టింది. జీవలోకంతో నిత్య స్నేహం వల్ల కావ్య వస్తువుగా అనుభూతీ, కావ్య కల్పనకు ప్రేరేపించే కరుణా, కల్పన చేయించగలిగే శక్తీ, చైతన్యమూ వస్తాయి. (సాహిత్యవ్యాసాలు)
2 “సాహిత్యానుభవం వాస్తవ జీవితానుభవం కన్నా విలక్షణమైంది. ఒకటి స్వభావ జగత్తు వాస్తవమైంది. రెండవది విభావజగత్తు కావ్యలోకంలోనిది. స్వభావ జగత్తు రెండవదానికి ఆధారమైనదే అయినా విభావ జగత్తుగా పరిణమించి గొంగళిపురుగు సీతాకోకచిలుక అయిన రీతిగా పరిణమిస్తుంది. ఒకదాని కొకటి ప్రతిఫలన రూపాలు కావు. అట్లాగే సమానానుభవం కలిగించేవీ కావు.” – కోవెల సుప్రసన్నాచార్య
ఇలాంటి మరెన్నోఅ ఆణిముత్యాలకి ఆనావలమవుతోంది అంతర్వేది కవితా సమ్మేళనం.. ఈ సమ్మేళానానికి కవులకి కవయిత్రులకి సాదర ఆహ్వానం పలుకుతొంది అంతర్వేది..
వివరాలు:

9.11.2015

ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం – అంతర్వేదిప్రపంచ తెలుగు కవితోత్సవం
కావాలి మనకెల్లరకూ నూతనోత్సాహం
కదలిరండి కదలిరండి 

కవితా రంగాన
కలాలను హలాలుగా 
కవులందరం హాలికులుగా
దున్నేద్దాం దున్నేద్దాం ………….N Vijaya Lakshmi. 


ఒక ఎలుకల గుంపు ఉండేదట. వేసవిలో దొరికిన ఆహారపదార్థాలతో కలుగు నింపుకుని, వర్షాకాలం కోసం దాచుకునేవి. అన్ని ఎలుకలూ పనిచేస్తుంటే ఒక చిట్టెలుక మాత్రం ఎండలో కూర్చుని ఉంది. పనిచెయ్యకుండా అలా కూర్చున్నావే అంటే, ‘వర్షాకాలం కోసం ఎండను దాచుకుంటున్నాను.’ అన్నది. మిగతావి పనుల్లోను వెళ్ళిపోయాయి. దొరికిన తిండిమోసుకుని వెనక్కి వచ్చేసరికీ, చిట్టెలుక, సాయంకాలపు సూర్యుడిని తీక్షణంగా చూస్తూ కనిపించింది. మళ్ళీ ఏమిటని అడిగితే,’సూర్యుడి రంగుల్ని నాలో నింపుకుంటున్నాను ‘ అని సమాధానం. ఏదోపిచ్చికారణం, అనుకుని వదిలేశాయి. మళ్ళీ మరో రోజు పనికిరమ్మంటే, పడుకుని లోలోనే కళ్ళు తిప్పుకుంటూ ‘కొన్ని, ఆలోచనల్ని, మరిన్ని పదాల్నీ వర్షాకాలానికి పోగేస్తున్నాను మీరు మీ పని కానివ్వండి.’ అన్నది.
వర్షాకాలం వచ్చింది. బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఉన్న ఆహారాన్ని కొద్దికొద్దిగా తింటూ, చిట్టెలుకకూ పెడుతూ కాలం గడిచింది. ఆఖరి కొన్నిరోజులు పస్తు తప్పలేదు. ఆకలితో అలమటిస్తూ, ఎకసెక్కంగా చిట్టెలుకని మిగతా ఎలుకలు అడిగాయట, ‘ మేము పోగేసినవి అయిపోయాయి. నువ్వు పోగేసింది పంచరాదూ !’ అని. చిట్టెలుక కలుగు పైకి చేరి, అందమైన పాట అందుకుంది. సూర్యుడిని, ప్రకృతి అందాలని, ఆనందాన్ని వర్ణిస్తూ కలుగుని తన పదాలతో దేదీప్యమానం చేసింది. ఆనందంలో ఎలుకల్ని ఆకలి మర్చిపోయేలా చేసింది. పాట ముగిసేసరికీ…ఎలుకలన్నీ చిట్టెలుకవైపు ఆరాధనగా చూస్తూ….
“నువ్వు కవివి !” అన్నాయి. చిట్టెలుక గర్వంగా “నాకు తెలుసు” అంది.
– మహేష్ కత్తి.Poetry and literature may not fulfill basic needs of human beings.But beyond basic need there is something. That something is unique to human beings. That something is for soul.That something is “art”.
ఒక కవితకి ఇంతకన్నా అర్థం ఏమి కావాలి కవిత తనలో ప్రకృతిని దాచుకుంటుంది, కవులకి కవితలుంటే నిద్రాహారాలు విషయం అనేది ఒక మాములు ప్రక్రియ. కవులదంతా ఒక ఊహమయ సృజనాత్మకలోకం. మరి అలాంటి అందమయిన ప్రకృతిని తనలో దాచుకోగల సామర్థ్యం ఉన్న ఈ కవితలకు  కవులనుండి కవయిత్రుల నుండి సహకారం కావలంటూ ఇలాంటి కవితలకు అంతర్వేది వేదిక కావాలని ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ఆహ్వానం పలుకుతొంది నేటి మేటి కవులకు.
వివరాలు:

