5.29.2010

సెల్లులో మన పేర్లు....

సో.. నేను రాసిన ముందు పోస్ట్ వల్ల చాలా మందికి చాలా కోపం వచ్చేసినట్లుంది. సరే.. అభిప్రాయాలనేవి అందరికి ఒకటే అవవు.. అలా అని చాలా పెద్ద తప్పిదం చేశేసానా ... నా అభిప్రాయం తప్పా అని ఆలోచించి.. ఆలోచించి... ఇది తెగేది కాదని అనిపించి ఇహ ఆలోచించడం మానేసాను. నా అభిప్రాయాల వల్ల ఇబ్బంది పడినవారికి సారీ. నచ్చిన వారికి ధన్యవాదాలు. :-)
******


అప్పుడెప్పుడెప్పుడో... ఒకసారి మా ఆఫీసులో మేనేజర్ గారు ఏదో పనికోసమని .. నా సెల్ కి ఫోన్ చేసారట. నా సెల్ కవరేజ్ ఎరియాలో లేనని మొరాయించేసిందిట. పక్కన కొలీగ్ కి ఫోన్ చేసి , నాకివ్వమని చెప్పారు. సాధారణంగా మానేజర్ చేసేది లాండ్ లైన్ కే. కాని మా అసిస్టెంట్ మానేజర్ చలవ వల్ల, అది గంట నుండి ఎంగేజ్ రూపేణా బిజీగా ఉంది.

సరే ఆయనేదో అవతలి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎదో ఇంకో ఫోన్ వస్తున్నట్లుగా సౌండ్ వచ్చేసరికి , ఒకసారి సెల్ వైపు చూసా.. పేరు చూసి ఒక్క క్షణం తడబడ్డాను... ఇదేమి పేరు అని.. ఇలా కూడా ఉంటాయా ? అని... అంటే నేను సెల్ ఫోన్ వాడకం కొత్త అన్నమాట అప్పటికి. కాకపోతే కొంచం నయం.. మనమే ..... నంబర్ , ఆ నంబర్ ఎవరిదో వారి పేర్లు సేవ్ చేసుకోవాలని మాత్రమే తెలుసు. అది కూడా తెలియకముందయితే అంటే సెల్ కొన్న కొత్తలో అప్పటికి ఎవరో ఎల్.ఐ .సి ఏజెంట్ ఫోన్ చేసినప్పుడు, పేరుతో సహా సెల్ ఎంత బాగా గుర్తించేసింది, సెల్ ఎంత గొప్పదో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. (మా తమ్ముడు అన్ని సేవ్ చేసి ఇచ్చాడని తెలియక) ..

అలా కాకుండా ఇలా కొత్తగా పేర్లు.. ఎవరిదో తెలుసుకోవాలన్న కుతుహలం బయల్దెరెంది.. మానేజర్ ఫోన్ అయిపోగానే కొలీగ్ దగ్గరకి వెళ్ళి "ఫోన్ వచ్చిందండి మీకు పేరు కొత్తగా... చాలా వింత గా ఉంది ఎవరండి " అని అడిగాను. నవ్వుతూ తను చెప్పిన సమాధానం "మా ఆవిడండి".. ముద్దుగా అలా.. యు ఎస్ లో ఉంటుంది " అని చెప్పారు...... నిజంగానే సరదాగా అనిపించి, బాగుంది అని కొలీగ్ ఫోన్ బుక్ లో మిగతావారి పేర్లు ఎముంటాయా అన్న కుతూహలం కలిగింది... "నిరభ్యంతరంగా చూసుకొండి" అని నా చేతికి ఇచ్చారు.... నాచ్యురల్‌గా ... అమ్మా, అక్కా, ఆఫీస్, ఇలా స్టార్ట్ అయిన లిస్ట్.. రాక్షసి(వాళ్ళ ఆవిడట :-) ) , చిన్న రాక్షసి (మరదలు) , మై స్వీట్ హోం.... ఇలా వరసగా చదువుతుంటే నా పేరు నా పేరేవిధంగా ఉంటుంది చెప్మా..... అని ఆలోచన వచ్చి.... నా సెల్ నుండి రింగ్ ఇచ్చి పేరు చూస్తే "పొడుగు మేడం - కర్పోరేట్ కాలింగ్" అని వచ్చింది. నవ్వు వచ్చింది నాకు .. "అదేంటి పేరే పెట్టొచ్చుగా ఇలా పొడుగు .. పొట్టి ఎందుకు " అని అడిగితే..... "ఇంకో బ్రాంచ్ లో ఇంకో రమణి ఉన్నారుగా " ఎందుకు.. అని ఇలా జవాబు కొలీగ్ దగ్గరనుండి..
*****

ఇదిగో ఇతని సెల్ లో అలా పేర్లు చూసిన నాలో కుతూహలం.. నా ఫోన్ నంబర్ మా వాళ్ళ సెల్లో ఏ పేరుతో సేవ్ చేసి ఉంటారా?... చాలా రోజులకి మళ్ళీ మా అక్క దగ్గిర సెల్ లో చూసాను ఇలాంటి స్వీట్ పేర్లు ... ప్రేమగా పాప నంబర్ని మై అయిస్ 1 , బాబు నంబర్ని మై అయిస్ 2, అమ్మ నంబర్ని .. మై బర్త్ అని సేవ్ చేసుకోడం.. బాగుందనిపించింది.

అలా నా పేరు మరుగున పడి, నేను.... మై యంగర్ సిస్టర్, చిన్నక్క, సి. వదిన, పిన్ని, మాం .. మణి. ... ఇలా ఇలా మావాళ్ళ సెల్ లో నా నంబర్ ఇన్ని పేర్లతో దోబూచులాడుతోందన్నమాట. . మరి మీకెప్పుడయినా ఇలాంటి అనుభూతి, మన పేరు సెల్ లో ఏవిధంగా సేవ్ చేశారో అన్న కుతుహలం??? అయితే ఇకనేమి పంచేసుకుందాం రండి సరదా సరదాగా...
*****

3 comments:

 1. ఇంట్లోవారికి తప్పించి బయటివారికి ఇంటి పేర్లు వాడతానుఉదా ;కొల్లిపర ,మూల్పురి ,కస్తూరి ,కొడాలి. వేరే ఎవరైనా చుసిన అర్ధం కాదు మనం ఎవరితో మాట్లాడేమో:-)

  ReplyDelete
 2. ఇంతెరెస్ద్తింగ్ అందీ
  యు మీన్ .. మన ఫ్రెండ్స్ లొనే మన్ పెర్లిఉ ఫున్నిగా ఉందొచు కద

  ReplyDelete
 3. నాకు ఈ మధ్య ఏదో తెలీని నెంబర్ నుండి పదే ,పదే మిస్సేడ్ కాల్ వస్తా వుంది...ఎవరో కనుక్కోవాలి అని..."వైరస్" అని పెట్టి సేవ్ చేశా.....

  ReplyDelete

Loading...