11.27.2011

నేను రాను తల్లో …..


“ఓకే మేడం! హోప్ యు విల్ గెట్ గుడ్ డాక్టర్.. బట్ మా దగ్గర ఆపరేషన్ రీజనబులే .. మీరెందుకు డ్రాప్ అవుతున్నారో మరి.. “


“థాంక్ యు డాక్టర్.. ఇంటికి దగ్గర్లో అయితే  కాస్త ఎవరో ఒకరు నాకు తోడుగా ఉంటారని ఈ నిర్ణయం”


“మీ ఇష్టం మేడం. “

“థాంక్ యు డాక్టర్”.

*****

నవంబర్ 5 .. చాలా సంతోషకరమైన రోజు, అలాగే అత్యంత బాధాకరమైన రోజు.. సంతోషం .. కోలీగ్స్ అందరం కలిసి ఆటలు పాటలు.. చాలా సరదగా గడించింది.. విషాదం  ఆరోజే కాలికి వీడియో వైర్ చుట్టుకుని ఫ్లోర్ మీద పడి కాలి ఎముక విరక్కొట్టుకున్న రోజు వెంటనే  పక్కనే ఉన్నా హాస్పిటల్‌కి తీసువెళ్ళారు..అదో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్..ఇహ నేను చెప్పేదేముంది.. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడి ట్రీట్మెంట్..అయినా నా అనుభవం కూడా చెప్పాలి కదా.. పైన సంభాషణ ఆక్కడిదే  మరి..

******

ఎమర్జెన్సీ వార్డ్:  X-Ray   తీసిన తరువాత… (వెళ్ళిన వెంటనే X-Ray  తీసారు)

హాస్పిటల్ సిబ్బంది – ఆఫీసు కోలిగ్గ్స్ మధ్య సంభాషణ..


“అయ్యో!  ఎమయింది.. కాలు ఫ్రాక్చర్ అయినట్లుంది.. డాక్టర్ రావాలి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు “పేషంట్” ని అడ్మిట్ చేయండి… “

“ఇంకా వాళ్ళ వాళ్ళేవరూ రాలేదు. డీటైల్స్ తెలియకుండా ఎలా? మీరు ఫస్ట్ ఎయిడ్ చేసెయండి.. వాళ్ళ హస్బండ్ వచ్చాకా డిసైడ్ చెస్తారు..”

“ ఏమి చేయాలన్నా “పేషంట్” ని  అడ్మిట్ చేయాల్సిందే లేకపోతే చెయ్యము”

“ఒహో సరే అయితే చేసేయండి..”

“ ఆ కౌంటర్‌లో డబ్బులు కట్టేయండి......   “పేషంట్” వంటి మీద గోల్డ్ అంతా తీసేయమ్మా .. ఇదిగో ఈ అప్లికేషన్ మీద సైన్ చేయండి.. " అంటూ నాతో….

మావాళ్ళు వెళ్ళి డబ్బులు కట్టేసారు… 
ఇహ మొదలు చూసుకొండి..

“పేషంట్ “  కి బి.పి చెక్ చేయండి..”  (యంత్రాల్లా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ఎవేవో పేర్లు చెప్పి టెస్ట్లంటూ  చాలా హడావిడి చేసేసారు… ఇవన్నీ జరుగుతున్నంతసేపూ.. నేను నా పేరుని మర్చిపోయేంతగా “పేషంట్..... పేషంట్”  అని ఎన్ని సార్లు అని ఉంటారో .. ప్చ్… అఫ్కోర్స్ వాళ్ళకి నేను “పేషంట్‌"...నే... కాని మరీ మన మనో ధైర్యం కృంగదీసేలా ఇన్ని సార్లా/.పరీక్షలా?…బాబోయ్!! .)


ఆ తరువాత అసలు డాక్టరు వచ్చి పి ఓ పి వేసేరు.. ఆరోజు రాత్రి ప్రహసనం అలా ముగిసింది.

*******
మర్నాడు 06/11/2011.

ఉదయం 5 గంటలనుండి  నుండి  మళ్ళీ  మొదలు….కనీసం నేనేవరు.. ఎందుకు అడ్మిట్ అయ్యాను అన్నది కూడా అడగకుండా రొబోల్లా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు కాలి కొనగోటి వేలు నుండి తలవెంట్రుక దాకా చెక్ అప్‌లు.. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా .. "ఇదేమి టెస్ట్ ఎందుకు చేస్తున్నారు"  అని.. అహ!  ఒక్కదానికి సమాధానం ఉండదు.. నేనేమన్నా అడిగితే" మీకు బి.పి ఉందా .. సుగర్ ఉందా.."  అంటూ ప్రశ్నలతో నన్ను దారి మళ్ళించడం.. ఒకానొక సమయంలో నాకు కోపం వచ్చి "మీరేమన్నా హౌజ్ సర్జన్లా..  నామీదెమన్న ప్రయోగాలా"  అని అడిగేసాను కూడా.. ఛట్.. నేనే దొరికానా అన్న అసహనం..