9.09.2015

30:30:30 వరల్డ్ రికార్డ్ కవి సమ్మేళనం -అంతర్వేది సమాచారం -స్థల పురాణం, క్షేత్ర సమాచారం -రవాణ సౌకర్యాలు

30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల కవి సమ్మేళనం
(వరల్డ్ రికార్డ్ కవి సమ్మేళనం ) 


దక్షిణ కాశీగా విరాజిల్లే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో (తూర్పు గోదావరిజిల్లా ) మొట్టమొదటి సారిగా తెలుగు లో అత్యున్నత స్థాయిలో 2015అక్టోబరు 17 , 18తెదీలలోలోనిర్విరామంగా 30గంటల 30నిమిషాల 30సెకండ్లపాటు(30:30:30:) “కవి సమ్మేళనం” ను నిర్వహించనున్నాము.

ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాలనుండి ఎంతోమంది అతిరథ మహారథులయిన సాహితీ వేత్తలు , ప్రముఖ కవులు, సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.
ఈ సాహిత్య ,కవి సమ్మేళనం కార్యక్రమం 
1. “తెలుగు బుక్ ఆఫ్ రికార్డు” 
2. “భారత్ బుక్ ఆఫ్ రికార్డు “
3. “ఆంధ్రా వరల్డ్ రికార్డ్ ‘
లలో చింతపట్ల వెంకటాచారి గారు , Dr. చింతా శ్యాం కుమార్ ల సహకారం తో నమోదు కాబడుతుంది . 
ఇంతటి మహోన్నత కార్యక్రమం జరుగుతున్న ఈ అంతర్వేది చుట్టుపక్కల దేవాలాయలు, స్థల పురాణం, క్షేత్ర సమాచారం మీకోసం. అలాగే రావాణ సౌకర్యాలు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ స్థలపురాణం తెలుసుకుని ఇక్కడి మహత్యం ఈ దేవుడి ఆశిర్వాదాలతో పాటుగా తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా జరగాలని, మీ అందరి పేర్లు ఈ ప్రపంచ రికార్డ్ లో నమోదు కావాలని ఆకాంక్షిస్తూ.. అంతర్వేది సమాచారం మీకోసం.
****
అంతర్వేది సమాచారం


అంతర్వేది  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన  అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం కలదు.
మరిన్ని వివరాలకు  ఈ కింద ఉన్న ఉన్న అంతర్వేది  సమాచారం    లింక్ ని క్లిక్ చేసి సమాచారం తెలుసుకుని కవులు కవయిత్రులు అందరూ  తప్పక రావాలని మా ఆకాంక్ష.. ఇట్లు 

కమిటీ సభ్యులు మరియూ కార్య నిర్వాహక వర్గం.

