4.24.2012

గెలుపు-ఓటమి

రాత్రి పాప... నా పక్కకి వచ్చి నా చుట్టూ చేయి వేసి "అమ్మా.. భయమేస్తోంది రేపే రిజల్ట్స్.. బాటనీ సరిగ్గా రాయలేదు...అనుకున్నవేవి రాలేదు..  ఎమవుతుందో.. ఎమో " అని.. భయపడ్తూ అంది. పాపకి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. "ఏమి పర్వాలేదు, ఏమయినా నో టెన్సన్స్.. ఇప్పటితో జీవితం అయిపోలేదు ఓటమి ఎప్పుడు గెలుపుకి దారి అంతే.."  అనునయించాను కాని.. నా మనసులో నా పిల్లల గురించి మా బంధువర్గం అయితేనేమి.. దగ్గిరవాళ్ళ, దూరంవాళ్ళ ఉద్దేశ్యాలు ఈమధ్యే తెలియడంతో .. నాకెందుకో నేనే ఓడిపోతున్నాను అన్న బాధ కలిగింది..
******
"నీ పిల్లలికి క్రమశిక్షణ లేదు..." , అని ఒకళ్ళు, "ఇదిగో ఇలా చదివితే మటుకు అసలు మార్క్స్ రావు" అని ఒకళ్ళు, " వాడా ఎస్ ఎస్ సి అయితే కంప్లీట్ చేయడు.." అని ఒకళ్ళు.. "వాడికి కొంచం మాట్లాడడం నేర్పు "  అని ఒకళ్ళు.. ఇవి వింటుంటే నిజానికి నాకే భయమేసింది ..ఏంటి మరీ నా పిల్లలు అసలు క్రమశిక్షణ లేకుండా ఉన్నారా?  అని..  నాకు అవకాశం దొరికినప్పుడల్లా, చదువు విలువ, కష్టం, సుఖం, బాధలు, బంధుత్వాలు ఒకటేమిటి ఒక తల్లిగా  కాక ఒక స్నేహితురాలిగా చెప్తూ వచ్చేదాన్ని .. నాకు తెలియని ఇన్ని అవలక్షణాలు పిల్లలో వాళ్ళు చూడగలుగుతున్నారా అని మనసు మధన పడిన సందర్భాలెన్నో.. దగ్గరి మిత్రులైతే  "ఏమి లేదు రమణీ! వయసు కదా...  పిల్లలు అంతే దూకుడుగా ఉంటారు.. వాళ్ళకి ఆలోచించే వయసు వస్తుంది అప్పుడు చూడు నువ్వే ఆశ్చర్యపోతావు"  అంటూ ధైర్యం చెప్పేవారు.. ఏది ఏమైనా పిల్లలిద్దరు ఇప్పటి వరకు నా అదుపాజ్ఞాలలోనే ఉన్నారన్న నమ్మకం నాది.. ఇంకా సడలి పోలేదు..

నేను సాధారణంగా ఏ పిల్లలిని వాళ్ళు ఇలా వున్నారు అంటూ  వేలెత్తి చూపను ఎందుకంటే చిన్నప్పుడు జులాయిగా తిరిగి పెద్దయ్యాక పద్దతిగా ఉద్యోగం చేస్తూ ......కుటుంబ బాధ్యతలు స్వీకరించి పెద్దరికంగా, పెద్దతరహాగా మారినవాళ్ళని చాలా మందిని చూశాను..అలాగే క్రమశిక్షణ, అంటూ ఏ స్నేహితులు లేక ఇంట్లోనే ఉండి.. బిడియపడ్తూ ఉండేవాళ్ళనీ చూశాను... సో, నా నమ్మకం ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక మనసుని తాకే సంఘటన ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది... అందరూ మారతారు.. తెలిసి తెలియని వయసు.. ముఖ్యంగా మా బాబు... వాడి వయసు, వాడి ఆలోచనలు చాలా పెద్దవాడినయ్యాను అన్న ఒక భావన.. వాడి దృష్టిలో , అమ్మకేమి తెలీదు.. అక్కకి తను అండగా ఉండాలి ... :)) అందుకే మాములుగా గేట్ బయట వాళ్ళ అక్క నించున్నా "ఏయ్! అక్కా లోపలికి వెళ్ళు" అని కసురుతాడు ఎదో పెద్ద భారం మొసేస్తున్న వాడిలా .. నాకే నవ్వు వస్తుంది.. సినిమాల ప్రభావం అని నవ్వుకుంటా..