ఇలా ఆరోజు సాయంత్రం దాకా జరిగిన తరువాత ప్రత్యక్షయయ్యారు  అసలు ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్.. “ఏమి లేదమ్మా చిన్న ఫ్రాక్చర్ అంతే చిన్న రాడ్ వేస్తాము.. మీరు విథిన్ మంత్స్ లో రికవర్ అయిపోతారు.. అప్రాక్స్మెట్ గా ఇంతవుతుంది.. " అని (మా బడ్జెట్ కి (లక్షల్లో) పై మాటే ) చెప్పారు.. "మీరు ఏ విషయం చెప్పేస్తే రేపు మార్నింగ్ చేసేస్తాము.. ఆలోచించుకొండి ఇదిగో నా కార్డ్.."  అని.. ఇచ్చేసి వెళ్ళారు.

ఆ డాక్టర్ వెళ్ళాక మళ్ళీ  షరా మాములే… రొబోలు ప్రత్యక్షం.. మర్నాడు మేము రెండవ ఓపీనియన్ తీసుకుని వెళ్ళేదాకా... ఆ టెస్ట్ లు ఈ టెస్ట్లు అంటూ  చేసి.. నాలో .. నాకేదో ఉందనే భయాన్ని ద్విగుణీకృతం చేసి.. వాళ్ళు చేసిన టెస్ట్లకి అంతకు తగ్గ బిల్ వేసి (మా అంచనాలకి మించి) మమ్మల్ని వదిలి పెట్టారు.. "బాబోయ్ కార్పోరేట్ హాస్పిటల్  కల్చర్ " అని అనుకోకుండా ఉండలేకపోయాను…

అక్కడినుండి బయటకి రాగానే అనిపించింది

  "నేను రాను తల్లో .....
గొప్పోళ్ళ దవఖానకు ...."
అని..

ఈ మధ్యే ఒబేసిటి గురించీ లక్షలు ఖర్చుపెట్టీ ట్రీట్మెంట్ వికటించి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ ఉదంతం T.V లో  చూసి.. .. చిన్న దగ్గు వచ్చిందని టెస్ట్ కి వెళ్ళి అటునుండి తిరిగి తిరిగి రాలేని లోకాలకు వెళ్ళిన  17 యేళ్ళ పాప.. (మా అక్కగారి బంధువు ) ఉదంతం విని నా అనుభవం రాయాలనిపించి.. ... ఇలా..

అమ్మ తల్లో..నేను రాను
నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు

ఎర్రనీల మందు, సున్నాకు మీద సూదులయె
మందుకు తగ్గటే సూదేస్తేనే జొరమొచ్చె
నేను రాను బిడ్డో బంజల దవాఖానకు

ఔనమ్మా..ఒక్కసారి
కడుపులో నొప్పి ఆయే
compounder కాడికి వెళ్ళితే
కాలుకు కట్టు కట్టే
పన్నుకు బాధంటే తల్లో కన్నులే పీకేస్తారు
వద్దు వద్దు తల్లో యములున్న దవాఖానకు

కొడలు పిల్ల నీలాడ ఆశుపత్రికని పోతే
ambulanceకు పది
ward boy కి పదిహేను
అమ్మాయి పుడితే ఇరవయి
మొగోడు పుడితే ముప్పయి
మంచానికి ఏబయి
మందులేవో ఉండవాయె
వద్దు వద్దు తల్లో లంచాల దవాఖానకు

ఔనవును
అటు చీటి రాస్తే లంచం
ఇటు గేటు తీస్తే లంచం
ఆ సిస్టరమ్మకు లంచం
చిన డాక్టరయ్యకు లంచం

మంచాల ఉన్న మనోళ్ళను చూసొద్దమంటే లంచం
దొరల ఆశుపత్రి ఆయే..దరిలేని దోపిడి ఆయే

వద్దు వద్దు తల్లో దగుల్భాజి దవాఖానకు

కారెక్కివచ్చిన దొరలను కంటిరెప్పలగా చూస్తరు
అక్కడ వున్న మిషిణ్లన్ని ఆ దొరల కోసమే
మంచి మంచి మందులన్ని వారికే ఇచ్చేస్తారమ్మో
వద్దు వద్దు తల్లో గొప్పోల దవాఖానకు
నేను రాను బిడ్డో బంజాల దవాఖానకు
అమ్మ తల్లో..నేను రాను
నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు
వద్దు వద్దు తల్లో మాయదారి దవాఖానకు
నేను రాను బిడ్డో బంజాల దవాఖానకు 
****

డాక్టర్లూ!!!  నన్ను మన్నించండి.....
*****

20 comments:

  1. అన్యాయం.....నేనొప్పుకోనంతే !!! :(

    ReplyDelete
  2. డాక్టరు గారు : నిజంగా నిజం చెప్తే నిష్టూరమే మరి..

