ఒక పాటని కాని, చెవులకింపైన సంగీతాన్ని కాని.. వినడానికి లేదా ఆ భావనలో లీనం అవడానికి వయసు ఎంతవరకు అవసరమంటారు చెప్పండి? "మిరపకాయ్" సినిమాలో పాట అనుకుంట "చిరుగాలే వస్తే వస్తే.. అన్న పాట పాడిన గాయని కి ఉన్నలాంటి ఆ గరుకైన మధురమైన గళం మా ఆఫీసులో ఒక అమ్మాయికి ఉంది. ఆ మాట చెప్పిన మర్నాడు ఆ పాట ఆ అమ్మాయికి వినిపించాను.. తనకి తెలుగు రాదు, అయినా పాటని చాలా బాగా ఎంజాయ్ చేసింది కారణం అదే పాట సంగీతంలో హిందిలో కూడా పాట ఉందిట.. సేం మ్యూజిక్ అంటూ పాట రెంటిలో అర్థం వేరు.. సంగీతం ఒక్కటే సంగీతానికి భాష అవసరంలేదు అని ఈ సంఘటన రుజువు చేసింది అలాగే మంచి పదసంపదతో, పదాల కూర్పుతో కూడిన పాట వినడానికి వయసు కూడా అవసరం లేదని నా అభిప్రాయం.
ఒక మంచి పాట వింటునప్పుడు పెళ్ళి అయి, పిల్లలు సంసారం భవసాగరం ఇత్యాది వన్నీ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి పాటలేంటి అని పెద్దలు మందలించినప్పుడు నాలో కలిగిన సంఘర్షణ ఇది. తప్పేమి ఉంది పాట.... పాటలోని భావం నాకు నచ్చాయి. వినడం తప్పులేదు అన్నీఅయిపోయాయి అని గిరి గీసుకుని కూర్చుంటామా? ఎమో కొన్ని కొన్ని నాకు అర్థం కావు అలా అనుకొని వదిలేయడమే.. హ్యాపీగా మనకి నచ్చిన పాటలని ఫీల్ అవడమే.. ... ఇంతకీ నాకు నచ్చిన పాట అంటారా.. మీరు వినండి..
********
అబ్బాయి : రాయి!
అమ్మాయి : ఏం రాయాలి?
అబ్బాయి : లెటర్!
అమ్మాయి : ఎవరికీ?
అబ్బాయి : నీకు.....
అమ్మాయి : నాకా..?
అబ్బాయి : ఊ(..
అబ్బాయి : నాకు వ్రాయటం రాదూ, ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా..
అమ్మాయి : వెయిట్, వెయిట్.....
అమ్మాయి : నాకు నువ్వు రాసే ఉత్తరం, నేను రాసి...
అబ్బాయి : నాకు చదివి వినిపించి, తరువాత నువ్వు.. చదువుకో...
అమ్మాయి : ఐ లైక్ ఇట్ ..ఊ.. చెప్పు!
అమ్మాయి : ఊ....
అబ్బాయి: ఆఆ..
అబ్బాయి : నా ప్రియా!...ప్రేమతో.. నీకు
అమ్మాయి : నీకు....
అబ్బాయి: నే..
అమ్మాయి : రాసే..
అబ్బాయి : నేను
అమ్మాయి : ఊ....
అబ్బాయి : రాసే
అమ్మాయి : ఉత్తరం.
అబ్బాయి: ఉత్తరం..లెటర్..ఛ...లేఖ..ఊ... కాదు..ఉత్తరమే అని రాయి
అమ్మాయి : ఊ..అదీ
అబ్బాయి : చదువు..
అమ్మాయి : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.....
అబ్బాయి : పాటలో మర్చి రాసావా..అప్పుడు నేను కూడా మారుస్తా..
అబ్బాయి : మొదట నా ప్రియా అన్నాను కదా! అక్కడ ప్రియతమా! అని మార్చుకో..
అబ్బాయి: ప్రియతమా నీవక్కడ క్షేమమా.. నేను ఇక్కడ క్షేమం
అమ్మాయి: ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
అబ్బాయి : ఆహా....ఒహో.. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
అబ్బాయి : కానీ అదంతా రాయాలని కూర్చుంటే, అక్షరాలే..మాటలే...!
అమ్మాయి: ఉహలన్ని పాటలే కనుల తోటలో..
అబ్బాయి : అదే...
అమ్మాయి : తొలి కలల కవితలే మాట మాటలో....
అబ్బాయి : అదీ...ఆహా..బ్రహ్మాండం...కవిత..కవిత..ఊ...పాడు...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే....
ఉహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కలల కవితలే మాట ...మాటలో....
ఓ హో...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ...లా ల లా... లా ల ల...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాల ల ...లా ల లా... లా ల ల...
అబ్బాయి: ఊ...
అబ్బాయి : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది..
అబ్బాయి : అదేమిటో నాకు తెలీదు, ఏమి మాయో తెలీదు నాకు ఏమి కదసలు..
అబ్బాయి : ఇది కూడా రాసుకో...
అబ్బాయి : అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ......
అబ్బాయి : ఇదిగో చూడు... నాకు ఏ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
అబ్బాయి : నీ వొళ్ళు తట్టుకుంటుందా..?
అబ్బాయి : ఉమా దేవి....దేవి ...ఉమా.... దేవి...
అమ్మాయి : అది కూడా రాయాలా?..?
అబ్బాయి : ఆహా..హా....
అబ్బాయి : అది ప్రేమ....
అబ్బాయి : నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే....ఏడుపు వస్తోంది...
కానీ నేను ఏడ్చి.. నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నపుడు... వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు.....మాములు ప్రేమ కాదు
అగ్నిలాగ స్వచ్ఛమైనది...అగ్నిలాగ స్వచ్ఛమైనది...
గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే,
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని... నా మేనికేమిగాదు,
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెఱ్ఱి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నదీ....
నాడు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నదీ...
మనుషులేరుగలేరు,
మామూలు ప్రేమ కాదు,
అగ్ని కంటే స్వచ్ఛమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా..
శుభ లాలీ లాలి జో
లాలి లాలి జో...
ఉమా దేవి లాలిజో..
లాలీ లాలి జో
మమకారమే....ఈ లాలి పాట గా....
రాసేది హృదయమా....
నా హృదయమా....
******
బాగుంది కదా! కమ్మనీ ఈ ప్రేమలేఖ.. ! .
ఈ పాట ఇక్కడ వినండి/చూడండి ... కమ్మనీ ఈ ప్రేమలేఖ .......