7.15.2009

నా మనోభావాలు దెబ్బ తిన్నాయా?

సమజంలో భిన్న మనస్తత్వాలలో ఒక స్నేహ పూరిత వాతావరణాన్ని కలిపించే ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు మొదలయ్యాయి. ప్రపంచంలోని తెలుగు ప్రజల మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు, పరస్పరం సమాచారం అందించుకోవడం , అభిప్రాయాలను పంచుకోవడానికి చక్కని వేదికలుగా ఆదరణ పొందాయి బ్లాగులు.

వేసుకొనే దుస్తులు మెప్పుకోసం,
పెట్టుకొనే నగలు గొప్పకోసం
కట్టుకొనే ఇల్లు హోదా కోసం
చేసుకొనే శుభకార్యం మన అంతస్థుకు అద్దం
అవసరార్థం అయ్యో పాపం అంటాం
అనవసరమైనా ఆహ , ఓహో అంటాము
ఈ జగన్నాటకంలో కొన్ని పాత్రలు వెయ్యకా తప్పదు

కొందరిని మొయ్యకా తప్పదు.
నవ్వూ, ఏడుపూ మెప్పు కోసం,
తిప్పలు ముప్పని తెలిసినా తప్పులు
అన్నీ 'లోక కల్యాణం ' కోసమే.

మరి ఇన్నిటిలో మనకోసం కేవలం మనకోసమే మన అభిప్రాయాలు పంచుకోడం కోసం, మనల్ని మనం అర్ధం చేసుకోడం కోసం, మనగురించి ఇంకొకరు తెలుసుకోడం కోసం జరిపే అన్వెషణా ఫలితమే ఈ బ్లాగులు.


బ్లాగులు ఎవరైనా వ్రాసుకోవచ్చు, విద్యార్ధి, ఉద్యోగార్ధి, సంసారి, బ్రహ్మ చారి అన్న తేడా లేదు. ఎవరు వ్రాసుకొన్నా భాష మెరుగుపడ్తుంది, వ్యక్తీకరణ బాగవుతుంది, మనకి మనం అర్ధం అవుతాము. మనలో ఉన్న రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, తాత్వికుడు అందరు కట్టగట్టుకొని బయటకి వస్తారు. మనకే తెలియని కొత్త కోణాలు చూపెడ్తారు, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తారు.

*******

ఈనాడులో "డైరి" గురించి చదివినప్పుడు మురిసిపోయి రాసుకొన్న వ్యాసం ఇది. ఈరోజు వరకు అలానే అనుకొంటున్నాను. ఇకముందు కూడా ఇదే భావనతో ఉంటాను. ఇకపోతే..


ఒక కుటుంబం లేదా మా కుటుంబమనే అనుకొందాము ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళాలనుకొన్నామనుకొండి, చక్కగా ఎవరికివారు తయారయిపోయి "పదండి వెళ్దాం" అనేసుకొంటామా ? లేకపోతే మనమెలా ఉన్నాము అని అడుగుదామన్నా ఆలోచన లేదా ఆ భావన ఒక్కసారన్నా కలుగుతుంది. ఈ డ్రస్ ఎలా ఉందనో, ఈ నగ బాగుందా అనో అడుగుతాము. "అమ్మా బాగుందా మరీ ఓవర్గా ఉందా చెప్పు నువ్వే చెప్పాలి పార్టీలో ఇంకెవరన్నా చెప్తే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది." అని అంటుంది మా పాప . నాకు నచ్చితే " బాగున్నావు " అని చెప్తాను లేకపోతే "ఇలా మార్చు" అని చెప్తాను. నాకు నచ్చకపోతే ఇంకొకళ్ళకి కూడా నచ్చకూడదని రూల్ ఏమి లేదు. పాప విషయంలో "ఇది బాలేదు" అంటే, లేదు "నాకు నచ్చింది " అని మావారు అన్నారనుకొండి, కాదు కూడదు అని పోట్లాట దిగము కదా! ఇక్కడే అంటే ఇంట్లోనే కుటుంబసభ్యులం భిన్నాభిప్రాయాలతో ఉంటాము. అలా అని ఏఇద్దరి మధ్య ఏవైరము లేదు. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో అభిప్రాయాలని తెలియజేసుకొంటున్నాము. అలాగే ఒక కథ విషయంలోనో, ఒక నవల విషయంలోనో, ఒక పుస్తకం గురించో .. మన అభిప్రాయం విమర్శగానో , పొగడ్తగానో వెలిబుచ్చడం తప్పు కాదని నా అభిప్రాయం.


