8.10.2009

ఈ ఆదివారం మాది...

పరిస్థితులని మనకనుగుణంగా మార్చుకోవాలా? మనం పరిస్థితులకి అనుగుణంగా మారాలా? "పెళ్ళయ్యాక పరిస్థితులే దానికి అన్నీ నేర్పుతాయే.. " పాపకి పనులు అస్సలు తెలియడంలేదమ్మా అంటే అమ్మ అనేది అలా. పరిస్తితులు మనల్ని మార్చేస్తాయట. కాని మనకనుగుణంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించాను. "మీరలా ఆలోచించండి .. నేనలా అమలు పరిచేస్తాను" అని నాకు చెప్పినట్లుగా ఈ ఆదివారాన్ని తనకనుగుణంగా, మాకనుగుణంగా మార్చారు ఓ ప్రఖ్యాత బ్లాగరు.
మంచి అదృష్టాన్నిఅందిపుచ్చుకొనే అవకాశాన్ని కలగజేసినందుకు ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు.

******

"రచయిత తన ఆలోచనల్ని, తన పరిమితుల్ని అధిగమించి వ్రాసిన కథలవి. హృదయాలని స్పృశిస్తాయి చాలా గొప్పవిషయం " అని అంటారొకరు.

"ఆయన తన పరిమితులకి లోబడే వ్రాసారు. ఆమాత్రం రచయిత ఆలోచించకుండా ఉండరు" ఈ కథలకి సంబంధించి సినిమా అయితే.. ఓ మంచి హీరోయిన్ నా దృష్టిలో ఉంది అంటూ విభేదిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసారు ఇంకొకరు.

వీళ్ళీలా వాదులాడుకొంటే .. ఇంకోపక్క

"పుస్తకాలు లభ్యం కావాలంటే మనం 10 మందికి కలిసి ఒక్కొక్కరింట్లో ఒక్కో 10 వేరు వేరు పుస్తకాలను ఒక గ్రంధాలయంలా అమర్చుకొంటే ఎలా ఉంటుంది ?" అని అందరి అభిప్రాయాలకై ఎదురుచూసిన వారొకరు..

ముఖ్య అతిథి తను వాడే తెలుగు సాఫ్ట్ వేర్ గురించి చెప్తుంటే అంతే శ్రద్ధగా వింటూ తనకి తోచిన సలహాలని చెప్తున్నారు ఇంకొకరు.

వీరిద్దరీ చర్చ ఇలా సాగుతుండగా...

మీకోసం అంటూ ముఖ్యఅతిథి పై తన అభిమానాన్ని పుస్తకం ద్వారా తెలియజేసారు ఇంకొకరు.

తనని తాను పరిచయం చేసుకొనే సమయంలో, ఇంకొకరి పరిచయాన్ని " సాహిత్యంలో తలపండిన వారు అంటే మీరని మీరు చెప్పకనే తెలిసింది" అంటూ చమత్కరించారు.

చమత్కారానికి హాస్యగుళికగా స్వీకరిస్తూ.. సాహిత్యంలోనే కాదు మాములుగానే తల పండిందంటూ మరో చమత్కరాన్ని సమాధానం చేసారు ముఖ్య అతిథి.

తను వ్రాసిన కథ గురించి అనుకొంట.. ఇంకో ప్రముఖ బ్లాగరు మరో ప్రముఖ రచయితతో మంతనాలాడుతున్నారు.

ప్రముఖ రచయిత అటు మంతనాలాడుతూ.. అంతే చురుకుదనంతో తను వ్రాసిన కథల ఫాంట్ , కవరు పేజ్.. వాటికి సంబంధించి తన ప్రయత్నాలు, ముఖ్య అతిధికి విశిదీకరించారు.

ఇంత సందడిలోను తనని తాను పరిచయం చేసుకొంటూ తన బ్లాగు గురించి చెప్తున్న వారు మరొకరు.

మరో పక్క....