అలాగే పాప ... ఇదో కొత్తకోణం చెప్పాలంటే.. రెండు నెలలు కాలు సమస్యతో మంచం పై ఉన్న నన్ను పసిపాపలా చూసుకుంది.. నా పనులు నేను చేసుకుంటూ ఉన్నప్పుడు , ఒక్క పని కూడా చేయవు అంటూ కసురుతూ ఉండేదాన్ని.. ఇద్దరికి గొడవ కూడా అయ్యేది.. అలాంటిది పరిస్థితి ఒక్కసారిగా మారేసరికి పాప నన్ను అమ్మలా చూసుకోడం.. నన్ను నేనే మర్చిపోయేంత పసిపిల్లనయ్యాను ఆ సమయంలో .. ఇలాంటి పాపకి క్రమశిక్షణ లేకపోవడం...:((

ఇవన్నీ గమనించి బంధువుల అవహేళన అవి , చూసి పిల్లలికి ఒకటే చెప్పాను.. "రాత్రింబవళ్ళు  కష్టపడి చదివేసి , మంచి మార్క్స్ తెచ్చుకొండి"  అని మాత్రం కాదు.. "మీకు లోకజ్ఞానం తెలియాలి నాన్న.. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి.. అందరూ మనవాళ్ళు కాదు..  అలా అని అందరూ పరాయివాళ్ళు కాదు.. నా పిల్లలు మరీ అజ్ఞానంలో, మీరనే క్రమశిక్షణ లేకుండా  లేరు ... వాళ్ళు వాళ్ళ పరిథిలో తెలివైనవాళ్ళే" అని నేను వాళ్ళకి చెప్పిన మాటని నిలబెట్టండి చాలు అని...పాప కనక నిజంగా బాటనీ పేపర్ మళ్ళీ రాయాల్సి వస్తే .. బంధువుల నుండి నేను ఎదుర్కోవల్సింది మటుకు .. "మాకు ముందే తెలుసు .. మీ పాప చదవదని.. చదవలేదని.. క్రమశిక్షణ లేదు... మొ! కాని అలా జరగలేదు..... నాకు తన పరీక్షల టైంలోనే  యాక్సిడెంట్ అవడం పాపకి పెద్ద దెబ్బే ... అయినా పాప  మంచి మార్క్స్ స్కోర్ చేసింది.. పొద్దున్న రిజల్ట్స్ చూడగానే ఆనందభాష్పాలతో నన్ను చుట్టేసుకుని పరవశించిపోయింది నా చిట్టి తల్లి.. ఎంతసేపు కాలేజ్, ఇల్లు ఇదేనా అని మొన్న ఆదివారం బ్లాగు సమావేశానికి తీసుకెళ్ళాను.... చూసినవాళ్ళందరి దగ్గరా మంచి మార్కులే తెచ్చుకుంది.... బాబు కూడా తన విషయంలో అదే అన్నాడు "ఎస్ ఎస్ సి కంప్లేట్ చేయని చూద్దాం"  అనేవాళ్ళే ముక్కున వేలేసుకుంటారమ్మా!  నీకా డౌటే లేదు అని.. వాడు మాములుగానే 90%లో ఉన్నాడు నాకసలు సందేహం లేదు.... ముందు ముందు ఏమి జరుగుతుందో కాని ఇప్పటివరకు గెలుపే.. ఒకవేళ ఓటమైనా  మనసులో మధన పడ్తాను ..  పిల్లలికి మటుకు ..గెలుపుకి దారి వెతుక్కోమనే స్థైర్యం, ధైర్యం  ఇస్తాను కాని ఓడిపోయాను అని ఒప్పుకోదల్చుకోలేదు.... నా వాళ్ళు .. నా పిల్లల కోసం.
*****