క్కడ నా బ్లాగులో నేను చేసింది అదే. నాకు ఒక కథ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో చెప్పాను. అలాగే ఇంకో కథ నచ్చింది, ఎందుకు నచ్చిందో కూడా చెప్పాను. నాకు నచ్చడం , నచ్చకపోడం అనేది నా బ్లాగులోనె వెలిబుచ్చాను. అలాగే నా అభిప్రాయలని ఏకిభవించినవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చర్చలాంటి అభిప్రాయ సేకరణ జరిగింది. అంతేకాని ఏకీభవించినవారు ప్రాణమిత్రులు కారు, వ్యతిరేకించిన వారు శత్రువులు కారు. ఒకళ్ళకొకళ్ళము తెలియని మనమధ్య వ్యక్తిగత ధూషణలు, ప్రతీకారవాంఛలు , శపధాలు ఎంతవరకు సమంజసం?



ఇక నేను విమర్శించినది కథని కాని , రచయిత్రిని కాదే? మరి ఏవిధంగా అంటే ఏ విషయాన్ని ఆధారం చేసుకొని నన్ను "మీకు సిగ్గుండాలి " " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" లాంటి పదాలు వాడతారు?


ఇన్ని వాదాలు ఇన్ని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నా నేను పరుషంగా ఒకమాట మాట్లాడానా? " సిగ్గుండాలి " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" అని నన్ను అన్నందుకు నా మనోభావాలు దెబ్బతిన్నాయా?... అని రెండు క్షణాలు ఆలోచించాను. ఆలోచించినతరువాత తీసుకొన్న నిర్ణయం.. ఇకముందు ఇలా అన్నవారి వ్యాఖ్యలు నన్ను ఆకాశానికి ఎత్తేసినట్లు పొగిడినా, పాతాళానికి కృంగిపోయేట్లు అవేశ వ్యాఖ్యలు వ్రాసినా ప్రచురింపబడవు.. ఎందుకంటే నాకు సిగ్గు ఉంది కాబట్టి , సిగ్గులేకుండా ప్రచురించలేను కాబట్టి(మనోభావాలు ఇంతలా దెబ్బతిన్నాయి).


ఇకపోతే చివరిగా నేను తెలియజేయాలనుకొన్న ముఖ్యమైన విషయం , నిజంగా నేను విమర్శించిన కథలోలా ఓ 60 యేళ్ళ స్త్రీ మళ్ళీ పెళ్ళి చేసుకొని(దేనికోసమైనా కావచ్చు) , నాదగ్గిరకి వచ్చినా.... ఓడిపోయాను, గెలిచాను లాంటి ఫీలింగ్స్ నాకు కలగవు. ప్రస్తుత సమాజానికి సరిపడదు అని వ్రాసాను తప్పితే ఎరెలా ఉన్నా నాకెంత మాత్రం అభ్యంతరంలేదు , దీనిగురించి ఆలోచించాల్సిన అవసరం , ఎవరెవరికో క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాల గురించి నిరూపణలు గట్రా అంటూ శపధాలు చేయడాలు , సవాళ్ళు విసరడాలు లాంటివెన్ని జరిగినా.. నేను ఏ హిమాలయాలకి వెళ్ళను, ఏ కాషాయ వస్త్రాలు ధరించను. ప్రస్తుతానికి నేను కోరి మనసుపడి సృష్టించుకొన్న నా కుటుంబమే నాకు హిమగిరిసొగసులాంటి మనోజ్ఞ సీమ.

*********

Note 1: నేను ఫీల్ అవుతున్నానని ఫోన్ ద్వారా . మెయిల్ ద్వారా నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన స్నేహితులకి మనఃపూర్తిగా ధన్యవాదాలు.


Note 2: వాదనలొద్దు అన్నతరువాత వ్యాఖ్యలు ఎందుకు ప్రచురించానా అని అనుకొంటున్నారా? వ్యక్తిగత ధూషణ, దాడులు లాంటివి ఎవరికి జరిగింది అన్నది.. విజ్ఞులైన పాఠకులకి తెలియాలి అని. ఇప్పటికీ నేను మౌనమే. నా నిర్ణయాలు చెప్పాను అంతె.
*******

11 comments:

  1. నేను చాలా రోజులుగా తెలుగు బ్లాగులు చదువుతున్నాను.ఈ ప్రవీణ్ అనే జీవి..నోటికి ఏది వస్తే అది వాగేయడం, దురద తీరే దాక అరవడం చేస్తుంటాడు, ఇలాంటి వెధవల గురించి పట్టించుకోకండి.ఇలాంటి mentally challenged ppl ని చుసి జాలి పడి వదిలేయాలి.

