8.23.2009

వినాయక చవితి శుభాకాంక్షలు
ప్రార్థన

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన్న విద్యలకెల్ల నొజ్జయై ............
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని బ్రార్ధన జేసెద నేకదంత! నా ......
వలపలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా! ......

తలచితి నే గణనాథుని; తలచితె నే విఘ్నపతిని! దలచిన పనిగా ..
దలచితి నే హేరంబుని దలచితె నా విఘ్నములను తొలగించుటకున్

అటుకులు కొబరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్
విటలాక్షు నగ్రసుతునకు బటుతర్ముగ విందుచేసి బ్రార్థింతు మదిన్..
______________________________________________

మా ఇంట్లో/మదిలో ప్రార్థించేశాము.. మరి మీరో??

2 comments:

  1. మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. మీ కుటుంబానికి కూడా వినాయకచవితి శుభాకాంక్షలు

    ReplyDelete

Loading...