8 comments:

  1. మీ కంటే ఎక్కువ మీ పిల్లల గురించి మీ బందువులకి, బయటవారికి ఏమి తెలుసండి? ఈ రోజుల్లో పిల్లలలో ఒక మంచి లక్షణం నేను చూసినదేమిటంటే...they don't like comparisions and they don't look at others and set their goals. They have their own goals and they do work towards them.. కాని అప్పుడప్పుడు పెద్దలుగా మనమే..తోటి వారు అందరూ ప్రగతి సాదిస్తున్నరేమో, మన పిల్లలు వెనకపడి ఉనారేమో అని సందేహం ఉన్న..వారు ఎప్పుడూ proove చెసుకుంటూనే ఉంటారు మీ పిల్లల లాగా..

    ReplyDelete
  2. ముందుగా ఇంత మంచి పోస్ట్ వ్రాసినందుకు అభినందనలు .. ఈ samasya అందరిదీ .. ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు వుండేవి ..అప్పుడు తల్లి, తండ్రి మాటల కన్న అమ్మమ్మ, నాన్నామ్మ , తాతయ్య ల ఒడి వారి మాట వినేలా చేస్తుంది ..తమ పిల్లలను స్ట్రిక్ట్ గా పెంచాలనుకున్న వారి అనుభవం, తమ పిల్లల పిల్లల పట్ల మరింత బాధ్యతా , ప్రేమ చూపిస్తుంది .. తమ పిల్లలకి సమయం ఇవ్వలేక పోయినా, వారికి పుట్టిన పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వగలుగుతారు ..అప్పుడు ఇది మంచి, ఇది చెడు అని, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మరింత అందంగా వివరించ గలుగుతారు ..ఉమ్మడి కుటుంబాల్లో నివసించే తల్లి, తండ్రులకి పిల్లల పరమైన ఒత్తిళ్ళు చాలా తక్కువ ..ఎందుకంటే ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకోబడుతుంది .. కాని, ఈనాడు ఎవరి పిల్లల గురించి వారు తపన పడడం వల్ల తల్లి తండ్రుల్లో ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడిని తమ పిల్లల మీద వేస్తుంటాము .. ఒక టీచర్ గా నేను ఈ విషయాలు పరిశీలిస్తూ వున్దేదానిని ..ఉమ్మడి కుటుంబాలలో వుండే పిల్లల మాట తీరు, ప్రవర్తన, చదువు, single ఫామిలీస్ లో వుండే పిల్లల కన్నా విభిన్నంగా అందంగా వుండేది ..మదన పడకండి ..ఈ నాటి పిల్లల్లో వయసుకి మించిన పరిణితి, వారి జీవితాలను దిద్దుకోవాలన్న ఆలోచన కనిపిస్తూనే వుండి .. ఇంకో ముఖ్య విషయం, పిల్లల్లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది .. అమ్మ,నాన్నల యెడ ప్రేమ, దాన గుణం, సేవా గుణం, భక్తి ..పరిశీలించండి ..ఇవన్నీ ఒకదాని తో మరొకటి ముడిపడి వున్నాయి ..త్వరలో రామరాజ్యం రాబోతుంది అనడానికి సాక్ష్యాలు ....వెన్నెల గారు చాలా బాగా చెప్పారు ...-- పిల్లలు తల్లి తండ్రులకి అమ్మా, నాన్నలుగా వ్యవహరించగలరు ..
    rukminidevi.j