    ReplyDelete
  2. భలే వారె.. మాండ గురించి తెలీదా ? మంచి కామెడి కింగ్. ఆసలు అతనితొ వాదించడమె చాలా టైం వేస్ట్. మీరు మళ్ళీ ఆ కామెంట్స్ కి ఫీల్ అవడం యెమిటి? మీ అనాలసిస్ చాలా బాగుంది + మీ అభిప్రాయమే నాది.

    ReplyDelete
  3. రమణి గారు,
    మీ గత పొస్టు లో మార్తాండ కామెంట్స్ చాలా తలనొప్పి తెప్పించాయి. కామెడీకైనా ఒక హద్దు ఉండొద్దూ? కాలనేమి అడిగిన ఏ ప్రశ్నకూ జవాబివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్పాలంటారు, పైగా తనకొక్కడికే కాదు! సన్యాసం పుచ్చుకుంటానంటారు. అదేదో త్వరగా పుచ్చుకోవచ్చుగా! సబ్జెక్టుతో సంబంధం లేకుండా మాట్లాడే ఒకే ఒక్కడు. మీరు చర్చ ఎక్కడ మొదలెట్టారో అది ఆయన ఎట్లా దారి తప్పించి ఎక్కడికి తీసుకెళ్లాడో చూడండి. పైన రాఘవ్ చెప్పింది నిజమే!

    అతడి కామెంట్స్ ని ఆపివేస్తే మంచిది!

    ఏదో మీ పోస్టులు చదువుదామని వస్తే ఈ గోలేంటి మాకు? మీ బ్లాగసలు చూడ్డం మానేశాను నేను తెలుసా? మా మీద మీరైనా దయుంచి ఏ కామెంట్స్ ప్రచురించాలో, ఏవి ప్రచురించ కూడదో కాస్త చూస్తూ ఉండండి మేడమ్!

    ReplyDelete
  4. మార్తాండ్ ప్రవీణ్ కు సిద్ధాంతం ఎక్కడ ముగుస్తుందో రార్ధాంతం ఎక్కడ మొదలౌతుందో తెలీదు. కాబట్టి తనని పక్కనబెట్టి మీ పని మీరు కానివ్వండి.

    ReplyDelete
  5. ప్రెజెంట్ మేడం(పైన అందరితో ఏకీభవిస్తూ)...

    ReplyDelete
  6. వ్యక్తిగత విమర్శలు బాధిస్తాయి. నిజమే. కానీ ఆ విమర్శలు చేసేవారిమీద జాలిపడే స్థాయికి చేరుకోగలిగితే ఇక ఏ సమస్యా ఉండదు.

    ReplyDelete
  7. nenu kudaa present madam, nenu kuda andarito ekabhavistu):

    ReplyDelete
  8. Oh! మార్తాండ ను అస్సలు పట్టిచుకోనక్కర్లేదు. డిలీట్ చెయ్యండి.అతనే రాయడం ఆపేస్తాడు.

    ReplyDelete
  9. @testing wheel garu: సారీ అండీ మీ వ్యాఖ్యలు ప్రచురించలేదు . వ్యక్తిగత దూషణలు వద్దండి రచయిత్రి కాని రచయిత కాని వ్రాసిన కథలకి మన అభిప్రాయలని చెప్తున్నాము అంతే. మరోలా భావించకండి.

    ReplyDelete
  10. parvaledu ..meeru aa matram jagratha padatharu ani telusu ramani garu .....kani aa Marthanda matlade maatalu( not in just this post ..but every whr) , rachayitha sthayi ki taggavi ga levu ..vaaru kooda object cheste baguntundi ani feel ayyanu ....antha kanna 100% i do not want to hurt the writer ...

    and rachayitha kadha ni kadha ga kaakunda , aame aa charecter 100 % tana bhavam ga chepparu kabatti and aame ye ikkada opinion adigaru kadaa..., ee marthanda vanti varini aame upekshincharu ani naa opinion ...mee antha baga vrayadam inka raledu ...leka pothe Kalpana gariki issue ardham ayyela vrasi undunu ....yedi yemaina blog lokam antha okkati ...chakka ga undi

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...