    కాని . మీరొప్పుకోవట్లేదంటే మీరు నాకు ఆపరేషన్ చేసినటువంటి మంచి డాక్టరు లాంటి డాక్టర్ అయి ఉంటారు..

    ఈ పోస్ట్ మీకోసం కాదులెండి డాట్టరుగారు .. ఈసారికిలా ఒగ్గేయండి మరి.

    ReplyDelete
  3. ఐతే ఓకే !!! :)

    ReplyDelete
  4. మీరు చెప్పినటువంటి డాక్టర్లు ఉన్నారు కేవలం వైద్యం చేయడమే లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండీ! కానీ కౌంటర్ బాగా ఇచ్చారుగా! బాగుంది!

    ReplyDelete
  5. అయ్యో రసజ్ఞ గారు,

    కాలు facture ఐతే కామెడీ ఎంటండి?? అందుకనేనా మొన్నటి టపా లో " కదలలేని పరిస్థితి" అన్నారు?? ఇప్పుడు ఎలా ఉంది...?? త్వరగా తగ్గాలని అందరి బ్లాగరుల తరుపునా దేవుడిని కోరుకుంటున్నా ....

    మీ పాట చాల బాగుంది..చప్పట్లు....


    మీ శ్రేయోభిలాషి,
    RAAFSUN

    ReplyDelete
  6. సారి,,ఇందాకటి కామెంట్ లో పేరు తప్పు రాసాను....

    రసజ్ఞ గారు కాదు ..రమణి గారు...

    గమనించగలరు ....

    RAAFSUN

    ReplyDelete
  7. రమణిగారూ నిజమే, ఈ రోజుల్లో హాస్పిటల్స్ ఫైవ్ స్టార్ హోటెళ్ళలానే ఉన్నాయి. సామాన్యమయిన మనుష్యులకి అందుబాటులో లేకుండా. నాకూ కొన్నేళ్ళ క్రితం ఇలాంటి అనుభవమే ఎదురయింది.
    Krishnaveni

    ReplyDelete
  8. రసజ్ఞ గారు డాక్టర్లందరూ వైద్యం కోసమే ఉన్నారండి కాని, వారు పని చేస్తున్న హాస్పిటల్ నిర్వహించేవారే మానవత్వం మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు.. నీలాపనిందలు డాక్టర్లకి ... సొంతంగా ప్రాక్టీసో లేదా హాస్పిటల్ రన్ చేసేవాళ్ళని చూడని ఇంత హడావిడి ఉండదు.. ఏది ఏమయితేనేం.. అలా ఇలా ఉన్నారు కాబట్టే ఈ పోస్ట్
    మర్చిపోయాను మీ బ్లాగు చూసాను. మంచి శైలి అండి మీది. కంగ్రాట్స్.

    RAAFSUN గారు: :) ఇప్పటికే ఎదో జరిగిపోయిందంటూ పరామర్శలజోరు పరిథులు దాటుతోందండి బాబు.. కనీసం ఇలా అన్నా హ్యాపీగా రాసుకుంటూ ఉందామనుకుంటున్నా మీరేమో కామెడి అంటున్నారు ప్చ్.. బరువైన డైలాగులు నావల్ల కాదండి.. "బ్లాగర్ల తరుపున మీరు దేవుడికి.." ఈ ఒక్క మాట చాలు రేపీపాటికి నడిచేయలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. చదవగానే ఎగిరిగంతెయ్యాలన్న కోరికని అతి బలవంతంగా అణుచుకున్నా.. శ్రేయోభిలాషుల విషెస్ చాలండి మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండడానికి.... మరోసారి థాంక్స్.

    కృష్ణవేణి గారు: థాంక్స్ అండి...

    ReplyDelete
  9. అన్నట్లు ఇంకోవిషయం ఈ పోస్ట్‌లో రాసిన పాట నా సొంతం కాదు. అప్పట్లో వచ్చిన వందేమాతరం సినిమాలో శైలజగారు పాడిన పాట సంధర్భానికి తగ్గట్లుగా ఉందని కొన్ని లైన్స్ వాడాను.

    ReplyDelete
  10. మీరు త్వరగా నడవాలని, గెంతాలని , మనసారా ఇంకోసారి కోరుకుంటూ.....

    మీ శ్రేయోభిలాషి,
    RAAFSUN

    ReplyDelete
  11. I have been there Ramani garu. What an experience it was!

    Please take care and love your leg and plaster. Wish you a speedy recovery.