2.26.2015

చిలకమ్మకాకినాడ రామారావు పేటలోని ఓ పెళ్ళివారిల్లు
అంతా సందడి సందడిగా ఉంది తెల్లవారుఝామున పెళ్ళి రాత్రి 9.30 కి పెళ్ళికూతురు గౌరిపూజలోనో మరి వేరే ఏ విషయంలోనో హడావిడిగా ఉంది. బ్రహ్మం గారి మంత్రాలు మైక్ అవసరం లేకుండానే భూమిని దద్దరిల్లేలా చేస్తున్నాయి. కళ్యాణమంటపం చుట్టూ పిల్లలందరూ తిరుగుతున్నారు. విడిదింట్లో పెళ్ళికొడుకు తాలుకూ సందడి కూడా కనిపిస్తోంది. డేట్ కూడా బాగా గుర్తుంది నాకు, ఎప్రిల్ 16 పెద్దక్క(పిన్ని కూతురు) పెళ్ళి సందడి అది. ఎప్రిల్ 24 పెద్దన్నయ్య(పిన్ని కొడుకు) పెళ్ళి 8 రోజుల తేడాతో అనుకున్నారు ఇద్దరి పెళ్ళిళ్ళు వేసవి సెలవలు ఇక సందడే సందడి మా అందరికీ అందులో మా కుటుంబాలలో మొదటి పెళ్ళేమో... ఇక అల్లరంతా మాదే అన్నట్లు ఉన్నాము. నేను అప్పుడు 7th లోనో మరి 8th లోనో ఉన్నాననుకుంట. ఇక వచ్చిన చుట్టాలని ఒక్కొక్కరిని అమ్మ పరిచయం చేస్తోంది. అక్క ఈడు వాళ్ళందరూ ఒక జట్టుగా చేరి ఆడుకుంటుంటే, నా ఈడూ వాళ్ళందరూ ఒక జట్టు గా చేరి ఆడుకుంటున్నాము. ఆటలో భాగంగా విడిదింటికి పక్కగా ఉన్న ఓ గదిలోకి వెళ్ళి దాంకున్నా .. సన్నగా మాటలు వినిపిస్తున్నాయి.

"సరిగ్గా నించో"
"ఇదిగో అలా చేయి వేలాడేయకు.. ఈ పమిటని ఇలా పట్టుకో ఈలోపులో కుచ్చిళ్ళు సద్దుతాను" 
"అబ్బా ఒక్క పదినిముషాలు ఓపిక పట్టు నా బంగారు కదూ చీర సరిగ్గా కట్టనీ"


అలా మాటలు వినిపిస్తుంటే ఎవరబ్బా? అని లోపలికి తొంగి చూశాను ఒక చిన్న పాప ఒక పెద్దావిడకి చీర కడుతోంది ఆ పెద్దావిడేమో చిన్న పిల్లలా కట్టుకోనని మారాం చేస్తోంది. చూడ్డానికి భలే విచిత్రమనిపించి అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాను "అమ్మా చూడు అక్కడ అంటూ..." చెప్పాను. అమ్మేమి కంగారు పడకుండా కనీసం కూర్చున్న చోటినుండి కూసింత అయినా కదలకుండా...

"ఆవిడ మా అత్తయ్య అమ్మా! .. మా మేనమామ బార్య అదిగో ఆ మూలగా కూర్చున్నారు చూడు పెద్దాయన మా మావయ్య . అందరూ తుని తాతగారు అంటారు" అని వివరం చెప్పింది.

