11.19.2013

రమణి కే జైస చెష్మా లగాకే :))))



ఏమి రాయాలి ఎప్పుడు ఈరోజు  నాకు నేను గుర్తు చేసుకుంటూ ఎదో ఒకటి రాస్తూ ఉంటాను.. ఈసారి ఏమి రాయాలో తెలియడం లేదు.. ఎక్కడో వయసు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఆయుష్షుని తగ్గించేస్తోంది. :) అయినా ఇలా వయసు పెరుగుతున్నా మనసు వయసు మటుకు తగ్గిపోతోంది. ఇక ఈసారి మటుకు ఇలా కొత్తగా వచ్చే వయసు  మార్పులను అంగీకరించాల్సిందే :( అప్పుడెప్పుడో మీఅందరికీ చెప్పిన 30+ నుండి  ఇదిగో ఈ మధ్యే 40+ లోకి అడుగుపెట్టాను అతికష్టంగా  ( ఎప్పుడు అని అడగకండి, నా చిన్ని మనసు చిన్నబుచ్చుకుంటుంది :(  ) మొన్నామధ్య ఎప్పుడో మా బాబు "ఇంకెన్నేళ్ళమ్మా నీకు 40+ " అని అడిగాడు హ...హ ....నేను మటుకు తక్కువ తిన్నానా "50+ వచ్చేదాకా రా!! " అని సమాధానం. :

చిన్నప్పుడు నా తోటి వాళ్ళల్లో ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకున్నారంటే బాగా చదువుతారు , మాంచి తెలివయినవాళ్ళని అనేవారు. నాకు కూడా ఓ కళ్ళజోడు పెట్టుకోవాలనిపించేది. ప్చ్! మనిష్టమా  ఎదన్నా కావాలనిపిస్తే ఇలా వెళ్ళి అలా తెచ్చుకొని పెట్టుకోడానికి అన్నీ అమ్మని అడగాల్సిందే.. అడిగితే "భూమికి జానేడు బెత్తెడు లేవు.. నీకెందుకే కళ్ళజోడూ !"  అని ఓ పెద్ద ధీర్ఘం తీసేసి అదేదో అడగకూడనిది అడిగినట్లుగా బుగ్గలు నొక్కేసుకుని వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి పక్కున నవ్వేసి చెప్పి శాంతపడేది మా అమ్మ.  ఇంక నేను మాట్లాడానికి ఏముంది.

సరే! కాలేజ్ చదువులు.. అప్పుడిక కళ్ళజోడంటే కాస్త మోజు తగ్గింది దానికి తగ్గట్లు నాకున్న స్నేహితుల్లో కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు వేళ్ళమీద లెక్కపట్టొచ్చు. ఎదో మనకి ఏ "సైట్" లేదులే!  అన్న సంతృప్తి. అలా అసలు ఈ కళ్ళజోడు అన్న concept కి నేను దూరంగా ఉన్నాను. కాని మరి ఇప్పుడో.. :((((((

40+ మార్పులు అంగీకరించాలి... తప్పట్లేదు .. జానెడు బెత్తెడు ఉన్నప్పుడు అమ్మని అడిగిన ఈ కోరిక ఇప్పుడు బారెడు ,(weight)  మూరెడు (height) ఉన్నప్పుడు తీరుతోందన్నమాట .. ఇప్పుడసలు ఇష్టంలేదు కాని తప్పదు మరి,, అది సంగతి.. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే "రమణీ లలామ నవ లావణ్యసీమ"    కాస్తా   "రమణి లలామ కళ్ళద్దాల భామ... బామ్మ"  అయిందన్నమాట. ఇప్పటికిదే  రేపు జరగబోయే నా పుట్టినరోజు వచ్చిన మార్పు.. 

 (ఇంకా కొత్త ఫొటో(with spectacles) తీయలేదు మరి.. అందాక అన్నమాట ఇది. :)) 


ముజ్కో తోడ రౌండ్ ఘుమాకే
"రమణి  కే జైస చెష్మా లగాకే"
కొకొనట్  మే  లస్సి మిలాకే

ఆజా  సారే మూడ్ బనాకే
ఆల్ ది రమణి ఫాన్స్ 
( ఇక్కడ రమణి ఫాన్స్ అంటే ఆత్మీయులన్నమాట,,, )
డోంట్ మిస్ ది ఛాన్స్..


:)))))))))))))))))))) అదన్నమాట విషయం మరి విష్ చేసేయండి...Ready 1.........2............3...:))))))))

9 comments:

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు రమణి గారు :-)

    ReplyDelete
  2. రమణి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    మీ టపాకి రెండు దహాలు.

    ReplyDelete
  3. మా రమణి నిండు నూరేళ్ళూ పదహారేళ్ళలా ఉండాలని దీవిస్తూ... మీ నెచ్చలి మరో 40+...:-)

    ReplyDelete
  4. :) పుట్టినరోజు శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  5. జన్మదిన శుభాకాంక్షలు రమణి గారు.

    ReplyDelete
  6. వేణు శ్రీకాంత్ గారు, బులుసు సుబ్రహ్మణ్యం గారు, ఫాతిమా గారు, కొత్త పెళ్ళి కూతురు శిశిర గారు, జయ గారు.. అత్మీయంగా శుభాకాంక్షలందించినందుకు చాలా చాలా థాంక్స్ అండి. :)

    ReplyDelete
  7. పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  8. పుట్టినరోజు శుభాకాంక్షలు రమణి గారు

    ReplyDelete
  9. కశ్యప్ గారు, మాలా కుమార్ గారు థాంక్స్ అండీ !

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...