    ReplyDelete
  3. జనాలు అన్నాక ముఖ్యం గ చుట్టాలు ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్లు గా మాట్లాడుతూ ఎదుతువారిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు....
    పిల్లలకి మంచి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు.అభినందనీయం

    ReplyDelete
  4. రమణి గారు,చాలా మంచి పోస్టు రాశారండీ..మా లాంటి వాళ్లకి మార్గదర్శకమైన పోస్ట్..:-)

    ReplyDelete
  5. జలతారు వెన్నెల గారు: నాకంటే మీకు నా పిల్లలగురించి తెలుసా అని వాదించిన సందర్భాలు కూడా ఉన్నాయండి.. ఇక్కడ చుట్టాల్తో కాని, ఇతరేతర బంధువులతో కాని వచ్చిన చిక్కేంటంటే.. ఇంట్లో చిన్నదానిగా పుట్టడం.. చెప్పేవాళ్ళందరూ పెద్దవాళ్ళవడం.. అదేదో సినిమాలో లా వాళ్ళకి 62 అయితే నాకు 60 వాళ్ళకి 22 అయితే నాకు 20.... రేండేళ్ళో మూడేళ్ళో పోని ముప్పై యేళ్ళో తక్కువవుతాయి. కాని బుద్ధి జ్ఞానం లేకపోతే లోకజ్ఞానం అనేది వాళ్ళ వయసుకు వచ్చేసరికి వాళ్ళకి వచ్చినట్లే నాకు వస్తాయి అని ఎందుకనుకోరో నాకర్థం కాదు.... చిన్నప్పుడంటే చిన్నదాన్ని నాకేమి తెలీదు అంటూ నెట్టుకొచ్చారు కాని ఇప్పుడు?? ఇంట్లో చిన్న దాన్నే కాని నాకు ఒక కుటుంబం, ఒక హోద... ఒక ఆలోచన ఉంటాయని ఎందుకనుకోరో.. ఇంకా వింతైన విషయమేమిటంటే... పెద్దవాళ్ళకి చిన్నదన్నే.. కాని వాళ్ళ వాళ్ళ పిల్లలికి కూడా చిన్నదాన్ని ఎలా అవుతానో నాకర్థం కాదు.. దీని గురించి విశ్లేషణ మరో పోస్ట్ లో రాస్తానండి.. కామెంట్ పోస్ట్ అయ్యేలా ఉంది..
    comparisons నేనసలు చేయనండి.. మీరన్నట్లు మా పిల్లలు కూడా దీనికి వ్యతిరేకులే..
    రుక్మిణీ దేవి గారు: చాలా చాలా థాంక్స్ బాగా విశ్లేషించారు.. మీలా ఆలోచిస్తే పిల్లల భవిష్యత్తు బంగారమే కదండి..
    శేఖర్ గారు: ఠాంక్ యు
    నాగిని గారు: థాంక్స్ అండీ

    ReplyDelete
  6. ఈ నాటి పిల్లల్లో వయసుకి మించిన పరిణితి, వారి జీవితాలను దిద్దుకోవాలన్న ఆలోచన కనిపిస్తూనే వుండి .. ఇంకో ముఖ్య విషయం, పిల్లల్లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది .. అమ్మ,నాన్నల యెడ ప్రేమ, దాన గుణం, సేవా గుణం, భక్తి ..పరిశీలించండి ..ఇవన్నీ ఒకదాని తో మరొకటి ముడిపడి వున్నాయి ..త్వరలో రామరాజ్యం రాబోతుంది అనడానికి సాక్ష్యాలు
    __________________________
    exactly.. hope so

    ReplyDelete
  7. శేఖర్ గారు: "ఠాంక్" యు
    sorry thank you

    ReplyDelete
  8. రమణి గారు!పిల్లలకే కాదు మీక్కూడా అభినందనలు !

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...