తుని తాతగారు నాకు తెలుసు..మా ఇంటికి వచ్చేవారు మిలట్రీలో చేస్తారు అదే మిలట్రీ డ్రెస్ లో వచ్చేవారు ఇంటికి, బాగా గుర్తు అదే అన్నాను అమ్మతో.. ఆయన బార్యేనే ఇప్పుడు నువ్వు చూసింది ఆ చీర కడ్తున్నది వాళ్ళ మనవరాలు "చిలకమ్మ" పాపం చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు దానికి..వాళ్ళకి ఇదొక్కతే, దానికి వీళ్ళు.. అని చెప్పింది అమ్మ.

ఆ తరువాత ఆ పెళ్ళి లోనే మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము .. నాకన్నా రెండేళ్ళో మరి మూడేళ్ళో చిన్నది. తలవెంట్రుక మొదలుకొని కాలి చిటికెన వేలు దాక ఏ పార్ట్ వదలకుండా బంగారం అభరణాలతో నింపేసేది. జడంతా బంగారు చేమంతి పూలు... అలా మొదలుకుని ఆఖరికి కాలికి కూడా బంగారు పట్టీలే... అంత చిన్నపిల్ల అలా అలకరించుకుంటే చూడడానికి ఎంత బాగుండేదో. సరే చిన్నపిల్ల తనలా తయారవడం ఒక ఎత్తయితే వాళ్ళ అమ్మమ్మని అలా తయారుచేయడం మరో విశేషం ఆవిడ ఆ నగలని మోస్తూ ఎలా ఉండేదా అని అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడా చిన్నప్పటి రూపం ఆ అలంకరణ చిన్న వయసులోనే ఆ పెద్దరికం అవి తలుచుకుంటుంటే నాకు గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ , భానుమతి గారి అత్తగారి కథల్లో ఓ కథ లో ఓ పసిపిల్ల పురిటికి వచ్చిన తన పిన్ని పసిపిల్లల విషయంలో పెద్దాపేరక్క కబుర్లు గుర్తోస్తాయి. అన్నట్లు మర్చిపోయా ఈ పుత్తడి బొమ్మ పేరు కూడా "అన్న పూర్ణ " అలాగే ఉంది అప్పటికి ఇప్పటికి కూడా పుత్తడి బొమ్మలా...

రెండురోజుల క్రితమే చూశాను మళ్ళీ.. అడపా దడపా ఎవో ఫంక్షన్‌లకి చూస్తున్నా మాట్లాడుకోవడం తక్కువే తన హడావిడికి కాని ఈసారి పెద్ద హడావిడి లేదు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా తీసుకునేంత వీలు చిక్కింది. తీసుకుని నిన్న మాట్లాడాను ఒక్కసారి అలా పాత రోజుల ప్రేమతో కూడిన ఆప్యాయతలు, ఆ కలివిడి తనం అన్నీ గల గలా పారే సెలయేరులా ఆ మాటలు నన్ను చాలా సేపు అక్కడినుండి తీసుకురాలేకపోయాయి.
*****

