6.24.2010

ఏమి జరిగింది?

ఏమి జరిగింది?

పాప ఏడ్చింది...

Woodward’s  పట్టమని వాళ్ళ అమ్మతో చెప్పు.. నేను చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని.. బామ్మగారి సలహ. :)
problem solved. 
*****
బామ్మగార్లు కూడా సలహా ఇవ్వలేని విధంగా ఏమన్నా జరిగితే మనదగ్గిర సమాధానమేమి ఉంటుంది? ఎవరన్నా "ఏంటి ఎమి జరిగింది? " అంటే "ఏమోనండి నాకు అర్థం కావడం లేదు" అని సమాధానం ఇవ్వవలసి వస్తోంది కొన్ని కొన్ని సంఘటనలని చూస్తే.  

ఇలాంటి ఏమి చెప్పలేని పరిస్థితి నాకు వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. ఎదన్నా ఒక విషయం గురించి చెప్పాలంటే టకా టకా చెప్పేస్తాను.. జంకు లేకుండా..అలాంటిది నేను మారాను, మారక తప్పలేదు. "అమ్మో! నేను తప్పు మాట్లాడుతున్నానేమో? ఎవరో.. ఏదో శక్తి నా పరిసరాలని చుట్టుముట్టి  నా మాటలన్ని వినేస్తోంది " అన్న భయం కలుగుతోంది. భయం అంటే గుర్తొచ్చింది, నా బాల్యం నుండి భయం అనే ఒక అనుభూతిని నేను పొందింది చాలా తక్కువ, అంటే వేళ్ళమీద లెక్కపెట్టుకోవచ్చు.  మన తప్పు లేదు అన్నప్పుడు,  దూసుకుపోడమే తెలిసినదాన్ని.  

మార్పు ఎందుకు? అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకు ముందులా ఉండడం లేదు అంటే సమాధానం ఎమో! ఎందుకిలా? ఏమి జరిగింది? తెలీదు, ఏదన్నా ఒక వస్తువు గురించి  అనుకున్నా.... "చాలా సంవత్సారాలయ్యింది ఫలనా  వ్యక్తిని చూసి.. "  అని అనుకోడం తడవు, ఆ మనిషి అదేదో నేను పిలిచినట్లుగా కళ్ళముందు వుండడం, మరీ మరీ విచిత్రంగా ఉంది. దీని ఆంతర్యమేమిటో అర్థం అవడంలేదు. అందుకే ఈ భయం.. ఎవరిమీదన్నా కోపం వచ్చేసి .. అరిచి ఎదన్నా అంటుంటే, ఆ అన్నదేదో  జరిగింది మొన్నామధ్య.. బాబోయ్ ఇదేంటి అన్న భయం..  .. అందుకే మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్ళు అంటే ఏమో.. మంచే కోరుకొన్నాను, చెడు మనసులోకి కూడా రావడంలేదు. నేను భ్రమలో ఉన్నానో, వాస్తవంలో ఉన్నానో కూడా తెలియని అగమ్య గోచరంలో ఉన్నాను.. "అబ్బా ఏంటి ఈ సోది? అసలేమి జరిగింది? అని చదివి జుట్టు పీక్కుని గట్టిగా మీరు అరిస్తే .... " -:) ఎమో ! అది తెలియకే కదా నాకు చాలా తికమకగా ఉంది అని సమాధానం..

ఇలాంటి తికమక మకతిక పరిస్థితి మీకు వచ్చిందా ఎప్పుడయినా? ఏమి జరుగుతోందో మీకు తెలియకుండా ఎమన్నా జరిగిందా? జరిగితే మీ అనుభవాన్ని చెప్పండి.. హమ్మయ్య నాకింకో తోడు ఉన్నారని భయాన్ని దూరం చేసుకుంటాను.

నా ఈ పరిస్థితి నుండి నేను తొందరగా బయటకి వచ్చేయాలని కోరుకొండి ప్లీజ్!!!.. మళ్ళీ కలుద్దాం..

అదిగో మళ్ళీ.... ఏమి జరిగిందీ అని అడుగుతున్నారు?? నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి.... ప్చ్..
*****

7 comments:

  1. tappakumDa bayaTapaDataaru, lenDi.

    ReplyDelete
  2. ఒకటి రెండు అన్న కథలు చదివితే మీకు కన్స్యూజన్ పొయి మళ్ళీ మామూలు మనిషయ్యే అవకాసం వుంది... :-))

    ReplyDelete
  3. అది 6th sense అనుకుంటా. ఒక్కోసారి జరగబోయే సంఘటనలు మనుకు చూసాయగా ముందే తెలుస్తాయి. కుండలినీ యోగా చేస్తున్నా ఇలా జరగవచ్చు.

    ReplyDelete
  4. ఎప్పుడూ బోలెడు మంది గురించి తల్చుకుంటూ ఉంటాము. ఎవరో ఒకరు ఎప్పుడయినా ఎదురుపడతారు అలా అనుకోగానే. ఎన్నో అనుకుంటాము; ఏదో ఒకటి జరిగి తీరాలి గదా! ఆ కాకతాళీయాల్నే పట్టుకుని భయపడనవసరం లేదు.

    ReplyDelete
  5. హను గారు థాంక్స్ అండీ

    మంచుపల్లకి గారు: ఇలాంటి సమయంలో అన్న కథలు చదవాల్సిందే అంటారు... మనలో మన మాట... అనుభవపూర్వక సలహా ఇస్తున్నారా? :-) ఎంత ధైర్యంగా అంత ధైర్యాన్ని, సాహసాన్ని చేయమంటున్నారు?

    శివగారు: అదే అనుకుంట.. యోగా ఎప్పుడో క్రీ,పూ.. చేసానండి. ఇప్పుడు చేయడంలేదు. అందులో ఈ కుండలినీ అన్నది నాకసలు అవగహన లేదు.

    శ్రీనివస్ గారు : థాంక్స్ అండి.. అలాగే అనుకుంటున్నా.. కాకతాళీయమే కదా అని... కాని జరగకూడనివేవో జరుగుతున్నప్పుడు కొంచం భయం. అది కూడా మాములే అని తీసుకోలేకపోయాను అంతే.

    ReplyDelete
  6. ఏది ఒకసారి నన్ను బాగా తలచుకోండి చూద్దాం. టికెట్టు లేకుండా ఇండియా ఇలా నేను రావచ్చేమో అనే అత్యాశ :)

    ReplyDelete
  7. శరత్ గారు::-) అదేదో సినిమాలో అనుకుంట ఈ డైలాగ్... ' అతిగా అవేశపడే ఆడలేడీస్‌కి ...ఆశ పడే మగ జెంట్స్‌కి అంత తొందరగా అనుకున్నవి జరగవట.. :-( "

    మీ అత్యాశ వల్ల ఏమో మీరు టికెట్టు లేకుండా ఇండియా బార్డర్‌కి కూడా రాలేకపోతున్నారు. మనలో మన మాట మీ బావ తలచుకుంటే ఏమన్నా.. ;-)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...