వీరందరి చర్చల్లో .. వాదనలో... మంతనాలలో ప్రేక్షక పాత్రలతో తదేక దీక్షతో వీక్షిస్తున్న కొందరు.

మొత్తానికి సరస్వతీ దేవి ఆ ఇంట కొలువుదీరింది, అదివారం అందరి చర్చల్లో... వాదనలలో.. మంతనాలలో...

ఎంతచక్కటి అనుభవం అది. ఎలా భద్రపరుచుకోడం.. చిన్ని గుండేల్లో దాగనంటోంది మరి ఏమి చేయడం.. ఇక నావల్ల కాదని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చేసాను... పంచేసుకొందామని.

ఏంటి మొదలు చివరా లేకుండా.... అర్థం పర్థం లేకుండా అని అనుకొంటున్నారా? ఇదిగో చెప్పేస్తున్నాగా..
**********




"ఈ ఆదివారం మాది " అని ధీమాగా చెప్పగలిగే ఆ అవకాశాన్ని ఇచ్చిన వారు ప్రముఖ బ్లాగరి శ్రీమతి సుజాత గారు. వారం రోజుల ముందు నుండి హైదరాబాదులో ఉన్న తనకు తెలిసిన బ్లాగర్లందరినీ అప్యాయంగా ఆహ్వానించారు, ఆదివారం వారింటికి రమ్మనమని. పిలుపునందుకొన్నవారు అందరూ రాలేకపోయినా ... వచ్చిన వారు ఆదివారాన్ని సాహితీగోష్ఠితో ఆహ్లాదపరిచారు.
Link
రచయిత పరిథిల గూర్చి పర్ణశాల కత్తి మహేష్ గారు చర్చిస్తే.. విభేదిస్తూ హీరోయిన్ గురించి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారు సుజాత గారు వీరి బ్లాగు మనసులో మాట.

పుస్తకాల గురించి తనకు తోచిన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారు శ్రీవల్లీ రాధిక గారు, వీరి బ్లాగ్ మహర్ణవం .


ముఖ్య అతిథి వాడే సాఫ్ట్ వేర్ కి సలహాలు అందిస్తున్నవారు శిరీష్ కుమార్ గారు. చదువరి బ్లాగరు, పుస్తకంద్వారా తన అభిమానాన్ని తెలియజేసినవారు వరూధిని గారు.. సిరిసిరిమువ్వ బ్లాగరి.

సాహిత్యంలో తలపడి(పండి)న అంటూ చమత్కరించినవారు గీతాచార్య గారు..

తను వ్రాసిన కథల గురించి ఇంకో రచయిత తో మంతనాలు జరిపిన వారు.. జ్యోతిగారు, రచయిత.. తన ఫాంట్.. కవర్ పేజ్ గురించి వివరించినవారు : కస్తూరి మురళీకృష్ణగారు " కస్తూరి గారి బ్లాగు :
రాతలు కోతలు.. జ్యోతిగారి బ్లాగులలో ఒకటి: జ్యోతి.

తనని తాను పరిచయం చేసుకొంటూ .. బ్లాగు గురించి చెప్పిన వారు శ్రీమతి మాలా కుమార్ గారు "సాహితి" బ్లాగరు.

ప్రేక్షక వీక్షకులు:మొదట నేనే.. ముఖ్య అతిథి అన్నయ్యగారు..జ్యోతిగారి అమ్మాయి, మధ్య మధ్యలో సుజాతగారి శ్రీవారు తళుక్కున కనిపించి మాయమవడం , చిన్నారి సంకీర్తన అల్లరి హడావిడిలతో .. మాలతిగారికి తన బహుమానాలతో.. వీక్షకులను అలరించింది.

అదండీ సంగతి.. సుజాతగారింట్లో అందరు సందడి సందడిగా ఆదివారాన్ని మావారంగా మరల్చుకొని,అప్యాయంగా అందించిన ఆతిధ్యాన్ని స్వీకరించి వెనుదిరిగాము.