పిన్ని సంవత్సరీకాలు కిందటి సంవత్సరం మార్చ్ 8 న మన ఫేస్ బుక్ ఫ్రండ్స్ కలుద్దామని విజయలక్ష్మి మురళీధర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు అక్కడికి బయల్దేరుతున్నాను ఇక్కడ ఈ విషయం తెలిసింది పిన్ని "నో మోర్" అని... అలా వెనక్కి వచ్చి అమ్మతో వెళ్ళాను. ఆ పిన్ని సంవత్సరీకాలకి ఈరోజు కజిన్ వాళ్ళింటికి వెళ్ళాను. కార్ దిగగానే వెనకనుండి "బాగున్నావా వదినా!" అంటూ పలకరించేసరికి ఎవరా అని తిరిగి చూస్తే నేను పైన చెప్పిన పుత్తడిబొమ్మ ఎంత అందమో ... మరీ చిన్నప్పుడే పెళ్ళి చేయడం వల్లో ఏమిటో కాని కొంచం పెద్దరికపు ఛాయలు కనిపిస్తున్నా చూడ్డానికి పల్లెటూరిని అంతా తన కట్టుబొట్టులో ఇక్కడికి తీసుకొచ్చిందా అన్నంత అందంగా ఉంది. మెడనిండా చేతినిండా.. అదే చిన్నప్పటి రూపు కళ్ళ మెదిలింది. అమ్మని జాగ్రత్తగా లోపల కూర్చోబెట్టి మేమిద్దరం కబుర్లల్లో పడ్డాము. ఇద్దరు పిల్లల పెళ్ళిల్లు అయిపోయాయి ఆ పిల్లలికి పిల్లలు, వాళ్ళ బావగారు, తోడి కోడలు చనిపోవడం మొదలుకొని ఒక్కొక్కటి ఏకరువు పెట్టి భోజనాల టైం కి వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా చెప్పేసింది. "నువ్వు చెప్పు వదినా!" అని అంటే ఏది అంత చరిత్ర లేదు పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నా తప్పించి ఏమి చెప్పాలో కూడా తెలియలేదు నాకు ఆ మాటకారికి. ఇవన్ని చెప్పడానికి ముఖ్య కారణమేమిటంటే ఇంటికి వచ్చినా నాకేందుకో తన మాటలలా చెవిలో వినిపిస్తూ ఉంటే ఒకసారి మాట్లాడాలి అనిపించి ఫోన్ చేశాను. మళ్ళీ అదే అప్యాయత నిండిన స్వరం నాకన్న చిన్నది కాని నన్ను మించిన పెద్దరికంతో "అలా కాదు బంగారూ! శ్రావణ మాసమా.. ఆ తరువాత శుద్ధ ఏకాదశి.. చూడు నాన్నా! ఒకసారి తెలుగు నెలల బట్టి " అంటూ నేనేదో విషయం గురించి అడిగితే తెలుగునెలలన్నీ తన ఒళ్ళో దాచిపెట్టుకున్నట్లు ఠకా ఠకా ఆ చెప్పే తీరు.. "అత్తా నువ్వంటే నాకు ప్రాణం అత్తా నువ్వనే కాదు మీ అక్కచెల్లెళ్ళు అందరూ నావాళ్ళు, నాకెవరున్నారు చెప్పు! " అంటూ అమ్మని పట్టుకుని అన్నతీరు... తెలుగుదనానికి, తెలుగు మాటలకి , తెలుగు కి ఆవిడ తన మాటలతో పట్టం కట్టిన తీరు చూడగానే నాకనే కాదు ఎవరికయినా ముచ్చటేస్తుంది. పేరుకి తగ్గట్టు గలా గలా పారే చిలక పలుకుల చిలకమ్మ ఈ పుత్తడి బొమ్మ అనిపించింది. బాపు బొమ్మ అని కూడా అనచ్చు.. ఆ అందాన్ని. 
smile emoticon

*****

కొసమెరుపు: చిలకమ్మని చూసి అమ్మ ముచ్చటపడిపోయి "చిన్నప్పుడు ఎంత కుదురుగా కూర్చునేదో.. భలే ముచ్చటేసేది నిన్ను చూస్తుంటే " అని అన్నప్పుడు.. "ఆ ! మరి మాకు అలా ఏడు వారాల నగలు పెట్టండమ్మా! మేము కదలకుండా కుదురుగా కూర్చుంటామని" నేను హాస్యమాడాను.. ఆ మాటకి అనుకోకుండా అక్కడ కూర్చున్న అన్నయ్యలు, వదినలు, అక్కలు అందరూ చప్పట్లు.. బాగా చెప్పావు అంటూ... హహహ చక్కటి వాతావరణమది ..
Loading...