    ReplyDelete
  12. RAAFSUN గారు: :-) థాంక్స్

    sujata గారు : చాలా థాంక్స్ అండీ.. మీ అందరి విషెస్ చాలు నాకు తొందర్లో మళ్ళీ నా జీవన శైలితో జీవించడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికీ... జీవితం మళ్ళీ మొదలెట్టడానికి..

    ReplyDelete
  13. What kind of fracture is it? To the foot or Leg?

    ReplyDelete
  14. kumarN గారు: :-) leg fracture.. foot కి కాదు.. Ankle కి పైన.. మీరు డాక్టరా?

    ReplyDelete
  15. Tibia Fracture? Lateral Malleolus?

    The experience you wrote above is very disconcerting for me.

    I had fifth metatarsal.

    ReplyDelete
  16. కుమార్ గారు.. క్షమించండి.. నేను ప్రస్తుత పరిస్థితుల్ని.. నా అనుభవాన్ని బేరీజు చేసుకుని రాసాను కాని, డాక్టర్‌స్ ని ఎదో అనేద్దామన్న ఉద్దేశ్యం కాదండి. అది కూడా నేను ఇక్కడ మా వూళ్ళో పరిస్థితిని చెప్పాను కాని, మీవైపు (అక్కడ దేశంలో) విషయం నాకసలు తెలీదు.

    నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్.. నాకు భగవంతుడితో సమానం.. నాకు ఆయన పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ .

    నేను .. పరిస్థితులు మనిషిపై చూపే ప్రభావాన్ని చెప్పాను disturb అయితే మరోసారి మన్నించండి..

    ఇక నాకు జరిగిన fracture ... కుదిరినప్పుడు రిపోర్ట్ స్కాన్ చేసి పెడ్తాను బ్లాగులో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకెప్పుడయింది? ఎలా ఉన్నారు? ఎన్ని మంత్స్ రెస్ట్ లో ఉన్నారు వివరాలు చెప్పగలరా.. నాకు 2 moths అని చెప్తున్నారు అందుకని..

    ReplyDelete
  17. అయ్యయ్యో, రమణిగారూ, నేనన్న disconcerting మీకు తప్పుగా అర్ధమయినట్లుంది. అది కాదు, మీ అనుభవం నన్ను ఇబ్బందిపెట్టింది అన్నది, ఆ ఎక్స్పీరియన్స్ లోంచి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళటం నాకు నచ్చకే.

    నా ఫిఫ్త్ మెటాటర్సల్ రైట్ ఫుట్ కి, అపాయింట్మెంట్ దొరకడానికి కొంచెం ఇబ్బంది అయినా, పి ఏ చూడగలదూ అంటే వెళ్ళిన ఐదు నిమిషాల్లో పక్క రూమ్ లో ఎక్స్ రే, అది అయిన ఐదు నిమిషాల్లో ఫ్రాక్చర్ అయిందని కన్ఫర్మ్, అప్పుడు ఆవిడే నవ్వుకుంటూ సరే పక్క రూమ్ లోకి పదా అని, పింక్ కలర్ కావాలా అని జోక్. వద్దులే వైట్ కాస్టే అని నా ఆన్సర్. అంతే వెళ్ళిన ముప్ఫై నిమిషాల్లో అవుట్. Was on cast for 3 weeks, followed by 3 weeks on boot. Just got rid of it last week. I am OK now, but bone healing takes long time, few more months may be.

    ReplyDelete
  18. కుమార్ గారు: హమ్మయ్య థాంక్స్ అండీ కార్పోరేట్ హాస్పిటల్స్ గురించి డాక్టర్స్ గురించి నేను రాసిన దానికి మీరు అప్సెట్ అయ్యారేమో అనుకున్నా.. ఎందుకంటే అది సహజం.. ఎంతో డెడికేషంతో ప్రాణాలతో చెలగాటమాడకుండా వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు.. వాళ్ళకి ఇలాంటి పోస్ట్ కొంచం ఇబ్బందే..

    మీరు చాలా చాలా అదృష్టవంతులు ఒకరోజులో మీకు కంఫర్మేషన్, ట్రీట్మెంట్ great.మనవాళ్ళు ఇలా ప్రాణాలతో చెలగాటం ఆపేస్తే బాగుంటుంది.. నేను కూడా తొందర్లో మీ అందరికీ am ok చెప్పేయాలని ఆశ..చూద్దాము ప్రస్థుతం డిపెండెంట్.. ఇంకో 2 వీక్స్ లో నావరకు నేను చేసుకోగలనని డాక్టర్ల ఉవాచ.hope so.

    ReplyDelete
  19. Please take care and wish you speedy recovery Ramani garu.

    ReplyDelete
  20. E V Lakshmi gaaru : Thanks a lot andi..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...