**********

ఎవరో హల్లో ! హల్లో! అని పిలిచినట్లు వినపడింది? ఎమయింది?

ముఖ్య అతిథి ఎవరా? అనా... అదేంటి చెప్పలేదా..... అవునా.. ఉండండి .. మొత్తం చదువుతాను....

.......

.......

.......


.....

అవునవును మర్చేపోయాను... పోని ఆవిడ పేరు చెప్పుకొండి మీలో ఎవరన్నా.....ఎవరో ఒకరు....

.......

.....

.....

ప్చ్! చెప్పలేరా..... సరే.. నేనే చెప్పేస్తున్నా....రెడీ..స్టడీ...గొ....

.........

.......

......

ఆవిడే.. అవిడే.. మన ... మన ......
......

......

......



మా ల తి గా రు ( తెలుగు తూలిక)

......

సుజాత గారింట్లో .. మాలతిగారితో మా మధుర క్షణాలివి.
*******

24 comments:

  1. జెలసీగా వుంది మిమ్మలందరినీ చూస్తుంటే.

    మనుషులూ తెలుసు, పేర్లూ తెలుసు - కానీ ఏ మనిషిది ఏ పేరో తెలియదు. ఫోటోలొ ఎవరెక్కడ వున్నారో చెబితే ఏ ముఖానిది ఏ పేరో తెలుసుకునేవారం కదా.

    ReplyDelete
  2. శరత్ గారు: :) అందుకే కదా చెప్పనిది .. అయినా ఎదో మీరడిగారు కాబట్టి చెప్తున్నాను.. చెప్పుకొండి, రెండువరసలలో కూర్చున్నవారు మహిళలు. నించున్నవారు మగవారు. ఒకరు మాత్రమే కూర్చున్నారు. అందరి పేర్లు.. మాలతిగారు, సుజాతగారు, శ్రీవల్లీ రాధిక గారు, మాలా కుమార్ గారు జ్యోతిగారు, వరూధినిగారు, మహేష్ గారు గీతాచార్యగారు, మురళీ కృష్ణ గారు, చదువరి గారు, మాలతిగారి అన్నయ్యగారు, చివరగా .... ఆగండి ఆయాసం వచ్చేస్తోంది.. ఒక్కనిముషం.. నేను. హమ్మయ్య.. చెప్పేసాను.

    ReplyDelete
  3. Let me Guess ...

    I saw Mahesh's picture .. so that was Easy ..

    I also saw Chaduvari's picture but I cant find him in the foto. So I guess he was the one who clicked it!

    ఇకపోతే పెద్దాయన మాలతి గారి అన్నయ్య అయ్యుండాలి - మహేష్ పక్కన ఉన్న కుర్ర ప్రొఫెసర్ గీతాచార్య అవ్వచ్చు. జేబులో పెన్ను పెట్టుకుని "ఫోతో సరిగ్గా తియ్యకపోతే నీమీద ఒక సీరియల్ రాస్తా" అన్నట్టు చూస్తున్నాయన మురళికృష్ణగారే అవాలి.


    ఆడవాల్లాళొ - మేడం జో & వరూధిని గార్ల ఫొటోలు ఏదో ఈ-తెలుగు సైట్లో చూశా. అది వరూధినిగారే అని ఎలా తెలుసంటే, ఆ సైట్లో గుండ్రంగా గడ్డిపీకుతూ కూర్చున్నవారి పేర్లు అదే వరసలో రాసారు కాబట్టీ. తెల్ల జుట్టావిడ మాలతిగారయ్యుండాలి. "మాలా కుమార్" అనేది కాస్త పాతతరం పేరు కాబట్టి, అందరికన్నా ట్రెడిషనల్ గా ఉన్న తెల్ల చీరావిడ అయ్యుండాలి.

