"i saw u r article in maalika. its good."
"it appeared in malika. i clicked on u r name and it opened."
" r u interested in writing for the printed magazines? "
"i already told about u to both of them.. but could not contact u. i shall give u number of editor u can call him anytime."
******
మాలికలో నా పేరు చూసి నా అర్టికల్ చదివి, పైన మెచ్చుకున్నవారు ఒక ప్రముఖ రచయిత. printed మాగజైన్లో నాకు అవకాశం ఇప్పిస్తానని సారాంశం.
ఒక అగ్రిగేటర్ ద్వారా, ఒక ఆర్టికల్ ద్వారా, ఒక ఆన్లైన్ పత్రిక ద్వారా ఇలాంటి అవకాశం రావడమనేది చాలా ఆనందంగా ఉంది. వారు ఉదహరించిన పత్రికలలో నేను ఏమన్నా రాయగలనో లేదో కాని, వచ్చిన అవకాశానికి మూలకారకులయిన మాలిక టీం వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నేను బ్లాగులోకానికి 2007 లో వచ్చాను. అప్పటినుండి, ఆవేశంగానో, ఆనందంగానో, హాస్యంగానో ఎన్నో పోస్ట్లు రాశాను. అంతర్జాల పత్రికలకి కూడా రాసి పంపాను , కాని తిరిగివచ్చాయి. కథలో పట్టు లేదనో, క్వాలిటీ లేదనో, నిజమే నిజానికి నాకసలు ఈ కథలు రాయడానికి అస్సలు అనుభవం లేదు. ఉద్యోగమైనా, కథలయిన ఏమయినా మొదట అవకాశం వస్తేనే కదా అనుభవం గడించేది. రెండో అవకాశం వచ్చేది కూడా అప్పుడే. కొన్ని అంతర్జాల పత్రికలలో చదివే కథలకన్నా నేను రాసినవి బాగానే ఉన్నాయి కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కాని అక్కడ పేరున్న ప్రముఖులు రాస్తారు కాబట్టి ఎలా ఉన్నా అచ్చయిపోతాయి అని తరువాత తెలిసింది. ఒక మాములు బ్లాగరుగా నేను రాసిన వ్యాసాలని తిరస్కరించకుండా నన్ను ఉత్తేజపరిచి, వాటిని పబ్లిష్ చేసిన మాలిక టీంకి, అవకాశం కల్పించిన రచయిత గారికి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోడానికే ప్రయత్నిస్తాను.