    ఇప్పుడు కొంచం కష్టం. తెలుగుదేశం, కమ్యూనిష్టు, టీ.ఆర్.ఎస్ రంగు చీరలవాళ్ళని గెస్ చెయ్యడం. ముగ్గురి వేళ్ళూ పొడుగ్గానే ఉన్నాఇ కాబట్టీ కోబోర్డ్ ప్లేయర్ ని పట్టుకోవడం కష్టం. వైల్డ్ గెస్ చేస్తున్నా .. పచ్చ చీరావిడ చేతిలో ఏదో పొట్లం కనిపిస్తోంది - పని మధ్యలో ఫొటొకోసం వచ్చినట్టు .. కనుక సుజాత గారయ్యుండాలి. ఎర్ర చీరావిడ ముఖం ప్రశాంతంగా పొందికగా ఉంటే, గులాబీ చీరావిడ ముఖంలో మాత్రం ఫోటో దిగుతున్న ఆనందం కనిపిస్తోంది (ఎంత తొందరగా బ్లాగులో పెట్టేద్దామా అన్నట్టు) - సో, ఎర్ర చీర రాధిక గారు, గులాబి రమణీ గారు అని నా గెస్ అధ్యక్షా!

    ReplyDelete
  4. నేను మిస్సయినందుకు చాల బాధగా ఉంది.
    సుజాత గారికి, మాలతి గారికి, మీ అందరికీ నా శుభాభినందనలు !

    ReplyDelete
  5. మలక్ పేట్ రౌడీ,
    చివర్లో, మూడు పార్టీల వాళ్ళనీ గెస్ చేయడంలో తప్పులో కాలేశారు. :))

    ReplyDelete
  6. మలక్పేట్ రౌడీ,

    Nice try! చివర్లో మూడు పార్టీల వాళ్ళనీ గెస్ చేయడంలో తప్పులో దారుణంగా కాలేశారు. :))

    ReplyDelete
  7. గులాబి రంగు చీర వారు సుజాత గారు ఎరుపు రమణి గారు మధ్యలో రాధిక గారు పైన వరూధిని గారు తరువాత మాలతి గారు తరువాతా మాలా కుమార్ గారు తరువాత జ్యోతిగారు
    ఇది నా గెస్ ..
    ఎలా చెప్పానంటే జ్యోతి గారి ఫొటో చూసాను ..వరూధిని గారి ఒక పోస్ట్ వల్ల తను సన్నం గా ఉంటారని తెలుసుకున్నాను కాబట్టి ఆవిడ తనే ,పక్కన చదువరి గారనుకుంటా ..రమణి గారు సుజాత గారు పోస్ట్లబట్టి వీజీగా కనిపెట్టగలను వాళ్ళు ఎలా ఉంటారో .. హహ ఏమోలే ఎంతవరకు కరక్ట్నో మరి నా గెస్ :)

    ReplyDelete
  8. నేస్తం గారు కూడా 50% కరెక్ట్ చెప్పారు అంతె..రౌడీగారిలా ప్చ్ ప్చ్ ప్చ్ :(

    ReplyDelete
  9. కానివ్వండి కానివ్వండి..ఎవరిష్టం వాళ్లదయిపోయింది..ఎవరెవరయితేనేమి లేండి!

    ReplyDelete
  10. నేను ట్రై చేస్తా :)
    ముందు వెనుక వరుసలోని వారు (ఎడమ నుంచి కుడికి )
    1. మురళీకృష్ణ గారు 2. శ్రీవల్లి రాధిక గారు 3.మాలతీ గారు 4. మాలకుమార్ గారు 5. జ్యోతి గారు 6. మహేష్ గారు 7.గీతాచార్య గారు
    ముందు వరుసలోని వారు (ఎడమ నుంచి కుడికి )
    1. మాలతి గారి అన్నగారు 2. రమణి గారు 3. సిరిసిరిమువ్వ గారు (వరూధుని గారు) 4. సుజాత గారు

    ఇది ఖచ్చితం గా 100 % కరెక్ట్ హోంవర్క్ ప్రకారం :)

    ReplyDelete
  11. సిరిసిరిమువ్వ గారు: నిజమేనండి ఎవరయితెనేమి.. తెలిసినవాళ్ళందరూ.. నోటిమీద వేలేసుకొండి.. ఎక్కడ దొంగలక్కడే గప్ చిప్....

    శ్రావ్య గారు : :( ప్చ్! ప్చ్!

    ReplyDelete
  12. Ramani gaaru don't try to mislead :)

    I know I hit the bull !

    ReplyDelete
  13. ఎంత రౌడీ అయితే మాత్రం ఎంత ధైర్యం ? మాల అన్న ముచ్చటైన పేరును పాత తరం అంటారా ?
    మకూ వున్నారు యూసుఫ్ గూడా రౌడీలు. హన్నా !

    ReplyDelete
  14. అయ్యో నేను మీ పేరు గురించి అనలేదండీ - నేను అన్నది పక్కన ఉన్న "కుమార్" గురించి, ఈ మధ్యకాలంలో భర్త పేరు తన పేరులో కలుపుకునేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తా (మా అవ్విడని కూడా వెక్కిరిస్తూ ఉంటా ఈ విషయంలో):))

    ReplyDelete
  15. మాలతి గారి పక్కన రంగనాయకమ్మగారిని, మహేష్, సుజాత గార్లకు మధ్యలో యోగిని, మాలతిగారి అన్నయ్యగారి ప్లేసులో మార్తాండని, జ్యోతిగారి పక్కన ధూం ని కూర్చోపెట్టుంటే ఫోటో ఇంకా బాగుండేది :))

    ReplyDelete
  16. @ రౌడీ గారు: అప్పుడు మీ ప్రమాదవనానికి, తుంటర్వ్యూలకి.. చేతినిండా పనే కదా..:) :) ఎవరు ఎవరి పక్కన ఉన్నా ఎవరికి వ్యక్తిగత కక్షలు లేవు కాబట్టి హ్యాపీస్. నవ్వులు చిందిస్తూ ఫొటోలు తీయించేసుకొంటాం.

    ReplyDelete
  17. naguess..........malakpet rowdy garidi 90% correct...
    mundu varasalo erupu ramani gaaru,pink or rose...radhika gaaru............

    erupu ramani garu 100 % sure............

    ReplyDelete
  18. everybody discussed the persons in the pic. What abt thetive ofth meet?

    ReplyDelete
  19. @Dhanraj Manmadha gaaru : అరుదైన రచయితలు సముద్రాలు దాటి వచ్చినప్పుడు వారి గౌరవార్ధం జరిగిన చిన్న సమావేశం ఇది. ఇక్కడ సాహిత్యానికి సంబంధించిన స్థానిక రచయితలు కూడా పాల్గొన్నారు. ఒకవిధంగా మంచి చర్చ జరిగింది. అసలు విషయం దారి మళ్ళినట్లు నాకు అనిపించింది:) మంచి సమయానికి మంచి ప్రశ్న వేశారు.

    ReplyDelete
  20. మీరు ఫోటో పెట్టకుండా ఉండుంటే కంటెంట్ గురించి చర్చ జరిగేదండీ.. ఇప్పుడందరూ ఫోటో గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు...

    ReplyDelete
  21. థాంక్స్ మురళిగారు సముచితమైన సలహా ఇచ్చారు.

    ReplyDelete
  22. రమణి గారూ,
    మేము ప్రత్యక్షంగా లేకపోయినా, మాకు కబుర్లన్నీ చెప్పి పుణ్యం కట్టుకున్నారు. ధన్యవాదాలు.
    ఫోటో గురించి వైల్డ్ గెస్ లు భలే ఉన్నాయి ;)

    ReplyDelete
  23. మధురవాణి గారు: :) నెనర్లు...

    ReplyDelete
  24. అందరిని ఒకేసారి చూసేపాటికి, కనుల పండుగగా ఉంది, కాని వారి పేర్లు కూడా చెపితే బాగుండేది.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...